komal
-
కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ దుమ్ములేపుతున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో అభిషేక్ శర్మ ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 467 పరుగులు సాధించాడు. పలు మ్యాచ్‌లలో తన అద్భుత ఇన్నింగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డులు కూడా అందుకున్నాడు.ఇక 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సాధిస్తున్న విజయాల పట్ల అతడి తల్లిదండ్రులు రాజ్‌కుమార్ శర్మ, మంజు శర్మ ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో అభిషేక్ తల్లి మంజు, సోదరి కోమల్ అతడి వెంటే ప్రయాణాలు చేస్తున్నారు.ఈ క్రమంలో కోమల్ తన సోదరుడు అభిషేక్‌తో కలిసి స్టేడియంలో సందడి చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.చెల్లెలు కాదు.. అక్క! ఈ నేపథ్యంలో కోమల్ శర్మ గురించిన వివరాల కోసం అభిమానులు వెదుకుతున్నారు. కోమల్ శర్మ అభిషేక్ శర్మ చెల్లెలు అని పొరబడుతున్నారు. నిజానికి ఆమె అభిషేక్ కంటే ఏడేళ్లు పెద్దవారట. మార్చి 20, 1994లో కోమల్ శర్మ జన్మించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో ఆమె బ్యాచిలర్ డిగ్రీ చేశారు. జైపూర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఆమె ఒక డాక్టర్!ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్ కోమల్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటొలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా అభిషేక్‌కు కోమల్‌తో పాటు మరో సోదరి సానియా శర్మ కూడా ఉన్నారు.ఇక సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన నేపథ్యంలో తన తమ్ముడు అభిషేక్ శర్మతో కలిసి కోమల్ అహ్మదాబాద్‌కు వెళ్లారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్‌తో తొలి ఫైనలిస్టు ఎవరో తేలనుంది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ‘యమధీర’
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా ఆర్.శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘యమధీర’. వేదాల శ్రీనివాస్ నిర్మాత. రిషిక నాయిక. ఇందులో క్రికెటర్ శ్రీశాంత్ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి చిత్రంగా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి. ఎస్. రావు , పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. వేదాల శ్రీనివాస్ నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు, ఆలీ సత్య ప్రకాష్ నటించడంతో ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎంల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్‌తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్‌కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. యమధీర చాలా మంచి టైటిల్. వేదాల శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా ఈ సినిమా నిర్మించారు. మంచి ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత డి. ఎస్. రావు మాట్లాడుతూ.. యమధీర ఈనెల 23న విడుదల కాబోతుంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వేదాల శ్రీనివాస్‌కి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ : నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ సత్యనారాయణ, డి. ఎస్. రావు, పి. శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం షూట్ చేశాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. -
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్‌లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్‌కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
టాటావాళ్లే ఫ్లాటయ్యారు
చిన్నప్పుడు సెలవులొస్తే అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో మనకు వేసవి విడిది. అయితే ఈ చిన్నారి ఉన్న చోటనే ఉండి, రోజూ చల్లటి కథల పుస్తకాలను పిల్లలకు పంచిపెడుతూ చుట్టుపక్కల తండాలన్నిటినీ వేసవి విడిదులుగా మార్చేస్తోంది! ‘‘అమ్మా... జూదం చెడ్డ ఆట కదా?’’.. జుట్టు దువ్వుతున్న తల్లిని అడిగింది తొమ్మిదేళ్ల కోమల్ పవార్.‘అవును’’ పోనీ టెయిల్‌కు రబ్బర్ బ్యాండ్ పెడుతూ అంది తల్లి. ‘ధర్మరాజు ఆ ఆట ఆడాడు కాబట్టే కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది కదా..’’ మళ్లీ కోమల్ ప్రశ్న. ‘‘ఊ’’ అంటూ కూతురిని తన వైపుకి తిప్పుకుంటూ ఆ అమ్మాయి చుబుకం పట్టుకొని నుదిటి మీద ముద్దుపెట్టుకుంది తల్లి. ‘అందుకే కౌరవులు ఎంత చెడ్డవాళ్లో జూదమాడిన ధర్మరాజూ అంతే చెడ్డవాడమ్మా..’’ నేల మీదున్న పుస్తకాల బ్యాగ్‌ను ఆయాసంతో భుజానికి తగిలించుకుంటూ అంది కోమల్!బిడ్డ ఆలోచనకు సంబరపడిపోతూనే ‘‘అంత బరువు మోయకపోతేనేం.. కొన్ని కొన్ని తీసుకెళ్లొచ్చు కదా’’ అంది తల్లి.‘‘ఇవన్నీ బస్తీ పిల్లల ఫర్మాయిష్ పుస్తకాలమ్మా! తీసుకెళ్లాలి. లేకపోతే బాధపడ్తారు పాపం.. అయినా సాయి వస్తాడు కదా.. వాడికీ ఇస్తాను కొన్నిమోయమని’’ జవాబు చెప్తూనే గడపదాటింది కోమల్. ‘జాగ్రత్త ఎండలో..’’ హెచ్చరించింది అమ్మ. బడికే ఇన్స్పిరేషన్! మహారాష్ట్రలోని సతారా జిల్లా హెకల్వాడీలో కోమల్ దినచర్య ఇది. నాలుగో తరగతి చదువుతోంది ఆ అమ్మాయి. పాఠ్యపుస్తకాలంటే ఇష్టం. కథల పుస్తకాలంటే ప్రాణం. కథలు చదవడం.. ఇదిగో ఇలా తన సందేహాలను అమ్మతో పంచుకోవడం..! తను చదివే హెకల్వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చిన్న లైబ్రరీ ఉంది. అందులోని పుస్తకాలను చదవడమే కాకుండా.. యేడాది కిందటి ఎండాకాలంలో తనకు నచ్చిన కథలను చేత్తో రాసి రెండు మూడు పుస్తకాల ప్రతులను తయారు చేసింది. వాటిని ఆ సెలవుల్లో తన ఊరు చుట్టూ ఉన్న తండాల్లో కథలంటే ఇష్టం ఉన్న పిల్లలకు పంచింది. స్కూళ్లు తెరిచాక ఈ విషయం టీచర్లకు తెలిసి కోమల్‌ను ప్రశంసించారు. వారే ఈ ఎండాకాలం ఓ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో కూడా స్కూల్ లైబ్రరీని తెరిచే ఉంచాలని! ఎండల్లో తండాలకు హెకల్వాడీ చుట్టూ నాలుగు తండాలున్నాయి. ఉదయం పూట పుస్తకాలను తండాలకు పంచి తిరిగి సాయంకాలం వాటిని స్కూల్ లైబ్రరీకి చేర్చాలి. కొన్నాళ్లు ఈ బాధ్యతను ఆ స్కూల్ లైబ్రేరియన్ తీసుకున్నారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. అప్పుడు ఇదిగో ఈ చిట్టి కోమలే ముందుకు వచ్చింది. పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి కథల పుస్తకాలను సంచీలో సర్దుకొని ఇంటికెళ్లి రెడీ అయి మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తండాలకు బయలుదేరుతుంది. తన ఈడు పిల్లలకు కథల పుస్తకాలు పంచడం, వాళ్లు ఆ పుస్తకాలను చదివేలా చూడ్డం అంటే ఆ పిల్లకు పండుగే. ఈ అమ్మాయి ఉత్సాహం, ఆమె జిల్లా పరిషత్ స్కూల్ ఇస్తున్న ప్రోత్సాహం గురించి తెలిసీ టాటా ట్రస్ట్ వాళ్లు ఈ పిల్లలకు బోలెడు పుస్తకాలను తెచ్చిచ్చారు. అలాగే చిన్న లైబ్రరీని కాస్తా పెద్దగా మార్చారు ఈ యేడు. ఛోటీ గ్రంథపాల్ కోమల్‌ను చూసి ఇప్పుడు వాళ్లింటి చుట్టుపక్కల ఉన్న పిల్లలూ ఆమె సాయంగా తండాలు తిరుగుతున్నారు పుస్తకాలు పట్టుకొని. పొలాల్లో, అంగన్వాడీల్లో, చెరువు గట్ల మీద, వాకిళ్లలో, ఇలా పిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ పుస్తకాలు ఇస్తూ, వాళ్లు అవి చదివేలా చేస్తోంది కోమల్ అండ్ టీమ్. పైగా కిందటి రోజు చదివిన కథల గురించి తెల్లవారి చిన్న సైజు గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయట. ‘‘నాకు రామాయణ, మహాభారతం నుంచి నీతికథలు.. అన్ని.. అన్నీ ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా వాటన్నిటినీ చదవాలి. కథలు చదివితే ఇంకో ప్రపంచంలోకి వెళ్తా..’’ అంటుంది ఈ ఛోటీ గ్రంథపాల్. అన్నట్టు కోమల్‌కు తండాలవాళ్లు ఇచ్చిన పేరు అది. బుజ్జి లైబ్రేరియన్ అని! – శరాది -
కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే..
న్యూఢిల్లీ: అప్పటికే వారిద్దరి మధ్య పెద్ద గొడవ. తీవ్ర కోపంతో భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఫైటింగ్‌కు స్వస్తి పలకాలని, ఆ గొడవ మర్చిపోయేందుకు ఆమెకు గొప్ప బహుమతి ఇస్తానని నమ్మబలికాడు. పార్క్‌కు పిలిపించాడు. ఇద్దరు కలుసుకున్నాక కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకొని తనవైపునకు తిప్పుకొంటూ ఆమెను ఆశ్చర్యపరచబోతున్నానని, కళ్లు మూసుకోవాలని చెప్పాడు. దాంతో తన భర్త నెక్లెస్ తీసుకొచ్చాడని ఆమె సంతోషపడింది. ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మనోజ్ కుమార్ వ్యక్తి కోమల్ అనే యువతిని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ వివాహం. కానీ, రెండేళ్లలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మనోజ్‌కుమార్ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడు. అదే విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవవుతోంది. ఈ క్రమంలో వారిద్దరు కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్ర పన్నిన మనోజ్.. మరోసారి గొడవకు ముగింపు పలుకుదామనే నెపంతో ఆమెకు ఫోన్ చేసి ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్ రమ్మని పిలిచాడు. అంగీకరించిన కోమల్ అక్కడికి వచ్చాక అతడు ముందుగానే కంజ్వాలాలో కొనుగోలు చేసిన వైరుతో మాయమాటలు చెప్పి గొంతుకు బిగించి హత్య చేసి పారిపోయాడు. ఆ వెంటనే ఫుల్లుగా మద్యం తాగుతూ జరిగిన సంగతిని అతడి స్నేహితులకు వివరిస్తుండగా అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతడిని అనుమానించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పెద్ద మొత్తం అడవిలాగ ఉండే ఆ పార్క్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు కూడా ఆరుగంటలు పట్టింది. ఎక్కడ చంపివేశాడనే చోటును కూడా అతడు గుర్తించలేకపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
అఫీషియల్‌గా విడిపోయిన సెలబ్రిటీ జంట
ముంబై: కొంతకాలంగా టీవీ నటి సోనియా కపూర్‌తో రిలేషన్లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా అధికారికంగా భార్య నుంచి విడిపోయారు. ముంబై హైకోర్టు విడాకులు మంజూరు చేయడంతో హిమేష్- కోమల్ దంపతుల 22ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. గత డిసెంబర్లో ఈ జంట చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.. మంగళవారం విడాకులు మంజూరుచేసింది. విచారణ చివరిరోజున స్వయంగా కోర్టుకు హాజరైన హిమేష్, కోమల్‌లు.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడాకుల అనంతరం కోర్టు ఆవరణలో హిమేష్ రేషమ్మియా మీడియాతో మాట్లాడారు. వైవాహిక బంధంలో పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఉంటుందని, దానిని కొనసాగించేందుకే తామిద్దరం విడిపోయామని హిమేష్ చెప్పారు. ‘కోమల్‌తో నాది 22 ఏళ్ల ప్రయాణం. విడాకులు తీసుకోవాలనే మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. అధికారికంగా విడిపోయినా కోమల్‌కు, ఆమె కుటుంబానికి నేనెప్పుడూ మంచి మిత్రుడిగానే ఉంటా’అని హిమేష్ పేర్కొన్నారు. సోనియా కారణం కాదు తాము విడిపోవడానికి సోనియా కపూర్ కారణం కాదని హిమేష్ మాజీ భార్య కోమల్ తెలిపారు. విడాకుల అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సోనియా వల్లో ఇంకొకరివల్లో నేను నా భర్త(హిమేష్) విడిపోలేదు. ఇక ముందు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలనుకునే విడిపోయాం. హిమేష్ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడే’ అని కోమల్ లేఖలో తెలిపారు. విడాకుల అనంతరం హిమేష్‌తో కలిసి ఉన్నప్పటి ఇంట్లోనే కోమల్ ఉండనున్నారు. కొడుకు(స్వయమ్) బాధ్యతను ఇరువురూ పంచుకుంటారు.