ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ‘యమధీర’ | Yamadheera Theatrical Trailer Out Now | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ‘యమధీర’

Published Mon, Mar 18 2024 7:28 PM | Last Updated on Mon, Mar 18 2024 7:38 PM

Yamadheera Theatrical Trailer Out Now - Sakshi

కన్నడ హీరో కోమల్‌ కుమార్‌ హీరోగా ఆర్‌.శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘యమధీర’. వేదాల శ్రీనివాస్‌ నిర్మాత. రిషిక నాయిక. ఇందులో క్రికెటర్‌ శ్రీశాంత్‌ విలన్‌ పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి చిత్రంగా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ  తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి. ఎస్. రావు , పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. వేదాల శ్రీనివాస్ నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు, ఆలీ సత్య ప్రకాష్ నటించడంతో ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు.

మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎంల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్‌తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్‌కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. యమధీర చాలా మంచి టైటిల్.  వేదాల శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా ఈ సినిమా నిర్మించారు. మంచి ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత డి. ఎస్. రావు మాట్లాడుతూ.. యమధీర ఈనెల 23న విడుదల కాబోతుంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వేదాల శ్రీనివాస్కి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ : నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ సత్యనారాయణ, డి. ఎస్. రావు, పి. శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం షూట్ చేశాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement