Sreeshanth
-
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ‘యమధీర’
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా ఆర్.శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘యమధీర’. వేదాల శ్రీనివాస్ నిర్మాత. రిషిక నాయిక. ఇందులో క్రికెటర్ శ్రీశాంత్ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి చిత్రంగా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి. ఎస్. రావు , పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. వేదాల శ్రీనివాస్ నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు, ఆలీ సత్య ప్రకాష్ నటించడంతో ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎంల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్‌తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్‌కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. యమధీర చాలా మంచి టైటిల్. వేదాల శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా ఈ సినిమా నిర్మించారు. మంచి ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత డి. ఎస్. రావు మాట్లాడుతూ.. యమధీర ఈనెల 23న విడుదల కాబోతుంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వేదాల శ్రీనివాస్‌కి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ : నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ సత్యనారాయణ, డి. ఎస్. రావు, పి. శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం షూట్ చేశాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. -
నా పదును తగ్గలేదు; ఫ్రాంచైజీలకు హెచ్చరికలు పంపిన సీనియర్ బౌలర్
టీమిండియా సీనియర్ బౌలర్ శ్రీశాంత్ ఈసారి ఐపీఎల్ మెగావేలంలో పాల్గొననున్నాడు. తన కనీసం ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించిన శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో చూడాలి. అయితే శ్రీశాంత్ మాత్రం తన బౌలింగ్‌లో పదును తగ్గలేదని.. తనను పరిగణలోకి తీసుకోవాలంటూ ఫ్రాంచైజీలకు హెచ్చరికలు పంపాడు. కాగా ఏడేళ్ల నిషేధం తర్వాత గ్రౌండ్లో అడుగుపెట్టనున్న శ్రీశాంత్ కేరళ రంజీ జట్టులోకి ఎంపికయ్యాడు. రెండేళ్ల తర్వాత జరగనున్న రంజీ ట్రోఫీలో శ్రీశాంత్ పాల్గొననుండడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వేలంలో ఎంపికైతే.. తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు రంజీ సీజన్ చక్కని అవకాశమే అని చెప్పొచ్చు. తాజాగా శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. 2002లో శ్రీశాంత్ కేరళ తరపున తొలిసారి రంజీ ఆడిన మ్యాచ్ వీడియో అది. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ''నా పదును ఇంకా తగ్గలేదు.. నన్ను పరిగణలోకి తీసుకోండి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక ఐపీఎల్ మెగావేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. కాగా ఈసారి వేలంలోకి 590 మంది క్రికెటర్లు రాగా.. అందులో 228 క్యాప్డ్, 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఇక రిటెన్షన్‌లో భాగంగా 33 మందిని ఆయా జట్లు అట్టిపెట్టుకున్నాయి. ఇక వేలంలో 217 మందికి అవకాశం ఉండగా.. 590 మంది పోటీపడుతున్నారు. -
సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్!, ఏ మూవీలో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతారా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్ హిట్ టిమిండియా బౌలర్, నటుడు శ్రీశాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాని అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శ్రీశాంత్ మహ్మద్ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతిల లుక్ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ ఈ సినిమాలో శ్రీశాంత్, సమంత సరసన పలు సన్నివేశాల్లో కనిపించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే శ్రీశాంత్ ఓ మూవీతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీనితో పాటు శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటింస్తున్నట్లు తెలుస్తోంది. Controversy’s Child, Cricketer Sreesanth to Star in Samantha Movie.#Sreesanth #Nayanthara #Samantha #SamanthaRuthPrabhu #VijaySethupathi #VigneshShivan #KaathuVaakulaRenduKaadhal #KVRK #MohammedMobi #Cricket https://t.co/ahXn73TOzw — yousaytv (@yousaytv) February 10, 2022 -
'చంపేయాలన్నంత కోపం వచ్చింది'
తిరువనంతపురం : టీమిండియా స్పీడస్టర్ శ్రీశాంత్ ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమిని జీర్ణించుకోలేక ఆసీస్ క్రికెటర్లను చంపేయాలన్నంత కసిని పెంచుకున్నట్లు ఒక టీవీషోకు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా 2003 ప్రపంచకప్‌లో టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో రెండు సార్లు ఓటమిపాలైంది. లీగ్ స్టేజ్‌లో 125 పరుగులకే ఆలౌట్ అయిన గంగూలీ సేన 8 వికెట్లతో పరాజయం చవిచూసింది. ఇక టైటిల్ ఫైట్‌లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక అంతే పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ రెండు పరాజయాలు తన మనసులో నాటుకుపోయాయని, అవకాశం దొరికితే వారిని చంపేయాలనంత కసిని పెంచుకున్నానంటూ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (కేకేఆర్ ట్వీట్‌పై మనోజ్ ఆగ్రహం) '2003 ప్రపంచకప్‌లో వారు భారత్‌ను ఓడించిన విధంగా చిత్తు చేయాలనుకున్నాను. ఆ ఓటమి ఎప్పటికీ నా మనస్సులో ఉంటుంది. వారిని చంపేయాలనంత కసిని పెంచింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో నేనెప్పుడూ చాలా కోపంగా ఉండేవాడిని. ఆ అవకాశం నాకు మళ్లీ 2007 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వచ్చింది. యార్కర్ వేయాలని భావించిన నా తొలి బంతిని మాథ్యూ హెడెన్ ఫోర్ కొట్టడం నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌ను మీరు చూసినట్లయితే.. నేను చాలా ప్యాషన్‌తో పరుగు తీయడం కనిపిస్తుంది. ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించాలనుకున్నాను. ప్రతీ ఒక్కరు మాట్లాడుకునే మ్యాచ్‌లో నన్ను భాగస్వామ్యం చేసిన ఆ దేవుడికి నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటా. నా దేశం తరపున నేను కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన అదే. ఆ మ్యాచ్‌లో నేను చాలా డాట్ బాల్స్ వేసాను. కేవలం రెండే ఫోర్లు ఇచ్చి12 పరుగులు మాత్రమే సమర్పించుకొని రెండు వికెట్లు కూడా తీశా. ఈ ఏడాది సెప్టెంబర్‌తో తనపై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం తొలిగిపోనుండటంతో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. (మూడో ఫైనల్.. రెండో ట్రోఫీ.. అదిరిందయ్యా ధోని) ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్‌పై బోర్డు చర్యలు తీసుకుంది. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసిన ఈ కేరళ పేసర్.. పలుమార్లు తనకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్ టీమ్‌లలో శ్రీశాంత్ సభ్యుడిగా కొనసాగిన విషయం విధితమే. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో జోగి వేసిన ఆఖరి బంతిని క్యాచ్‌గా పట్టుకొని భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
బిగ్‌బాస్ విన్నర్‌కి శ్రీశాంత్ ఫ్యాన్ బెదిరింపులు
దీపికా కకార్ హింది బిగ్‌బాస్ 12 విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీపిక మీద యాసిడ్ పోస్తానంటూ శ్రీశాంత్ అభిమాని ఒకరు ట్విటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నరంట. దాంతో దీపిక అభిమానులు ఈ విషయాన్ని ముంబై పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి.. దీపికను రక్షించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు. దీని గురించి భువనేశ్వరి ‘శ్రీఫామ్ పేరు చెప్పి ఎవరో దీపిక మీద యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారనే విషయం గురించి నాకు తెలిసింది. ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. నేను, నా భర్త ఖచ్చితంగా చెప్పగలం శ్రీఫామ్కు చెందిన వారు ఎవరు ఇలాంటి పనులు చేయరు’ అంటూ ట్వీట్ చేశారు. My dear #SreeFam,came to know about the Acid attack news yesterday.We want to tell you all that Me and Sree are very sure that no one from #SreeFam can ever write such a thing & we believe You all. It could be any one portraying as Sreefam. — Bhuvneshwari Sreesanth (@Bhuvneshwarisr1) January 7, 2019 -
శ్రీశాంత్ బ్యాన్.. బీసీసీఐకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని సవాల్ చేస్తూ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సోమవారం అతని అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై జీవిత కాల నిషేధం సరికాదు. మళ్లీ క్రికెట్ ఆడాలన్నది నా కల. ఖచ్ఛితంగా నాకు న్యాయ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా, శ్రీశాంత్ నిషేధ అంశం పై వివరణ కోసం బీసీసీఐకు నాలుగు వారాల గడువు విధించినట్లు తెలుస్తోంది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ.. హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై కేరళ హైకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలోనే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
త్రయంపై నిషేధం కొనసాగుతుంది బీసీసీఐ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన పేసర్ శ్రీశాంత్, స్పిన్నర్ అంకిత్ చవాన్, చండిలాలపై జీవితకాల నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇందులో రెండో ఆలోచన లేదని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘బీసీసీఐ క్రమ శిక్షణ కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు. క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు.. రెండు వేర్వేరుగా ఉంటాయి. గతంలో క్రికెటర్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని అవినీతి నిరోధక యూనిట్ కూడా నివేదికను ఇచ్చింది. కాబట్టి కమిటీ తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు. -
సంగీత దర్శకుడిగా శ్రీశాంత్?
పైకి ఎదిగినంత వేగంగానే వివాదాలతో కెరీర్లో వెనుకపట్టు పట్టిన భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. ఐ.పి.ఎల్. పోటీలలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గాను నిషేధానికి గురైన ఈ యువకుడు దాదాపుగా క్రికెట్‌కు దూరమైనట్లే. ఒకవైపు తాను అమాయకుడినంటున్న ఈ కులాసా కుర్రాడు ప్రస్తుతం ఇతర వ్యాపకాల వైపు ఆలోచన మళ్ళించినట్లు కనిపిస్తోంది. విందులు, వినోదాలు, ఇతర కార్యక్రమాల్లో ఇప్పటికే ఆటపాటల్లో ప్రతిభ చూపెట్టిన శ్రీశాంత్ తాజాగా పాటలకు బాణీలు కట్టడానికి సిద్ధమవుతున్నాడట! తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘అణ్బుళ్ళ అళగే’ చిత్రానికి ఈ కళంకిత క్రికెటర్ పాటలు రాస్తున్నారనీ, బాణీలు కడుతున్నారనీ కోడంబాకమ్ కబురు. ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రంలో శ్రీశాంత్ బావ మధూ బాలకృష్ణన్ ఓ పాట పాడుతున్నారట. ఆ మాటకొస్తే, శ్రీశాంత్‌కు ఈ కళాపోషణ కాస్త ఎక్కువే. గతంలో ఓ కార్యక్రమంలో హిందీ తారలతో కలసి నర్తించిన అనుభవం అతనికి ఉంది. అలాగే, తాజాగా టీవీ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లాజా’లో కూడా శ్రీశాంత్ పాల్గొంటున్నాడు. ఆ కార్యక్రమం కోసం తన డ్యాన్స్ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. అయితే, సినిమాకు శ్రీశాంత్ సంగీత దర్శకత్వం గురించి అధికారికంగా ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. ‘‘శ్రీ ఇప్పుడు ముంబయ్‌లో ‘ఝలక్ దిఖ్లా జా’కు డ్యాన్స్ ప్రాక్టీస్‌లో ఉన్నాడు’’ అని అతని సోదరుడు దీపూ శాంత్ చెబుతున్నారు. పాటలు రాయడం, బాణీలు కట్టడమనేది నిజమైతే, శ్రీశాంత్ మరోసారి వార్తల్లో నిలిచినట్లే! -
సినిమా రంగంలో శ్రీశాంత్
క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ గురించి తెలియని వారుండరు. కొంత కాలం స్టార్ ప్టేయర్‌గా మెరిసిన ఈయన ఆ మధ్య బెట్టింగ్ ఆరోపణలతో బహిష్కరణకు గురై విషయం తెలిసిందే. ఈ సంచలన క్రీడాకారుడిప్పుడు తన దృష్టిని సినిమా రంగంపై సారించారు. ఈ రంగంలో నటుడిగా, సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న అన్బుళ్ల అళగే అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. అంతేకాదు శ్రీశాంత్ రియాలిటీ షో కోసం ప్రాక్టీస్ చేస్తుండడం విశేషం. ప్రముఖ డ్యాన్సర్, నృత్య దర్శకురాలు స్నేహా కపూర్ ఈ షోకు నృత్య దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారని శ్రీశాంత్ సోదరుడు నిర్వాహకుడు దీపుశాంత్ వెల్లడించారు. శ్రీశాంత్ ఇప్పటికే ఒక స్టేజీ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్‌తో కలిసి ఆడి తన డ్యాన్స్ స్కిల్‌ను నిరూపించుకున్నారు. ఈ రియాలిటీ షోకు క్రికెట్ క్రీడాకారులు పురబ్ కోహ్లి, సుబే విందర్ సింగ్, సోపియ చౌదరి, నటుడు రణ్వీర్ షోర్లు అతిథులుగా పాల్గొననున్నారు. ఈ షోకు నటి మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రెమో డి.సౌజాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనుండటం విశేషం.