బిగ్‌బాస్‌ విన్నర్‌కి శ్రీశాంత్‌ ఫ్యాన్‌ బెదిరింపులు | Dipika Kakar Threatened With Acid Attack by Sreesanth Fan | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ విన్నర్‌కి శ్రీశాంత్‌ ఫ్యాన్‌ బెదిరింపులు

Published Tue, Jan 8 2019 3:56 PM | Last Updated on Thu, Jul 18 2019 1:53 PM

Dipika Kakar Threatened With Acid Attack by Sreesanth Fan - Sakshi

దీపికా కకార్ హింది బిగ్‌బాస్‌ 12 విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీపిక మీద యాసిడ్‌ పోస్తానంటూ శ్రీశాంత్‌ అభిమాని ఒకరు ట్విటర్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నరంట. దాంతో దీపిక అభిమానులు ఈ విషయాన్ని ముంబై పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసి.. దీపికను రక్షించాలంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి శ్రీశాంత్‌ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు.

దీని గురించి భువనేశ్వరి ‘శ్రీఫామ్‌ పేరు చెప్పి ఎవరో దీపిక మీద యాసిడ్‌ దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారనే విషయం గురించి నాకు తెలిసింది. ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. నేను, నా భర్త ఖచ్చితంగా చెప్పగలం శ్రీఫామ్‌కు చెందిన వారు ఎవరు ఇలాంటి పనులు చేయరు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement