సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ దుమ్ములేపుతున్నాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 467 పరుగులు సాధించాడు. పలు మ్యాచ్‌లలో తన అద్భుత ఇన్నింగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డులు కూడా అందుకున్నాడు.
ఇక 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సాధిస్తున్న విజయాల పట్ల అతడి తల్లిదండ్రులు రాజ్‌కుమార్ శర్మ, మంజు శర్మ ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో అభిషేక్ తల్లి మంజు, సోదరి కోమల్ అతడి వెంటే ప్రయాణాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కోమల్ తన సోదరుడు అభిషేక్‌తో కలిసి స్టేడియంలో సందడి చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
చెల్లెలు కాదు.. అక్క!
ఈ నేపథ్యంలో కోమల్ శర్మ గురించిన వివరాల కోసం అభిమానులు వెదుకుతున్నారు. కోమల్ శర్మ అభిషేక్ శర్మ చెల్లెలు అని పొరబడుతున్నారు. నిజానికి ఆమె అభిషేక్ కంటే ఏడేళ్లు పెద్దవారట.
మార్చి 20, 1994లో కోమల్ శర్మ జన్మించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో ఆమె బ్యాచిలర్ డిగ్రీ చేశారు. జైపూర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
ఆమె ఒక డాక్టర్!
ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్ కోమల్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటొలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా అభిషేక్‌కు కోమల్‌తో పాటు మరో సోదరి సానియా శర్మ కూడా ఉన్నారు.
ఇక సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన నేపథ్యంలో తన తమ్ముడు అభిషేక్ శర్మతో కలిసి కోమల్ అహ్మదాబాద్‌కు వెళ్లారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్‌తో తొలి ఫైనలిస్టు ఎవరో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment