టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్‌లో జరిగిన రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.
ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన అభిషేక్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. సఫారీ పేసర్ కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాటర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదేమి ఆట భయ్యా..కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతావా? అంటే ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మరి కొంతమంది అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వండి అంటూ భారత జట్టు మేనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.
ఒక్క సెంచరీ మినహా..
కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు భారత్ తరపున 9 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
జైశ్వాల్‌కు బ్యాకప్‌గా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదింటిలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తానే అభిషేక్ జట్టులో కొనసాగే అవకాశముంది.
ఐపీఎల్‌లో అదుర్స్
ఐపీఎల్-2024లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్రదర్శించలేకపోతున్నాడు.
Abhishek Sharma's last 9 T20i innings:
0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5)
He is clearly missing IPL tracks and his partner Travis Head.#INDVSSA pic.twitter.com/rZLiTGUmxe— JassPreet (@JassPreet96) November 10, 2024
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment