లండన్: బ్రిటన్‌లో ఓ సిక్క్తుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. బర్మింగ్‌హమ్ నగరంలో రద్దీగా ఉన్న వీధిలో సిక్కుపై అందరూ చూస్తుండగానే దారుణంగా దాడి చేసిన వీడియోను ‘డైలీ సిక్ అప్‌డేట్స్’ అన్న ఫేస్‌బుక్ పేజీలో సంచలనం సృష్టించింది. బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. సిక్కుపై దాడి జరుగుతున్న చుట్టూ ఉన్న వ్యక్తులెవరూ పట్టించుకోలేదు. కొద్ది దూరంలో మరో వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. బహుశా అతను మొదటి బాధితుడై ఉంటాడనిఅనుమానిస్తున్నారు.