
BJP MLA Mukesh Verma Quits Party: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణల పరంపర కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన మర్నాడే ధారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత మళ్లీ మరో ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడిన కులాలను విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలను పట్టించుకోలేదని, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచిందని వర్మ ఆరోపించారు. అంతేకాదు ఆయన ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల నాయకుడిగా తన రాజీనామలేఖలో పేర్కొన్నారు. అయితే వర్మ తాను ఏ పార్టీలోకి వెళ్తున్నదీ చెప్పలేదు. ఈ మేరకు రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం ఆ పార్టీకి షాక్‌కి గురిచేసే అంశమే!
(చదవండి: బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు)
Comments
Please login to add a commentAdd a comment