
బీజేపీలో చేరిన ఎస్పీ ఎమ్మెల్యే హరి ఓం
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూ ఉండగానే.. మరోవైపు చేరికలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం కాషాయం గూటికి చేరారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో సైనీ, హరి ఓంలతో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మపాల్ సింగ్‌లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ!
బీజేపీలోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. ఎన్నికల వేళ పార్టీలోని కీలక ఓబీసీ నేతలు బయటకి వెళ్లిపోతూ ఉండడంతో ఆ వర్గంలో తమకు ఇంకా పట్టు ఉందని నిరూపించుకోవడం కోసమే ఓబీసీ ఎమ్మెల్యేలను అక్కున చేర్చుకోవాలన్న వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment