ముగ్గురిని బలిగొన్న అతివేగం
కల్వర్టును ఢీకొన్న కారు
అక్కడికక్కడే ఒకరు..
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
మృతుల్లో నవదంపతులు
నకిరేకల్ సమీపంలో దుర్ఘటన
మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు
నకిరేకల్, న్యూస్‌లైన్ అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర సంఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రా మం వెళ్లారు. తిరుగుప్రయాణంలో సత్తుపల్లి మండ లం తంబూరుకు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ బావ తిన్నవల్లి చైతన్యకుమార్, చెల్లి విష్ణుప్రియతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 7గంటల సమయంలో కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ నకిరేకల్ బైపాస్ వద్ద అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని త ప్పించబోయి కల్వర్టు గోడను ఢీకొట్టాడు.
ఈ ఘట నలో సౌమ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకట కృష్ణప్రసాద్, అతని బావ చైతన్యకుమార్(31), చెల్లి విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి త రలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్బీనగ ర్ కామినేనికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్ మృతి చెందగా విష్ణుప్రియ మృత్యువు తో పోరాడుతోంది.సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద స్థలిని సీఐ నాగేశ్వర్, ఎస్‌ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్ర భుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.