Kalvartu
-
కూలిన కల్వర్టు
దేవరాపల్లి (మాడుగుల): దేవరాపల్లి నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో బోయిలకింతాడ గ్రామం వద్ద ఆర్అండ్బి కల్వర్టు కూలిపోయింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడ,తో ఆ రోడ్డుకు ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 25 అడుగుల వెడల్పున ఉన్న కల్వర్టు కూలిపోయే సమయంలో దేవరాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్తున్న బస్సు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. వందమందికి పైగా కాలేజీ విద్యార్థులతో చోడవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కల్వర్టు కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు దాటిపోవడంతో రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడింది. దేవరాపల్లి నుంచి గవరవరం మీదుగా చోడవరం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వాణిజ్య కేంద్రమైన చోడవరంలో కోర్టుల సముదాయంతోపాటు ట్రెజరీ కార్యాలయం తదితర సదుపాయాలు ఉండటంతో మండలంలోని దేవరాపల్లి, కాశీపురం, చిననందిపల్లి, పెదనందిపల్లి, తారువా, ఏ.కొత్తపల్లి, కెఎం పాలెం, మారేపల్లి, తెనుగుపూడి, వెంకటరాజుపురం, గరిశింగి, వాకపల్లి, తిమిరాం, కలిగొట్ల తదితర గ్రామాల ప్రజలు బోయిలకింతాడ మీదుగానే చోడవరానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కల్వర్టు కూలిపోడంతో మండల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 8 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించి తారువా బ్రిడ్జి, మామిడిపల్లి, వేచలం మీదుగా గవరవరం శారదానదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాజ్వే పైనుంచి వెళ్లాల్సివుంటుంది. కాజ్‌వేపై నుంచి శారదానది ఉప్పొంగి ప్రవహిస్తే ఆ అవకాశం కూడా ఉండదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. ఈ శిథిల కల్వర్టు కూలిపోతుందని స్థానిక తాజా మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల యువజన అధ్యక్షుడు బూరె బాబురావు పలు మార్లు ఆర్అండ్బి అధికార్లు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు మండల సర్వ సభ్య సమావేశంలో సైతం పలుమార్లు ఇదే సమస్యపై గళమెత్తారు. అప్పట్లో అధికార్లతో పాటు అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఇసుక లారీ వలనే కూలిపోయింది..... బోయిలకింతాడ వద్ద కూలిపోయిన కల్వర్టును ఆర్అండ్బి ఏఈ కె.వెంకటేశ్వరరావు సోమవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. 10 టన్నులు బరువుకు మాత్రమే పర్మిషన్ ఉన్న ఈ రహదారిలో సుమారు 50 టన్నుల మేర అధిక బరువుతో ఉన్న ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వలనే కల్వర్టు కూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి దేవరాపల్లి–చోడవరం ప్రధాన రహదారిలో బోయిలకింతాడ వద్ద కూలిన కల్వర్టు సమస్యను ఆర్అండ్బి ఎస్ఈ దృష్టికి తీసుకెళ్తాను. ప్రతీ రోజు వందలాది మంది విద్యార్దులు కాలేజీలకు, మండల ప్రజలు నిత్యం కోర్టులు, ట్రెజరీ తదితర పనులపై చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో కూలిన కల్వర్టుకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను యుద్దప్రాతిపదకన చేపట్టేలా అధికార్లుపై ఒత్తిడి తీసుకువస్తాను. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను.–బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల -
నిర్లక్ష్యపు గండి
నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి నగరం-కారంకివారిపాలెం మధ్య నిలిచిన రాకపోకలు మురుగు తూములున్న చోట కల్వర్టులు నిర్మించని ఫలితం ముందే హెచ్చరించినా పెడచెవిన పెట్టిన అధికారులు నగరం : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది మన అధికారులు తీరు. మురుగు తూములున్న చోట కల్వర్టులు నిర్మించండి మాహాప్రభో అని రోడ్డు నిర్మాణ సమయంలోనే అధికారులకు విన్నవించినా వారి చెవికెక్కలేదు. ఫలితంగా రెండు నెలల కిందట నిర్మించిన రోడ్డు కోతకు గురై తెగిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తీరిగ్గా వచ్చి మరమ్మతులు చేపట్టాలంటూ సిబ్బందిని ఆదేశించి వెళ్లారు. మండల కేంద్రం నగరం నుంచి కారంకివారిపాలెం వెళ్లే మార్గంలో రెండు నెలల కిందట బీటీ రోడ్డు నిర్మించారు. రహదారి కింద ఉన్న మురుగుతూములకు కల్వర్టు నిర్మించలేదు. దీంతో తూములున్న చోట క్రమంగా రోడ్డు కోతకు గురైంది. నాలుగురోజులుగా అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయం కారంకిపాలెం వద్ద రోడ్డుకు గండిపడి పూర్తిగా తెగిపోయింది. దీంతో కారంకివారిపాలెం, అద్దంకివారిపాలెం, తోటపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి మరోవైపున పంటకాల్వల ఉండటంతో పంటలకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. పంటకాల్వపై వేసిన విద్యుత్‌స్తంభాల మీదుగా పాదచారులు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు. ఈ మార్గంలోనే మరో మూడు మురుగు తూములున్నాయి. వీటి వద్ద రోడ్డు కోతకు గురువుతోంది. ఇవి కూడ తెగే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు వేసే ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని, అప్పుడే కల్వర్టులు నిర్మించి ఉంటే ఇలాంటి ప్రమాదాలకు తావుండేది కాదని అంటున్నారు. నీటి ప్రవాహ ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయిందన్న విషయం తెలుసుకుని తెనాలి ఆర్డీవో కె.నరసింహులు, పీఆర్ ఈఈ సుబ్రమణ్యేశ్వరరావులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రహదారి మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులతో చర్చించి రహదారి కోతకు గురవకుండా పటిష్ట చర్యలు చేపడతామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ దారం వెంకటేశ్వరరావు, డీటీ వెంకటేశ్వరరావు, పీఆర్ఏఈ షేక్ పిరోజ్లాల్, టీడీపీ స్థానిక నేత విచారపు రాఘవయ్య డ్రైనేజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
వారసుడిని చూడకుండానే..
⇒ దొంగరావిపాలెం వద్ద కల్వర్టును ఢీకొన్న కారు ⇒ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ⇒ ఇద్దరికి తీవ్రగాయాలు ⇒ మృతులు విశాఖ లాసన్స్‌బే కాలనీ వాసులు ⇒ ఐదు రోజుల క్రితం జన్మించిన బిడ్డను చూసేందుకు వెళుతుండగా ప్రమాదం పెనుగొండ రూరల్: వారసుడు పుట్టాడనే ఆనందంతో బయల్దేరిన విశాఖలోని ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఐదు రోజుల క్రితం జన్మించిన కుమారుడిని చూసేందుకు తహతహతో బయల్దేరిన తండ్రి, వారసుడిని చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్న తాత, నానమ్మ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పశ్చిమగోదావిర జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయరహదారిపై ఆదివారం వేకువజామున కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీకి చెందిన చల్లా గంగునాయుడు(55), చల్లా పార్వతమ్మ(50) దంపతులు, వారి కుమారుడు చల్లా అరుణకుమార్(30) అక్కడిక్కడే మృతి చెందారు. అరుణకుమార్ చెల్లెలు చల్లా సునీత, స్నేహితుడు యు.చలపతికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అరుణకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతూ ఓవర్ టేక్ చేసే సమయంలోగానీ, కునుకు పట్టడంతోగాానీ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సునీత, చలపతిని తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రమాదం వేకువజాము 4, 5 గంటల మధ్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారు కావడంతో ఇక్కడ జన సంచారం లేదు. అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సమాచారం అందించడంతో పెనుగొండ ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏడాది క్రితమే వివాహం విశాఖపట్నానికి చెందిన చల్లా అరుణకుమార్‌కు ఏడాది క్రితం నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన అరుసుమిల్లి కూర్మారావు రెండో కుమార్తె నళినితో వివాహమైంది. ఆమె ఐదు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కుమారుడు పుట్టాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో అందరికీ వెసులుబాటు ఉంటుందని కుమారుడిని చూడడానికి తల్లి, తండ్రి, చెల్లి, స్నేహితుడితో కారులో తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివాహమైన ఏడాదిలోనే అల్లుడిని కోల్పోయామంటూ కూర్మారావు కన్నీరుమున్నీరయ్యారు. పచ్చి బాలింతరాలైన కుమార్తెకు అల్లుడి మరణ వార్త ఎలా చెప్పాలంటూ విలవిల్లాడారు. ఉద్యోగంలో చేరకుండానే అరుణకుమార్ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ వద్ద విశాఖపట్నంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అతని తండ్రి గంగునాయుడు కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో అరుణకుమార్‌కు కేజీహెచ్‌లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం మాసేశాడు. ఈ లోపునే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రమాదంలో కాళ్లు, మరో ప్రమాదంలో ప్రాణాలు చల్లా గంగునాయుడు జీవితం ప్రమాదాలతోనే గడిచిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఐదేళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కర్రల ఊతంతో మాత్రమే కదలగలడు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొడుకును ఉద్యోగంలో చేర్చాలని ఆశపడ్డారు. ఎట్టకేలకు కుమారుడికి కారుణ్య నియామకం కింద అనుమతులు వచ్చిన తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలన్న ఆశ తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వారసుడైన మనుమడిని కూడా చూడకుండానే వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. -
ముగ్గురిని బలిగొన్న అతివేగం
కల్వర్టును ఢీకొన్న కారు అక్కడికక్కడే ఒకరు.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి మృతుల్లో నవదంపతులు నకిరేకల్ సమీపంలో దుర్ఘటన మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు నకిరేకల్, న్యూస్‌లైన్ అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర సంఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రా మం వెళ్లారు. తిరుగుప్రయాణంలో సత్తుపల్లి మండ లం తంబూరుకు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ బావ తిన్నవల్లి చైతన్యకుమార్, చెల్లి విష్ణుప్రియతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 7గంటల సమయంలో కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ నకిరేకల్ బైపాస్ వద్ద అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని త ప్పించబోయి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. ఈ ఘట నలో సౌమ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకట కృష్ణప్రసాద్, అతని బావ చైతన్యకుమార్(31), చెల్లి విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి త రలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్బీనగ ర్ కామినేనికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్ మృతి చెందగా విష్ణుప్రియ మృత్యువు తో పోరాడుతోంది.సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద స్థలిని సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్ర భుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
జీవచ్ఛవాలుగా..
సాక్షి, మంచిర్యాల/మందమర్రి : అది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట. ఆ గ్రామంలో మంచి వైద్యుడు ఉన్నాడు. అతడే కుందారపు శ్రీనివాస్. ఇతనికి పదకొండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అభిరామ్, కూతురు దీక్షిత జన్మించారు. కలతలు, కలహాలు లేకుండా హాయిగా జీవిస్తున్నా రు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మందమర్రిలోని తన తోడల్లుడు హేమంత్‌కుమార్ నానమ్మ దశ దినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబం హాయిగా గడిపి గురువారం సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిలోని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వారి ఇంట్లో ఏడు గంటల వరకు గడిపి ఇంటికి బయలు దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా.. అని శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత నా చేయి పట్టుకుని వదల్లేదు. వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు అని రోదించుకుంటూ చెప్పింది శ్రీలత తల్లి లక్ష్మి. ఇంతలోనే ఘోరం.. రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్, శ్రీలత, పిల్లలు కమాన్‌పూర్‌కు బయలు దేరారు. మందమర్రి దగ్గరలోని పాలవాగు కల్వర్టు వద్ద పాము అడ్డు వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు కూర్చున్న దీక్షిత డాడీ పాము అనగానే శ్రీనివాస్ బయపడి కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కింద పదునైన బండలు ఉన్నాయి. బండలపై పడటంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్రంగా దెబ్బతాకింది. పడటంతోనే శ్రీనివాస్ చనిపోయాడు. దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది.. అరిచి అరిచి రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడటంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని చేయి విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు కూడా నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండటంతో ఎవరూ కనిపించ లేదు. ఎవండి.. ఎవండి.. అరేయ్ బాబు, అమ్మాయి ఎక్కడున్నారు.. అని అన్నా ఎవరి నుంచి మాటలు వినబడ లేదు. కాపాడండి.. కాపాడండి అని అరిచింది.. ఎవరు రాకపోవడంతో ఆమె కూడా అపస్మారక స్థితి లోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు కొడుకు అభిరామ్‌కు మెలుకువ వచ్చింది. మేలకువ వచ్చి.. చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటు నుంచి వస్తుందోనని బాలుడి భయం.. బాలుడు కూడా కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది.. శుక్రవారం వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. కల్వర్టు లోతుగా ఉండటం.. ముళ్లపొదలు అధికంగా ఉండటంతో వీరిని ఎవరు గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది. నిమిషాలు గంటలు.. గంటలు రోజుల్లా గడిచాయి.. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలత మేలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్పూర్లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర ఉన్నామని చెప్పి మళ్లీ సృ్పహ కోల్పోయింది. ఉదయం నుంచి వెతుకగా.. ఇటు కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇటు పోలీసులు, ఆటూ కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ లేపి మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పై నుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శబ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-రామకృష్ణాపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్లు కింద శనివారం రాత్రి పది గంటలకు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.. స్పృహలోకి రాని శ్రీలత మందమర్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుందారపు శ్రీలత, అభిరామ్రాం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. శ్రీలత ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అభిరామ్ రాంలకు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో బాలుడిని కూడా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంకా తన భర్త, కుమార్తె మృతి చెందిన విషయం ఇంకా శ్రీలతకు తెలియదని, వారు మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాత్రమే తెలుసు అని బంధువుల తెలిపారు. దీంతో వచ్చిన వారికి వారి మరణవార్త శ్రీలతకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని వారు తెలిపారు. నేడు అయితే పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఏక్కడ.. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఎక్కడ ఇంకా నాన్న నిద్రపోయి లేవలేదా.. ఎందుకు ఇంత మంది ఉన్నారు. నాకు మమ్మీ, డాడీ, చెల్లిని చూపించండి అంటూ శ్రీనివాస్ కుమారుడు అభిరామ్ అనడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిరామ్‌ను తన తండ్రికి దహన సంస్కారాలు చేసేందును రొంపికుంట గ్రామానికి తీసుకువచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అభిరామ్‌తో కలిసి తలకొరివిపెట్టారు. కమాన్‌పూర్‌లో అంత్యక్రియలు మంచిర్యాలలో శ్రీనివాస్, దీక్షిత మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కమాన్‌పూర్‌కు తరలించారు. ఆదివారం తండ్రీకూతురు అంత్యక్రియలు జరిగాయి. శ్రీలతకు తీవ్రగాయాలు కాగాకరీంనగర్లోని ఓ ఓ ప్రవేటు ఆస్పతిలో చికిత్స పొందుతుంది. ఆమె భర్త, కూతురు కడారి సారి చూపున నోచుకోలేదు.