చెరువులో పడి బాలిక మృతి | Girl fell into the pond and died | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలిక మృతి

May 29 2018 12:54 PM | Updated on Sep 28 2018 3:39 PM

Girl fell into the pond and died - Sakshi

మాధురి మృతదేహం

కేతేపల్లి (నకిరేకల్‌) : బహిర్భూమికి వెళ్లిన బాలిక ప్రమాదశవాత్తు చెరువులో మునిగి మృతి చెంది ంది. ఈ ఘటన కేతేపల్లి మండలం  గుడివాడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన టేకుల సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు కుమారుడు ఉన్నారు.

వీరిలో పెద్ద కుమార్తె మాధురి(11) తోటి స్నేహితురాలితో కలసి సోమవారం  బహిర్భూమికి స్థానిక జెడ్పీ పాఠశాల పక్కనే ఉన్న  చెరువు వద్దకు వద్దకు వెళ్లింది. ఈక్రమంలో  చెరువులోకి దిగిన మాధురి అందులో ఉన్న లోతైన గుంటలను గమనించక పోవటంతో  ప్రమాదశవాత్తు నీటిలో మునిగిపోయింది.

దీంతో మాధురి వెంట ఉన్న బాలిక కేకలు వేస్తూ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ చేసిం ది. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న  మాధురి తల్లిదండ్రులు, గ్రామస్తులు చెరువులో గాలించటంతో మాధురి  మృతదేహం లభించింది. మృతురాలు స్థానిక  ప్రభుత్వ పాఠశాలలో  ఆరో తరగతి చదువుతోంది.  

గ్రామస్తుల అందోళన

పాఠశాలకు సమీపంలో ఉన్న చెరువులో కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోక పోవటం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందోళనకు దిగారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు.

పాఠశాల పక్కనే లోతైన గుంతలు తవ్వి మట్టి తీసుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement