నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులోని కడపర్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న చిన్నారి మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. చౌటుప్పల్ భీమనకల్లుకు చెందిన దంపతులు బిడ్డతో బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.