ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాస్తారోకో
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాస్తారోకో
Published Fri, Aug 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
నకిరేకల్ : ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని రవాణాకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ మెయిన్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటì కీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాస్తారోకో చేస్తున్న సమయంలోనంబర్ ప్లేట్ లేకుండా ఇసుకుతో వస్తున్న ఓ ట్రాక్టర్‌ను మెయిన్‌సెంటర్ నిలిపివేసి పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ సర్పంచ్‌పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నాయకులు దైద సుధాకర్, కందాల ప్రమీల, మర్రి వెంకటయ్య, రాయి కృష్ణ, పల్స యాదగిరి, బొమ్మకంటి కొమురయ్య, గౌని లక్ష్మినర్సయ్య, పురుషోత్తంరెడ్డి, ఆకుల భాస్కర్, వంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నర్సింహ్మ, సుదీర్‌రెడ్డి, మర్రి రామస్వామి, దేవయ్య, శ్రీను, జనార్ధన్, అమీర్‌పాషా, నగిశెట్టి శ్రీను, వంటెపాక కృష్ణ, పుట్ట సత్తయ్య, ముత్తిరాములు, బొజ్జ చిన్నవెంకులు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement