ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’ | man who guided the world of Swami Vivekananda | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’

Published Wed, Jan 11 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’

ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’

నకిరేకల్‌ : ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌ అన్నారు. నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన  మండలి ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పగల సామర్ధ్యం కలిగిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన  ముగ్గులు, వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రధమ బహుమతి జె.రేణుక, రెండో బహుమతి ఎస్‌.మాధవి, మూడో బహుమతి సంతోష, వ్యాసరచన పోటీలో ప్రధమ ఝాన్సీ, ద్వితీయ ఎం.జ్యోతి, తృతీయ కే.శ్రీదేవి అందుకున్నారు. తొలుత గ్రామ శివారులోని రాణి రుద్రమాదేవి శిలాశాసనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ కొమ్ము వెంకటేషం, ఎంపీటీసీ పుట్ట సరిత, దోసపాటి రాము, వివేకాయంద యువజన మండలి అధ్యక్షుడు పుట్ట సాయి, ప్రతిని«ధులు జొర్రీగల వెంకటేశ్వర్లు, దోసపాటి నాగరాజు, పుట్ట సత్యనారాయణ, తండు శ్రీను, శ్రీకాంత్, బెజవాడ సురేష్, పుట్ట జానయ్య, దయాకర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement