swami vivekananda
-
స్వామి వివేకానందకు జగన్ నివాళులు
-
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
‘స్వామి వివేకానంద తొలి శంఖారావం హైదరాబాద్‌లోనే’
హైదరాబాద్: స్వామి వివేకానంద తొలి శంఖారావం మన భాగ్యనగరంలోనేనని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. స్వామి వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని కొద్దిమందికి మాత్రమే తెలుసని చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ లో జరిగిన 'వివేకానంద డే' కార్యక్రమంలో భాగంగా యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన స్వామి వివేకానంద ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారని స్వామి బోధమయానంద చెప్పారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరయ్యారని ఆయన చెప్పారు. ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ నాడు సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారని చెప్పారు. హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి స్వామి వివేకానంద వివరించారని తెలిపారు. భారత దేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారని, భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు వివేకానంద స్పష్టం చేశారని బోధయమానంద తెలిపారు. అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష కోరల్లో చిక్కుకోవద్దని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద యువతను హెచ్చరించారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ లాంగ్వేజెస్, డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్ల భాషా మంత్రాలని అభివర్ణించారు. యువత వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి పొందాలని సూచించారు. రామకృష్ణ ప్రభ సంపాదకులు స్వామి పరిజ్ఞేయానంద మాట్లాడుతూ ఫిబ్రవరి 13 'వివేకానంద డే' ప్రాధాన్యత గురించి సమాజంలో మరింత అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాదేనని చెప్పారు. మహబూబ్ కాలేజీ అధ్యక్షులు పి. ఎల్ . శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి 'వివేకానంద డే' వేడుకల్లో వేలాదిమంది పాల్గొనేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో మహబూబ్ కాలేజీ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, కార్యదర్శి భగవత్ వారణాసి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, వాలంటీర్లు, పాల్గొన్నారు. కార్యక్రమానికి వాలంటీర్ నారాయణ రావు సమన్వయకర్తగా వ్యవహరించారు. -
‘ఆయన రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’
‘ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహ నీయుని చిత్తరువు ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు ఓ రష్యన్ చింతనాశీలి. జీవితంలో సమస్యలనేవి ప్రతీ వ్యక్తికీ ఉండేవే. ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు, కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహిణి కావచ్చు, మరెవరైనా కావచ్చు. సమస్యలనేవి సర్వసాధారణమైతే, సమ స్యను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయడానికి కావలసిన సామర్థ్యం పెంచుకుంటే సమస్యలు పరిష్కరించడం పెద్ద విశేషం కాదని వివేకానందుడు అన్న మాటలు సదా స్మరణీయం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా ఆలోచింపజేస్తాయి. కాని స్వామి వివేకానందుడు చెప్పిన అమృత వాక్యాలు మాత్రం యువతను ప్రేరేపించి, ఆచరింపజేస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాని ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి ఆదర్శాన్ని స్వీకరించి గొప్ప నేతలుగా ఎదగవచ్చనేది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు నిరూపించారు. ఆ ఒక్క వ్యక్తి వివేకానందుడే నని వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ, బోస్బాబులు విభిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆదర్శాలు కలిగి ఉన్నవారని చరిత్రకారుల వాదనల సారాంశం. ‘నేను స్వామి వివేకానందుడి రచనలు చదవడం ద్వారా నాలో వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’ అని గాంధీజీ అంటే... సుభాష్ చంద్రబోస్ ‘స్వామి వివేకానందుని రచనలు చదువుతుంటే నా ఒంట్లో రక్తం ఉప్పొంగుతుంది కదా! ఆయనను విన్నవారు ఇంక ఎంత అనుభూతిని పొంది ఉంటారో? ఆయన బ్రతికి ఉన్నట్లయితే పాదాల చెంత కూర్చొని ఆయన ఏమి చెబితే అది చేసేవాణ్ణి’ అన్నారు. ఈ మహానేతలు వివేకానందుని మాటలకు ఎంతగా ప్రభావితులు అయ్యారో ఈ మాటలే తెలియజేస్తాయి. ఇవ్వాళ దేశానికి కావలసింది ఇలాంటి ప్రభావ వంతమైన స్ఫూర్తి ప్రదాతలే. విద్య పట్ల వివేకానందుని అభిప్రాయాలు అత్యున్నతమైనవి. విద్యా వ్యవస్థను ఆయన భావాలకు అనుగుణంగా రూపొందించగలిగితే కాబోయే భారత పౌరులందరూ జాతి రత్నాలుగానే భాసిస్తారు. అప్పుడు తాము పుట్టిన ఊరినే కాదు, దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్దరించగల మహానుభావులు ప్రపంచానికి అందుతారు. (క్లిక్ చేయండి: ఆదివాసుల హృదయ దీపాలు) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనవరి 12 వివేకానందుని జయంతి, జాతీయ యువజన దినోత్సవం) -
స్వతంత్ర భారతి: నూరవ ‘సైన్స్ కాంగ్రెస్’
నూరవ ‘సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు కలకత్తాలో జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరిగాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐ.ఎస్.సి.ఎ.) వీటిని నిర్వహించింది. ఐ.ఎస్.సి.ఎ. కలకత్తాలోనే 1914లో ప్రారంభం అయింది. ఈ సంస్థ ఏటా జనవరి నెల మొదటి వారంలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తుంటుంది. దేశవిదేశాల శాస్త్రవేత్తలు, సైన్స్‌లో నోబెల్ గ్రహీతలు హాజరై ప్రసంగిస్తారు. స్వామీ వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు ఆధ్యాత్మిక గురువు స్వామీ వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యులు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు పి.బి.శ్రీనివాస్, శకుంతలాదేవి, శంషాద్‌బేగం, రితుపర్ణోఘోష్, శ్రీహరి, మన్నాడే.. కన్నుమూత. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు. లోక్‌సభ, రాజ్యసభల్లో క్రిమినల్ లా (అమెండ్‌మెండ్) యాక్ట్, 2013 కు ఆమోదం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ బిల్, 2013 కు రాజ్యసభ ఆమోదం. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన బీజేపీ. దేశంలోనే తొలి మహిళా బ్యాంకు (అందరూ మహిళా సిబ్బందే ఉండే బ్యాకు) ముంబైలో ప్రారంభం. అమల్లోకి హెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్, 2013. రాజ్యసభలో లోక్‌పాల్, లోకాయుక్త్ బిల్లు 2013 ఆమోదం. -
సామ్రాజ్య భారతి: జననాలు
స్వామీ వివేకానంద, వినోదినీ దేశాయ్, మార్గరెట్ ముర్రే, మహాత్మ అయ్యంకాళి, అష్రఫ్ అలీ తన్వీ, ఉపేంద్ర కిషోర్ రాయ్ చౌదరి, నజ్ముల్ మిల్లత్, సత్యేంద్ర ప్రసన్న సిన్హా జన్మించారు. స్వామి వివేకానంద విశ్వవిఖ్యాత భారతీయ తత్వవేత్త. అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వివేకానంద జన్మస్థలం కలకత్తా. వినోదినీ దేశాయ్ ప్రముఖ బెంగాలీ రంగస్థల నటి. ఈమె కూడా కలకత్తాలోనే జన్మించారు. ఆమె తల్లి వేశ్య. రంగస్థల దిగ్గజం గిరీశ్ చంద్ర ఘోష్ ఆమెకు గురువు మార్గరెట్ ముర్రే జన్మించినదీ కలకత్తాలోనే. ఆంగ్లో–ఇండియన్ ఈజిప్టోలజిస్ట్, పురావస్తు పురాతత్వ పరిశోధకురాలు. బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా ఆర్కియాలజీ లెక్చరర్. మహాత్మ అయ్యంకాళి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆధునిక కేరళ పితామహులుగా పేర్గాంచారు. ఆయన అనుచరులు ఆయన్ని ‘మహాత్మ’ అని పిలిచేవారు. ఆయ్యంకాళి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఎడ్డెమంటే తెడ్డెం విధానాన్ని ఆచరించారు. అష్రఫ్ అలీ తన్వీ ఇస్లాం మత గురువు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జన్మించారు. ఆయన జన్మించిన ఏడాదిపై అస్పష్టత ఉంది. 1862 అని కొందరు, 1863లో అని కొందరు చరిత్రకారులు రాశారు. ఇదే సందిగ్ధత వినోదినీ దేశాయ్ జన్మ సంవత్సరం పై కూడా ఉంది. 1862, 1863 అనే రెండు రిఫరెన్సులు ఉన్నాయి. ఉపేంద్ర కిశోర్ రాయ్ చౌదరి బెంగాలీ రచయిత, తైల వర్ణ చిత్రాల లేఖకుడు. బంగ్లాదేశ్‌లో జన్మించారు. న జ్ముల్ మిల్లత్ న్యాయ నిపుణులు. ప్రాచీన జామియా నజ్మియా మత విద్యాలయ స్థాపకులు. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించారు. సత్యేంద్ర ప్రసన్న సిన్హా ప్రసిద్ధ న్యాయవాది. పశ్చిమబెంగాల్లోని రాయ్‌పుర్‌లో జన్మించారు. -
World Speech Day: మంచి గొంతు, భాష ఉంటే సరిపోదు.. భావోద్వేగాన్ని జత చేస్తేనే
‘ప్రసంగం శక్తివంతమైనది. మంచి ప్రసంగం.. ప్రపంచాన్ని ఒప్పించేది, మార్చేది, ఆచరింపజేసేది’అంటాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. మాట ప్రపంచాన్ని నడిపించే వాహకం. దాన్ని అద్భుతంగా ఉపయోగించినవాళ్లు మంచి వక్తలవుతారు. అలా మనసును కదిలించే ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చిన వాళ్లున్నారు. నేడు అంతర్జాతీయ ప్రసంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాసంగికత గురించి కొన్ని ముచ్చట్లు... ప్రసంగం అంటే.. మంచి గొంతు ఉంటే సరిపోదు. మంచి భాష తెలిసినంత మాత్రాన వక్తలైపోరు. ఎందుకంటే కొన్నిసార్లు పదాలు ఉత్తి శబ్దాలు. వాటికి భావోద్వేగాన్ని, ఆలోచనలను జత చేసి వ్యక్తీకరిస్తేనే అద్భుతమైన ప్రసంగం అవుతుంది. అది జనంలో మార్పు తీసుకురాగలిగితే చరిత్రలో నిల్చిపోతుంది. రకరకాల ప్రసంగాలు.. ప్రసంగాల్లో చాలా రకాలుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని విజ్ఞానాన్ని అందజేస్తాయి. కొందరి ప్రసంగాలు ఆలోచనల్లో పడేస్తాయి. ఇంకొన్ని మనకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. అంశమేదైనా దాన్ని ముందు వక్త నమ్మితే.. అది విన్నవాళ్లను సైతం ఒప్పించగలుగతారు. అలా తమ ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చేసిన కొందరు నేతలున్నారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని రగిలిస్తే... విద్వేషాలను రెచ్చగొట్టిన మరికొన్ని ప్రసంగాలూ ఉన్నాయి. చదవండి: ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే! నాకో కల ఉంది : మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించింది. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగమది. స్వేచ్ఛ కోసం మానవ హక్కుల కోసం, స్వేచ్ఛ, సమానత్వం కోసం తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు నెల్సన్మండేలా. రివోనియా ట్రయల్ దగ్గర 1964లో సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు ముందు నిలబడి ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. ‘నా జీవితకాలం లో ఆఫ్రికన్ ప్రజల కోసం నన్ను నేను అంకితం చేసుకున్నా ను. నేను తెల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను, నల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. ప్రజలందరూ సామరస్యంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కోసం అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీ స్వేచ్ఛకోసం నువ్వు పోరాడు. ఇతరుల హక్కులపై ఆధిపత్యం కోసం పోరాడకూడదు’ ఆయన చేసిన ప్రసంగం ఆయనను చెరసాల నుంచి కాపాడలేకపోయింది కానీ... దక్షిణాఫ్రికా ప్రజల గుండెలను పిండేసింది. స్వేచ్ఛ కోసం ఆఫ్రికన్లను కార్యోన్ముఖులను చేసింది. స్వామి వివేకానందకు స్టాండింగ్ ఒవేషన్ స్వామి వివేకానంద.. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ సందర్భంగా ‘అమెరికా సోదర, సోదరీమణులకు’అంటూ ఆయన మొదలుపెట్టిన ప్రసంగం రెండు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. సమయం తక్కువగా ఉందని చెప్పిన నిర్వాహకులు... ఆయన ప్రసంగం మొదలుపెట్టాక మైమరచిపోయి విన్నారు. మహాత్ముని మాట.. అత్యంత ప్రభావితం చేయగలిగిన వక్తల్లో ఒకరు మన జాతిపిత మహాత్మాగాంధీ. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు భారత జాతిని మేల్కొల్పాయి. ‘మనం ద్వేష భావం వీడాలి, స్నేహభావం అలవరుచుకోవాలి. బ్రిటిష్ వారిప్పుడు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. వారి సహాయం కోసం నేను చేయి అందిస్తాను... దాన్ని కత్తిరించడానికి వారు సిద్ధంగా ఉన్నా సరే. వారికి సాయపడేందుకే నేను ముందుంటాను’అంటూ గాంధీ చేసిన ప్రసంగాలు బ్రిటిష్‌వారిని సైతం ఆలోచింపజేశాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో మార్చి 7న ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చరిత్రాత్మక ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కావాలంటూ ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం వినేందుకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. పాక్ సైన్యం నుంచి ర క్షణ కోసం కాకుండా ప్రతిఘటనకు ప్రతీకగా వెదురు క ర్రలు చేతబూని ప్రజలు బహిరంగసభకు వచ్చారు. ఈ సందర్భంగా ముజీబుర్ చేసిన ప్రసంగం భారత ఉప ఖండంలో రాజకీయ ప్రసంగాలలోకెల్లా అత్యున్నతమైనదిగా నిలిచింది. ఈ ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యునెస్కో 2017లో గుర్తించింది. -
పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు
స్థిమితమైన, స్థిరమైన ఆలోచన కలిగిన సాధకుడు తన సాధనతో ఏది కాగోరితే, అది కాగలడు. తాను అత్యంత బలవంతుడనని భావించి, కార్యరంగాన విజయాన్ని సాధించగల ఆత్మవిశ్వాసంతో తన గమనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తాడు. అనుకూలంగా కాలం సాగిపోతున్నప్పుడు నన్ను మించినవాడు లేడని మానవుడు విర్రవీగడం సాధారణమైన విషయం. కానీ, తనకు సంప్రాప్తించిన విజయాన్ని సైతం దైనందిన జీవికలో సంభవించిన సాధారణమైన అంశంగానే భావించిన వాడే క్లిష్టపరిస్థితుల్లోనూ తన మానసిక స్థైర్యాన్ని అచంచలమైన తీరులో ప్రదర్శించగలుగుతాడు. కష్టం లేదా ఆపద లేకుండా సాధారణంగా ఏ పనీ పూర్తికాదన్నది వాస్తవం. ఆపద ఎదురైనప్పుడు దానినుంచి పారిపోవడం సముచితమైన విషయం కాదు. అలాగని, ఆ ఆపదలో చిక్కుకుని బాధపడడమూ వివేకి లక్షణం కాదు. ఈ సందర్భంలో స్వామి వివేకానంద బోధించిన వాక్యాలు నిజమైన తెలివిని విజ్ఞతతో అన్నివేళలా ప్రదర్శించవలసిన ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ‘‘మనమంతా వేటగాడికి భయపడిన కుందేళ్ళలా ఆపద వచ్చినప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం. ఇది సరియైన పద్ధతి కాదు. ఎంతటి ఆపదనైనా సరే, ఎదుర్కొని పోరాటాన్ని సాగించడమే నిజమైన ప్రజ్ఞ. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడ్డామంటే చాలు, కష్టాలు, భయాలు అన్నీ దూరంగా తొలగిపోతాయి.’’ అన్న అద్భుతమైన వాక్యాలు ఎప్పటికీ గుర్తుంచుకోతగ్గవే..!! ‘‘మనిషి స్థిరత్వంతో ఉన్నప్పుడు ఆలోచనా సరళిలో స్పష్టత మరింతగా పెరిగి, సాధనకు మార్గం సుగమమవుతుంది. గజిబిజిగా ఉండే యోచనలన్నీ ఒక కొలిక్కివచ్చి, సజావుగా పురోగమించేందుకూ, గమ్యాన్ని చేరేటందుకూ ద్వారాలు తెరుచుకుంటాయి’’ అంటాడు పర్షియన్ మేధావి రూమి. స్థిరత్వాన్ని ప్రదర్శించే ఇటువంటి ధీరుల లక్షణాలను స్వామి వివేకానంద తెలిపిన విధమూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ‘దిటవైన ఆలోచనా సరళి కలిగిన వ్యక్తి తన కార్యసాధనలో ఎటువంటి విమర్శలు ఎదురైనా నిరాశకూ, బాధకూ లోను కాడు. తన మార్గాన్ని అధర్మ వర్తనులు లేదా అసత్య ప్రేలాపనలు చేసేవాళ్ళు అడ్డుకున్నా, శాంతస్వభావంతో వాటిని ఎదుర్కొంటాడు. అనవసరమైన ప్రేలాపనలతో సాగే వారి ప్రేరేపణలూ ధీరుడైన ఇటువంటి వ్యక్తిని ఏమీ చేయలేవు. నిత్యమూ సంతృప్తితో, సంతుష్టితో ఉండడమే ఇటువంటివారి లక్షణం. ఫలితాలకోసం ఎప్పుడూ వీరు ఎదురు చూడరు. తమ లక్ష్యాన్ని చేరడానికి నిర్మల హృదయంతో శ్రమిస్తారు.’’ అంటారు వివేకానంద. ఎంతటి అద్భుతమైన వాక్యాలో కదా.. ప్రతివారూ గుర్తుంచుకుని, తమ వర్తనా సరళికి అనువుగా మలచుకోవలసిన వాక్యాలే యివి..!! సమస్య ఎప్పుడైతే వస్తుందో, దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందనేది ఆర్యోక్తి. సమాధానం అనేది మన సందేహానికి సూటిగా దొరక్కపోయినా, దానిని దాటే మార్గం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇది వాస్తవం. మేరునగధీరులైన సాధకులు చాటిన జీవనసత్యం. ఎటువంటి పరిస్థితులకూ చలించకుండా తన సహజ లక్షణంతో చరించడాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. సాధకునిలో ఉండవలసిన స్థిరమైన వర్తనాశైలిగా దీన్ని అభివర్ణించవచ్చు. భయం, అధైర్యం, అనుమానం, అసూయ. ద్వేషభావం వంటి అనవసర భావవికారాలు స్థితప్రజ్ఞునిలో అణుమాత్రమైనా ఉండవు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు. తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొదలైన అన్ని అవయవాలనూ సాచి, మళ్ళీ డిప్పలోకి ముడుచుకున్నట్లుగా ఈ తరహా వ్యక్తులు సర్వేంద్రియాలనూ సర్వావస్థల్లో నిగ్రహించుకో గలుగుతారు. తన కనుల ముందు జరిగే సంఘటనలను చూసి కూడా చలించకుండా, స్థిరమైన ఆలోచన తో ముందుకు సాగుతాడు. అంటే మనసును నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే వీరి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణ ం. ముఖ్యంగా ఆటంకాలూ, అవరోధాలూ ఎదురైనప్పుడే స్థితప్రజ్ఞుల సుగుణాలు జగతికి తేటతెల్లమవుతాయి. తాను పడిపోయానని తెలిసినా, కుంగక, అపజయమనే మాటకు లొంగక ధైర్యంగా లేచి నిలబడే ధీరత్వం వీరిలో కనబడుతుంది. తనకు ఎదురైన ఓటమికి వేరేవారిని నిందించరు. కారణాలను అన్యులకు ఆపాదించరు. సంభవించిన పరాజయ క్రమంలో అవమానానికి, తృణీకరణకు గురైనా, చిరునవ్వుతోనే సాగుతూ వినమ్రంగా మసలుకోవడం ఉత్తములైన వీరి సహజ లక్షణం. ఈ అపజయం తమ గమ్యంలో ఒక మామూలు విషయమేనని తలుస్తూ, కార్యాన్ని సాధించగలిగిన బలం తనలో ఉందని అపారమైన నమ్మికతో ముందుకు సాగే తత్త్వం వీరి సొంతం. ఇలాంటి వారే అపూర్వమైన ఆ శక్తితో, ఆసక్తితో, అనురక్తితో ఆసాంతం పరిశ్రమించి విజయాన్ని చేజిక్కించుకోవడంలో చరితార్ధులవుతారు. నిశ్చయాత్మకమైన ఆలోచన సొంతమైన ఇటువంటి వ్యక్తులు తమలో ఉన్న మంచిని నలుగురికీ పంచడం ఒక ఉన్నతమైన సుగుణమైతే, తాము ఆ మంచిని చేశామని చెప్పుకోకపోవడం వీరిలో ఎంచదగిన ప్రత్యేకమైన అంశం. ఫలాలు ఎలాగైతే పక్వానికి వచ్చినప్పుడే పండుతాయో, అదేవిధంగా ఫలితం కూడా రావలసిన సమయంలోనే వస్తుందని వీరు నిశ్చల మానసంతో భావిస్తారు. కార్యసాఫల్యం మీద సహజంగా పిరికి వారికి కలిగే సందేహాలు, అపనమ్మకంవంటివి మచ్చుకైనా వీరిలో కానరావు. మనం తరచు మాట్లాడుకునే నూతన ఆవిష్కరణలకు కారణంగా, ప్రేరణగా నిలిచేది, వీరి కార్యసాధనా క్రమమనే అపూర్వరణమే..!! నవచేతనకు అర్థాన్నిచ్చేదీ, ఊతంగా నిలిచేదీ వీరి సుదృఢమైన చేతలే..!! సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు. – ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి -
యువత నడతపైనే దేశ భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: యువత నడతపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం యువశక్తి. దేశంలోని జనాభాలో 45 శాతం మంది యువజనులే ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. స్వామి వివేకానంద చెప్పినట్లు మన దేశ గతాన్ని, భవిష్యత్తును అనుసంధానం చేయగల శక్తి యువతదే’అని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (వీఐహెచ్ఈ) 22వ వార్షిక వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జూమ్ యాప్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. స్వామి వివేకానంద ఆలోచనలను యువత అనుసరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత తమ లక్ష్యసాధనకోసం తలపెట్టిన ఆలోచనలను సరైన విధంగా ఆచరణలో పెట్టాలన్నారు. లక్ష్యసాధనలో పట్టుదల, నిరంతర సాధన ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు. ‘ప్రస్తుతం మన దేశంలోని యువజనుల ఆలోచనలు నిస్వార్థంగా, సమాజహితం కోసం ప్రయత్నించే విధంగా ఉన్నాయి. వీటికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగే సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తప్పు, ఒప్పుల మధ్య తేడాలను గుర్తించగలిగినప్పుడే ఎదుగుదల సరైన విధంగా ఉంటుంది. హక్కులు, చట్టాలపట్ల యువత సరైన అవగాహన అలవర్చుకోవాలి, వీటిపై సరైన పట్టు సాధించినప్పుడే సమాజానికి మరింత సేవ చేయడానికి వీలుంటుంది. దేశంలో మార్పులు తీసుకురావాలన్నా.. శాంతిని స్థాపించాలన్నా.. దేశ పురోగతి వేగాన్ని పెంచాలన్నా యువశక్తి ఆచరణే కీలకం. నా సర్వీసులో ఎంతోమంది విజయం సాధించిన యువ అడ్వొకేట్లను చూశా. వృత్తిలోకి వచ్చినప్పుడే సరైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం యువత ముందు ఎన్నో రకాల సవాళ్లున్నాయి. తమకున్న నైపుణ్యాన్ని సరైన విధంగా ఆచరణలో పెట్టాలి. సమస్యలు లేని మార్గంలో వెళ్లడమంటే సరైన దారి కాదనే అంశాన్ని కూడా గుర్తించాలి’అని జస్టిస్ రమణ యువతకు దిశానిర్దేశం చేశారు. -
మంచి మాట..జీవన లక్ష్యం
ప్రతి మనిషి జీవితానికి లక్ష్యం అనేది అత్యంత అవసరం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సఫలీకృతుడవడానికి అంకిత భావంతో పనిచేయాలి. తనకున్న యావచ్ఛక్తిని వినియోగించి పనిచేస్తే, విజయానికి దారులు తప్పక తెరుచుకుంటాయి. ఈ ధరిత్రిపై లక్ష్యం లేకుండా సాగే ఏ మనిషి జీవికైనా నిరర్ధకమంటారు స్వామి వివేకానంద. ఉన్నతపదవి.. వ్యాపారం.. క్రీడలు..లలితకళలు.. యిలా ఏ విభాగంలో మనం రాణిద్దామని అనుకుంటామో, అందులో చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని సావధానంతో నిర్ణయించుకోవాలి. అయితే, లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ప్రతి పనినీ మొక్కవోని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ముందుకు సాగాలి. మనం పయనించే మార్గంలో విజయంతో బాటు అపజయాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అపజయం సంభవించినప్పుడు కుంగిపోక, లక్ష్యసాధనలో విజయానికి చేరువ కావడానికి మరింత అనుభవం తనకు సమకూడిందని భావిస్తూ సానుకూల దక్పథంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఈ ధరిత్రిలో ఏదీ, తనంత తానుగా మన చెంతకు రాదు. ఎనలేని శోధన, వలసినంత సాధన తోడైతేనే లక్ష్యం అవలీలగా సొంతమవుతుంది. మనిషి ఎంచుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి . ఉన్నతంగా ఉండడమంటే జీవనోపాధికోసం అప్పుడే సాధారణమైన ఉద్యోగంలో జేరినవాడు, వెంటనే అత్యంత సంపన్నుడు కావాలని కోరుకోవడం ఏమాత్రం సబబుకాదు. కానీ, తాను చేరిన వృత్తిలో, ఉద్యోగంలో, కృషి చేస్తే తాను ఎంతవరకు ఎదగగలడు అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. సహేతుకమైన ఆలోచనతో, వివేచనతో ముందుకు సాగుతూ నిజాయితీతో కృషి చేస్తే, తను అనుకున్న ఉన్నతమైన స్థానాన్ని అందుకోలేకపోయినా, ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాన్ని మానవుడు కైవశం చేసుకుంటాడని చరిత్ర నిరూపించిన నిదర్శనాలెన్నో మనకు కనబడతాయి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కషి చేసిన వారందరూ, తమ జీవన గమనంలో అప్రతిహతమైన విజయాలను చేబూనారన్న విషయం చరిత్ర తేజోమయంగా మనకు తెలియజేస్తుంది. ఈ విజయపరంపరలో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత స్థాయి కి ఎదిగిన వ్యక్తులూ మనకు ఎంతో మంది తారసపడుతూనే ఉంటారు. బీద కుటుంబంలో పుట్టి, ఉదయాన్నే వార్తా పత్రిక లను పంచే అతి సాధారణ వ్యాపకాన్ని బాలునిగా ఉన్నప్పుడు నిర్వర్తించిన అబ్దుల్ కలామ్ దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిగా, భారత అణుశాస్త్ర పితామహునిగా నిలవడం కృషితో నాస్తి దుర్బిక్షం అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యం. కలలు కను..కలలను సాకారం చేసుకో’’ అన్న ఆ మహోన్నత వ్యక్తి లక్ష్య సాధకు లకు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే గాక, తన జీవితాన్నే ఆ సుధా మయ వాక్యాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిపిన సార్ధక జీవనుడు. లక్ష్యం ఉన్నతమైనదైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే ఆటంకాలేవీ మనల్ని బాధించవు. లక్ష్యాన్ని చేరే గమ్యంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్ళు సాధారణమైనవిగానే మనకు అనిపిస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే చిరు సవాళ్ళు, పెనుసవాళ్ళు కూడా మన విజయానికి బాసటగా నిలిచే పునాదిరాళ్ళుగా మనం విశ్వసించాలి. మనిషికి మహితమైన సహనాన్ని, తనలో తనకు విశ్వాసాన్ని పెంపొందించే మేలురాళ్ళుగా ఈ సవాళ్ళను పేర్కొనవచ్చు. మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, విజయాన్ని చేబూనిన ప్రతి మానవుడూ మహనీయుడు కాకపోవచ్చు, కానీ సమాజంలో తప్పకుండా మాననీయుడవుతాడు. మహితమైన హితాన్ని నలుగురికీ తద్వారా చేకూరుస్తాడు. లక్ష్యసాధకునికి తప్పనిసరిగా కావలసింది అచంచలమైన ఆత్మవిశ్వాసం. మానవ చరిత్రను పరికిస్తే లక్ష్యాలను సాధించి, ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు మొదటినుంచీ ఉన్నతులు కావాలనే విశ్వాసంతో పరిశ్రమించి, సాఫల్యతను సాధించారని వారి జీవనచిత్రం తిలకిస్తే మనకు అర్థమవుతుంది. లక్ష్యం అంటే గురి.. లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితాన్ని గమ్యం తెలియకుండా పయనించే నావతో పోల్చడం సబబుగా ఉంటుంది. మనం ఏ లక్ష్యం కోసమైతే సాధన, పరిశ్రమ కొనసాగిస్తామో, ఆ సాధనలో అవిశ్రాంతంగా కొనసాగితే, ఈ ధరిత్రిలోని ప్రతిశక్తీ మనకు సహకరిస్తుందనే మాట అత్యంత ప్రసిద్ధిని పొందిన ఓ పాశ్చాత్య దార్శనికుని మాట. – వెంకట్ గరికపాటి , వ్యాఖ్యాన విశారద -
విశ్వగురు దార్శనికతే.. వివేకానంద తాత్వికత..
ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తుంటారు. బలమైన వ్యక్తిత్వం, విజ్ఞాన శాస్త్రం లోనూ, వేదాంతంలోనూ ఆయనకున్న అపారమైన విజ్ఞానం, మానవ, జంతు జీవితం పట్ల సహా నుభూతి అనేవి ఆయన్ని శాంతి, మానవజాతి దీపశిఖగా మలిచాయి. తన బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువజనులకు స్ఫూర్తి కలిగించారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నిలిచిపోకండి అనేది యువతకు వివేకానంద ఇచ్చిన స్పష్టమైన పిలుపు. స్తంభనకు గురైన మానసిక స్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఇది. భారతదేశం మతం, తత్వశాస్త్రాల పవిత్ర భూమి. ఇక్కడే మహాత్ములు, మహర్షులు ఎందరో జన్మించారు. ఇది త్యాగ భూమి. మన వాస్తవమైన అస్తిత్వాన్ని లేదా హిందూ ఆలోచనా విధానాన్ని మర్చిపోయినందువల్ల మన దేశం వేల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉంటూవచ్చిందని స్వామి వివేకానంద అన్నారు. సింహం పిల్ల తన కుటుంబం నుంచి వేరుపడి మేకల మందలో చేరినప్పుడు క్రమేణా అది కూడా ఆ మేకల్లాగే ప్రవర్తించేలా అన్నమాట. తాను సింహాన్ని అనే విషయం దానికి తెలీదు. దాని పరాక్రమం కానీ, దాని స్వభావం కానీ అది మర్చిపోయి ఉంటుంది. సింహం ఆ మేకలమందపై దాడి చేసినప్పుడు సింహం పిల్ల దొరికిపోతుంది. తన బిడ్డ తన సొంత అస్తిత్వాన్నే కోల్పోయిందని సింహం గ్రహిస్తుంది. తర్వాత తన బిడ్డను అది బావి వద్దకు తీసుకెళ్లి దాని వాస్తవరూపాన్ని చూపించి దాని అసలు బలాన్ని అది తెలుసుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా భారతీయ సమాజం కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయిందని వివేకానంద చెప్పారు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. హిందు ఉంటే జీవన స్థితి, జీవన శైలి అని చెప్పారు. అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్ 11న నిర్వహించిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద సుప్రసిద్ధ ప్రసంగం చేశారు. ‘అన్ని దేశాల పీడితులకు, భూమ్మీది అన్ని మతాలకు ఆశ్రయం ఇచ్చి గౌరవించిన దేశనుంచి నేను వచ్చాను. ఈ ప్రపంచానికి సహనం అనే పాఠాన్ని, సార్వత్రిక ఆమోదాన్ని నేర్పిన మతానికి చెందినవాడిని అని చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నాను. విశ్వజనీన సహనభావాన్ని మేము విశ్వసించడమే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలు చెప్పేది సత్యమని మేము అంగీకరిస్తాము’ అని ఆయన చెప్పారు. నా దేశ యువతరానికి ఉక్కునరాలు, ఇనుప కండరాలు, గొప్ప హృదయం, పిడుగులాంటి మనస్సు అవసరముంది. ఈ గుణాలతోనే వీరు దేశాన్ని మార్చగలరు. ప్రపంచరంగంలో భారతీయ హోదాను వెలిగించడంలో యువత పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించేవారు. ఒక సందర్భంలో యువత ఫుట్‌బాల్ కూడా ఆడాలని ఆయన చెప్పారు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. వ్యాయామం ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు, బలానిక, సంతోషానికి కూడా దారి తీస్తుంది. ఆరోగ్యకరంగా ఉండటమే మనిషి అంతిమ గమ్యం కావాలి. అన్నిరకాల చర్యలూ ఆరోగ్యం ద్వారా మాత్రమే పూర్తవుతాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించారు. ఆరోగ్యకరమైన శరీరంలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని తేలింది. ఈరోజు ప్రపంచమంతా ఆరోగ్యకరమైన శరీరానికి యోగా అవసరమని గుర్తించింది. ఇది మన ప్రాచీన జీవిత విధానంలో భాగమై ఉంటోంది. భారతీయ సంస్కృతి ప్రాధాన్యత విదేశాలు సాధించిన భౌతిక ప్రగతి భారత్‌కు అవసరమే కానీ మనం దానికోసం యాచించవద్దని స్వామి వివేకానంద విశ్వసించేవారు. మనం పాశ్చాత్య ప్రపంచానికి ఇవ్వాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ మనవైపు ఉంది. పాశ్చాత్య ప్రపంచానికి మన అవసరం ఎంతో ఉంది. అలాగే పాశ్చాత్య ప్రపంచం నుంచి శాస్త్రీయ ఒరవడి విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల గురించి ఆయిన తరచూ మాట్లాడేవారు. అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో గౌరవమిచ్చేవారు. ప్రాచ్యదేశాలు ఎన్నటికీ పాశ్చాత్యదేశాలు కాలేవు. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా తూర్పు దేశాల్లాగా ఎన్నటికీ కాలేవు అని ఆయన చెప్పేవారు. వివేకానంద విద్యా తాత్వికత, నూతన విద్యావిధానంవ్యక్తిత్వాన్ని నిర్మించే, ఆలోచనలను పెంచే, విజ్ఞానాన్ని విస్తరించే, మన కాళ్లమీద మనం నిలబడేలా చేసే విద్య మనకు కావాలి అని వివేకానంద అన్నారు. విద్య ప్రధాన లక్ష్యం మానవ సృష్టేనని ఆయన భావించారు. సాంప్రదాయిక, ఆధునిక విద్యావ్యవస్థలను ఆయన అద్భుతంగా అనుసంధానించారు. ఆయన విద్యా తాత్వికత ఇప్పటికీ సందర్భోచితమే. సమగ్ర దృక్పథం చేపట్టి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక, వృత్తిగత అభివృద్ధితోపాటు వివక్ష లేని విద్యను, అందరికీ అందుబాటులో ఉండే విద్యను ఆయన బలపర్చారు. అలాగే వాస్తవికమైన ఆధునిక దృక్పథంతో టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమ, సైన్స్‌కి సంబంధించిన పాశ్చాత్య విద్యకు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని నేతృత్పంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం కూడా స్వామి వివేకానంద భావాలకు అనుగుణంగా ఉంటోంది. సైన్సుతో వేదాంతాన్ని సమగ్రపర్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం పిరికిపందల కోసం కాదు. మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నవారిదే ప్రపంచం అని ఆయన చెప్పారు. దళితులు, మహిళలు, పేదల అభ్యున్నతి గురించిన భావన, కర్మ ప్రాధాన్యత అనేవి ప్రత్యేకించి స్వామి వివేకానంద ఆలోచనల్లో ఉండేవి. దరిద్రులలో నారాయణుడిని చూశారాయన. మానవ సేవే మాధవసేవ అని భావించారు. దరిద్రనారాయణ భావన ద్వారా ఆయన మానవవాదాన్ని మతంతో అనుసంధించారు. చికాగోలో సర్వమత సదస్సులో కూడా ఆయన విశ్వ సౌభ్రాతృత్వమే అన్ని మతాల సారాంశమన్నారు. ఏ దేశ అభివృద్ధి అయినా దాని యువతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువతలో మేధోపరమైన సదాలోచన జాతికి అవసరం. నేడు ప్రతిరాష్ట్రమూ మాదకద్రవ్యాల సేవనం అనే సామాజిక దురాచారం పట్ల కలతచెందుతోంది. ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తోంది కానీ సమాజం తన స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. -బండారు దత్తాత్రేయ (నేడు స్వామి వివేకానంద 158వ జయంతి) వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
సిద్ధాంతం కన్నా దేశం మిన్న
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో గురువారం స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘సైద్ధాంతిక విభేదాలుండొచ్చు. అది సహజమే. అవి దేశ ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలి కానీ నష్టపరిచేలా ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. జేఎన్‌యూలో నిరంతరం వామపక్ష, హిందుత్వ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుందన్న విషయం తెలిసిందే. సైద్ధాంతిక విబేధాలున్న పలు వర్గాలు.. తమ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ప్రకటిస్తూనే, ఒక్కటై, ఉమ్మడిగా పోరాటం చేశాయని స్వాతంత్య్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అందువల్ల, దేశ ప్రయోజనాలు, సమగ్రత విషయంలో సైద్ధాంతిక ప్రభావంతో నిర్ణయం తీసుకోవడం హానికరమవుతుందని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రేమను, అంకితభావాన్ని స్వామి వివేకానంద విగ్రహం ప్రజలకు నేర్పిస్తుందన్న విశ్వాసం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద కలలు కన్న దృఢమైన, సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఈ విగ్రహం నీడలోనే వివిధ అంశాలపై విద్యార్థులు చర్చలు జరపవచ్చని సూచించారు. ‘ఆత్మ విశ్వాసంతో పాటు అన్ని రంగాల్లో స్వతంత్రత, స్వావలంబన కలిగిన భారత పౌరులను తీర్చిదిద్దేలా మన విద్యా వ్యవస్థ ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఆ దిశగానే ఉంటుంది’ అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై వర్సిటీ విద్యార్థి సంఘం నిరసన తెలిపింది. విగ్రహావిష్కరణ కన్నా ముందు విద్యార్థులు వర్సిటీ నార్త్ గేట్ వద్ద ‘మోదీ గో బ్యాక్’, ‘వి వాంట్ ఆన్సర్స్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ‘స్కాలర్షిప్స్ రాని విద్యార్థుల గురించి ఆయన ఎందుకు మాట్లాడరు?’ అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఐషె ఘోష్, సాయిబాలాజీ ప్రశ్నించారు. ‘ఆసియాన్’తో బంధమే ముఖ్యం ఇండియా–ఆసియాన్ సదస్సులో మోదీ ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్)తో తమ బంధం నానాటికీ బలపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్–ఆసియాన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గురువారం 17వ భారత్–ఆసియాన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్–ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021–2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్ ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు. -
ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ఉదయం మన గడ్డపై అడుగుపెట్టారు. తనకు స్వాగతమవ్వడానికి వచ్చే ప్రజానీకం సంఖ్యను 60 లక్షల నుంచి కోటి వరకూ పెంచుకుంటూ వెళ్లిన ట్రంప్... మొత్తానికి రహదారి పొడవునా ఇరుపక్కలా తన కోసం వచ్చిన జనాన్ని చూసి, మోతేరా స్టేడియంలో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన సత్కారసభకు హాజరైనవారిని చూసి సంతృప్తిచెందారనే చెప్పాలి. లక్షమందికిపైగా కూర్చోవడానికి వీలయ్యే ఆ స్టేడియం మొత్తం నిండిపోవడం ట్రంప్‌కు సంతృప్తినిచ్చేవుంటుంది. అందుకే ఈ స్వాగత సత్కారాలు అసాధారణమైనవని ఆయన కొనియా డారు. ఈ ఏడాది ఆఖరుకు అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా తల పడే అవకాశమున్న బెర్నీ శాండర్స్‌ను ఓడించాలంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్లు కీలకమని, అందుకు అహ్మదాబాద్ స్వాగత సత్కారాలు దోహదపడతాయని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. అది నెరవేరిందన్న భావన ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనబడింది. ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైల బంధుగణం, పాఠశాలల విద్యార్థులు హాజరై, చాయ్‌వాలా వంటి పదాలు ఆయన పలకడానికి ప్రయత్నించినప్పుడూ, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీల కృషి ని స్మరించినప్పుడు మోతేరా స్టేడియాన్ని మార్మోగించారు. నేతలిద్దరూ పరస్పరం ప్రశంసించుకోవడం, ఉగ్రవాదం గురించి, పాక్ గురించి ట్రంప్ ప్రస్తావించడం వంటివన్నీ అక్కడున్నవారిలో ఉత్సాహాన్ని నింపాయి. ట్రంప్ ప్రసంగం ఆద్యంతమూ గమనిస్తే ఇక్కడి జనం ఏం కోరుకుంటారో, ఏయే అంశాలను ప్రస్తావిస్తే వారికి సంతోషం కలుగుతుందో ఆయన ప్రసంగాన్ని రూపొందించిన అధికారులకు పూర్తి అవగాహన ఉన్నదని అర్థమవుతుంది. పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, సామాజిక పథకాలు వంటి అంశాల్లో భారత్ ప్రగతి అత్యద్భుతమైనదని, వీటన్నిటినీ ఒక స్వేచ్ఛాయుత సమా జంగా, ఒక ప్రజాతంత్ర దేశంగా ఎవరినీ వేధించకుండా, బాధించకుండా సాధించడానికి ప్రయత్ని స్తుండటం గమనార్హమైనదని కొనియాడారు. ఒక అగ్రరాజ్యాధినేత నోటివెంబడి ఇలాంటి ప్రశంసలు రావడం కన్నా ఏం కావాలి? ఈ పర్యటనలో మరో కీలకమైన ఘట్టం మంగళవారం చోటుచేసుకోబోతోంది. ఇరుదేశాల అధి నేతల మధ్యా వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరగడంతోపాటు, రెండు దేశాల అధికారులు ఇప్పటికే అవగాహనకొచ్చిన రక్షణ, ఆంతరంగిక భద్రత ఒప్పందాలపై మంగళవారం లాంఛనంగా సంతకాల వుతాయి. రక్షణ ఒప్పందం విలువ 300 కోట్ల డాలర్లపైమాటేనంటున్నారు. ముందనుకున్నట్టే వాణిజ్య ఒప్పందం మాత్రం అనంతరకాలానికి వాయిదా పడింది. ఇద్దరు నేతలూ ముఖాముఖి సంభాషించుకునే సమయంలో ట్రంప్ మత విద్వేషాలు, సీఏఏ గురించిన ప్రస్తావన తీసుకొస్తారని కొందరు ఆశిస్తున్నారు. అదెంతవరకూ సాధ్యమో చూడాలి. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగ్గా ఉండాలని అమెరికా ఆశిస్తోంది. ఇంతకుముందు అమెరికాను ఏలిన అయిదుగురు అధ్యక్షులు మన దేశంలో పర్యటించినా... పాకి స్తాన్‌తోసహా మరే దేశ పర్యటనతోనూ ముడిపెట్టకుండా నేరుగా మన దేశ సందర్శనార్ధం మాత్రమే వచ్చిన తొలి అధ్యక్షుడు ట్రంప్. దీన్నిబట్టే ఈ పర్యటనకు ట్రంప్ ఇస్తున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ప్రసంగంలో ట్రంప్ పరోక్షంగా తాలిబాన్లతో అమెరికాకు కుదరబోయే ఒప్పం దాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పాకిస్తా¯Œ కఠినంగా వ్యవహరించేలా ఆ దేశంతో తమ అధికా రులు చర్చిస్తున్నారని, త్వరలో అది సాకారం కాబోతోందని ఆయన ప్రకటించారు. ఆయన ప్రస్తావిం చింది ఈనెల 29న తాలిబన్లతో కుదిరే ఒప్పందమని సులభంగానే చెప్పొచ్చు. కానీ అది ఒక దుస్సాహసంగా మిగిలే ప్రమాదం ఉంది. అధికారంలోకొచ్చాక మొదటి రెండేళ్లూ ఆయన పాకిస్తా న్ను తీవ్రంగా విమర్శించేవారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించేవారు. కానీ అహ్మదాబాద్ ప్రసంగాన్ని గమనిస్తే అదేమీ కనబడదు. సరిగదా... పాక్‌పై ఆయనకు ఎక్కడలేని నమ్మకమూ ఏర్పడిందనిపిస్తుంది. ఆయన నమ్మకాల మాటెలావున్నా పాక్‌తో మనకున్న గతానుభవా లను గుర్తుకుతెచ్చుకుంటే తాలిబన్లతో కుదరబోయే ఒప్పందం పర్యవసానాలెలావుంటాయో సుల భంగానే గ్రహించవచ్చు. అఫ్ఘానిస్తాన్ గడ్డపై ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఆనాటి సోవియెట్ యూని యన్‌తో లెక్కలు తేల్చుకోవడానికి ఛాందసవాద శక్తులకు తాలిబన్ ముద్ర తగిలించి, వారికి నిపుణు లతో ఆయుధ శిక్షణనిప్పించి రంగంలోకి దించింది అమెరికాయే. ఆ తర్వాత వారు సృష్టికర్తనే ధిక్క రించి చెలరేగడం వేరే కథ. చివరకు తాలిబన్లు ప్రభుత్వాన్ని చేజిక్కించుకుని సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. అప్పుడే పాకిస్తాన్ ప్రాపకంతో తాలిబన్లు చొరబాటుదార్లను ప్రవేశపెట్టి కశ్మీర్‌ను రక్తసిక్తం చేశారు. ఆ సమయంలోనే మన భద్రతా బలగాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉగ్రవాద దాడులు పెరిగాయి. అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్లతో పాతకథే నడిపించాలని పాక్ కలలు గంటోంది. ఇప్పుడు తాలిబన్ల సత్ప్రవర్తనకు పూచీపడి, ట్రంప్‌ను ఒప్పించడంలో పాక్ పాత్ర కీలకం. ఈ ఒప్పందం గురించిన కథనాలు వచ్చినప్పటినుంచి ‘హింస తగ్గింపు’ పదే పదే ప్రస్తావన కొస్తోంది. తాలిబన్లు హింస ‘తగ్గిస్తారని’ అమెరికా చెబుతోంది. పండగలకు దుకాణదారులు ప్రక టించే డిస్కౌంట్ తరహాలో దీన్ని ప్రచారం చేస్తోంది. హింసామార్గాన్ని వదిలేస్తామని ప్రకటించడానికి సిద్ధపడనివారితో ఒప్పందం చివరకు దేనికి దారితీస్తుందో తెలియనట్టు అమాయకత్వం నటిస్తోంది. ఈ విషయంలో మోదీ దృఢమైన వైఖరి తీసుకోవాలి. అలాగే ఎన్నారైలను ఇబ్బందుల్లో పడేసే కఠిన మైన వలస నిబంధనలు రూపొందించడాన్ని మానుకోవాలని హితవు చెప్పాలి. ఈ రెండూ సాధిస్తేనే ట్రంప్ పర్యటన వల్ల మనకు కొద్దో గొప్పో మేలు కలిగినట్టు లెక్క. -
యువతకు రోల్ మోడల్ ఆయన..
-
క్యాంపస్‌లో కలకలం : వివేకానంద విగ్రహం ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్‌లో జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహాన్నిదుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మిన్ బ్లాక్‌లోకి బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి వర్సిటీ వీసీ మామిడాల జగదీష్ కుమార్‌పై అభ్యంతరకర మెసేజ్‌లు రాసిన మరుసటి రోజు వివేకానంద విగ్రహం ధ్వంసం చేయడం గమనార్హం. విద్యార్ధుల ఆందోళనతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. హాస్టల్ ఫీజు పెంపు, డ్రెస్ కోడ్ వంటి పలు సమస్యలపై జేఎన్‌యూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చి పెంచిన ఫీజులను ఉపసంహరించినట్టు ప్రకటించారు. -
నా సోదర సోదరీమణులారా...
కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, నిత్యస్మరణీయుడిగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచి ఉన్న భారతీయ ఆధ్యాత్మిక యువకెరటం స్వామి వివేకానంద. ఈ పుణ్యపుడమి ఘనతను తాను గుర్తించడమేగాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశ దిశలా చాటిన స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుండెలోతుల్లోకి చొచ్చుకొనిపోతాయి. లోకంలో కనిపించే చెడు, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే అని బలంగా విశ్వసించిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... హైందవ ధర్మ, ఆర్ష సంప్రదాయ బావుటాలను దేశదేశాలలోనూ ఎగురవేసి, భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను నెలకొల్పి ఎందరో విద్యావంతులైన శిష్యులను మానవసేవకు అంకితమయ్యేలా చేసిన ఆ ధన్యమూర్తి జన్మించిన జనవరి 12ను యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా వివేకానందుడు చెప్పిన మంచి మాటలు కొన్ని...ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. భగవత్సాక్షాత్కారం పొందనంతవరకు నీ మతం నిష్ప్రయోజనమే. ఎవరు మతం పేర కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తూ ఉంటారో, వారు చక్కెర బస్తాలను మోసే గాడిద వంటివారు. ఆ గాడిదకు చక్కెర రుచి ఇసుమంతైనా తెలియదు. దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. ఇతరులకు ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచేవాడు మనుష్యుల్లో మహోత్కృష్ట స్థానాన్ని అలంకరిస్తాడు. ఎందుకంటే నీ చెయ్యి ఎల్లప్పుడూ ఇవ్వడం కోసమే రూపొందించబడింది. సమస్త నీతికి, ఆధ్యాత్మికతకు, ఉత్కృష్టతకు జనని భారతదేశం. రుషులు నడచిన దేశమిది. నేటికీ ఇక్కడ దివ్యపురుషులున్నారు. ఆ పుణ్యపురుషుల నుండి దీపాన్ని బదులు తెచ్చుకుని, నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను సోదరా! ఈ విశాల ప్రపంచంలోని పట్టణాలలో, పల్లెల్లో, మైదానాలలో అడవులలో అన్వేషిస్తాను. అంతటి మహానుభావులను మరెక్కడైనా చూపగలరా? భగవదనుగ్రహాన్ని పొందాలంటే, మానవుడు వినిర్మల హృదయుడై ఉండాలి. ఆ నిర్మలత్వం శీలం వల్లనే సిద్ధిస్తుంది.ఆధ్యాత్మిక ధర్మం పుస్తకాలలో లేదు. సిద్ధాంతాల్లో లేదు. విధివాక్యాలలో లేదు. ఉపన్యాసాలలో అంతకన్నా లేదు. తర్కంలో అసలే లేదు. అది ఒక స్థితి. ఆ స్థితి ఒక్క సిద్ధులలోనే ఉంది. ఆ సిద్ధులు ఎవరో కాదు, మీరే! ఆ సిద్ధి పొందాలంటే, మీలో ప్రతివారూ రుషిౖయె, ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకునే వరకు, మీకు ఆధ్యాత్మిక జీవనం ఆరంభం కానట్లే. అతీంద్రియ దశ మీకు కలిగేవరకు ఆధ్యాత్మిక జీవనమనేది వట్టి అర్థంలేని మాట. మీరు భగవంతుని తెలుసుకొన్నప్పుడు మీ ముఖ వర్ఛస్సు మారుతుంది. మీ కంఠస్వరం మారుతుంది. మీ ఆకారమంతా మారుతుంది. మీరు మానవజాతినే ఉద్ధరించేవారవుతారు. రుషికి ఎవరూ ఎదురు లేరు. ఎవరూ ఎదురు నిలవలేరు. రుషిత్వమంటే అదే మరి. అది మన జాతికి పరమావధి. మన ఉపనిషత్తులలోనూ, శాస్త్రాలలోనూ, పురాణాలలోనూ దాగిన మహాద్భుత సత్యాలను వెలికి లాగాలి. మఠాల నుండి వాటిని బయటకు తీయాలి. అరణ్యాల నుండి తరలించుకు రావాలి. ప్రత్యేక వర్గాల అధీనం నుండి వాటిని గుంజుకు రావాలి. అవి దేశమంతటా– ఆసేతు హిమాలయ పర్యంతం దావానలంగా వ్యాపించడానికి మనం పూనుకుంటే కార్యం సాధించామన్నమాటే. ఈ సత్యాలను మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. వాటిని ప్రజలకు మొట్టమొదట వివరించాలి. నేడు దీనికి మించిన సత్కర్మ మరొకటి లేదు. కర్మలలో దాన కర్మ ఒక్కటే గొప్పది. అన్ని దానాలలోనూ ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైనది. భారతీయుడు నా సోదరుడు! భారతీయుడే నా ప్రాణం! భారతదేశపు దేవీదేవతలే నా ఆరాధ్యదైవాలు; భరతభూమి నా చిన్నప్పటి ఊయల, పడచుదనపు పూదోట, వార్థక్యపు వారణాసి అని గర్వంగా పలకండి. కష్టాలనే అభేద్యమైన అడ్డుగోడల్ని చీల్చుకొని ముందుకు సాగేది, సచ్ఛీలంతో శక్తిని సంతరించుకున్న సంకల్ప బలమే కానీ ధనం, పేరు ప్రతిష్ఠలు, పాండితీ ప్రకర్షలు కావు. ఓటమిలేని జీవితం ఉండదు. పరాజయం పలకరించని ప్రభువుండడు. జీవితానికి మెరుగులు దిద్దేది ఓటమే!తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడుసేవకుడిగా ఉండడం అలవరచుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్న ఇసుమంత ఆచరణ మిన్నలక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపినప్పుడే విజయం వరిస్తుంది.నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది. స్వామి వివేకానంద పలుకులన్నీ కలకండ పలుకులలా తియ్యగా ఉండకపోవచ్చు కానీ, మనలోని అనారోగ్యాన్ని నయం చేసి, ఆరోగ్యాన్ని చేకూర్చేది చేదు గుళికలేనని మరచిపోకూడదు. ఆయన మాటలు వెన్నలా మెత్తగా ఉండకపోవచ్చు కానీ, కొండరాళ్లను పిండి చేసేది ఇనుప పలుగేనని గుర్తుపెట్టుకుని, ఆ మాటల స్ఫూర్తిని మనసులో నింపుకుని ముందుకు సాగిపోవాలి. -
మానవత్వాన్ని, ప్రేమను ఎవరైనా తృణీకరించగలరా?
భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన, ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అది రాజస్థాన్‌లోని రైలు నిలయం. స్వామి వివేకానంద అక్కడ బస చేసి ఉన్నారు. పగలంతా జనం తీర్థప్రజలా ఆయన దర్శనార్థం వచ్చిపోతూనే ఉన్నారు. మతం, ధార్మికత వంటి అంశాలపై అడిగిన సందేహాలన్నింటికీ అనర్గళంగా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఈ విధంగా మూడు పగళ్లు, మూడు రాత్రుళ్లు గడిచాయి. ధార్మిక ప్రబోధంలో స్వామీజీ ఎంతగా లీనమైపోయారంటే, ఆహారం స్వీకరించడానికి కూడా ఆయన ప్రబోధాన్ని ఆపింది లేదు. ఆయన చుట్టూ గుమికూడిన జనాలకు తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని ఆయనను అడగాలని కూడా స్ఫురించలేదు. మూడవరోజు రాత్రి సందర్శకులందరూ వెళ్లిపోయాక ఒక నిరుపేద వ్యక్తి ఆయనను సమీపించి అభిమానపర్వకంగా ‘‘స్వామీజీ! ఈ మూడురోజుల నుంచీ మీరు నిర్విరామంగా మాట్లాడుతూనే ఉన్నారు. గుక్కెడు నీళ్లు కూడా తాగింది లేదు. అది చూసి నేను ఎంతో బాధపడుతున్నాను’’ అన్నాడు అభిమాన పూర్వకంగా. భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన, ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అతడు ‘‘స్వామీజీ, మీకు చపాతీలు ఇవ్వాలని నా హృదయం పరితపిస్తోంది. కాని ఎలా ఇవ్వగలను? నేను వాటిని తాకాను. మీరు అనుమతి ఇస్తే పిండి, పప్పు తెచ్చిపెడతాను. మీరు స్వయంగా వండుకోవచ్చు’’ అని చెప్పాడు. అందుకు స్వామీజీ, ‘‘లేదు నాయనా, నువ్వు వండిన చపాతీలనే తెచ్చి నాకు ఇవ్వు. సంతోషంగా వాటిని తింటాను’’ అన్నారు. ఆ మాట విని అతడు భయంతో వణికిపోయాడు. చర్మకారుడైన తాను ఒక సన్న్యాసికి చపాతీలు ఇచ్చాననే సంగతి మహారాజు చెవిన పడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని భీతి చెందాడు. కాని స్వామీజీ ఆకలి తీర్చాలనే తపన అతడి భయాన్ని దిగమింగింది. వెంటనే ఇంటికి వెళ్లి తాజాగా చపాతీలు వండి తెచ్చి స్వామీజీకి ఇచ్చాడు. నిరుపేదవాడి నిస్వార్థ ప్రేమాభిమానాలను చూసి స్వామీజీ కళ్లు చెమ్మగిల్లాయి. – డి.వి.ఆర్ -
నడిపించిన మాట
స్వామీ వివేకానంద ఒకరోజు హిమాలయాల్లో సుదీర్ఘమైన కాలిబాట గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నైరాశ్యంతో ఇలా అన్నాడు: ‘‘ఓ మహాశయా! ఇప్పటిదాకా ఎంతోదూరం నడిచి నడిచి అలసి సొలసి ఉన్నాను. ఇక ఎంతమాత్రమూ నేను నడవలేను. నడిచానంటే నా ఛాతీ బద్దలయిపోతుంది’’ అన్నాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమి చేసేవాళ్లం? మహా అయితే ఆ వృద్ధుణ్ణి ఎత్తుకుని భుజాన వేసుకుని అతి కష్టం మీద కొంతదూరం నడిచేవాళ్లం . లేదంటే పెద్దాయన కదా, కాళ్లు పట్టుకున్నా పుణ్యమేలే అని కాసేపు కాళ్లు నొక్కి, సేదతీర్చి అప్పుడు ఆయనని నడిపించేవాళ్లమేమో! అయితే, స్వామి వివేకానంద అలా చేయలేదు. ఆ వృద్ధుడి మాటలను ఓపిగ్గా విని ఇలా అన్నారు:‘‘మీ కాళ్ల దిగువన చూడండి. మీ కాళ్ల కింద ఉన్న బాట, మీరు ఇప్పటి దాకా నడచి వచ్చిన బాట, మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట! అది కూడా త్వరలోనే మీ కాళ్లకింద పడిపోవడం ఖాయం’’ అన్నారు. అంతే, ఈ స్ఫూర్తిదాయక వచనాలు ఆ వృద్ధునికి కొండంత బలాన్నివ్వడంతో ఆయన తన కాలినడకను కొనసాగించాడు. – డి.వి.ఆర్. -
ఆకలి లౌకికమా?!
పండిట్ శేఖరమ్ గణేష్ దియోస్కర్ హితవాది పత్రిక సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఒకరోజు ఆయన తన మిత్రులిద్దరితో స్వామి వివేకానందను కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఇద్దరి మిత్రులలో ఒకరు పంజాబీ అని తెలుసుకున్న స్వామీజీ, అప్పుడు పంజాబ్‌లో నెలకొని ఉన్న తీవ్ర ఆహార కొరతను గురించి వారితో ఆదుర్దాగా మాట్లాడారు. ఆ సమయంలో భారతదేశంలో తాండవిస్తున్న కరువు కాటకాలను గురించే స్వామీజీ మనస్సులో మథన పడుతున్నారు. అందువల్ల వచ్చిన సందర్శకులతో ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి అసలు మాట్లాడనే లేదు. స్వామీజీ నుంచి సెలవు పుచ్చుకునే సమయంలో ఆ పంజాబీ వ్యక్తి అసంతృప్తి వెలిబుచ్చుతూ ఇలా అన్నాడు : ‘‘మహాశయా, ఆధ్యాత్మికపరమైన విషయాలను మీ ముఖతా వినాలని మేము ఆసక్తితో ఎదురు చూశాం. కాని దురదృష్టవశాత్తూ మన సంభాషణ లౌకిక విషయాల మీదకు వెళ్లింది. మన సమయం వృథా అయిందని భావిస్తున్నాను’’ అన్నారు. ఈ మాట వినగానే స్వామీజీ గంభీర ముద్ర దాల్చి ఇలా స్పందించారు : ‘‘మహాశయా! నా దేశంలో ఒక వీధి కుక్క సైతం పస్తున్నా, దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే అప్పటికి నా వంతు అవుతుంది’’ అన్నారు. స్వామీజీ మహాసమాధి తర్వాత కొన్ని సంవత్సరాలకు పండిట్ దియోస్కర్ ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆనాటి స్వామీజీ వచనాలు తన మనస్సులో చెరగని ముద్రవేసి దేశభక్తి అంటే ఏమిటో నిజమైన ఆర్థాన్ని ప్రప్రథమంగా తెలియజేశాయని చెప్పాడు. మంటే మట్టి కాదు.. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, జప తపాలు మాత్రమే కాదు అని దీని అర్థం. -
యువతకు వివేకానంద స్ఫూర్తి
జిన్నారం(పటాన్చెరు): యువతకు వివేకానంద స్ఫూర్తి అని డీసీసీ అ«ధ్యక్షురాలు సునితారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిన్నారం మండలంలోని ఇమాంనగర్‌లో శనివారం వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వివేకానందుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. పటాన్చెరు నియోజకర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఇమాంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకులే నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఏర్పాటవుతుందని, ఇందుకు నాయకులు కాటాశ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శశికళా, శంకర్‌యాదవ్‌లు ఉన్నారని తెలిపారు. పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జెడ్పీఫ్లోర్ లీడర్ ప్రభాకర్, నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, శంకర్ యాదవ్, శశికళ, నిర్మల, నాగేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మద్దివీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లేశ్ తదతరులు పాల్గొన్నారు. -
100 సూక్తుల వివేకం
ఇంటలెక్చువల్ మాంక్ ఆఫ్ ఇండియా షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ‘సోదర సోదరీమణులారా’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించిన ప్రసంగం పాశ్చాత్య ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన పాశ్చాత్య మేధావులు ఆయనను ‘ఇంటలెక్చువల్ మాంక్ ఆఫ్ ఇండియా’ అని శ్లాఘించారు. తొలిసారిగా పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ తాత్విక విశిష్ఠతను ప్రత్యక్షంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గురువు ఆయన. చిన్నప్పుడు అల్లరి పిల్లాడిగా అమ్మ చీవాట్లు తిన్న నరేంద్రుడు, పెరిగి యువకుడయ్యాక రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారాడు. ఆయన మార్గదర్శకత్వంలో అంతులేని జిజ్ఞాసతో ఆధ్యాత్మిక మర్మాలను ఆకళింపు చేసుకుని, స్వామీ వివేకానందగా ఎదిగాడు. భారతీయ ఆధ్యాత్మిక సంపద ఘనతను ప్రపంచానికి చాటే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని, ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాడు. ‘మనుషులను తీర్చిదిద్దడమే నా పని’ అని ప్రకటించి, మనుషులను తీర్చిదిద్దే పనికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ‘ప్రపంచమే పెద్ద వ్యాయామశాల. మనల్ని మనం మరింత దృఢంగా తీర్చిదిద్దుకునేందుకే ఇక్కడకు వచ్చాం’ అంటూ మానవ జన్మ ప్రయోజనాన్ని ఉద్బోధించిన మహనీయుడు స్వామీ వివేకానంద. యువశక్తిపై అపారమైన విశ్వాసం గల ఆయన తన బోధనలతో యువకుల్లో నూతనోత్సాహాన్ని నింపాడు. అందుకే ఆయన జయంతిని మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా గుర్తించింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన పలికిన ఆణిముత్యాల్లాంటి మాటలు..సత్యం కోసం దేనినైనా త్యాగం చేయవచ్చు. అయితే, దేనికోసమైనా సత్యాన్ని త్యాగం చేయకూడదు. ►బలమే జీవనం. బలహీనతే మరణం ►సత్యం, స్వచ్ఛత, నిస్వార్థం... ఈ మూడు లక్షణాలూ ఉన్నవారిని సృష్టిలోని ఏ శక్తీ నాశనం చేయలేదు. ►అన్ని శక్తులూ మీలోనే ఉన్నాయి. మీరు ఏదైనా చేయగలరు. మీరు అన్నీ చేయగలరు. ఇది నమ్మండి. మిమ్మల్ని మీరు బలహీనులని ఎప్పుడూ అనుకోకండి. ►మీ అంతట మీరే లోపలి నుంచి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు. ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. ►ఎవరిపైనా ఆధారపడవద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు. ►నిజమైన మార్గదర్శకత్వం చీకట్లో చిరుదీపంలాంటిది. అది అన్నింటినీ ఒకేసారి చూపించదు. అయితే, మీరు వేసే ప్రతి అడుగు సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది. ►మీకు సాయం చేసేవారిని మరచిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించవద్దు. మిమ్మల్ని నమ్మినవారిని మోసగించవద్దు. ►అస్తిత్వంలోని అసలు మర్మం భయం లేకపోవడమే. దేనికీ భయపడవద్దు. భయపడితే మీరే భయంగా మారిపోతారు. ►నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ►మతాల మర్మం వాటి సిద్ధాంతాల్లో కాదు, ఆచరణలోనే ఉంది. మంచిగా నడుచుకోవడం. ఇతరులకు మంచి చేయడం. ఇదొక్కటే అన్ని మతాల సారాంశం. ►ఆదర్శవంతుడు వెయ్యి తప్పులు చేస్తాడనుకుంటే, ఆదర్శరహితుడు యాభైవేల తప్పులు చేస్తాడనేది నిస్సంశయం. అందువల్ల ఆదర్శాలను కలిగి ఉండటం మంచిది. ►మహిళలను తగిన రీతిలో గౌరవించిన దేశాలే ఔన్నత్యాన్ని సాధిస్తాయి. మహిళలను గౌరవించని దేశాలేవీ ఉన్నతిని సాధించలేవు. ►బలహీనతలూ బంధనాలూ ఊహాజనితాలే. బలహీనపడవద్దు. దృఢంగా నిలబడండి. అనంతమైన శక్తి మీలోనే ఉంది. ►రాజకీయంగా, సామాజికంగా ఎవరైనా స్వాతంత్య్రం సాధించవచ్చు. ఎవరైనా ఒక మనిషి తన వ్యామోహాలకు, ఆకాంక్షలకు బానిసగా ఉన్నంత కాలం నిజమైన స్వేచ్ఛలోని స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదించలేడు. ►మీపై మీకు నమ్మకం లేనంత కాలం మీరు దేవుడిని నమ్మలేరు. ►విశ్వాసం... విశ్వాసం... విశ్వాసం... మన విశ్వాసమే మనం. విశ్వాసమే దైవం. ఔన్నత్యానికి విశ్వాసమే మార్గం. ►మీ విధికి మీరే విధాతలని గ్రహించండి. బాధ్యతలను స్వీకరించి ధైర్యంగా ముందడుగు వేయండి. ►ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ►కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. ►మీ సహచరులకు నాయకత్వం వహించాలనే ఆలోచన చేయకండి. దానికి బదులు వారికి మీ శాయశక్తులా సాయం చేయండి. ►మతాలన్నీ సమానమే. వాటి పద్ధతుల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, వాటి సారాంశం ఒక్కటే. ►వేదాలు, ఖురాన్, బైబిల్... ఇవేవీ లేని చోటుకు మానవాళిని ముందుకు నడిపించాలనుకుంటాం. అయితే, వేదాలు, ఖురాన్, బైబిల్ మధ్య సామరస్యంతోనే అది సాధ్యమవుతుంది. ►మతాలన్నీ పిడివాదాలకు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. మనుషుల్లో హేతుబద్ధతకు దోహదపడేవిగా ఉండాలి. ►హేతుబద్ధమైన కార్యాచరణతోనే బాల్యవివాహాలు, అవిద్య వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. ►సమాజంలో మార్పు తెచ్చేందుకు చేపట్టే ఎలాంటి కార్యాచరణ అయినా ఉపరితలానికే పరిమితం కారాదు. హేతుబద్ధమైన కార్యాచరణ ఏదైనా అట్టడుగు స్థాయి నుంచి మొదలైతేనే సమాజంలో సమూలమైన మార్పులు సాధ్యమవుతాయి. ►కరువు కాటకాలతో, ప్రకృతి విపత్తులతో, మహమ్మారి రోగాలతో మనుషులు అల్లాడే చోటుకు వెళ్లండి. ఆపన్న హస్తాల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారికి శక్తివంచన లేకుండా సేవ చేయండి. ►జీవుడే దేవుడు. ఎవరైనా మానవసేవ ద్వారా భగవంతుడికి చేరువ కావచ్చు. ►ఒక వితంతువు కన్నీళ్లు తుడవలేని, ఒక అనాథ నోటికి అన్నం అందించలేని ఏ దేవుడినైనా, ఏ మతాన్నైనా నేను విశ్వసించను. ఆకలితో అలమటిస్తున్న సాటి మానవులను పట్టించుకోని ప్రతి మనిషినీ నేను ద్రోహిగానే పరిగణిస్తాను. ►ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే చాలు. జరగాల్సిన పనులు వాటంతట అవే జరిగిపోతాయి. ►ప్రతి గొప్ప పనికీ మూడు దశలు ఎదురవుతాయి– అవహేళనలు, వ్యతిరేకత... చివరకు ఆమోదం. తాము ఉన్న కాలాని కంటే ముందు ఆలోచించే వాళ్లను ప్రపంచం అపార్థం చేసుకుంటుంది. ►ఎల్లప్పుడూ అత్యున్నత ఆదర్శాలను కలిగి ఉండండి. ఈర్ష్యను, స్వార్థాన్ని విడిచి మనో స్థైర్యంతో ముందుకు సాగండి. అప్పుడు మీరు ప్రపంచాన్నే కదిలించగలరు. ►ధర్మానికీ, దేశానికీ ఉపయోగపడని శరీరం, ధనం ఎంతగా పెరిగినా వ్యర్థమే. ►సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. ►మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించండి. ►అనాలోచితంగా తొందరపడి ఏ పనీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల... ఈ మూడూ కార్యసిద్ధికి ఆవశ్యకాలు. అయితే, ఈ మూడింటి కంటే ప్రేమ మరింత ఆవశ్యకం. ►దయార్ద్ర హృదయంతో ఇతరులకు సేవ చేయడం మంచిదే గాని, సర్వజీవులను భగవత్ స్వరూపాలుగా ఎంచి సేవించడం ఇంకా మంచిది. ►జీవితంలో ధనం నష్టపోతే కొంత పోగొట్టుకున్నట్లు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే మాత్రం సర్వస్వం కోల్పోయినట్లే. ►నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయ తీరాల వైపు నడిపిస్తుంది. ►అసత్యానికి దూరంగా ఉండండి. సత్యానికి కట్టుబడి ఉండండి. సత్యానికి కట్టుబడి ఉంటే ఆలస్యమైనా విజయం సాధించి తీరుతాం. ►భయాన్ని వీడండి. మనిషి పతనానికైనా, పాపానికైనా భయమే కారణం. ►దృఢ సంకల్పం, పవిత్రాశయం తప్పక ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా ధరించిన వారు అన్ని విఘ్నాలనూ ప్రతిఘటించి నిలువగలుగుతారు. ►లక్ష్యం కోసం అలుపెరుగకుండా శ్రమిస్తుంటే నేడు కాకుంటే రేపైనా విజయం సిద్ధిస్తుంది. ►ఒక్క క్షణం సహనం ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ►మనం మార్పు చెందితే ప్రపంచమంతా మారుతుంది. మనం పరిశుద్ధులమైతే ఈ లోకమంతా పరిశుద్ధమవుతుంది. ►మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు. ►రోజుకు కనీసం ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఈ ప్రపంచంలోని అద్భుతమైన మనిషిని కలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు. ►ధీరులు, సమర్థులు అయిన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. వీరోచిత ధైర్య సాహసాలతో కడవరకు ప్రయత్నాన్ని కొనసాగించే వారికే విజయం వరిస్తుంది. ►ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతారో, దాన్ని పొందే మార్గాలపైనా అంతే శ్రద్ధ చూపాలి. ►అసూయను, అహంభావాన్ని విడనాడండి. ఇతరుల మేలు కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది. ►తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకవంతుడు చేపట్టే ప్రతి పనినీ తనకు నచ్చేలా మలచుకుంటాడు. ఏ పనీ అల్పమైనది కాదు. ►మనకు కావలసినది శ్రద్ధ. మనిషికీ మనిషికీ నడుమ తేడాలకు కారణం వారి శ్రద్ధలోని తారతమ్యాలే. ఒక మనిషిని గొప్పవాడిగా, మరో మనిషిని బలహీనుడిగా చేసేది శ్రద్ధే. ►భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి. ►వేదాంత పరిభాషలో పాపమనేదే లేదు. మనం పాపాలు అనుకున్నవన్నీ పొరపాట్లు మాత్రమే. ►అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో, అపవిత్రమైన ఆలోచన కూడా అంతే చెడ్డది. ►ప్రతి బాధ్యత పవిత్రమైనదే. బాధ్యతపై మనకు గల భక్తి మాత్రమే భగవంతునికి మనం చేయగల అత్యుత్తమమైన అర్చన. ►మనిషిలో ముందుగానే నిక్షిప్తమై ఉన్న సంపూర్ణతకు ఒక రూపాన్నిచ్చేదే విద్య. ►అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించడానికి మీ జీవితాన్నంతా ధారపోయండి. ►మానవ జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం. ►మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం. ►సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు. ►ఓర్పుగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం, సత్యానుభూతి కోసం తీవ్రంగా తపించడం... ఇవి మాత్రమే మానవాళి భవిష్యత్తును సుసంపన్నం చేయగలవు. ►ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర పనిలోనైనా ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ పని అంత చక్కగా నెరవేరుతుంది. ►మన దేశంలో రెండు మహా పాతకాలు ఉన్నాయి. అవి: స్త్రీలను అణగదొక్కడం, నిరుపేదలను కుల నిబంధనలతో వేధించడం. ►ఇతరుల దోషాల గురించి ఎన్నడూ ముచ్చటించకు. వారెంత దుష్టులైనా సరే. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ►బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే కాని, అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. ►విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కాని దైవం విగ్రహం మాత్రమేనని ఆలోచిస్తే మాత్రం పొరపాటే. ►సజీవ దైవాలను సేవించండి. అంధుడు, వికలాంగుడు, నిరుపేద, దుర్బలుడు, క్రూరుడు... ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుడిని గుర్తించండి చాలు. ►బలమే జీవనం. బలం సంక్షేమాన్ని, అంతులేని జీవితాన్ని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. బలహీనతే మరణం. బలహీనత అంతులేని దుఃఖాన్ని, శ్రమను కలిగిస్తుంది. ►మిమ్మల్ని మీరు అనంత శక్తి సమన్వితమైన ఆత్మ స్వరూపులుగా భావించుకోండి. అప్పుడు ఎలాంటి శక్తి వెల్లడవుతుందో చూడండి. ►ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రతే ఏకైక మార్గం. ►నిలువెల్లా స్వార్థం నిండిన మనిషే ఈ లోకంలో అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. స్వార్థం లేశమైనా లేని మనిషి పరమానందాన్ని పొందుతాడు. ►ప్రపంచంలో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. జీవితకాలంలో మనకున్న సమయం తక్కువ. అందువల్ల మనకు అవసరమైనది ఒంటపట్టించుకోవడమే జ్ఞానం. ►అహంకార మమకారాలు, నేను, నాది అనే భావనలే ఈ లోకంలోని అనర్థాలన్నింటికీ కారణం. ►శారీరక శుభ్రత అవసరమే అయినా, మానసిక పవిత్రత మరింత ముఖ్యం. మనో మాలిన్యాలను తొలగించుకోనిదే బాహ్యశుద్ధి వల్ల ఉపయోగం లేదు. ►మనిషనేవాడు ముందు ఆత్మాభిమానం కలిగి ఉండాలి. ఆత్మాభిమానం లేనివాడు మనిషిగా ఎదగలేడు. ►కార్యసాధన శక్తి కంటే కష్టాలను భరించే శక్తి చాలా గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి చాలా చాలా గొప్పది. ►స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యిసార్లు విఫలమైనా వెనుకంజ వేయకుండా మరోసారి ప్రయత్నించండి. ►ఇతరులకు చేసిన మంచి కొంచెమైనా సరే, అది అంతర్గత శక్తిని మేల్కొలుపుతుంది. మంచిని కనీసం తలచుకున్నా, అది మనసును అనంత శక్తితో నింపుతుంది. ►తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ►తనను తాను కించపరచుకోవడం అన్ని బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ►పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మను దర్శించుకోగలరు. ►మిమ్మల్ని మీరు నిరుపేదలుగా అనుకోవద్దు. ధనం కంటే మంచితనం, పవిత్రతలే నిజమైన సంపద. ►పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శక్తినే విశ్వసించండి. ప్రపంచంలో పాపమనేది ఏదైనా ఉంటే అది మన బలహీనత మాత్రమే. ►డబ్బులేని మనిషి నిరుపేద కాదు. నిజానికి జీవితంలో లక్ష్యం లేని మనిషే నిరుపేద. ►ఒక సమయంలో ఒకే పని చేయండి. ఆ పని చేస్తున్నంత సేపూ మీలోని సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించండి. ►స్వార్థం లేకుండా ఉండటమే అన్ని నీతుల్లోకీ గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతిపనీ గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. ► పవిత్రత ఒక మహత్తర శక్తి. దాని ముందు మిగిలినవన్నీ భయంతో కంపిస్తాయి. ►పట్టు విడవకుండా పనిచేయండి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోండి. ►పరిపూర్ణమైన అంకిత భావం, పవిత్రత, అత్యంత సునిశిత బుద్ధి కలిగిన కొద్దిమంది పనిచేసినా ప్రపంచంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ►అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది. యోగం ద్వారా జ్ఞానం, జ్ఞానం నుంచి ప్రేమ, ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి. ►నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు గాని, ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే అన్ని ప్రార్థనల కంటే ఎక్కువగా మనల్ని భగవంతుడికి చేరువ చేస్తుంది. ►మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానినే అంటిపెట్టుకుని పనిచేయండి. ►సహృదయం నుంచి భగవద్వాణి వినిపిస్తుంది. సంకుచితమైన బుద్ధి నుంచి వెలువడేది స్వార్థమే. ► నిరుత్సాహులై, అధైర్యపడేవారు జీవితంలో ఏ పనినీ సాధించలేరు. ►ఇతరులు ఏమి అనుకున్నా, ఏమి చేసినా మీరు మాత్రం మీ పవిత్రతను, నైతిక స్థైర్యాన్ని, భగవద్భక్తి స్థాయిని దిగజార్చుకోకండి. ►బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే గాని, బలహీనతను గురించి చింతించడం కాదు. ► మెదడుకు, హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్నే అనుసరించండి. ►విధేయత, సంసిద్ధత, కర్తవ్యం పట్ల ప్రేమ... ఈ మూడూ మీలో ఉంటే ఏ శక్తీ మిమ్మల్ని అడ్డుకోలేదు. ►మనిషిలో దైవత్వం దాగి ఉంది. ప్రతి మనిషీ తనలోని దైవత్వాన్ని వెలికితీసి తన ప్రవర్తనలో వ్యక్తపరచడం సాధ్యమే. అదే మానవ జీవిత లక్ష్యం. -
మోదీ స్పీచ్ బ్యాన్... మమతపై విమర్శలు
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ గుర్రుతో ఉంది. ఆదివారం కోల్‌కతాతోపాటు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసం లైవ్ ప్రసారం చేసేందుకు యూజీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అన్నికళాశాలలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విద్యాలయాల్లో మాత్రం ప్రసారం చేయొద్దంటూ మమతా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాషాయం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన ఒక ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ ప్రసంగం అడ్డుకోవటం దారుణం. ప్రధాని సందేశాలను విద్యార్థులు వినకోవద్దనుకోవటం సరైన పద్ధతి కాదు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి పేర్కొన్నారు. ఇక దీదీ(మమతా) మరీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుదేశ్ వర్మ మండిపడ్డారు. స్వామి వివేకానందుడు దేశభక్తుడు. ఆయనపై ఉపన్యాసం విషయంలో విద్యాలయాలకు, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లాంటి అత్యున్నత విభాగం ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరిస్తున్నారు అని సుదేశ్ చెబుతున్నారు. కాగా, 1893 సెప్టెంబర్ 11, చికాగో వేదికగా ప్రపంచ సర్వమత సమ్మేళన సదస్సులో స్వామి వివేకానందుడు ఉపన్యసించిన విషయం తెలిసిందే. ఆ అపూర్వ ఘట్టానికి 125 ఏళ్లు పూర్తి కావటంతో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
‘ప్రపంచ శాంతికి వారధి భారతీయ సంస్కృతి’
శ్రీకాకుళం: విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించే సనాతన ధర్మమే భారతీయ సంస్కృతి అని, ప్రపంచ శాంతికి వారధిలా భారతీయ సంస్కృతి దోహదపడుతుందని తెలుగుతల్లి చైతన్య సమితి అధ్యక్షుడు యర్నాగుల వేంకట రమణారావు అన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో సెట్‌శ్రీ సౌజన్యంతో యంగ్ ఇండియా సారథ్యంలో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల 6వ రోజు కార్యక్రమాన్ని హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో... స్థానిక చందు హిందీ పండిత శిక్షణ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన భారతీయ సంస్కృతి అనే అంశంపై మాట్లాడారు. ‘బేటీ పడావో–బేటీ బచావో’ జిల్లా కన్వీనర్, ప్రముఖ మహిళా న్యాయవాది కద్దాల ఈశ్వరమ్మ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రభోదాలను యువత అనుసరించాలన్నారు. విశ్వగురువుగా భారత రూపు దిద్దుకోవాలని ఆకాంక్షించారు. హిందీ వికాస వేదిక అధ్యక్షుడు బాడాన దేవేభూషణరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి యంగ్ ఇండియా డైరెక్టర్ మందపల్లి రామకృష్ణారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్యామసుందరరావు, వివేకానంద సేవా సమితి సభ్యులు సోపింటి జగదీష్, కళాశాల అధ్యాపకులు ఎం. ఈశ్వరరావు, లావేటి కృష్ణారావు, రావాడ శ్రీనివాసరావు, ఎం. షణ్ముఖరావు, టి. అనిల్‌కుమార్, ఎల్. భార్గవనాయుడు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వివేకానంద, సోదరి నివేదిత చిత్ర పటాలకు జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. -
ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’
నకిరేకల్ : ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్ అన్నారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పగల సామర్ధ్యం కలిగిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గులు, వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రధమ బహుమతి జె.రేణుక, రెండో బహుమతి ఎస్.మాధవి, మూడో బహుమతి సంతోష, వ్యాసరచన పోటీలో ప్రధమ ఝాన్సీ, ద్వితీయ ఎం.జ్యోతి, తృతీయ కే.శ్రీదేవి అందుకున్నారు. తొలుత గ్రామ శివారులోని రాణి రుద్రమాదేవి శిలాశాసనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కొమ్ము వెంకటేషం, ఎంపీటీసీ పుట్ట సరిత, దోసపాటి రాము, వివేకాయంద యువజన మండలి అధ్యక్షుడు పుట్ట సాయి, ప్రతిని«ధులు జొర్రీగల వెంకటేశ్వర్లు, దోసపాటి నాగరాజు, పుట్ట సత్యనారాయణ, తండు శ్రీను, శ్రీకాంత్, బెజవాడ సురేష్, పుట్ట జానయ్య, దయాకర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు -
వివేకానందుడు.. ఓ ఆసక్తికరమైన విషయం
న్యూఢిల్లీ: యువతా! అనే సంబోధించిన వెంటనే టక్కున గుర్తొచ్చే పేరు స్వామీ వివేకానంద. ఆయన ఒక్క భారత్‌కు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికే యూత్ ఐకాన్. ఆధ్యాత్మికంగా, మేధోపరంగా, సంస్కృతిపరంగా ఏ అంశంతో పోల్చినా ఆయనకు తెలిసినంత విషయ పరిజ్ఞానం ఇంకెవరికీ ఉండదని చెప్పడం పెద్ద ఆశ్చర్యం కాదేమో. ఏకసంతాగ్రహి అయిన వివేకానందుడు తన అనర్గళమైన ఆంగ్ల ప్రసంగాలతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేశారు. సోదరీసోదర మణులారా అనే పదాలకు వన్నె తెచ్చిన మనీషి ఆయన. అలాంటి వివేకానుందుడి గురించి కూడా ఓ అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. ఆంగ్లంలో చక్కగా మాట్లాడటం, రాయడం చేయగలిగే వివేకానందుడు పరీక్షల్లో మాత్రం చాలా తక్కువ ప్రదర్శన చేసేవారంట. ఆయన రాసిన పరీక్షల్లో వరుసగా 47, 46, 57శాతం మార్కులు మాత్రమే ఆయన సాధించారంట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత హిందోల్ సేనుగుప్తా తాను రాసిన 'ది మోడ్రన్ మాంక్: వాట్ వివేకానంద మీన్స్ టు అస్ టుడే' అనే గ్రంథంలో వివరించారు. 'వివేకానందుడు మూడు విశ్వవిద్యాలయాల ఆంగ్ల ప్రవేశ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఆర్ట్స్ స్టాండార్డ్ (ఎఫ్ఏ ఇదే క్రమంగా ఇంటర్మీడియట్గా మారింది)లో 46శాతం, బీఏలో 56శాతం, ఆంగ్ల భాషలో 47శాతం మార్కులు సాధించారు' అని రచయిత చెప్పారు. అంతేకాకుండా ఆయన గణితం, సంస్కృతంలో కూడా పరిమితి ప్రతిభనే చూపించారట. -
మంచి పుస్తకమే మీకొక మంచి స్నేహితుడు!
రామాయణ భారత భాగవతాదులు అధ్యయనం చేయడం మీ జీవితంలో ప్రధానమైన అంశంగా స్వీకరించండి. అది మీకు శీలవైభవాన్ని ఇస్తుంది. ఊన్చుకోవడానికి అవకాశమౌతుంది. ఇతిహాసాలు, పురాణాలు పనికిమాలినవి కావు. అందుకే స్వామి వివేకానంద .. ‘‘ఇతిహాసాలు, పురాణాలు ప్రస్తుత కాలానికి సరిపడవని మీకనిపిస్తే, ప్రస్తుత సమాజం లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలేదనిపిస్తే... నిర్దాక్షిణ్యంగా వాటిని బయటికి విసిరిపారేయండి. మీ ఇంట్లో మీ విలువైన పుస్తకాలమధ్య వాటిని ఉంచుకోకండి. భారతీయ వేదాంతసమాజ దార్శనిక గ్రంథాలైన రామాయణ, భారత భాగవతాదులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను.’’ అంటారు. మీకు ఏ కాలంలో ఎదురయ్యే పరీక్షకైనా అవి మీకు పరిష్కారాలు చూపిస్తాయి. పక్షపాతంతో ఏ పుస్తకాన్నీ చదవకండి. ఒక్కొక్కప్పుడు ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు కావచ్చు. మంచి పుస్తకాలను చదవడం మంచి స్నేహితుల సాంగత్యంతో సమానమైన ఫలితాన్ని స్తుంది.. రామాయణం కూడా అటువంటి ఒక మంచి పుస్తకం. నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన మనుష్యుడు ఈ కాలంలో ఎక్కడున్నాడు? అని. భగవంతుని గురించి అడగలేదు. అటువంటి మనుష్యులెవరైనా ఉంటే చెప్పమన్నాడు. ‘‘ఉన్నాడు. రాముడని ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు.’’ అంటూ సంక్షేప రామయణాన్ని నారద మహర్షి వివరించాడు. ఆ గుణాలను వివరిస్తూ ’కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాడు’ అంటాడు. ’కోపాన్ని పూర్తిగా విడిచి పెట్టినవాడు’ అని చెప్పడు. అదుపులో ఉంచుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే- కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీరు కోపమే చెందలేదనుకోండి. దారితప్పిందని మీరు భావించిన వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి. అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోపం వినాశన హేతువు. అసలు కోపం ఎవడి మీద ప్రభావం చూపుతుందంటే..అవతలివాడు దానికి ప్రభావితుడవుతాడో లేదో తెలియదుకానీ, కోపం ప్రదర్శించినవాడిమీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి పైకి ఉబికి వస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయడం అలవాటున్నవాడు పాము కుబుసాన్ని విడిచినట్లు తన పరిశీలనాత్మకమైన ప్రవర్తనచే విడిచిపెట్టినవాడవుతాడు. జీవితంలో ధర్మాత్ముడు. వాడు వృద్ధిలోకి వస్తాడు. అసలు ప్రధానంగా కావలసింది-తన కోపాన్ని తాను పరిశీలించు కోగలగడం. ఇది చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. కోపమొక్కటే స్వభావంగా మారిపోతే-ఒక నెగడు (నిప్పు) దగ్గరకెళ్ళి కర్రపెట్టి పొడిస్తే అందులోంచి నిప్పురవ్వలు రేగినట్లు -అందులోంచి వచ్చే మొట్టమొదటి అవగుణం అసూయ. గుణవంతు లయిన వ్యక్తులలో లేని అవగుణాలను ఆరోపించి మాట్లాడడం అలవాటవుతుంది. అవతలివాడిని పాడుచేయడానికి, పగతో కూడుకున్న దుర్మార్గపు ఆలోచనలు చేసి అమలచేసే విధానం మనసులో ప్రచోదనం అవుతుంది. తన స్థాయినిమించి వదరి మాట్లాడడం వంటి ఎన్నో అవగుణాలు మూటగట్టుకోవడానికి కారణమవుతుంది. అందుకే దాన్ని పరిశీలనం చేసుకోవడానికి పెద్దలు కొన్ని మార్గాలు చెబుతారు. కోర్కె తల్లి అయితే-దానిలోంచి ఉద్రేకపూరిత భావన ఒకటి పుడుతుంది. దానికి రెండు తలలు ఉంటాయి. ఒకటి శోకం. రెండవది అదుపు తప్పిన స్థితి. అదే కోపం. అందుకే మనసు వెంటనే -నాకోరిక తీరడానికి కారణమెవరు ? అని వెతుక్కుంటుంది. దేన్నో ఒకదాన్ని పట్టుకోవాలిగా. పట్టుకున్న దానిమీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. శోకాన్ని, కోపాన్ని రెండు ముఖాలుగా పెట్టుకుని ప్రవర్తిస్తుంటుంది. దీనికి శాస్త్రం చెప్పిన పరిష్కారం ఏమిటంటే... కోపానికి ఆజ్యం..అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే కదా! అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడనా?’’ అన్న ప్రశ్న వేసుకోవాలని శాస్త్రం చెప్పింది. రెండవది-అవతలివాడు కోపాన్ని పొందాడంటే.. ఏ పరిస్థితుల్లో పొందాడో! ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెడుతుంది. ’’నాకటువంటి పరిస్థితి కలుగదు. నాకా అవకాశం రాలేదు. హే జగదంబా! ఏ కారణములు నాకేర్పడలేదో, నాకు కోపం రావడానికి ఏకారణాలు కారణం కాలేవో అటువంటి పరిస్థితులే అందరికీ కలిగేటట్లుగా అనుగ్రహించు’’. అదే నిజమైన ప్రార్థన. అలా ప్రార్థన చేసేవాడు ఉత్తమ సాధకుడు. ఇది సాధించాలంటే ఉండాల్సింది. ఓర్పు... అదే క్షమ. క్షమా యశః - అంటారు. సమస్తమైన కీర్తికీ అదే కారణం. ఎంత ఓర్పండీ మహానుభావుడికి! అంటారు. ఎంత ఓర్పండీ భూదేవికి! ఎంత ఓర్పండీ నా తల్లి సీతమ్మకి! ఈ ఓర్పు ఉన్న వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే మీ క్రమశిక్షణాయుత జీవితానికి ఈ గుణములు ఎంతో అవసరం. మీరు ఇంకా మీ నిజ జీవితంలోకి ప్రవేశించలేదు. ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యక్తిత్వ వికాస అభ్యాసం కూడా అందులో భాగమే. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఆ పేరెలా పెట్టుకోను!
ముంబై : 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి కూడా పరిచయమైన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా, విలన్‌గా అడపాదడప కనిపిస్తున్న ఆయన తన పేరు గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తన పూర్తి పేరు వివేకానంద అని, కానీ చిత్రసీమలోకి వచ్చాక తన పేరులోని ఆనంద్‌ను తీసేశానని ఆయన తెలిపాడు. 'నిజానికి నా పూర్తి పేరు వివేకానంద ఒబెరాయ్. మా నాన్న, తాతగారు స్వామి వివేకానందను ఆధ్యాత్మికంగా అనుసరించేవారు. ఆయన బోధనలను ఆరాధించేవారు. ప్రపంచానికి ఎనలేని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన ఆయన స్ఫూర్తితోనే నాకు వివేకానంద అనే పేరు పెట్టారు. 2002లో నేను సినిమాల్లో చేరేటప్పుడు నా పేరు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. నేను సినిమా తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. చెట్టుచేమల్ని పట్టుకొని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. వివేకానంద అని పేరు పెట్టుకొని అలాంటి పనులు ఎలా చేయగలను. అందుకే నేను నా పేరులో ఆనంద్‌ను తొలగించాను. స్వామి వివేకానంద మీద గౌరవంతోనే వివేక్ ఒబెరాయ్ పేరుతో కంటిన్యూ అవుతున్నాను' అని ఆయన ముంబైలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. 'సాథియా' సినిమాతో తొలి హిట్ అందుకున్న ఈ హీరో తన ట్విట్టర్ అకౌంట్లో మాత్రం వివేకానంద అని కొనసాగిస్తున్నాడు. -
యువతే దేశ భవిత
‘లే.. లేచి నిలబడు, ధైర్యంగా.. బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో, నీకు కావాల్సిన బలం.. శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మంచి చెడులను సృష్టించుకునేది మీరే.’ అంటూ స్వామి వివేకానంద తన బోధనలతో నవ భారత నిర్మాణానికి బాటలు వేశాడు. వివేకానందుడి ప్రవచనాలను ఒంటబట్టించుకున్న పలువురు యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి -
ఆలయాలకు వెళ్లేకన్నా.. ఆటలాడటం మిన్న
-
ఆలయాలకు వెళ్లేకన్నా.. ఆటలాడటం మిన్న
ఉత్సాహవంతులైన యువకులు కొందరు ఓ స్వామీజీ దగ్గరికొచ్చి.. 'అయ్యా.. పుణ్యలోకాల్లో నివసించే దేవుళ్ల సాక్షాత్కారం లభించాలంటే ఏం చెయ్యాలి?' అని అడిగారు. అందుకా స్వామీ ఇలా సమాధానమిచ్చారు.. 'దేవుడి గుళ్లో గంటను ఎన్నిసార్లు కొట్టాలి, హారతిని కుడి నుంచి ఎడమకివ్వాలా! లేక ఎడమ నుంచి కుడికివ్వాలా! అనే చిన్న చిన్న విషయాల దగ్గరే మీరు ఆగిపోకూడదు. అవన్నీ పక్కకు నెట్టండి. అసలు ఆలయాలకు వెళ్లడమే మానేసి మైదానాలకు తరలి వెళ్లండి. వెళ్లి ఫుట్ బాల్ ఆడండి. ఉత్సాహంగా బంతిని తన్నండి. శక్తినంతా ఉపయోగించి గోల్ చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఇలాంటి ప్రయత్నాల వల్లే మీకు దైవదర్శనం లభిస్తుంది. బలమే జీవితం. బలమే జీవితం. బలహీనతే మరణం' అంటూ యువకులకు ఉద్బోధిస్తారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఆయన మరెవరో కాదు స్వామి వివేకానంద అని. ప్రస్తుతం మలేసియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. వికేకానంద బెంగాలీ యువతతో పంచుకున్న విషయాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పెటాలింగ్ జయలోని రామకృష్ణ మఠంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల దాకా భారత్ ఎదుగుదల.. తన విశ్వాసాలపై ఉంచిన నమ్మకాలతోనే సాధ్యమయిందని, ఆ విశ్వాసాలను భారతీయుల మదిలో బలంగా నాటిన వ్యక్తి వికేకానందుడని మోదీ ఉద్ఘాటించారు. వివేకానంద కేవలం ఒక వ్యక్తి కాదని, యావత్ భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, మానవసేవే మాధవ సేవ అనే నినాదమే జీవితాశయంగా బతికిన ఆయన.. ఆనాడే పాశ్చాత్య గడ్డపై ప్రబోధనలు చేశారని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో భారత్ లేదని, ప్రకృతిని, అందులో నివసించే పశుపక్ష్యాదులను భారతీయులు దైవాలుగా భావిస్తారని గుర్తుచేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మలేసియా వెళ్లిన ప్రధాని మోదీ శనివారం ఆసియాన్ సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
స్ఫూర్తికి మూలం వివేకానంద: మోదీ
న్యూఢిల్లీ: స్వామి వివేకానంద 112వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ స్ఫూర్తిని అందించేందుకు స్వామి వివేకానంద మూలమని మోదీ కొనియాడారు. వివేకానంద ఆలోచనలు ఇప్పటికీ అనేకమందిపై ప్రభావం చూపిస్తున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. అమెరికన్లకు మోదీ శుభాకాంక్షలు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు నూతన శక్తితో మరింత ముందుకు వెళతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు రెండు దేశాలకే కాక.. ప్రపంచానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 6 నుంచి ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాలో తాను పర్యటించనున్న నేపథ్యంలో.. ఆయా దేశాలతో భారత్ సంబంధాలు బలోపేతమవటానికి తన పర్యటన దోహదం చేస్తుందని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానికి ముప్పులేదు: హోంశాఖ ప్రధాని మోదీకి మతవాద తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది. ప్రధాని భద్రతకు ఎటువంటి ముప్పులేదని, దీనిపై వచ్చిన వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేసింది. ముస్లింలను ఆకర్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయనకు మతవాద తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పోలీసులకు దీనిపై హెచ్చరికలు వచ్చినట్టు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. -
గత వర్తమానాల వారధి స్వామి వివేకానంద
గత వర్తమానాల వారధి స్వామి వివేకానంద భారత ప్రాచీన నాగరికతా గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా ప్రదర్శించిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద. జవహర్లాల్ నెహ్రూ మాటల్లో ఆయన మనదేశ గతానికి, వర్తమానానికి వారధిలా ఉండేవారు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తాలో 1863, జనవరి 12న జన్మించారు. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, బిశ్వనాథ్దత్త. తండ్రి ద్వారా హేతువాదం, ప్రశ్నించే తత్వా న్ని, తల్లి ద్వారా దైవభక్తిని నేర్చుకున్నారు. బీఏ జనరల్ ఇనిస్టిట్యూట్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆయనలోని ఆధ్యాత్మిక దృష్టి ప్రిన్సిపాల్ విలియం హేస్టీని ఆకర్షించింది. ఒకరోజు తత్తశాస్త్రం పాఠం చెబుతూ హేస్టీ ‘ట్రాన్స్’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి కలకత్తాలోని రామ కృష్ణుని కలవాలని నరేన్‌కు సలహా ఇచ్చారు. 1881 నవంబర్‌లో నరేన్, రామకృష్ణుల తొలి సమావేశం జరిగింది. నరేన్, రామకృష్ణుని అసాధారణ వ్యక్తిగా గ్రహించి ఆయన శిష్యుడయ్యాడు. రామకృష్ణులను నరేన్ అమితంగా ప్రేమించిన ప్పటికీ తన భావ ప్రకటన స్వతంత్రాన్ని మాత్రం కోల్పోలేదు. 1885లో రామకృష్ణుడు నిర్వికల్ప సమాధిస్థితిని పొందిన తర్వాత ఆయన అభి మతం ప్రకారం 8మంది శిష్యులతో నరేన్ 1887 జనవరిలో సన్యాసం స్వీకరించారు. కలకత్తాలోని బారానగర్‌లో మఠం స్థాపించి పవిత్ర భిక్ష ద్వారా డబ్బులు సేకరించే సమయంలో తన పేరును స్వామి వివేకానందగా మార్చుకున్నారు. 1888లో కాలినడకన దేశపర్యటన ప్రారంభించారు. పర్యటనలో తను కలుసుకున్న రాకుమా రులు, లాయర్లు, టీచర్లు, ప్రభుత్వాధికారులను దేశంలోని సామాన్యులకు సహాయం చేయాలని కోరేవారు. రూపం, వాగ్ధాటి, విషయ స్పష్టతతో అందరినీ ఆకట్టుకున్న వివేకానంద పశ్చిమదేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించి మన వనరుల తో అభివృద్ధి చెందాలని, అదే సమయంలో మన నైతిక ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ క్రమంలోనే చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్లి విశిష్ట ప్రసంగం చేశారు. పాశ్చాత్య పత్రికలు ఆయన ప్రసంగాలను పతాక శీర్షికల్లో ప్రచురించాయి. తిలక్ వంటి నాయకులు ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. 1897లో ఆయన రామకృష్ణ మిషన్ స్థాపించారు. ఖాళీ కడుపులకు మతం వద్దు, దేవుడిని చూడాలంటే మనిషికి సేవ చేయి అనే రెండు నియమాలు 117 ఏళ్లుగా సంస్థకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ స్వాతంత్య్రంతోపాటు నైతిక, మేధాపరమైన వారసత్వం ఉండాలని చెప్పారు. నా తర్వాత వందలాది వివేకానందులు జన్మిస్తారు. వారిలో ప్రతీఒక్కరూ నాకంటే వందరెట్లు గొప్ప అవుతారని అని చెప్పిన ఆయన 1902 జూలై 4న 39 ఏళ్ల వయసులో బేలూరు మఠంలో పరమపదించారు. (నేడు వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం) - తండ ప్రభాకర్ గౌడ్ తొర్రూరు, వరంగల్ -
వైద్యోవివేకానంద
వైద్యాన్ని కూడా వ్యాపారం లాగా చేసే వైద్యులు ఉన్న ఈ రోజుల్లో... అందుకు భిన్నంగా ఓ పదిహేను మంది డాక్టర్లు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని వైద్యులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ వంతుగా సమాజ సేవ కూడా చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలో ఓ అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పి గత ఏడేళ్లుగా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు. నేడు వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. - మొరంగపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ సాక్షి, వికారాబాద్ సాధారణ, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన డాక్టర్ రాజశేఖర్ ఈ ఆశ్రమ ఏర్పాటుకు ప్రధాన సూత్రధారి. ఈయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, ఇటికల మండలం, మునుగాల గ్రామం. ఈయన ఎంఎస్ పూర్తి చేసి మొదట తాండూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆనాటి నుంచే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. గత ఐదేళ్లుగా వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్త్తూ సామాజిక సేవను కొనసాగిస్తున్నారు. తన ఇంటి దగ్గర కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఎవరైనా ఫీజు ఇవ్వబోతే... పక్కనే ఏర్పాటు చేసుకున్న స్వామి వివేకానందుడి పేరుమీద ఉన్న హుండీలో వేయించి, ఆ డబ్బును అనాథ పిల్లల భోజనానికి, దుస్తులకు ఖర్చు చేస్తారు. వివేకానందుడే ప్రేరణ డాక్టర్ రాజశేఖర్‌కు బాల్యం నుంచి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం అలవాటు. స్వామి వివేకానంద జీవితం డాక్టర్ రాజశేఖర్ మనస్సును మార్చేసింది. ఆయన మార్గంలోనే నడవాలని తపించేవారు. చిన్నతనంలో చదువుకునేందుకు కష్టాలు ఎదురవడంతో తనలా కష్టాల్లో ఉన్న కొందరికైనా తనవంతు సహాయాన్ని అందించాలనుకున్నారు. అందుకు వివేకానందుడి మార్గమే సరైనదని నమ్మారు. తనతోపాటు ఆ సంస్థను కొనసాగించేందుకు సహకరిస్తున్న స్నేహితులకు సేవా దృక్పథాన్ని కలిగించారు. వికారాబాద్ మారుమూల గ్రామాల్లో రోజుకు ఒకరిద్దరు ఆర్థిక కారణాలతో, కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం, వారు ఆస్పత్రికి వచ్చాక చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం, వారి పిల్లలు అనాథలు కావడం వంటి ఎన్నో సంఘటనలు రాజశేఖర్ మనస్సును కలచివేశాయి. ఇలాంటి విషాదకరమైన ఎన్నో సంఘటనలు ‘యజ్ఞ’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు పునాదులు వేశాయి. అనాథ పిల్లలకు అండగా నిలవాలనే ఆయన తపనే ఆ ఆశ్రమం ఏర్పాటుకు దారి తీసింది. డాక్టర్ రాజశేఖర్‌కు వచ్చిన ఆలోచనను హైదరాబాద్‌లోని తన వైద్యమిత్రులు సతీష్, శైలజ, విజయ్, సురేందర్, రామకృష్ణలతో పంచుకున్నారు. రాజశేఖర్ ఆలోచనతో ఏకీభవించిన వారందరూ ‘యజ్ఞ ఫౌండేషన్’గా ఏర్పడ్డారు. అనుకున్నదే తడవుగా వీరంతా కలిసి ఆలోచనను ఆచరణలో పెట్టారు. అందుకు ప్రతిరూపమే 2007లో వెంకటాపూర్ తండా సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అనాథాశ్రమం. నేడు మండల పరిధిలోని దన్నారం గ్రామం సమీపంలో రెండు ఎకరాలను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో భవనం నిర్మించి అక్కడే పాఠశాలను, వసతిగృహాన్ని ఏర్పాటు చేసి, యజ్ఞ అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎండీ పూర్తి చేసిన డాక్టర్ రాజశేఖర్ భార్య శైలజ కూడా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆటపాటల్లోనూ శిక్షణ ప్రస్తుతం యజ్ఞ ఆశ్రమంలో 58 మంది అనాథ పిల్లలు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పదిమంది ఉపాధ్యాయులతో ఎనిమిదవ తరగతి వరకు అక్కడ పాఠాలు బోధిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా మూడు నుంచి పదమూడు లోపు వారే. ప్రతిరోజు వీరికి విద్యాబోధనతో పాటు ఆటపాటల్లో శిక్షణ ఇస్తున్నారు. తాము అనాథలమనే భావన వారి దరి చేరకుండా ప్రేమానురాగాలను పంచుతున్నారు. -
సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!
‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ... - స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది. ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే! మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది. దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే, సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు! చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు... మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం. ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు - రెంటాల జయదేవ -
మోదీకి ‘నరేంద్రుని’కి చుక్కెదురు
అధికారంలోని బీజేపీ-ఆర్ఎస్ఎస్-సంఘ పరివార్లే బలవంతపు మతమార్పిళ్లకు తెరలేపి, దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టుగా.. మతమార్పిళ్ల వ్యతిరేక జాతీయస్థాయి చట్టాన్ని ప్రతిపాదిస్తునాయి. ఈ మతమార్పిళ్ల విషయంలో బెంగాల్ నరేంద్రనాథ్ (స్వామి వివేకానంద)కు, గుజరాత్ నరేంద్రమోదీకి మధ్య భావాలలోనూ, ప్రవర్తనలోనూ ఆకాశానికీ, భూమికీ మధ్య ఉన్నంత తేడా ఉంది. వివేకానందుడు దేశభక్తుడూ, సెక్యులర్ భావదీప్తి గల సమున్నత వ్యక్తి. కాగా, మోదీ సెక్యులర్ తత్వానికి వ్యతిరేకి, ‘పురోభివృద్ధి’ పేరు మాటున మతైక దృష్టితో భారతీయ సమాజం చీలికకు పునాదుల్ని స్థిరపరిచే శక్తి కాబోతున్న వాడు! ‘‘‘స్మృతి’ సాహిత్యం, పురాణాలు పరిమితమైన, మిడిమిడి జ్ఞానం గల వారి కల్పనలు మాత్రమే. అవన్నీ కట్టుకథలు, తప్పుల తడకలతో నిండినవీ, వర్గ ప్రయోజనంతో, అసూయాద్వేషాలతో కూడినవీ’’. - స్వామి వివేకానంద: సంపూర్ణ రచనలు; సంపుటం 6; పేజీ 393-94. ఎంత సాగదీసినా కుక్కతోక వంకర వంకరేనని, ఎన్నటికీ సాఫీగా మారదని తెలుగువారి సామెత! అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంది వచ్చింది గదా అని, దాన్నెలాగైనా, ఎందుకైనా వినియోగించుకోవచ్చని బీజేపీ (ఎన్డీయే), సంఘ్ పరివార్లు భావించాయి. దాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో విజయావకాశాలను పెంచుకోవచ్చని భావించాయి. ఎన్నికల ప్రచారంలో ‘‘అభివృద్ధి’’ ఎజెండాను ఎన్నికల ప్రచారంలో తెగ ‘ఊదర’ కొట్టాయి. అధికారంలోకి వచ్చింది మొదలు, ఆ ‘‘అభివృద్ధి’’ ఎజెండాను అవతల పెట్టి, రోజుకొక తీరులో భారత సమాజాన్ని చీల్చికూర్చునే అజెండాను ముందుకు నెడుతూవస్తున్నాయి! అధికార నిర్వహణలో ఒకరు ప్రత్యక్షంగా పాత్రలు పోషిస్తుంటే, మరొకరు పరోక్ష సారథులుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎజెండా మాత్రం ఒకటే. కాషాయరంగు మాత్రం మారదు! దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టు... రంగుమార్చకుండానే దిక్కుమార్చి ప్రజాబాహుళ్యాన్ని మోసగించే పార్టీలలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ వర్గం ఒకటి. ‘‘మతం వేరైతేను ఏమోయ్? మనసులొకటై మనుషులుంటే జాతియన్నది లేచి పెరుగును’’ అన్న గురజాడ మహాకవి మాటకు బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడెవడైనా వెంటనే స్పందించాలి. ముజఫర్‌నగర్, ఆగ్రా, అలీగఢ్ అల్లర్లకు, కల్లోలాలకు కారణమైన బీజేపీ-ఆర్ఎస్ఎస్-సంఘ్ పరివార్ ముఠాలు అధికారంలో ఉండి తామే స్వయంగా బలవంతపు మతమార్పిళ్లకు తెరలేపాయి. దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టుగా ఏమీ ఎరగని ‘నంగనాచి’లా ‘‘మతమార్పిళ్లను శాశ్వతంగా అణచివేయడానికి జాతీ యస్థాయిలో చట్టాన్ని రూపొందించాల’’ని ప్రతిపాదిస్తునాయి. అసలు ఇప్పుడు మతమార్పిళ్లకు సాహసించింది ఎవరో తేల్చకుండానే బలవంతపు మత మార్పిళ్ల గురించి గగ్గోలు చేస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో కేంద్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన తర్వాత ‘‘మోదిత్వ’’ రాజకీయంతో, ‘హిందూత్వ’ నినాదం కింద బీజేపీ ప్రభుత్వం గజ్జెకట్టింది! ఈ ముఠా కింద పనిచేసే వారిలో రాష్ట్రాల గవర్నర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులూ ఉన్నారు. వీళ్లకి రాజ్యాంగంతో నిమిత్తం లేదు, చట్టం ముందు అందరూ సమానులేనన్న నిబం ధనతో గాని, మతాతీత లౌకిక (సెక్యులర్) వ్యవస్థ లక్ష్యంతో గాని మమేకత లేదు, రాజ్యాంగంలోని ‘51-ఎ’ అధికరణ అందరికీ నిర్దేశిస్తున్న ప్రాథమిక పౌర బాధ్యతలతో నిమిత్తం లేదు. అందులోనూ దేశంలోని విభిన్న మతాల, వర్గాల, సంప్రదాయ, సుసంపన్న ఉమ్మడి వారసత్వ సంస్కృతీ విలువల్ని పరిరక్షిం చుకోవాలన్న ఆదేశం (51-ఎ-ఎఫ్) పట్ల పట్టింపు లేదు. ప్రజా బాహుళ్యంలో శాస్త్రీయ దృక్పథాన్నీ మానవత్వాన్నీ, జిజ్ఞాసను, సంస్కరణ భావాలను పెంపొం దించాలన్న ఆదేశాన్ని (51-ఎ-హెచ్) పాటించాలన్న ధ్యాస సైతం ఈ ముఠాకు, వారి ప్రతినిధులైన పాలకులకూ బొత్తిగా లేదు. రాజనీతిజ్ఞత కాదు కుటిల నీతి దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు భారతదేశ జనాభాలో అంతర్భాగమై ఉండగా, ఆ మాటకొస్తే అంత జనాభా ఉన్న దేశమే యూరప్‌లో లేని దశలో... పాత చరిత్రలు వేటినో దుమ్ముదులిపి వర్తమానాన్ని ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకోవటం, అటూ ఇటూ కూడా చరిత్ర నమోదు చేసిన వైషమ్య దశలను నెమరువేసుకుంటూ మతమార్పిళ్ల పేరిట కక్ష సాధించాలని చూడటం రాజనీతిజ్ఞత కాదు. 1925లో మతసంస్థగా జన్మనెత్తిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మత రాజకీయానికే కట్టుబడి ఉంది. దాని పిల్ల సంస్థగా, క్రమంగా ఒక రాజకీయ సంస్థగా అవత రించి, ఇప్పుడు అధికార స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లు నేడు కూడా ఆ విషయాన్ని దాచుకోలేకపోతున్నాయి. 2002లో గుజరాత్లో మైనారిటీలపై సాగించిన ఊచకోతను దేశం మరిచిపోక ముందే, ఆ కేసుల్లో సుప్రీంకోర్టు తన తుది తీర్పును ఇంకా ప్రకటించకముందే... బీజేపీ అధికార స్థానాల నుంచి మళ్లీ పాత ఎజెండానే (మతమార్పిళ్ల పేరిట) అందిపుచ్చుకోవటం శతవిధాలా గర్హనీయమైన విషయం. మరోవంక ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి మళ్లీ వివాదాస్పద రామ మందిర నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నాడు. దేశంలో దారిద్య్రంలో మగ్గుతున్న అసంఖ్యాక పేద ప్రజానీ కాన్ని బేషరతుగా ఆ దుస్థితి నుంచి బయటపడవేయడానికి మారుగా అన్య మతస్తుల్ని ‘‘హిందూత్వం’’ ముసుగులో బలవంతపు ప్రలోభాలతో మత మార్పిళ్లు చెందించడానికి బీజేపీ పరివార్ సిద్ధమవుతోంది! ‘‘ఆర్ఎస్ఎస్ మా మాతృసంస్థ కాబట్టి దాని విధానాల నుంచి మేము దూరమయ్యే ప్రసక్తేలేద’’ని నరేంద్రమోదీ మంత్రివర్గంలో సీనియర్ సభ్యుడే బల్లగుద్ది చెబుతున్నాడు! గుజరాత్ ఊచకోతలకు, సొహ్రాబుద్దీన్ దంపతుల ఎన్కౌంటర్లకు కారకులైన బీజేపీ నాయకులపై ఉన్న తీవ్రమైన కేసులు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఈ మతమార్పిళ్లతో దేశ ప్రజలలోని అన్యమతస్తుల్ని అభద్రతా భావానికి గురిచేస్తున్నారు. భారీ స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ప్రజల్ని బలవంతంగా ‘హిందువులు’గా మార్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీలోని ‘హిందూత్వ’ శక్తులకు సందేశాలిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి మోదీ గానీ, అతని కేబినెట్ గానీ, పార్టీగా బీజేపీ గానీ ఈ ఘటనలపై స్పందించడం లేదు. ఇందులో భాగంగానే, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ‘ధరమ్ జాగరణ్ సమితి’ పేరిట ఉన్న ‘హిందూత్వ’ ముఠా డిసెంబర్ 25న (క్రిస్మస్ పండుగ) ఇంత వరకూ ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ‘మతమార్పిడి శిబిరాన్ని’ నిర్వహించబోవడమంటే... భారతీయ సమాజాన్ని కక్షల కుంపటిగా మార్చడానికి పరివార్ వర్గం సిద్ధమయినట్టేనని భావించక తప్పదు. ‘హిందూత్వం’లోకి మతమార్పిడికి ముస్లింలకైతే తల ఒక్కింటికి రూ.5 లక్షలు, క్రైస్తవులైతే రూ.2 లక్షల చొప్పున అవసరమనీ, ఇది ‘ఖరీదైన’ వ్యవహారం కాబట్టి అంత డబ్బు అవసరమనీ చెబుతూ తేదీ పాడూ లేని కరపత్రాలను, ఉత్తరాలనూ ‘జాగరణ్ సమితి’ అధిపతి రాజేశ్వర్‌సింగ్ అలీగఢ్‌లోని కుటుంబాలకు పంచడం మరో వివేషం.! వివేకానందుడు, మోదీ భిన్నధ్రువాలు ఈ మతమార్పిళ్ల విషయంలో బెంగాల్ నరేంద్రనాథ్ (స్వామి వివేకానంద)కు, గుజరాత్ నరేంద్రమోదీకి మధ్య భావాలలోనూ, ప్రవర్తనలోనూ ఆకాశానికీ, భూమికీ మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. బెంగాల్ నరేంద్రుడు దేశభక్తుడూ, సెక్యులర్ భావదీప్తి గల సమున్నత వ్యక్తి. కాగా, గుజరాత్ నరేంద్రుడు సెక్యులర్ వ్యతిరేకి, ‘పురోభివృద్ధి’ పేరు చాటున మతైక దృష్టితో భారతీయ సమాజం చీలికకు పునాదుల్ని స్థిరపరిచే శక్తి కాబోతున్నవాడు! మతమార్పిళ్లు ఎందుకు, ఎలా చరిత్రలో జరుగుతాయో శాస్త్రీయంగా నేలతల్లి సాక్షిగా స్వామీ వివేకానం దుడు ఇలా వివరించాడు: ‘‘భారతదేశంలోని నిరుపేద ప్రజా బాహుళ్యంలో అనేక మంది మహమ్మదీ యులుగా ఎందుకు ఉండవలసి వచ్చింది? వాళ్లందరినీ ఎవరో కత్తి చూపి తమ మతంలోకి మార్చుకున్నారని చెప్పడం బుద్ధిలేని మాట. ఎందుకంటే, అంత పెద్ద సంఖ్యలో భారత పేదలు జమిందారుల నుంచీ, భూస్వాముల నుంచీ పురోహిత మతాధిపతుల నుంచి విముక్తి పొందాలని భావించారు. ఫలితంగానే వ్యవసాయకులైన బెంగాల్ సాగుదార్లలో హిందువులకన్నా మహమ్మదీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కునారిల్లిపోతున్న అసంఖ్యాక బడుగువర్గాల ప్రజల్ని ఉద్ధరించాలన్న తలంపు ఎవడికైనా వచ్చిందా? కొలది వేల మంది పట్టభద్రులు ఒక జాతికి ప్రతినిధులు కాజాలరు, అలాగే కొలది మంది ధనికులు, సంపన్నులు మాత్రమే భారత జాతికాదు. జనాభాలో 90 శాతం మంది విద్యలేని వారే. వీరిని గురించి ఆలోచిస్తున్న వాడెవడు? ... బోధించాల్సింది విశ్వజనీనమైన మానవతను. భారత ప్రజలు తమ నెత్తికెక్కి అధికారం చలాయించే ‘బాసెస్’ను (అధిష్టానశక్తుల్ని) తోసిరాజంటూ వచ్చారు. మన ధర్మచింతనలో ప్రతీకలకూ (సింబల్స్), ఆచారాలకూ కర్మకాండలకూ చోటు లేదు. ఉపనిషత్తుల సారమంతా అదే సుమా! అంతా ఒక్కటే, అందరూ సమానమే, అదే అద్వైతం. మూఢనమ్మకాల్ని, మూఢవిశ్వాసాల్ని వదిలేయండి. ప్రకృతిలోని అద్వితీయమైన సమ్మేళనాశక్తినీ, సమతుల్యతనూ ఒక్కసారి దర్శించండి. అలాగే అన్ని మతాల సారమూ ఒక్కటే. ఈ భూమిలో పొదిగి ఉన్న సకల మతాల మహనీయ స్వరసమ్మేళనానికి దోహదం చేస్తున్న వాద్యబృందం నుంచి కావాలని ఒక వాద్య పరికరాన్ని ఎందుకు వేరు చేసి రసాభాస చేస్తావ్?’’ అని ప్రశ్నించాడు వివేకానంద! మతమార్పిళ్ల వల్ల, బహుళ జాతుల, బహుభాషల, విభిన్న మతాల బహురూపులతో కూడిన ఇండియా తన రత్నా లలో భాగమైన ఇతర రత్నాలను కోల్పోవలసివస్తుందని, ఫలితంగా మనదిగా భావిస్తున్న ‘హిందూ’ సమాజం కూడా తన ధర్మ చింతననూ కోల్పోయి శాశ్వత దైన్యంలో కూరుకుపోతుందనీ పేర్కొన్నాడు బెంగాలీ నరేంద్రుడు! అందుకే మనది జ్యోతిషం (ఆస్ట్రాలజీ) కాదు, ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ) మాత్రమేనని కూడా బోధించాడు! గుజరాతీ నరేంద్రాదులు ఈ విలక్షణమైన విజ్ఞానదాయక మైన మార్గం నుంచి ఎందుకు దూరం కావలసివచ్చిందో, ఎందుకు సహజ విచ్ఛిన్నకులుగా రూపాంతరం చెందవలసివచ్చిందో ప్రజలు తెలుసుకోగోరు తున్నారు! ఆఖరి మాట - ‘హిందూ’ శబ్దం అపభ్రంశం. పర్షియన్లకు ‘హ’కార ప్రయోగమే తప్ప, ‘స’ కారం పలకదు. అందుకని మన దేశంపైకి దూసుకొచ్చిన పర్షియన్లు ‘సింధు’ నదీ ప్రాంత నాగరికతను ‘హిందు’గా ఉచ్ఛరించడం వల్లనే, అది ‘హిందు’ శబ్దంగా వికార రూపం పొందిందని మహా పండిత రాహుల్ సాంకృత్యయన్ ఏనాడో వివరించాడు! (వ్యాసకర్త మొబైల్: 98483 18414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
కఠోపనిషత్తు
అన్ని ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు ఉండే స్థానం ప్రత్యేకమైంది. ఇందులో యోగం గురించి, ముఖ్యమైన వేదాంత భావాల గురించి చర్చ ఉంటుంది. అత్యంత రమణీయమైన కవిత్వం ఉంటుంది. ఇదంతా కథా రూపంగా చెప్పటం ఉంటుంది. ప్రాచ్య, పాశ్చాత్య పండితుల్ని విశేషంగా ఆకర్షించిన ఉపనిషత్తు ఇది. స్వామి వివేకానందుడు తరచు ప్రబోధించే ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత’ ఈ ఉపనిషత్తు నుంచి గ్రహించిందే. నచికేతుడు అనే బాలుడు మృత్యుదేవత అయిన యముడి దగ్గరకు వెళ్లి చావు పుట్టుకల మర్మం అడిగి తెలుసుకోవటం సూక్ష్మంగా ఇందులోని కథ. ఉపనిషత్తులోని కొన్ని ముఖ్యమైన శ్లోకాల సారాంశం. ఆత్మజ్ఞానం కలిగించేదీ, శుభం ప్రసాదించేదీ శ్రేయోమార్గం. అందుకు భిన్నమైం ది ప్రేయోమార్గం. బుద్ధిమంతుడు చక్కగా రెండింటినీ బేరీజు వేసి మేలనుకొన్న మొదటి దాన్ని ఎన్ను కుంటాడు. లోభాసక్తులకు లొంగి పోయిన బుద్ధిహీనుడు రెండో దానికి మొగ్గుతాడు.{శేయోమార్గం గురించి వినటానిక్కూడా చాలా మం ది నోచుకోరు. వినిన వాళ్లకు అర్థం చేసుకొనే ఓపిక ఉండదు. అట్లాంటిది, దాన్ని గురించి ఉపదేశించే ఆచార్యుడు నిజంగా అద్భుతమైన వాడు. దాన్ని గ్రహించగలిగిన శిష్యుడూ అంతే అద్భుతమైనవాడు. వేదాలు చదివీ, బుద్ధికి పదును పెట్టీ, పుస్తక పాం డిత్యం పెంచుకొనీ, ఆత్మ దక్కుతుందనుకోవటం అజ్ఞానం. స్వయంగా ఆత్మ ఎవరిని వరిస్తే, వారికి అది దక్కుతుంది. తనకు తానుగా తన తనువును ఆవిష్కరించుకొంటుంది. జ్ఞానికి జాతి మతకుల భేదాలుండవు. వాటన్నింటినీ ముద్దగా చేసి నమిలి మింగేస్తాడు. అతడికి మృత్యు భయం ఉండదు. దాన్ని బాగా నూరి పచ్చడిలా నంజుకుంటాడు. ఒకే ఒక అగ్ని అది మండించే పదార్థాల రూపాలను పొందినట్లు, ఒకే ఒక ఆత్మ అది ప్రవేశించిన వస్తు వుల రూపాలను పొందుతుంది. {పపంచానికంతటికీ కన్ను వంటివాడైన సూర్యుడికి చూసేవాళ్ల కళ్ల మాలిన్యం ఎలా అంటదో, సకల జీవుల హృదయాల్లో ఉన్న ఆత్మకు ఆ జీవుల దుఃఖం అలా అంటదు. సంసారమనే ఈ సనాతన అశ్వత్థ వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉన్నాయి. కొమ్మలు కిందికి విస్తరిం చి ఉన్నాయి. అదే శుద్ధం అదే బ్రహ్మం అదే అమరం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి.హృదయంలో ఉన్న అంతరాత్మ అయిన పురుషుడు బొటనవేలంత వాడు. గడ్డి నుండి లోపలికి పోచను విడదీసినట్లు పట్టుబట్టి అతణ్ణి శరీరం నుంచి వేరుచేయాలి. అతడు పరిశుద్ధుడు, అమరుడు అని తెలుసుకోవాలి. దీవి సుబ్బారావు -
కార్పొరేట్లు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి
గవర్నర్ నరసింహన్ పిలుపు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కంపెనీలు నైతిక విలువలకు కట్టుబడి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను నిర్వర్తించాలని, దాన్ని ఒక భాగంగా మలుచుకోవాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఎంతో కొంత సొమ్ము విరాళంగా ఇచ్చి దాన్ని సామాజిక బాధ్యత అనుకుంటే తప్పని హితవు పలికారు. ఆ పద్ధతిని విడనాడి స్ఫూర్తివంతమైన, ప్రయోజకరమైన బాధ్యతను చేపట్టాలన్నారు. మంగళవారం రామకృష్ణ మఠంలో ‘సహయోజన’ పేరుతో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ అంశంపై జరిగిన సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ఉద్వేగంగాప్రసంగించారు. సామాజిక బాధ్యత ఒక్కరోజు సంబంధం కాదని,. కంపెనీల కార్యకలాపాలు జరిగినన్ని రోజులు దీర్ఘకాలికంగా దాన్ని కొనసాగాలని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద బోధనలను ఆచరణలోకి తీసుకొచ్చి చిరకాలం నిలిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. ‘ఫండ్స్ ఇవ్వమని ఏ ఒక్కరికి చెప్పట్లేదు. ఆస్పత్రి నిర్మించి మంచి వైద్యులతో నడిపించండి. ఉచితంగా వైద్యం అందించండి. అలాగే రెండు రాష్ట్రాల ఏజెన్సీల్లో మెడికల్ కాలేజీలు నడపండి. సబ్సిడీపై విద్యార్థులకు చదువు అందించండి. ఇలాంటి వి ఎందుకు చేయడం లేదు? ప్రతి కార్పొరేట్ కంపెనీ 10 గ్రామాలను ఎందుకు దత్తత తీసుకోకూడదు. నిర్మల్ గ్రామం కాన్సెప్ట్ తీసుకుని పరిశుభ్రత, నీటి సరఫరా, మరుగుదొడ్లు, ఉచిత విద్య, సౌర విద్యుత్ వంటివి సమకూర్చండి. పల్లెల్ని అర్బన్ ఏరియాగా మార్చండి. రామకృష్ణ మఠం ఉచిత ంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం గ్రామాలకు మొబైల్ క్లినిక్‌ల ద్వారా ఉత్తమ వైద్యులతో సేవ చేస్తోంది. మరి ఈ బాధ్యతను కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు చేపట్టడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. శాంతా బయోటిక్స్ సీఎండీ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో పెట్టుబడి, లాభాలు, వ్యాపార విస్తరణతోపాటు ఎంత మందికి సేవ చేశారన్న అంశం కూడా ఉండాలని చెప్పారు. పేదలు, రోగుల పట్ల దయాగుణం కాకుండా సేవాభావం కలిగి ఉండాలని వివేకానంద హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ స్వామి బోధామయానంద అన్నారు. రామకృష్ణమఠం అధ్యక్ష స్వామి జ్ఞానాధనంధజి, పెన్నార్ ఇండస్ట్రీస్ చైర్మన్ న్రుపేంద్ర రావు మాట్లాడారు. కార్యక్రమంలో వీఐహెచ్ఈ డిప్యూటీ డెరైక్టర్ ఏఎస్ మూర్తి, కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిగ్గు తేల్చే పరీక్ష
సందేశం హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది. గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు. వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు. ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు. - రెంటాల జయదేవ -
నా కల నిజమౌతుంది
‘‘ముంబై, చెన్నై నగరాలలోని రికార్డింగ్ థియేటర్లకు దీటుగా హైదరాబాద్‌లోనూ ఓ థియేటర్ నెలకొల్పాలనుకుంటున్నా. గత కొన్నాళ్లుగా నాకున్న కల ఇది. త్వరలోనే అది నెరవేరుతుంది’’ అని చక్రి చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చక్రి పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘నాకు స్వామి వివేకానంద ఆదర్శం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నా ప్రతి పుట్టినరోజుకి అన్నదానం, రక్తదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. కెరీర్ గురించి చెప్పాలంటే.. నా వరకూ వచ్చిన అన్ని అవకాశాలనూ ఒప్పుకుని ఉంటే ఇప్పటికి 120, 130 సినిమాలు పూర్తి చేసేవాణ్ణి. దాంతో పాటు కొత్త సంగీతదర్శకుల రాకతో కొంచెం వెనకపడ్డాను. వాస్తవానికి ‘రేయ్’ విడుదలై ఉంటే, ఇంకా బిజీ అయ్యుండేవాణ్ణి. ఎందు కంటే, సంగీత ప్రాధాన్యంగా సాగే సినిమాల్లో మంచి స్థాయి ఉన్న సినిమా అది. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న ‘షేర్’ నాకు వందవ సినిమా అవుతుంది. హరిరామ జోగయ్య రూపొందిస్తున్న ‘టామీ’, మరో రెండు సినిమాలకు పాటలు స్వరపరుస్తున్నా. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుల కోసం ఓ యూనియన్ ప్రారంభించాలనుకున్నా. కానీ, సహకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నా’’ అని తెలిపారు. త్వరలో తన మిత్రుల ఆధ్వర్యంలో ‘పంచమిత్ర’ అనే నిర్మాణ సంస్థ మొదలవుతుందని, దానికి వెన్నుదన్నుగా నిలవబోతున్నానని ఈ సందర్భంగా చక్రి వెల్లడించారు. -
ఇంతకీ, ఏమాశిస్తున్నామ్?
పద్యానవనం విద్యనిగూఢ గుప్తమగు విత్తము, రూపము మానవాళికిన్ విద్యయశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే! విద్య... ఇది విచిత్రమైన, విస్తృతార్థం కలిగిన పదమనిపిస్తుంది. ఇంతకీ విద్య అంటే ఏంటి? ‘విద్య అంటే తెలియదా! అవ్వ!! విద్య అంటే... చదువు’ అంటారు. చదువు అంటే ఏంటి? మళ్లీ ప్రశ్న. జ్ఞానాన్ని చదువంటారా? అదీ సంపూర్ణార్థం కాదేమో? చదువుకు ఎందరెందరో, ఎన్నెన్నో నిర్వచనాలిచ్చారు. ఒక పదబంధంలో చెప్పజాలనంత, ఒక వాక్యంలో బంధించజాలనంత విస్తృతార్థం ఉంది కనుకే సర్వకాలాల్లోనూ ఇదెంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదివావ్ ఏం లాభం?’’ అని పెదవి విరిచే సందర్భాలు, ‘‘చదవక ముందు కాకరకాయ, చదివాక గీకరకాయ’’ అనే దెప్పిపొడుపులు వింటూనే ఉంటాం. కానీ, ఇవి అరుదయిన విలోమ సందర్భాలు మాత్రమే! అత్యధిక సందర్భాల్లో విద్య మనిషికి ఒక దోహదకారిని గానే ఉంటూ వస్తోంది. విద్య అంటే ఏంటో సంపూర్ణంగా నిర్వచించలేనపుడు, ఒకింత తెలివిగా కన్యాశుల్కంలో గిరీషం చెప్పినట్టు, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్’ అని సాపేక్షంగా చెప్పాలి. మనకున్న పాటి తెలివితేటలు ఎదుటివాడికి లేవనిపించినపుడు, ‘విద్య రాని వాడు వింత పశువు’ అని ఓ సామెత వదలాలి. లాటిన్లో ‘ఎడ్యూస్’ అంటే మనిషి తనలోకి తాను చూసుకొని తనను తాను సమగ్రంగా అర్థం చేసుకోవడం. దాన్నుంచి పుట్టిందే ‘ఎడ్యుకేషన్’ అంటారు. ‘మనిషిలో ఉండే దైవత్వపు బహుముఖీన ఆవిష్కరణే విద్య’ అని వివేకానంద స్వామి వివరించారు. ఆధునికుల నిర్వచనాలకు ఏ మాత్రం తీసిపోని, సమగ్రమైన, సముచితమైన నిర్వచనాలు, వివరణలు ఎంతో పూర్వకాలం నుంచే భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. మచ్ఛుకు ఈ పద్యమే చూడండి! భర్తృహరి సంస్కృత సుభాషితాలను ఏనుగులక్ష్మణ కవి తెలుగులోకి అనువదించినపుడు చెప్పారీ పద్యాన్ని. పండంటి విద్యకు పది లక్షణాలన్నట్టు ముఖ్యమైన విశేషాలను చెప్పాడు. విద్య రహస్యంగా దాటిపెట్టిన నిధి అంటాడు. అప్పుడున్న పరిస్థితుల్లో, నాటి స్త్రీ-పురుష సంబంధాలు, హెచ్చు-తగ్గు భావనల వల్లనేమో విద్య పురుషులకు సౌందర్యం వంటిదంటాడు. ఏ రంగంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోని ఈ రోజుల్లో ఆ పదాన్ని పురుషులకే పరిమితం చేయకుండా, స్వల్పంగా మార్చి, ‘పూరుషాళికిన్’ అనే చోట ‘మానవాళికిన్’ అనే పాఠబేధంతో చెప్పుకుంటే నష్టం లేదనిపిస్తుంది. విద్య వల్ల కీర్తీ, సౌఖ్యం లభిస్తాయంటాడు. విద్య గురుడని కూడా చెబుతాడు. ‘గు’ అంటే చీకటి, ‘రు’అంటే తొలగించేవాడు, అంటే అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానమనే వెలుగువైపు మనిషిని నడిపించడంలో విద్య కీలక భూమిక నిర్వహిస్తుంది కనుక దీన్ని నేరుగా గురువు అవవచ్చు. అప్పటివరకు పరిచయం లేని పరాయిదేశాల్లో కూడా పనికానిచ్చుకోవాలన్నా, రాణించాలన్నా.... కాస్త తెలివి తేటలు, కొంచెం చదువు ఉండాల్సిందే అనటంలో ఏ సందేహమూ లేదు. ఈ రోజున మన భారతీయ యువత ప్రపంచం నలుమూలలా విస్తరించి మంచి మంచి హోదాల్లో ఉన్నారంటే, అందుకు వారి కఠోర శ్రమ, విద్యావికాసం, తెలివితేటలే కారణం అన్నది సుస్పష్టం. విద్యతో పోల్చదగిన ధనమేదీ ఈ భూమ్మీద లేదంటారు విజ్ఞులు, ఆ మాటకూడా చెప్పారిక్కడ. నాటి రాజులే కాదు, నేటి పాలకులు కూడా విద్యాబుద్ధులు కలిగిన వారిని తప్పనిసరిగా ఆదరించాల్సి ఉంటుంది. అందుకే, మారుతున్న ప్రస్తుత సమాజంలోనూ విద్య లేని వాడినసలు మనిషి గానే పరిగణించరు. ‘‘ఎన్ని చదువులు చదివి, ఎంత నేర్చినగాని హీనుడవగుణంబు మానలేదు’ అన్న శతకకారుని మాటల్ని బట్టి, అప్పటివరకున్న అవగుణాలు చదువు వల్ల తొలగిపోవాల్సిందే(హీనుని విషయంలో తప్ప)అని కూడా మనం గ్రహించాలి. ‘‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదవునిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్’’ అని మారద వెంకయ్య కవి భాస్కర శతకంలో చెప్పిన మాట అక్షర సత్యం. చదవుకు ఓ గొప్ప నిర్వచనం అయిదారు వందల ఏళ్ల కింద శ్రీమద్భాగవతంలో పొతన చెప్పాడు. రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని గురువుల వద్ద విద్యాభ్యాసానికి పంపుతూ ఒక మాటంటాడు. ‘‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గల్గున్....’’ ఎంత గొప్ప మాట! చదువని వాడు అజ్ఞానిగా నలుగురు దృష్టిలో పడిపోతాడనే కాకుండా చదువు యొక్క అంతిమ లక్ష్యమేమిటో కూడా చెప్పాడు పోతన. చదువు కేవలం ఉద్యోగం కోసమో, ఉపాధికోసమో, మరో సంపాదన కోసమో కాదట! ‘‘చదివిన సత్, అసద్ వివేక చతురత కల్గున్....’’ అంటే, ఏది మంచి-ఏది చెడు తేల్చుకోగలిగిన చాతుర్యం మనిషికి చదువు వల్ల అబ్బుతుందట! భేష్!! విద్య ఉద్దేశం, అంతిమ లక్ష్యం కూడా ఇదే!! - దిలీప్‌రెడ్డి -
నవతరంగం
నేటి యువత చేతిలో..నేతల భవిత నిర్ణయాత్మక శక్తిగా మారిన నవతరంగం జిల్లాలోని ఓటర్లలో పది శాతం వారే .. యువనాయకత్వం కోసం ఎదురుతెన్నులు వరుస ఎన్నికల్లో విశ్వసనీయతకు పెద్ద పీట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు మరువలేం అంతరంగ ఆవిష్కరణలో యువ గళం... ‘దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది..’ అన్నారు స్వామి వివేకానంద. ‘శక్తి అంతా మీలోనే ఉంది.. ధీరులై లేచి నిలబడండి..’ అంటూ పిలుపునిచ్చారు. అవును.. యువ శక్తి అమోఘమైనది. నవతరం ఆలోచనలు ఎంతో విశాలమైనవి. భావి నిర్దేశకులు వీరే.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర వీరిదే. తమ ప్రతినిదులను ఎన్నుకునే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో తమ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడి వెన్నంటి నడిచేందుకు యువత సమాయుత్తమవుతోంది. తమ సమస్యలపై నిగ్గదీసేందుకూ సిద్ధమవుతోంది. అదే విధంగా తమకు మేలు చేసిన ‘మారాజు’లను మరిచిపోబోం.. అంటూ ప్రతినబూనుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదీ యువగళం.. -
దైవం మానవ రూపంలో...
మార్చి 3, సోమవారం శ్రీరామకృష్ణ పరమహంస జయంతి) స్వామి వివేకానంద లాంటి ఎందరినో తన ఉపదేశాలతో మహామహులుగా తీర్చిదిద్ది మానవాళికి అందించారు రామకృష్ణ పరమహంస. భక్తి, దైవం లాంటి ఎన్నో అంశాల గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా శతాబ్దిన్నర క్రితం ఆయన చెప్పిన మాటలు ఇవాళ్టికీ స్మరణీయాలు, ఆచరణీయాలు. వాటిలో కొన్ని... ఉన్నాడు... అతడున్నాడు... అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదనీ అంటే శుద్ధ తప్పు. పిలిస్తే పలుకుతాడు: ఏకకాలంలో అటు సగుణుడూ, ఇటు నిర్గుణుడూ, అటు నానారూపధారి, ఇటు ఏ విధమైన రంగూ రూపం లేనివాడూ భగవంతుడు. ఏ మతమైతే ఏమిటి? ఏ మార్గమైతే ఏమిటి? అందరూ ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి, ఏ మతాన్నీ, మార్గాన్నీ ద్వేషించకూడదు. కించపరచకూడదు. కులం, మతం ఏదైనా సరే, ఎవరైనా, ఎలాగైనా ఆ దేవదేవుణ్ణి పిలవచ్చు. మనస్ఫూర్తిగా, హృదయాంతరాళంలో నుంచి పిలిస్తే చాలు... ఆయన నిశ్చయంగా పలుకుతాడు. దర్శనమిస్తాడు. మరి, అలాంటప్పుడు తీర్థయాత్రలు చేయడం, మెడలో మాలలు ధరించడం మొదలైన ఆచారాలన్నీ ఎందుకని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో అవన్నీ అవసరం. అయితే, జిజ్ఞాసువులు క్రమంగా బాహ్యాడంబరాలన్నిటినీ దాటుకొని వస్తారు. అప్పుడిక కేవలం భగవన్నామ జపం, స్మరణ, చింతనే మిగులుతాయి. అందరూ ఆయనే ... వయస్సు ఎంత మీద పడ్డా, కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద మమకారం, ఈ బంధాల పట్ల వ్యామోహం పోనివారు ఎంతోమంది ఉంటారు. తీర్థయాత్రకు వెళ్ళినా వారి ధ్యాస అంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే. అలాంటివాళ్ళు తమ బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళనే సాక్షాత్తూ దైవస్వరూపులని భావించడం మొదలుపెట్టాలి. అప్పుడు మనుమరాలి మీద ప్రేమ అంతా ఆ దేవి మీద భక్తిగా మారుతుంది. పిల్లను ఆడిస్తున్నా, అన్నం పెడుతున్నా, చివరకు నుదుట బొట్టు పెడుతున్నా అంతా ఆ అమ్మవారికే చేస్తున్నానని ఊహించుకోవాలి. దాని వల్ల ఇంట్లోనే ఉన్నప్పటికీ, దైవ సాన్నిధ్యంలో ఉన్న భావన, లాభం కలుగుతాయి. అందుకే, తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితులు - ఇలా ఎవరినీ ప్రేమించినా సరే, ఆ వ్యక్తి సాక్షాత్ భగవత్ స్వరూపమేననీ, దేవుడి అవతారమేననీ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంతో సులభమైన ఈ మార్గం మన మనస్సునూ, జీవితాన్నీ మాలిన్య రహితం చేసుకొనేందుకు ఉపకరిస్తుంది. - డా॥రెంటాల జయదేవ -
యువతరానికి స్ఫూర్తి ప్రదాత వివేకానంద
కారేపల్లి, న్యూస్‌లైన్: నేటి యువతరానికి స్వామి వివేకానంద స్పూర్తి ప్రదాత అని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహోన్నత శక్తి స్వామి వివేకానంద అని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెం టరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా కారేపల్లి క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిద్రాణంలో ఉన్న భారత యువశక్తిని మేల్కొలిపి, భారత జాతి అభివృద్ధికి తగు సూచనలు, సందేశాలు అం దించిన దేశభక్తుడు వివేకానంద అని కొనియాడారు. భారత దేశ సంస్కృతిని పాశ్చ్యాశ్చ దేశాలకు పరిచయం చేశారని అన్నారు. నేటి యువ త వివేకానందను స్పూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహక కమిటీ సభ్యులు తనను పిలవడం అదృష్టమని అన్నారు. అనంతరం కారేపల్లి క్రాస్‌రోడ్డు సెంటర్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రాస్‌రోడ్డు కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు చేసి జాతి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జయంతి ఉత్సవ సమితి జిల్లా కమిటీ సభ్యులు, ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ కె ఉపేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు నంబూరు వెంకట సుబ్బారావు, మోతుకూరి నారాయణరావు, కీసర జయపాల్‌రెడ్డి, విశ్వనాధపల్లి సర్పంచ్ అజ్మీర కాంతి, సొసైటీ డెరైక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ముఖ్యంగా కీలకమైన బాధ్యతలను స్వీకరించేందుకు యువత ముందుకు రావాలని కేంద్ర పథకాల క్షేత్ర ప్రచార అధికారి డాక్టర్ జి.కొండలరావు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యువజన సరీసుశాఖ (సెట్‌శ్రీ), నెహ్రూ యువకేంద్రం సౌజన్యంతో యంగ్‌ఇండియా సారధ్యంలో ఆదివారం ఎన్వైకేలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత స్వామి వివేకానంద చిత్ర పటానికి జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం యువతీయువకులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సంస్కృతి, జాతి ఔన్నత్యం, మాతృభాషాభియానం,త్యాగం, సేవ వంటి గుణాలు వ్యక్తిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతాయన్నారు. యువజన వారోత్సవాల కన్వీనర్ కేవీఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికీ లేని గొప్ప యువశక్తి భారతదేశానికి ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. యువత శ్రమించేతత్వం విషయాసక్తి పెంచుకోవాలని హితవు పలికారు. గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ చైర్పర్సన్ గీతాశ్రీకాంత్, విద్యాసంస్థల అధినేత జామి భీమశంకర్లు మాట్లాడుతూ వివేకానందుడు భారతజాతికి అందించిన ప్రబోధాల సంపదను యువత సొంతం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. యంగ్‌ఇండియా డెరైక్టర్ మందపల్లి రామకృష్ణారావు కార్యక్రమానికి నేతృత్వం వహించగా, సెట్‌శ్రీ మేనేజర్ ఎ.మురికయ్య, వైష్ణవి సేవా సంస్థ అధ్యక్షుడు ఎస్.సత్యం, డి.మోహనరావు, సీహెచ్ శ్రీనివాస్, ఎన్‌వైకే ప్రతినిధులు బి.జోగారావు, లోచన బాబు, కుమారస్వామి పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 80 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. -
వివేకానందుడి స్ఫూర్తితోనే గిన్నిస్ రికార్డు
=యాత్రకు స్వాగతం పలికిన విద్యార్థులు =రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ =జేఎన్ఎస్లో విద్యార్థి, యువ, భక్తి సమ్మేళనం =పాల్గొన్న కలెక్టర్, డీఐజీ, అర్బన్ ఎస్పీ వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : స్వామి వివేకానందుడి వేషధారణలు.. చిన్నారుల కోలాటాలు.. నృత్యాలు.. చిందు కళాకారుల ప్రదర్శనలు.. మహిళల మంగళహారతుల నడుమ స్వామి వివేకానందుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి యాత్ర అగ్రభాగాన ప్రదర్శన నిర్వహించారు. స్వామి వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన రథయాత్ర జిల్లా కేంద్రానికి సోమవారం రాత్రి చేరింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రథయాత్ర జిల్లాకు సందర్భాన్ని పురస్కరించుకుని హన్మకొండ జేఎన్ఎస్లో రామకృష్ణ మిషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి, యువ, భక్తి సమ్మేళనం నిర్వహించారు. ‘స్వామి’ స్ఫూర్తితో చరిత్ర సృష్టించాలి రామకృష్ణ మిషన్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ జి.కిషన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వివేకానందుడిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని కొత్త చరిత్ర సృష్టించాలని అన్నారు. యువత పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే వివేకానందుడి రచనలు చదివి స్ఫూర్తి పొందాలన్నారు. ప్రపంచ దేశాల్లో వివేకానందుడి రచనలు చదివిన వారు ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించి చరిత్ర సృష్టించారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం సంచాలకుడు స్వామి బోధమయానందజీ మహరాజ్ మాట్లాడుతూ దేశం తరఫున ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్లి దేశ కీర్తి ప్రతిష్టలను పాశ్ఛాత్య దేశాలు గర్వించదగ్గ స్థాయిలో సనాతన ధర్మాన్ని పరిచయం చేశారని అన్నారు. స్వామీజీ రథయాత్రకు ప్రజలు, యువత, విద్యార్థులు, అన్ని వర్గాల వారు అపూర్వ రీతిలో ఘన స్వాగతం పలికారన్నారు. గుజరాత్ వడోదర రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి నిఖిలేశ్వరానందజీ మహరాజ్ మాట్లాడుతూ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినా పట్టువదలకుండా లక్ష్యాన్ని ఎంచుకున్న అరుణిమసిన్హాను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు గుజ్జుల నర్సయ్య, లక్ష్మణమూర్తి, సత్యనారాయణరెడ్డి, పాండురంగారావు, వెంకటేశ్వర్లు, జిల్లా వడుప్సా అధ్యక్షుడు భూపాల్‌రావు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మహతి స్కూల్ విద్యార్థులు స్వామీజీ ఉత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని మహతి హైస్కూల్ విద్యార్థులు స్వా మీజీ వేషధారణలో రావడం పలువురిని ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ పింగిళి హేమ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతోపాటు పాల్గొన్నారు. సమ్మేళనానికి వివిధ పాఠశాలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. జిల్లాకే ప్రత్యేకతను కలిగిన పేరిణి నృత్యాన్ని రంజిత్‌కుమార్ శిష్య బృందం ప్రదర్శించారు. -
'స్వామి వివేకానంద' సినిమా స్టిల్
-
చిన్న పనినైనా శ్రద్ధాసక్తులతో చేయాలి
భారతీయ ఆధ్యాత్మిక చేతన స్వామి వివేకానంద. తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రేరణతో ఆయన ప్రపంచమంతటా పర్యటించారు. యువశక్తిని ప్రేరేపించే విధంగా ఎంతో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రబోధాలు చేశారు. కొన్నితరాలకు సరిపోయేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని పంచారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు మంచి ముత్యపు మాలికలు!ఆ మాలికలనుంచి రాలిన కొన్ని మేలిముత్యాలివి. శ్రద్ధ, ధీరత్వం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందండి. అలా జ్ఞానం పొందిన మీ జీవితాన్ని ఇతరుల మేలుకై త్యాగం చేయండి. ఇదే నా ఆకాంక్ష, ఆశీర్వాదం. మనసు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమౌతుంది. మనసును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. చేపట్టిన కర్తవ్యం మధురంగా తోచటం చాలా అరుదు. చేదుగా తోచే పనిని చెయ్యాలంటే దాని మీద గొప్ప ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమను దాని చక్రాలకు కందెనగా పూసినప్పుడు మాత్రమే ఈ కర్తవ్యమనే యంత్రం సాఫీగా నడుస్తుంది. జీవించినా, మరణించినా మీ బలం మీదనే ఆధారపడండి. ప్రంచంలో పాపమనేది ఉంటే అది బలహీనతే కానీ మరొకటి కాదు. అన్ని రకాల బలహీనతల్ని విడనాడండి. మానవ చరిత్రను పరికిస్తే, ఉన్నతులైన స్త్రీ, పురుషుల జీవితాల్లో అన్నింటికంటే ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్లు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జన్మించారు, ఉన్నతులై నిలిచారు. నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు కానీ ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండటం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది. సౌశీల్యం, జ్వాజ్వల్యమానమైన ప్రేమ, నిస్వార్థాలే జీవితంగా గల కొంతమంది వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఉంది. కాబట్టి నీలో ఆ గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నించు. మనిషికి, మనిషికి మధ్య గల భేదం, విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతుణ్ణి గాను, మరొకర్ని దుర్బలునిగాను, అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే. అసూయను, తలబిరుసునూ విడనాడండి. పరహితం కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మనదేశపు తక్షణ అవసరం ఇది. పరిపూర్ణ అంకితభావం, అతిసునిశితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం, వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మొత్తం ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది. ప్రపంచానికి కావలసింది సౌశీల్యం, ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై, నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావాలి. పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే... పురోగమించడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసినప్పుడే మనలోని సంకల్ప శక్తి బయటకు వస్తుంది. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా వెనక్కు చూడకుండా పురోగమించాలి. అందుకు మనకు కావలసినవి శక్తి, పట్టుదల, ధైర్యం, సహనం. అప్పుడే మహాకార్యాలను సైతం సులువుగా సాధించగలుగుతాం. సింహసదృశులైనటువంటి కొద్దిమంది ప్రపంచాన్ని జయిస్తారు కానీ లక్షలకొద్దీ గొర్రెల మందలు కాదు. మీ మనసులో, మాటలలో గొప్ప శక్తిని ఉంచుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అంటే నీలోని భగవంతుని తక్కువ చేయడమే! భగవంతుని వైపు వెళ్లేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం. మనల్ని అధోగతి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు. నీవు శ్రద్ధాభావంతో ఏం చేసినా నీకది మేలే. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతివ్యక్తి తాను చేయగల ఎంత చిన్నపనైనా శ్రద్ధతో నిర్వహించాలి. సంకల్పశక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య. మన దేశానికి కావలసింది ఇనుప కండరాలు, ఉక్కునరాలు. ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిదీ, జగత్తులోని రహస్యాలను ఛేదించగలిగేది అయిన వజ్రసంకల్పం. వీటితోబాటు మహాసముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానెనా సాధించగలిగే దృఢసంకల్పం మనకు అవసరం. - ధ్యానమాలిక -
రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదా
రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలే కారణం? సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దీనిలో పార్టీ రెండు శాఖల ఏర్పాటు, తెలంగాణ బిల్లు సహా అనేక కీలకాంశాలపై చర్చను కూడా చేపట్టాల్సి ఉంది. అయితే, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ముఠా కుమ్ములాటల నేపథ్యంలో సమావేశం వాయిదా పడినట్టు సమాచారం. ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే 2 శాఖల ఏర్పాటు వాంఛనీయం కాదని పార్టీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారమై పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలోనే వివాదం చెలరేగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వంలో ఉన్న ఓ యువనేత చెప్పిన సూచన మేరకు రాజ్‌నాథ్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టేదాకా వేచి ఉండడం మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చినట్టు సమాచారం. ర్యాలీకి అనుమతి నిరాకరణపై ఆగ్రహం.. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘దేశం కోసం పరుగు’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీజేపీ ఖండించింది. పోలీసుల తీరును దేశద్రోహ చర్యగా అభివర్ణించింది. ‘యూనిటీ ఆఫ్ ఇండియా’పై చర్చ జాతీయ వాదానికి ప్రతీకగా నిలిచిన ‘ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఇండియా’ గ్రంథానికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో చర్చాగోష్టి జరిగింది. భారత్ ఒక దేశం కాదని, భారత జాతీయత అంటూ ఏదీ లేదని బ్రిటీష్ వాళ్లు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ 1913లో భారతీయ యువ చరిత్రకారుడు రాధా కుముద్ ముఖర్జీ ఈ సైద్ధాంతిక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథానికి బ్రిటన్ ప్రధాని రామ్సేమెక్డొనాల్డ్ ముందుమాట రాశారు. ఈ చర్చాగోష్టికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఇదిలావుంటే, భారతీయ జనతా కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా టి.కృష్ణమూర్తి నియమితులయ్యారు. -
దేశం కోసం ‘పరుగు’
కవాడిగూడ/ ఖైరతాబాద్, న్యూస్‌లైన్: యువత, విద్యార్థి లోకం దేశభక్తితో పులకించింది. స్వామి వివేకానంద చికాగో సభలో ప్రసంగించిన రోజును పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ఉత్సాహంగా సాగింది. స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ పరుగులో భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అయితే పరుగుకు ట్యాంక్‌బండ్‌పై అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలు, వివేకానంద అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల్లో లుం బినీ పార్కు వద్దకు తరలించారు. అంతకుముందు బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ విశిష్టతను వివేకానందుడు ప్రపంచానికి చాటిన రోజిదని దత్తాత్రేయ కొనియాడారు. సీనియర్ న్యాయవాది రామచందర్‌రావు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా సాగిన పరుగు నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ అరవిందరావు, ఆర్ఎస్ఎస్ నాయకులు శ్యాంకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రామకృష్ణమఠం స్వామి జ్ఞానానందమయ పాల్గొన్నారు. -
మేలుకో భారత్..!
-
స్వామి వివేకానంద భోధనలు అనిర్వచనీయం
-
తత్త్వదర్శనమే జిజ్ఞాసకు పరమావధి..!
నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉత్తమ గురుశిష్యులుగా గణతికెక్కిన శ్రీరామకృష్ణ పరమహంస, భారతీయ ఆధ్యాత్మిక వాణిగా వాసికెక్కిన స్వామివివేకానందలు ఒకరితో ఒకరు ఎలా మెలిగేవారో చూద్దాం. ధ్యానసమయంలో నరేంద్రుడి మనస్సు సమీపంలోని యంత్రధ్వని చేత చెదిరిపోసాగింది. శ్రీరామకృష్ణులకు ఈ విషయం చెప్పగా... ఆయన ఆ ధ్వని మీదనే మనస్సును లగ్నం చేయమని చెప్పారు. నరేంద్రుడు (వివేకానందుడు) అలా చేయగానే ఆ విఘ్నం తొలగిపోయింది. మరో సమయంలో ధ్యానకాలంలో తనకు పూర్ణ విస్మృతి కలగటం లేదని తెలుపగా శ్రీరామకృష్ణుడు అతడి నొసట గోటితో నొక్కిపట్టి తదనుభవం మీదనే మనస్సును లగ్నం చేయమని చెప్పాడు. అలా చేశాక నరేంద్రుడు నిశ్చలసమాధి నిమగ్నమయ్యాడు. ‘‘భగవంతుడు సగుణుడా? నిర్గుణుడా? అవతారాలు యదార్థాలా? కల్పితాలా?’’ అని శ్రీరామకృష్ణ శిష్యబృందం మధ్య తీవ్ర వాదాలు చెలరేగుతుండేవి. శిష్యులు ఎంతటి తీవ్రవాదాల్లో దిగినా శ్రీరామకృష్ణులు మందలించేవారు కాదు. చర్చ సత్యకాంక్షాజనితమైతే జ్ఞానోపలబ్ధికి తోడ్పడుతుందనేది ఆయన అభిమతం. సాధన సంపత్తు లేకుంటే ఎంతటి తర్కశాస్త్ర ప్రావీణ్యమైనా నిరర్థకమని వక్కాణించేవారు. నరేంద్రుడు ఒకప్పుడు విశ్వాసం మోక్షసాధనం కాదని నిరసిస్తూ, గుడ్డినమ్మకం గురించి చర్చించసాగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ‘‘నరేన్! గుడ్డినమ్మకం అంటే ఏమిటి? నమ్మకానికి కళ్లు ఉంటాయా? నమ్మకమనేదే గుడ్డిది. నమ్మకమని కాని, జ్ఞానమని కాని చెప్పు. అంతేకాని, గుడ్డినమ్మకమనటం అర్థరహితం’’ అని బోధించారు. ‘‘సమస్త తత్త్వశాస్త్రాలూ, సమస్త విజ్ఞానమూ అనుభవలేశంతో పోల్చి చూస్తే గుడ్డినమ్మకమే! జిజ్ఞాసకు పరమావధి తత్త్వదర్శనం. అదే మన విధి. అందుకు ఎంతోకాలం తీవ్రసాధనచేయాలి’’ అని శ్రీరామకృష్ణుల అభిప్రాయం. శ్రీరామకృష్ణుల బోధనలలోని ఘనత అంతా అతడి సాధనానుభవాలతో, పవిత్రప్రవర్తనలో ఇమిడి ఉంది. శ్రీరామకృష్ణుల దివ్యజీవన ప్రభావమే అతడి ఉపదేశసౌరభం. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆయన బోధించాడంటే... తాను అలా జీవించి చూపాడు. జాతి ఔన్నత్యం, కులనైచ్యాలను మరవటానికై అత్యంత నిమ్నజాతులవారు సైతం చేయజాలని సేవక కృత్యాలను మనస్ఫూర్తిగా చేశాడు. ఆయన... వినమ్రుడు, విశుద్ధ హృదయుడు, విశ్వాతీత ప్రేమపూరితుడు. నరేంద్రుడికి అలాంటి మహనీయుడి పావనపద సేవాభాగ్యం లభించటం చేతనే లోకకల్యాణహేతువులైన గురువాక్యాలను నరేంద్రుడు ఆచరణలో పెట్టాడు. వివేకానందుడై, పాశ్చాత్యంలో దిగ్విజయోపేతుడై వేదాంత ప్రచారం గావిస్తూ శ్రీరామకృష్ణమఠ సేవాసంఘాలను కాలక్రమాన ప్రాక్పశ్చిమ ఖండాలంతటా నెలకొల్పగలిగాడు. అటువంటి గురుశిష్యులు అత్యంత అరుదు.