కారేపల్లి, న్యూస్‌లైన్: నేటి యువతరానికి స్వామి వివేకానంద స్పూర్తి ప్రదాత అని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహోన్నత శక్తి స్వామి వివేకానంద అని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెం టరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా కారేపల్లి క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిద్రాణంలో ఉన్న భారత యువశక్తిని మేల్కొలిపి, భారత జాతి అభివృద్ధికి తగు సూచనలు, సందేశాలు అం దించిన దేశభక్తుడు వివేకానంద అని కొనియాడారు. భారత దేశ సంస్కృతిని పాశ్చ్యాశ్చ దేశాలకు పరిచయం చేశారని అన్నారు. నేటి యువ త వివేకానందను స్పూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహక కమిటీ సభ్యులు తనను పిలవడం అదృష్టమని అన్నారు. అనంతరం కారేపల్లి క్రాస్‌రోడ్డు సెంటర్‌లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రాస్‌రోడ్డు కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు చేసి జాతి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జయంతి ఉత్సవ సమితి జిల్లా కమిటీ సభ్యులు, ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ కె ఉపేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు నంబూరు వెంకట సుబ్బారావు, మోతుకూరి నారాయణరావు, కీసర జయపాల్‌రెడ్డి, విశ్వనాధపల్లి సర్పంచ్ అజ్మీర కాంతి, సొసైటీ డెరైక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
యువతరానికి స్ఫూర్తి ప్రదాత వివేకానంద
Published Mon, Jan 13 2014 3:06 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement
Advertisement