స్వామీ వివేకానంద, వినోదినీ దేశాయ్, మార్గరెట్ ముర్రే, మహాత్మ అయ్యంకాళి, అష్రఫ్ అలీ తన్వీ, ఉపేంద్ర కిషోర్ రాయ్ చౌదరి, నజ్ముల్ మిల్లత్, సత్యేంద్ర ప్రసన్న సిన్హా జన్మించారు. స్వామి వివేకానంద విశ్వవిఖ్యాత భారతీయ తత్వవేత్త. అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వివేకానంద జన్మస్థలం కలకత్తా. వినోదినీ దేశాయ్ ప్రముఖ బెంగాలీ రంగస్థల నటి. ఈమె కూడా కలకత్తాలోనే జన్మించారు. ఆమె తల్లి వేశ్య. రంగస్థల దిగ్గజం గిరీశ్ చంద్ర ఘోష్ ఆమెకు గురువు
మార్గరెట్ ముర్రే జన్మించినదీ కలకత్తాలోనే. ఆంగ్లో–ఇండియన్ ఈజిప్టోలజిస్ట్, పురావస్తు పురాతత్వ పరిశోధకురాలు. బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా ఆర్కియాలజీ లెక్చరర్. మహాత్మ అయ్యంకాళి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆధునిక కేరళ పితామహులుగా పేర్గాంచారు. ఆయన అనుచరులు ఆయన్ని ‘మహాత్మ’ అని పిలిచేవారు. ఆయ్యంకాళి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఎడ్డెమంటే తెడ్డెం విధానాన్ని ఆచరించారు.
అష్రఫ్ అలీ తన్వీ ఇస్లాం మత గురువు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జన్మించారు. ఆయన జన్మించిన ఏడాదిపై అస్పష్టత ఉంది. 1862 అని కొందరు, 1863లో అని కొందరు చరిత్రకారులు రాశారు. ఇదే సందిగ్ధత వినోదినీ దేశాయ్ జన్మ సంవత్సరం పై కూడా ఉంది. 1862, 1863 అనే రెండు రిఫరెన్సులు ఉన్నాయి. ఉపేంద్ర కిశోర్ రాయ్ చౌదరి బెంగాలీ రచయిత, తైల వర్ణ చిత్రాల లేఖకుడు. బంగ్లాదేశ్‌లో జన్మించారు. న జ్ముల్ మిల్లత్ న్యాయ నిపుణులు. ప్రాచీన జామియా నజ్మియా మత విద్యాలయ స్థాపకులు. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించారు. సత్యేంద్ర ప్రసన్న సిన్హా ప్రసిద్ధ న్యాయవాది. పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌పుర్‌లో జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment