
జిన్నారం(పటాన్‌చెరు): యువతకు వివేకానంద స్ఫూర్తి అని డీసీసీ అ«ధ్యక్షురాలు సునితారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిన్నారం మండలంలోని ఇమాంనగర్‌లో శనివారం వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వివేకానందుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. పటాన్‌చెరు నియోజకర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు.
ఇమాంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకులే నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఏర్పాటవుతుందని, ఇందుకు నాయకులు కాటాశ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శశికళా, శంకర్‌యాదవ్‌లు ఉన్నారని తెలిపారు. పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జెడ్పీఫ్లోర్ లీడర్ ప్రభాకర్, నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, శంకర్ యాదవ్, శశికళ, నిర్మల, నాగేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మద్దివీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లేశ్ తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment