స్వామీ వివేకానంద ఒకరోజు హిమాలయాల్లో సుదీర్ఘమైన కాలిబాట గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నైరాశ్యంతో ఇలా అన్నాడు: ‘‘ఓ మహాశయా! ఇప్పటిదాకా ఎంతోదూరం నడిచి నడిచి అలసి సొలసి ఉన్నాను. ఇక ఎంతమాత్రమూ నేను నడవలేను. నడిచానంటే నా ఛాతీ బద్దలయిపోతుంది’’ అన్నాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమి చేసేవాళ్లం? మహా అయితే ఆ వృద్ధుణ్ణి ఎత్తుకుని భుజాన వేసుకుని అతి కష్టం మీద కొంతదూరం నడిచేవాళ్లం . లేదంటే పెద్దాయన కదా, కాళ్లు పట్టుకున్నా పుణ్యమేలే అని కాసేపు కాళ్లు నొక్కి, సేదతీర్చి అప్పుడు ఆయనని నడిపించేవాళ్లమేమో!
అయితే, స్వామి వివేకానంద అలా చేయలేదు. ఆ వృద్ధుడి మాటలను ఓపిగ్గా విని ఇలా అన్నారు:‘‘మీ కాళ్ల దిగువన చూడండి. మీ కాళ్ల కింద ఉన్న బాట, మీరు ఇప్పటి దాకా నడచి వచ్చిన బాట, మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట! అది కూడా త్వరలోనే మీ కాళ్లకింద పడిపోవడం ఖాయం’’ అన్నారు. అంతే, ఈ స్ఫూర్తిదాయక వచనాలు ఆ వృద్ధునికి కొండంత బలాన్నివ్వడంతో ఆయన తన కాలినడకను కొనసాగించాడు.
– డి.వి.ఆర్.
నడిపించిన మాట
Published Sat, Aug 25 2018 12:05 AM | Last Updated on Sat, Aug 25 2018 12:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment