నవతరంగం
నేటి యువత చేతిలో..నేతల భవిత
నిర్ణయాత్మక శక్తిగా మారిన నవతరంగం
జిల్లాలోని ఓటర్లలో పది శాతం వారే ..
యువనాయకత్వం కోసం ఎదురుతెన్నులు
వరుస ఎన్నికల్లో విశ్వసనీయతకు పెద్ద పీట
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు మరువలేం
అంతరంగ ఆవిష్కరణలో యువ గళం...
‘దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది..’ అన్నారు స్వామి వివేకానంద. ‘శక్తి అంతా మీలోనే ఉంది.. ధీరులై లేచి నిలబడండి..’ అంటూ పిలుపునిచ్చారు. అవును.. యువ శక్తి అమోఘమైనది. నవతరం ఆలోచనలు ఎంతో విశాలమైనవి.
భావి నిర్దేశకులు వీరే.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర వీరిదే. తమ ప్రతినిదులను ఎన్నుకునే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో తమ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడి వెన్నంటి నడిచేందుకు యువత సమాయుత్తమవుతోంది. తమ సమస్యలపై నిగ్గదీసేందుకూ సిద్ధమవుతోంది. అదే విధంగా తమకు మేలు చేసిన ‘మారాజు’లను మరిచిపోబోం.. అంటూ ప్రతినబూనుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదీ యువగళం..