future of the country
-
యువతపైనే దేశ భవిష్యత్తు:అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని..దేశ నిర్మాణానికి వారు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం విశాఖ వీఎంఆర్డీఏ చిల్ర్డన్ ఎరీనాలో ప్రారంభమయిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒకే ఒక హీరో స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి యువతే మార్గదర్శకమన్నారు. యువత దేశ,రాష్టాభివృద్ధి తోడ్పడాలన్నారు. యువత కనీసం వారానికోసారి చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని సూచించారు. హస్త కళాకృతులను కొని కళాకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. యువత దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. అవినీతికి తావులేకుండా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన యువత పాల్గొన్నారు. -
యువతే దేశ భవిత
రాంగోపాల్‌పేట్: దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి వుందని మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మహావీర్ చక్ర అవార్డు గ్రహీత లెప్టినెంట్ జనరల్ మహ్మద్ జాకీ అన్నారు. సోమవారం సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా వద్ద సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు వారి చిత్రపటాల వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లెప్టినెంట్ జనరల్ మహ్మద్ జాకీ.. 1965, 1971 యుద్దాల గురించి యువతకు వివరించి వారిలో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ భక్తి విద్యార్థి దశ నుంచే పెంపొందించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. రామకృష్ణ మఠానికి చెందిన బోధనానంద స్వామీజీ మాట్లాడుతూ , సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు రాజు తదితరులు మాట్లాడారు. -
యువత.. కుతకుత
ఉపాధి కల్పన, శిక్షణ వట్టిమాటే నిధులు లేక నిర్వీర్యమైన సెట్వెల్ విభాగం ఏలూరు (టూ టౌన్) : ‘దేశానికి యువతే వెన్నుముక. దేశ భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంది’.. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇవే మాటలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో యువ ఓటర్లను, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇవే మాటలు వల్లెవేశారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఆయన అధికార పీఠమెక్కి 8 నెలలు కావస్తోంది. నేటికీ ఆ హామీ నెరవేరలేదు. నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు కనీసం స్వయం ఉపాధి పథకం కింద ఏదైనా వ్యాపారం చేసుకుందామనుకునే నిరుద్యోగులకు కనీస ప్రోత్సాహం కూడా అందటం లేదు. స్వయం ఉపాధి ఎలా పొందవచ్చనే అంశంపై శిక్షణ కూడా ఇవ్వటం లేదు. దీంతో సెట్వెల్ అధికారులు, ఉద్యోగులు గోళ్లు గిల్లుకుంటున్నారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఏటా శిక్షణ ఇచ్చి, వారిలో 50శాతం మందికి యువశక్తి పథకం కింద బ్యాంకుల ద్వారా 50 శాతం రాయితీతో కూడిన రుణా లు అందించే ఏర్పాటు చేసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీవ్ యువశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి యువశక్తి పథకంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది జీవో-13 ద్వారా 2014 సెప్టెంబర్ 25న ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. దీంతో యువతకు ఉపాధి, శిక్షణ లేకుండా పోయాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 472 యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం కింద రుణాలు మంజూరయ్యాయి. వారిలో 372 మంది యూనిట్లను స్థాపిం చారు. అదే ఏడాది మార్చి 3న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 100 మందికి రుణాలు అందలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పట్టిం చుకోకపోవటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోగా, కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో యువత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
నవతరంగం
నేటి యువత చేతిలో..నేతల భవిత నిర్ణయాత్మక శక్తిగా మారిన నవతరంగం జిల్లాలోని ఓటర్లలో పది శాతం వారే .. యువనాయకత్వం కోసం ఎదురుతెన్నులు వరుస ఎన్నికల్లో విశ్వసనీయతకు పెద్ద పీట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు మరువలేం అంతరంగ ఆవిష్కరణలో యువ గళం... ‘దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది..’ అన్నారు స్వామి వివేకానంద. ‘శక్తి అంతా మీలోనే ఉంది.. ధీరులై లేచి నిలబడండి..’ అంటూ పిలుపునిచ్చారు. అవును.. యువ శక్తి అమోఘమైనది. నవతరం ఆలోచనలు ఎంతో విశాలమైనవి. భావి నిర్దేశకులు వీరే.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర వీరిదే. తమ ప్రతినిదులను ఎన్నుకునే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో తమ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడి వెన్నంటి నడిచేందుకు యువత సమాయుత్తమవుతోంది. తమ సమస్యలపై నిగ్గదీసేందుకూ సిద్ధమవుతోంది. అదే విధంగా తమకు మేలు చేసిన ‘మారాజు’లను మరిచిపోబోం.. అంటూ ప్రతినబూనుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదీ యువగళం.. -
ఎన్నికలపై దేశ భవిష్యత్తు ఆధారపడింది
విజయపుర, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉందని, సమర్థుడైన నేతను దేశ ప్రధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓటర్లకు యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో యూపీఏ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. చిక్కబళ్లాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.ఎన్.బచ్చేగౌడకు మద్దతుగా చన్నరాయణపట్టణ పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు ప్రజా సమస్యలపై ఏ నాయకుడూ స్పందించలేదని అన్నారు. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. నరేంద్ర మోడిని ప్రధానిగా చేసేందుకు బచ్చేగౌడను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థి బచ్చేగౌడ మాట్లాడుతూ.. పథకాలతో పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయికి నాసిరకం బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే దేశం ఏనాడో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. పంట పండించేందుకు సాగునీరు లేదు. కనీసం బోరు నీరు వాడుకుందామన్నా విద్యుత్ సౌకర్యం లేక అన్నదాత అప్పుల్లో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకి ఏనాడూ రైతుల కష్టాలు గుర్తుకు రాలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం ఎత్తినహొళె పథకం గుర్తుకు వచ్చి శంకుస్థాపన చేశారని, అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఒనగూరే లాభం ఏదీ లేదని అన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్‌కు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీ చేరారు. కార్యక్రమంలో జెడ్పీసభ్యుడు రాజన్న, మాజీ ఎమ్మెల్యే జి.చంద్రప్ప, ఏపీఎంపీ మాజీ అధ్యక్షుడు గోపాలగౌడ, నేతలు నాగరాజు, నాగరాజ గౌడ పాల్గొన్నారు. -
యువత చేతిలో దేశ భవిత
=కళల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి =సెట్విన్ కృషి ప్రశంసనీయం =యువజనోత్సవాల్లో కలెక్టర్ రామ్‌గోపాల్ తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: యువత తలచుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలరని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ అభిప్రాయపడ్డారు. యువజన సర్వీసుల శాఖ (సెట్విన్) జిల్లా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే యువజనోత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎస్వీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన మొదటి రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతీ, యువకుల్లో దాగివున్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసే దిశగా సెట్విన్ అధికారులు చేస్తు న్న కృషి ప్రశంసనీ యమన్నారు. కళల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం తీసుకువచ్చే మార్పులో కూడా యువతదే కీలకపాత్ర అవుతోందన్నారు. అందుకోసం వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణ, అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి జనాభా ప్రకారం 35 ఏళ్ల లోపు వయసున్నవారు 65 శాతం ఉండడం దేశ అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒక రు భారతీయుడుగా ఉండడం దేశానికి గర్వకారణమన్నారు. ఎదుటి వ్యక్తిని గౌరవించే విధం గా విద్యా వ్యవస్థ అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఎలాంటి ఉద్యోగా న్ని ఎంచుకున్నా లక్ష్యసాధన దిశగా పయనిం చాలన్నారు. అప్పుడే వ్యక్తిగత, మానసిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలి పారు. 20 ఏళ్ల క్రితం వృద్ధాశ్రమాలు కనబడేవి కావని, ఇప్పు డు ఎక్కడ చూసినా ఆశ్రమాలు కనబడుతుం డడం బాధాకరమన్నారు. అందుకు ఎన్నో కారణాలున్నప్పటికీ యువత పెడదోవ పట్టకుండా సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సెట్విన్ సీఈవో బీ.లావణ్యవేణి మాట్లాడుతూ యువతలో సామాజిక స్పృహ, కళల పట్ల ఆసక్తిపెంచేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నామన్నా రు. అందులో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారికి తిరుపతిలో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపా రు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ర్టస్థా యి పోటీలకు పంపుతామన్నారు. మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావతి మాట్లాడుతూ కళ ల పట్ల ఆసక్తి వున్న యువతకు తమ కాలేజీ తరఫున అన్నివిధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 350 మంది యువ కళాకారులు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నా రు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిశా వంటి సంప్రదాయ నృత్యాలు, జానపద బృందాల నృత్యాలు, సంగీత పోటీలు నిర్వహించారు. అలాగే వాయిద్య పరికరాలైన తబలా, ఫ్లూట్, మృదంగాల్లో పోటీలు నిర్వహించారు. -
యువతపైనే దేశ భవిష్యత్ : సీపీ
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ బీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలోకృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో రాణించిన వారికి పేరు ప్రఖ్యాతులొస్తాయని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేవలం చదువే కాకుండా క్రీడల్లో ప్రవేశం ద్వారా పనిలో వత్తిడి తగ్గుతుందన్నారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని చెప్పారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటల్లో రాణించి దేశ ఉన్నత పదవులు చేపట్టినవారెందరో ఉన్నారన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్ .శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధార్థ అకాడమీ క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయలు కల్పిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మారావు మాట్లాడుతూ సాధించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల పీడీ పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.సజీవరెడ్డి, అకాడమీ పరిపాలనా అధికారి వై.చక్రధర్‌రావు, డెరైక్టర్ వీ బాబూరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో మేరిస్ స్టెల్లా కళాశాల, ఎస్వీడీ లా కళాశాల జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా, పురుషుల విభాగంలో డీఏఆర్ కళాశాల (నూజివీడు), పీబీ సిద్ధార్థ కళాశాల జట్లుఫైనల్స్కు చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్ లు: పురుషుల విభాగంలో ఆంధ్ర లయోల కళాశాల జట్టు 3-0 తేడాతో ఎస్జీఎస్ కళాశాల (జగ్గయ్యపేట)పై, నలందా డిగ్రీ కళాశాల 3-0 తేడాతో శాతవాహన కళాశాలపై, డీఏఆర్ కళాశాల (నూజివీడు) 3-1 తేడాతో మడోనా కళాశాల జట్టుపై, పీబీ సిద్ధార్థ కళాశాల 3-0 సప్తగిరి కళాశాల జట్టుపై, ఆంధ్ర లయోలా కళాశాల జట్టు 3-0 తేడాతో కేబీఎన్ కళాశాల జట్టుపై గెలుపొందాయి. నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టు 3-1 తేడాతో ఆంధ్ర లయోల కళాశాలపై, పీబీ సిద్ధార్థ జట్టు 3-0 తేడాతో విశ్వభారతి డిగ్రీ కళాశాల (జగ్గయ్యపేట)జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో..నందిగామ కేవీఆర్ కళాశాల జట్టు 2-0 తేడాతో నలందా డి గ్రీ కళాశాలపై, ఆంధ్ర లయోల కళాశాల జట్టు 2-0 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాలపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-0 తేడాతో గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కళాశాల జట్టుపై, సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు 2-0 తేడాతో నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టుపై, స్టెల్లా కళాశాల జట్టు 2-0 తేడాతో నందిగామ కేవీఆర్ కళాశాల జట్టుపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-1 తేడాతో సిద్ధార్థ పై గెలుపొందాయి.