యువతే దేశ భవిత | The youth of the country bhavita | Sakshi
Sakshi News home page

యువతే దేశ భవిత

Published Mon, Jan 23 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

యువతే దేశ భవిత

యువతే దేశ భవిత

రాంగోపాల్‌పేట్‌: దేశ భవిష్యత్‌ యువతపైనే ఆధారపడి వుందని మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మహావీర్‌ చక్ర అవార్డు గ్రహీత లెప్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ జాకీ అన్నారు. సోమవారం సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా వద్ద  సంస్కృతి ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

ఈసందర్భంగా పలువురు ప్రముఖులు వారి చిత్రపటాల వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లెప్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ జాకీ.. 1965, 1971 యుద్దాల గురించి యువతకు వివరించి వారిలో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేశ భక్తి విద్యార్థి దశ నుంచే పెంపొందించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. రామకృష్ణ మఠానికి చెందిన బోధనానంద స్వామీజీ మాట్లాడుతూ , సంస్కృతి ఫౌండేషన్‌ అధ్యక్షులు రాజు తదితరులు మాట్లాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement