
సాక్షి, విశాఖపట్నం: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని..దేశ నిర్మాణానికి వారు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం విశాఖ వీఎంఆర్‌డీఏ చిల్ర్డన్ ఎరీనాలో ప్రారంభమయిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒకే ఒక హీరో స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి యువతే మార్గదర్శకమన్నారు. యువత దేశ,రాష్టాభివృద్ధి తోడ్పడాలన్నారు. యువత కనీసం వారానికోసారి చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని సూచించారు. హస్త కళాకృతులను కొని కళాకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. యువత దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. అవినీతికి తావులేకుండా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన యువత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment