కేతేపల్లి (నకిరేకల్) : 65 నంబరు జాతీయ రహదారి మీ దుగా అక్రమంగా రవాణా చేస్తున్న రూ.20 లక్షల విలువైన అంబర్, గుట్కా పాకెట్లను కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్‌ప్లాజా వద్ద బుధవారం నల్లగొండ జిల్లా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ సత్తన్న ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 30మంది అధికారులు, విజిలెన్స్ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫీల్‌ఖానా నుంచి భ్రద్రాచలంకు వివిధ సరుకులతో వెళ్తున్న సెంట్రల్ పార్శిల్ సర్వీసుకు చెందిన ఏపీ 29టీఏ 6779 నంబరు గల లారీపై ఓవర్‌లోడ్ ఉన్నట్లుగా గుర్తించి విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేశారు. లారీలో ఉన్న సరుకులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సక్రమంలా లేకపోవటంతో పాటు, డ్రైవర్ పొంతన లేని సమాధానలు చెబుతుండటంతో అనుమానించిన సిబ్బంది లారీని రోడ్డు పక్కకు నిలిపి సరుకులను పరిశీలించారు. లారీలో నిషేధిత పొ గాకు ఉత్పత్తులతో కూడిన అంబర్‌లు, గుట్కాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు లా రీని కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించారు.
లారీలో కొన్ని కుర్‌కురే ప్యాకెట్ల్, చెప్పులు, ప్లాస్టిక్ సామగ్రి డ బ్బాలతో పాటు సగంలోడు మేర గుట్కా, అంబర్ ప్యాకెట్లు బైయటపడ్డాయి. 70 కాటన్ల అంబ ర్ ప్యాకెట్‌లు, 4 కాటన్లు దుబాయ్ గుట్కా, 8గన్నీ బ్యాగులు పహలనిషా, 8 బ్యాగులు స్వాగత్ గుట్కా, 3 గన్నీ బ్యా గులు త్రీస్టార్ ఖైనీ, 2గన్నీ బ్యాగులు గోపిక గుట్కా, 6 కాటన్లు ఖలేజా గుట్కా లభ్యమయ్యాయి. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ సుమా రు రూ. 20లక్షలకు పైనే ఉంటుందని విజి లెన్స్ డీఎస్పీ సత్తన్న తెలి పారు. లారీని, గుట్కా ప్యాకెట్లను కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్వాధీన పర్చి కేసు నమోదుకు సిఫారసు చేశామని తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు నర్సింహరాజు, చలమంచరాజు, ఏజీ నర్సిరెడ్డి, ఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీటీఓలు క్రిష్ణ, శ్రీధర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వో ఆంజనేయులు, ఎంవీఐ సలీం, ఎస్‌ఐ గౌస్ పాల్గొన్నారు.
రూ.20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
Published Thu, Jan 12 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
Advertisement