విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి
నకిరేకల్ : కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థుల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ మరిన్ని పోరాటాలు చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించినా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల బతుకులు మారలేదన్నారు. విద్యారంగసమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లం మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఎం.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల విద్యాసాగర్, రాష్ట్ర కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటషం, తీగల వెంకన్న, ఆర్ ఇందిర, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, ఖమ్మంపాటి శంకర్, సురేష్, బాబు, మధుకృష్ణ,దుస్స లింగస్వామి, ఆకారం నరేష్, మట్టిపల్లి వెంకట్, నరేష్, ఉపేందర్, శివకుమార్, దుర్గం మేగాత్ర, రమేష్ తదితరులు ఉన్నారు.
భారీ ప్రదర్శన
నకిరేకల్‌లో రెండు రోజుల పాటు జరగబోయే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా స్థాయి మహాసభలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మినీ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శకుంతల ఫంక్షన్‌హాల్‌లోఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని సంఘం జిల్లా అ««ధ్యక్షుడు మల్లం మహేష్ ఎగురవేశారు.