విజిలెన్స్ అధికారుల తనిఖీ
నకిరేకల్ :
నకిరేకల్‌లోని శ్రీ మల్లికార్జున జూనియర్, డిగ్రీ కళాశాలలో సోమవారం సాయంత్రం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా ఎస్పీ భాస్కర్‌రావు ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దార్ పి. రాధా, డీసీటీఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, సరిపడా స్టాఫ్ ఉన్నారా.. ల్యాబ్‌లలో తగిన పరికరాలు ఉన్నాయా... విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగస్తులుగా ఉండి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధిపొందుతున్నారా.. తదితర అంశాలను పరిశీలించామని తెలిపారు. వారి వెంట ఎస్‌ఐ పీరయ్య, కానిస్టేబుల్ పీ. వెంకట్‌రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకన్న, కృష్ణ ఉన్నారు.