నకిరేకల్ : బీసీల బడ్జెట్‌ను రూ. 25వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌ను పెంచాలని కోరుతూ ఈ నెల 18న బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆదివారం నకిరేకల్‌లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ కులాల అభ్యు న్నతికి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకినాల రవి, అర్రూరి వెంకటేశ్వర్లు, పగిల్ల సందీప్, బీసీ సంఘం నాయకులు బండపల్లి శ్రీనివాస్‌గౌడ్, మిడిసినమెట్ల సైదులు, నేలపట్ల రమేష్, పగిల్ల వెంకన్న, గోగికార పరమేష్, పోగుల ఉపేందర్, తిరుగుడు రవి, ఆలకుంట్ల సైదులు, శ్రీనివాసచారి, మాజీద్, వెంకన్న, శ్రీను, సంకోజు కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.
బీసీల బడ్జెట్‌ను రూ.25వేల కోట్లకు పెంచాలి
Published Mon, Nov 17 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement