BC Budget
-
బీసీల బడ్జెట్ రూ.20 వేల కోట్లకు పెంచాలి
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించే మొత్తాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో బీసీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్లో 15 బీసీ సంఘాల సమా వేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజ రైన కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ డిమాండ్లపై ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను కలసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బీసీ బడ్జెట్‌ను రూ.50 వేల కోట్లకు పెంచాలి’
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్లో బీసీల సంక్షేమ వాటాను పెంచాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన.. కేంద్రం 24 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.900 కోట్లే కేటాయించిందన్నారు. ఈ వాటాను రూ.50 వేల కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించినా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర రాయితీలు పొందలేక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారన్నారు. కేంద్రంలో బీసీల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, రూ.60 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. -
బీసీ బడ్జెట్ రూ.7,500 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల బడ్జెట్ గతం కంటే పెరగనుంది. తాజాగా 2018–19 బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థికశాఖ రెండ్రో జుల క్రితం బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. గతేడాది బడ్జెట్ కంటే పెంచి అంచనాలు రూపొందించుకోవాలని సూచించింది. బీసీ సంక్షేమశాఖకు 2017–18లో రూ.5070.76 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా రూ.2,500 కోట్ల మేర పెంచే అవకాశముంది. ఇందులో ప్రగతిపద్దు కింద రూ.4,764.60 కోట్లు, నిర్వ హణ పద్దు కింద రూ.305.76 కోట్లు కేటాయించింది. దీనిలోనే అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించింది. మిగతా మోత్తాన్ని కల్యాణలక్షి, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి పథకాలకు కేటాయించింది. తాజాగా బీసీ బడ్జెట్‌ను రూ.7,500 కోట్ల మేర అంచనాలు రూపొందిస్తోంది. ఈసారి బీసీ కార్పొరేషన్‌కు సంతృప్తికర స్థాయిలో కేటాయింపులుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యానిధి కింద వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిరుడు రజక, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు 500 కోట్లు కేటాయించింది. విశ్వబ్రాహ్మణ ఫెడ రేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక అభివృద్ధినిధి మాటేంటి..? వెనుకబడిన కులాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ బీసీ నివేదిక రూపొందించింది. మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటైన బీసీ కమిటీ సుదీర్ఘ సమాలోచనలు చేసి నివేదికకు తుదిరూపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘బీసీల అభ్యున్నతికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం. ఏకాభిప్రాయంతో ప్రాధాన్యతాక్రమంలో నివేదిక ఇస్తే వెంటనే మంజూరు చేస్తా’ అని హామీ ఇచ్చారు. అయితే తాజా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైనా బీసీ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘బీసీ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలి. అందుకే నివేదికను సీఎంకు ఇవ్వలేదు. సీఎం ఆదేశం వచ్చిన వెంటనే నివేదిక సమర్పిస్తాం. అసెంబ్లీలో చర్చిస్తాం’ అని మంత్రి రామన్న ‘సాక్షి’తో అన్నారు. -
బీసీ బడ్జెట్ అంటే సరా?
సాక్షి, హైదరాబాద్: బీసీల బడ్జెట్ అని చెప్పుకుంటే సరిపోదని, బీసీ వర్గాల అభ్యున్నతికి కేటాయించిన నిధుల్లో పెరుగుదల ఉండాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తాజా బడ్జెట్లో బీసీలకు చెప్పినంత గొప్పగా కేటాయింపుల్లేవని విమర్శించారు. కొన్ని పథకాలు భేషుగ్గా ఉన్నా వాటి కేటాయింపు అంకెలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం ఆయన శాసనసభలో ప్రసంగించారు. బీసీలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారని, అందులో చేనేతకు సంబంధించిన రూ.1200 కోట్లు కలపడమేంటని ప్రశ్నించారు. ఎంబీసీలంటే ఎవరో తేల్చే సరికి ఏడాది గడుస్తుందని, వారి పేర కేటాయించిన రూ.వేయి కోట్ల నిధులకు ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లకు నిధులు కేటాయించినా మిగతా కులాల సంగతే పట్టించుకోలేదన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు నిధుల్లో కోత పెట్టారని, రెండు పడక గదుల ఇళ్లకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. మభ్య పెట్టేందుకే భారీ కేటాయింపులు: రాజయ్య ప్రతి సంవత్సరం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడం లేదని సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వికలాంగులకు కేటాయింపుల్లో 70 శాతం నిధులు కూడా ఖర్చు కాకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ అవసరమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. తక్షణమే మునిసిపల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సీఎం అంతరంగాన్ని ఆవిష్కరించింది: చింత ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగాన్ని బడ్జెట్ ఆవిష్కరించిందని టీఆర్ఎస్ సభ్యుడు చింత ప్రభాకర్ పేర్కొన్నారు. మాకు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ముఖ్యం అనే రీతిలో బడ్జెట్ కేటాయింపులను జరిపారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను చూసి బడుగు, సబ్బండ వర్ణాలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. -
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
మిర్యాలగూడ : దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంట్లో ప్రత్యేకంగా బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కమిషన్‌కు జాతీయ హోదా కల్పించాలన్నారు. రూ.10వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, కుల వృత్తులకు రూ.రెండు వేల కోట్లతో బడ్జెట్ కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదగోని మహేష్‌గౌడ్, నాయకులు నాగరాజుగౌడ్, లక్ష్మణ్‌యాదవ్, కృష్ణబాబు, నాగరాజు, గురవయ్య, సురేష్, రమేష్, అనిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వీరభద్రుడికి కోరమీసాలు
-
కాంగ్రెస్ ఓ దొంగల ముఠా!
ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్ ► కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు.. ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లాలో త్వరలోనే టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ దగ్గర రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్ ఓకే చెప్పిందని వెల్లడించారు. ఈసారి బీసీల బడ్జెట్ ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు. వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు.. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
బీసీల బడ్జెట్‌ను రూ.25వేల కోట్లకు పెంచాలి
నకిరేకల్ : బీసీల బడ్జెట్‌ను రూ. 25వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌ను పెంచాలని కోరుతూ ఈ నెల 18న బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆదివారం నకిరేకల్‌లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ కులాల అభ్యు న్నతికి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకినాల రవి, అర్రూరి వెంకటేశ్వర్లు, పగిల్ల సందీప్, బీసీ సంఘం నాయకులు బండపల్లి శ్రీనివాస్‌గౌడ్, మిడిసినమెట్ల సైదులు, నేలపట్ల రమేష్, పగిల్ల వెంకన్న, గోగికార పరమేష్, పోగుల ఉపేందర్, తిరుగుడు రవి, ఆలకుంట్ల సైదులు, శ్రీనివాసచారి, మాజీద్, వెంకన్న, శ్రీను, సంకోజు కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. -
18న కలెక్టరేట్ల ముట్టడి:ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్‌ను 2 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను, కరపత్రాన్ని శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆవిష్కరించారు. రూ.10 వేల కోట్లతో బీసీ ప్లాన్ అమలు చేయాలని, కల్యాణ లక్ష్మిని బీసీలకు వర్తింపచేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోబీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.దుర్గయ్యగౌడ్, ఎన్.భూపేష్సాగర్, ఎం.పృథ్విరాజ్‌గౌడ్, జి.శ్రీకాంత్‌గౌడ్, బత్తినరాజు, సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.