మిర్యాలగూడ : దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.
బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కమిషన్‌కు జాతీయ హోదా కల్పించాలన్నారు. రూ.10వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, కుల వృత్తులకు రూ.రెండు వేల కోట్లతో బడ్జెట్ కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదగోని మహేష్‌గౌడ్, నాయకులు నాగరాజుగౌడ్, లక్ష్మణ్‌యాదవ్, కృష్ణబాబు, నాగరాజు, గురవయ్య, సురేష్, రమేష్, అనిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
Published Thu, Mar 16 2017 4:08 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement