సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
బీఎస్పీ ఫ్లోర్ లీడర్ శ్యామ్ సింగ్, ఎంపీ బినోయ్ విశ్వమ్, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, మల్లు రవి మద్దతు తెలిపారు. వందలాది మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీ సంఘాల నాయకులు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ‘ఓట్లు బీసీలవి– సీట్లు అగ్రకు లాలవా.. రాజ్యాధికారంలో వాటా కావాలి‘ అంటూ నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్ రాజ్ కుమార్, నేతలు గోవింద్, కర్రి వేణు మాధవ్, బాషయ్య, పరశురామ్ నాయకత్వం వహించారు.
బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారు: కృష్ణయ్య
ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అ గ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టా రని... కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు – బర్రెలు పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment