ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు పెరగుతున్న క్రమంలో ఢాకాలోని భారత హైకమిషన్ విద్యార్థులను పలు మార్గాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేర్చుతోంది. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరకున్నారు.
778 మంది విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌కు చేరుకున్నారు. ఇక.. 200 మంది విద్యార్థులు రెగ్యులర్ విమాన సర్వీసుల్లో భాగంగా శనివారం ఢాకా, చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టుల్లో విమానం ద్వారా భారత్‌కు చేరకున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. అయితే మరో నాలుగు వేల మంది విద్యార్థులతో టచ్‌లో ఉన్నామని అధికారులు తెలిపారు.
ఇక.. శుక్రవారం 300 మంది భారతీయులు.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బయలుదేరి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ చేరకున్న 300 మంది విద్యార్థల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థులంతా ఉత్తర ప్రదేశ్, హర్యానా, మేఘాలయా, జమ్ము కశ్మీర్ చెందినవారిగా అధికారులు గుర్తించారు.
Over 300 Indian Students Return Home As 105 Bangladeshis Die In Protests
Many of the students who returned were pursuing MBBS degrees and most of them were from Uttar Pradesh, Haryana, Meghalaya and Jammu and Kashmir.#BangladeshiStudentsareinDanger
https://t.co/kL2sdGFYmL— AK_0 (@ak_2350) July 20, 2024
బంగ్లాదేశ్ నుంచి రెండు మార్గాలు ద్వారా విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తాలాకు సమీపంలోని అకురాహ్ పోర్టు, మేఘాలయాలోని దావ్‌కీ గుండా విద్యార్థులు భారత్‌లోకి ప్రవేశించారు. పలువరు విద్యార్థులు టాక్సిల ద్వారా సుమారు ఆరుగంటల ప్రయాణం చేసి మరీ ఇళ్లకు చేరకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది భారతీ విద్యార్థులతోపాటు కొంతమంది భూటాన్, నేపాల్ చెందిన విద్యార్థులు కూడా భారత్‌లోకి ప్రవేశించినట్లు మేఘాలయా అధికారులు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment