borders
-
‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..
ప్రేమ గుడ్డిదని, అది చిగురించినప్పుడు సరిహద్దులు కనిపించవని అంటారు. ఇది ‘బాబు’ ప్రేమకథతో మరోమారు నిజమని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన బాబు తాను ప్రేమించిన పాక్ యువతి కోసం సరిహద్దులు దాటి, తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.బాబు సోషల్ మీడియా(Social media)లో చూసి, ఒక పాక్ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనే ప్రేమలో పడిన బాబు ఆ యువతి కోసం వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ప్రేమికుని అసలు పేరు బాదల్, అయితే బాబు అని ముద్దుగా ఇంట్లోనివారు పిలుస్తుంటారు. ఇప్పుడు అతని కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాబును సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.అలీగఢ్ జిల్లా బార్లా పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ అలియాస్ బాబు(30) సోషల్ మీడియాలో చూసి, ఒక పాక్ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమలో బాబు ఎంతగా మునిగిపోయాడంటే.. వెంటనే ఇంటిని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరైన వీసా, పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాడు. పాకిస్తాన్‌లోని మోజా మోంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన బాబును పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024, డిసెంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసుల విచారణలో బాదల్ తాను సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ యువతి ప్రేమలో పడ్డానని, ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చానని చెప్పాడని సమాచారం.బాదల్ ఢిల్లీలోని గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబంలోని ముగ్గురు సోదరులలో అతను రెండవవాడు. బాబు ఓ పాకిస్తానీ యువతితో ఫేస్బుక్లో చాట్ చేస్తుంటాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపావళికి ముందు బాబు ఇంటికి వచ్చాడని, తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు తన గుర్తింపు కార్డు(Identity card), ఇతర పత్రాలను ఇంట్లో పెట్టి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి బాబుకు సంబంధించిన సరైన సమచారం అందలేదన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ పోలీసులు.. బాబును వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు, అతను ఏమీ చూపించలేదు. దీంతో అతను పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 13, 14 కింద అరెస్టయ్యాడు. కాగా బాబు గతంలో రెండుసార్లు భారత్-పాక్ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడని, అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదని పాక్ పోలీసులు చెబుతున్నారు.బహౌద్దీన్ ప్రాంతంలో పట్టుబడిన బాబును అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాబు పాక్‌లోకి ప్రవేశించడం ప్రేమ కోసమేనా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి కానీ, భారత రాయబార కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా తమ బాబు తమ ఇంటికి వస్తాడని అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆలయాల్లో నూతన సంవత్సర సందడి -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత్ చేరిన వెయ్యి మంది విద్యార్థులు
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు పెరగుతున్న క్రమంలో ఢాకాలోని భారత హైకమిషన్ విద్యార్థులను పలు మార్గాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేర్చుతోంది. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరకున్నారు. 778 మంది విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌కు చేరుకున్నారు. ఇక.. 200 మంది విద్యార్థులు రెగ్యులర్ విమాన సర్వీసుల్లో భాగంగా శనివారం ఢాకా, చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టుల్లో విమానం ద్వారా భారత్‌కు చేరకున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. అయితే మరో నాలుగు వేల మంది విద్యార్థులతో టచ్‌లో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇక.. శుక్రవారం 300 మంది భారతీయులు.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బయలుదేరి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ చేరకున్న 300 మంది విద్యార్థల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థులంతా ఉత్తర ప్రదేశ్, హర్యానా, మేఘాలయా, జమ్ము కశ్మీర్ చెందినవారిగా అధికారులు గుర్తించారు.Over 300 Indian Students Return Home As 105 Bangladeshis Die In ProtestsMany of the students who returned were pursuing MBBS degrees and most of them were from Uttar Pradesh, Haryana, Meghalaya and Jammu and Kashmir.#BangladeshiStudentsareinDanger https://t.co/kL2sdGFYmL— AK_0 (@ak_2350) July 20, 2024 బంగ్లాదేశ్ నుంచి రెండు మార్గాలు ద్వారా విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తాలాకు సమీపంలోని అకురాహ్ పోర్టు, మేఘాలయాలోని దావ్కీ గుండా విద్యార్థులు భారత్‌లోకి ప్రవేశించారు. పలువరు విద్యార్థులు టాక్సిల ద్వారా సుమారు ఆరుగంటల ప్రయాణం చేసి మరీ ఇళ్లకు చేరకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది భారతీ విద్యార్థులతోపాటు కొంతమంది భూటాన్, నేపాల్ చెందిన విద్యార్థులు కూడా భారత్‌లోకి ప్రవేశించినట్లు మేఘాలయా అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్‌లో పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలిపింది. -
ఢిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు వీలుగా సింఘు సరిహద్దు రహదారి ‘సర్వీస్ లేన్’, తిక్రీ సరిహద్దు రహదారికి చెందిన ఒక లేన్ తెరుస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ నుండి హరియాణాకు వెళ్లే ప్రయాణికులకు గొప్ప ఉపశమనం లభించింది. పంటలకు కనీస మద్దతు ధర హామీతో పాటు వ్యవసాయ రుణాల మాఫీ తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. దీంతో ఈ రెండు సరిహద్దు మార్గాలను ఫిబ్రవరి 13న మూసివేశారు. ఈ నెలాఖరు వరకు తమ పాదయాత్రను నిలిపివేస్తామని నిరసన తెలుపుతున్న రైతులు ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని, అవసరమైతే సరిహద్దులను మళ్లీ మూసివేస్తామని ఆయన అన్నారు. కాగా కుండ్లీ సరిహద్దు రహదారిలో సర్వీస్ లేన్ తెరిచారు. దీంతో ఢిల్లీ వెళ్లే వాహనదారులకు ఉపశమనం లభించింది. -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
తప్పు చేయొద్దు! అక్రమ వలసదారులకు రిషి సునాక్ స్ట్రాంగ్ వార్నింగ్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను అనుమతించమని ఖరాకండీగా చెప్పేశారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి అక్రమ వలసదారుడిని బహిష్కరించడమే గాక ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా అనుమతించమని స్పష్టం చేశారు. యూరప్ నుంచి సరిహద్దులు దాటి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పడవలపై అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక రువాండ లేదు సురక్షితమైన మూడో దేశం నుంచి పడవల ద్వారా అక్రమంగా వస్తున్న వలసదారులను బహిష్కరించి, శాశ్వతంగా రాకుండా నిషేధించేలా హోం సెంక్రటరీ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. తప్పు చేయొద్దు, చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే మీరు ఉండలేరు. అక్రమ వలసలు నేరమని, పైగా అక్రమంగా ప్రవేశించిన ముఠాలను అనైతిక వ్యాపారాలు కొనసాగించేలా అనుమతించడం సరికాదని బ్రిటీష్ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. అలాగే పడవలను ఆపేస్తానన్న నా వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సరిహద్దు దాటిని అక్రమ వలసదారులను అనుమతించడానికి, ఆశ్రయం పొందాలన్న యూకేలోని చట్టాలను అనుసరించాలని చెప్పారు. వలసదారుల కేసు విచారణ కోసం ఉన్నప్పుడూ అనుమతిస్తారని, కానీ కొత్త చట్టం ప్రకారం అటువంటి వలసదారులు మొదటి స్థాయిలో ఆశ్రయం పొందకుండా నిరోధిస్తుందని ప్రధాని రిషి సునాక్ చెప్పారు. కాగా, ఫ్రాన్స్ నుంచి యూకేకి ప్రమాదకర స్థాయిలో శరణార్థులు వలస రావడాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: పాక్‌లో ఆత్మాహుతి దాడి..తొమ్మిది మంది పోలీసులు మృతి) -
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్‌లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్‌పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్‌పింగ్ ఖుంజెరాబ్‌లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్‌పింగ్‌కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్‌పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్‌పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్‌పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
పొలిమేర నుంచే ప్రణాళిక! సరిహద్దుల నుంచి కీలక నేతల పర్యవేక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈలోగానే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పలివెల వంటి ప్రాంతాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై దాడులకు దిగారు. ప్రచారం ముగియడంతో ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. కానీ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్టలైన కొందరు నేతలు మాత్రం మునుగోడు నియోజకవర్గం పక్కనే పొలిమేర గ్రామాల్లో తిష్టవేశారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిసింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించేలా సూచనలు చేస్తున్నారని.. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ వంటివన్నీ పర్యవేక్షిస్తున్నారని.. స్థానిక నాయకులను పిలిపించుకుని సూచనలు చేస్తున్నారని సమాచారం. సరిహద్దుల నుంచే సలహాలు.. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బుధవారం ఓ టీఆర్ఎస్ నేతకు చెందిన కారు కనిపించిందని.. ఆయన నియోజకవర్గానికి అవతల ఓ గ్రామంలో మకాం వేశారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నేత నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇక మర్రిగూడ మండలం శివారు దాటాక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఒక స్థానిక నాయకుడి ఇంట్లో ఓ సీనియర్ నేత మకాం వేసి పర్యవేక్షిస్తున్నారని.. పోల్ మేనేజ్మెంట్పై అక్కడి నుంచే సూచనలు చేస్తున్నారని తెలిసింది. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ పరిసరాల్లోని ఒక హోటల్లో మరో సీనియర్ లీడర్ ఉండి పరిశీలన జరుపుతున్నారని.. మరో ఎమ్మెల్యే వాహనం సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కనిపించిందని స్థానిక నేతలు చెప్తున్నారు. నార్కట్‌పల్లి వివేరా హోటల్లో అడ్డా వేసిన ఓ నేత మునుగోడులోని పరిసర మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీలో బుధవారం అధికార పార్టీ నేత వాహనం కనిపించింది. దీంతో ఆ కారులో డబ్బుల సంచులు ఉన్నాయని, కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ మకాం వేసినట్టు తెలిసింది. తక్కువగా ఇచ్చారంటూ ఓటర్ల ఆందోళన.. ప్రచారం సందర్భంగా ఓటర్లు ఏది అడిగితే అది ఇస్తామన్న నేతలు మంగళవారం సాయంత్రం నుంచే పంపిణీ మొదలు పెట్టగా.. ఈ ‘పని’లో ఏ ఇబ్బందీ రాకుండా ముఖ్యనేతలంతా చూసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు రూ.20 వేలు.. రూ. 30 వేలు ఇస్తామని ఒక పార్టీ, తులం బంగారం ఇస్తామని మరో పార్టీ వారు చెప్పారని.. తీరా ఇప్పుడు రూ.3 వేలు, రూ.4వేలు ఇస్తున్నారని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కనిపించింది. మునుగోడు మండలం కొరటికల్తోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటర్లు తమకు తక్కువ మొత్తం ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మునుగోడు ఉప ఎన్నిక సర్వేలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఓ సర్వే ఒక పార్టీకి అనుకులంగా.. మరో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని ప్రచారం సాగిస్తున్నాయి. సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనే వారు ఓడిపోతారని తేలిందంటూ మరికొందరు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
Sakshi Cartoon: చైనా సరిహద్దుల్లో అమెరికా రహస్య విమానాలు
మనం భారత్ సరిహద్దుల్లో ఇలానే చేస్తుంటే.. వాళ్లు మన సరిహద్దుల్లో అదే పని చేస్తున్నార్సార్! -
సరిహద్దుల్లోని క్లబ్బులను మూసేయాలి: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ఛతీస్‌గఢ్, భద్రాచలం దగ్గరలోని కుంట్ల, పుదుచ్చేరిలోని యానాంలో రిక్రియేషన్ క్లబ్బులను మూసేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో విపరీతంగా కొనసాగిన జూద క్లబ్బులను రిక్రియేషన్‌లో భాగంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మూసివేశాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులో ఉండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దోచుకుంటున్న ఈ క్లబులను వెంటనే మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రులను, హోం శాఖామాత్యులను కలిసి విన్నవించామన్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని క్లబ్బులను గతంలో మూసివేశారని, యానాంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లబ్బులపై కలెక్టర్ దాడి చేసి సొసైటీని రద్దు చేసి సీజ్ చేశారని తెలిపారు. చెన్నై నగరంలో రిక్రియేషన్ పేరుతో నడిచే పేకట క్లబ్ ల గురించి కూడా త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకెళతామన్నారు. -
ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం
Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత పట్టుకుని కాలినడకన పోలాండ్ సరిహద్దుల వెంబడి పయనమయ్యారు. ఈ మేరకు సరిహద్దుకు సుమారు 8 కి.మీ దూరంలో తమ కళాశాల బస్సు నుంచి దిగిన 40 మంది వైద్యా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలాండ్ సరిహద్దుకు వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. పోలాండ్ సరిహద్దుకు సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఎల్వివ్లోని ఒక వైద్య కళాశాల విద్యార్థులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కైవ్‌లోని అడుగు పెట్టేయడమే కాక అక్కడ ఉన్న ఉక్రెయిన్ డిఫెండర్లతో పోరాడుతున్నాయి. మరో రెండు గంటల్లో నగరం రష్యా అధినంలోకి వచ్చే అవకాశం ఉందని ఉక్రెయిన పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత వైద్య విద్యార్థుల పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు వరకు సుదీర్ఘ నడకను సాగించారు. అంతేకాదు కొంతమంది విద్యార్థుల తాము ఉక్రెయిన్‌ని విడిచి కాలినడకన ఒక సముహంగా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారు, పైగా వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. రష్యా బాంబు దాడులు, క్షిపిణి దాడుల భయంతో భూగర్భ మెట్రో స్టేషన్లు, నేల మాళిగలు వంటి షెల్టర్ల నుంచి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీలలో క్యాంపు కార్యాలయాలను ప్రారంభించింది. పోలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులకు సహాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ మరింత మంది రష్యన్ మాట్లాడే అధికారులను ఈ క్యాంపు కార్యాలయాలకు పంపింది. విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు కూడా బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకోగలిగిన భారతీయుల కోసం ప్రభుత్వం విమానాలను పంపించడమే కాక ఈ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు రెండు చార్టర్డ్ విమానాలు ఈరోజు బుకారెస్ట్‌కు బయలుదేరే అవకాశం ఉందని ఒక విమానం రేపు బుడాపెస్ట్‌కు బయలుదేరుతుందని వెల్లడించారు. హంగరీ, రొమేనియాలోని సరిహద్దు చెక్ పాయింట్లకు దగ్గరగా ఉన్నవారు ముందుగా బయలుదేరాలని సూచించారు. విద్యార్థి కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులను కోరింది. (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?) -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
తగ్గేదేలే... ఈడ కాదంటే.. ఆడ ఆడతాం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు మళ్లీ జోరందుకున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఆడితే ఇబ్బందేంటని భావించిన పేకాట నిర్వాహకులు ఏకంగా అక్కడ భూములు కొనుగోలు చేసి క్లబ్బులుగా మార్చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. వారంలో మూడు రోజులు పేకాట రాయుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించి లక్షల్లో కమిషన్ పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న పేకాట వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇసుక కాంట్రాక్టర్లదే హవా.. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడం లేదా లీజుకు తీసుకుని పెద్ద రేకులతో కంచెలు నిర్మించి, లోపల విశాలమైన హాళ్లు, పడక గదులు నిర్మించి పేకాటకు తెరతీశారు. రాష్ట్రంలోని మంచిర్యాల, చెన్నూర్ ప్రాంతాల్లో ఇసుక దందా నిర్వహిస్తున్న కొందరు ప్రముఖులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్రలోని సిరోంచ, అమ్రావతి, కంబాల్‌పేట ప్రాంతాల్లో క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అక్కడి స్థానిక మాఫియా ఏర్పాటు చేసిన క్లబ్బులను లోకల్ పోలీసులు మూసేయించారు. ఆరు నెలల కింద తెలంగాణకు చెందిన ఓ బడా ఇసుక కాంట్రాక్టర్ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని క్లబ్బు ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి రీక్రియేషన్, స్పోర్ట్స్ క్లబ్బుల పేరిట పేకాట నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు క్రషర్, బీడీ ఆకు కాంట్రాక్టర్లు కలసి మూడు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోని బడా వ్యక్తులంతా ఆగస్టు నుంచి పేకాటకు వెళ్తున్నట్లు సమాచారం. కేరళపై మక్కువతో.. బడా బాబులు, ప్రముఖులకు కేరళ సిండికేట్ బ్యాచ్ ఆహ్వానం అందిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విమానం ఎక్కడం, శని, ఆదివారాలు అక్కడే ఉండటం లక్షల్లో సమర్పించుకుని వస్తున్నట్లు ఇటీవల పోలీసులుకు పట్టబడ్డ సుమన్ చౌదరి విచారణలో తేలింది. అయితే రాయిచూర్ కేంద్రంగా సాగుతున్న పేకాట కేంద్రాల నిర్వాహకుల సిండికేటే కేరళలోనూ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. పేకాటలో పెట్టే డబ్బులు కాకుండా కేవలం ఎంట్రీ ప్యాకేజీ కోసం రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి వారం 50 నుంచి 70 మంది కేరళ వెళ్తున్నట్లు తెలిసింది. రష్యా వెళ్లాలనుకునే వారికి.. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ రష్యాకు పంపేందుకు సుమన్ చౌదరితో పాటు కేరళ సిండికేట్ బ్యాచ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఏకంగా అక్కడి మాఫియాతో చేతులు కలిపి వీవీఐపీ బ్యాచ్‌కు వారం పాటు మూడు ముక్కలాట ఆడిస్తోందని చెబుతున్నారు. రెండు నెలల కింద 18 మంది ప్రముఖులు రష్యా వెళ్లి వచ్చినట్లు సుమన్ చౌదరి విచారణలో బయటపడింది. ప్రముఖుల వివరాలు మాత్రం పోలీసులు బయటకు రానివ్వట్లేదు. పాత నిర్వాహకులకు అడ్డా.. ఇక్కడ పేకాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తి తన అనుచరులతో కలసి కర్ణాటక సరిహద్దు అయిన రాయిచూర్‌లో నాలుగు పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశాడు. 2019 ఏప్రిల్‌లో కరోనా వల్ల మూతపడ్డ క్లబ్బును ఇటీవలె మళ్లీ తెరిచినట్లు పోలీసు వర్గాలకు తెలిసింది. గతంలో బోయిన్‌పల్లితో పాటు నల్లకుంట, బంజారాహిల్స్, బేగంపేటలో క్లబ్బులు నిర్వహించిన వాళ్లంతా ఇప్పుడు సిండికేట్‌గా మారి రాయిచూర్ నుంచి భగాల్‌కోట్ వెళ్లే మార్గంలో ఏర్పాటుచేసిన పేకాట కేంద్రాలకు ప్రతి వారం 300 మందికి పైగా వెళ్తున్నట్లు తెలిసింది. పేకాట కేంద్రాల నిర్వాహకులే ఏసీ బస్సులు ఏర్పాటు చేసి రాయిచూర్ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. వీళ్లకు ఐడీ కార్డులు ఇచ్చి ఎంత మేరకు ఆడుతారో వాటికి సంబంధించి డబ్బులు తీసుకుని కాయిన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్లేలోపు వీళ్లకు కావాల్సిన ఏర్పాట్లు, కాయిన్స్, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌కు ‘వైల్డ్’ ఎంట్రీ) -
China: జగమొండి డ్రాగన్
ఒకటి కాదు... రెండు కాదు. తాజాగా ఆదివారం భారత, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగినవి – ఏకంగా 13వ విడత చర్చలు. తొమ్మిది గంటల పాటు ఉన్నతస్థాయి చర్చల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఒక్క అంగుళమైనా పురోగతి లేదు. తప్పంతా అవతలివాళ్ళదే అన్నది ఇరుపక్షాల వాదన. వివాదాస్పదమైన కొన్ని కీలక ప్రాంతాలపై పరిష్కారం కోసం ‘నిర్మాణాత్మక సూచన’లిచ్చామనీ, చైనా ‘అంగీకరించలేద’నీ భారత సైన్యం సోమవారం ఉదయం ప్రకటించింది. చైనా మటుకు భారత్ ‘అసంబద్ధమైన, అవాస్తవిక డిమాండ్లు చేస్తోంద’ని ఆదివారం రాత్రే ఆరోపించింది. వెరసి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గమనిస్తే, డ్రాగన్ మంకుపట్టుతో వరుసగా రెండో ఏడాది, ఈ రానున్న చలికాలంలోనూ తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపులు తప్పవు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఆక్సిజన్ కూడా అందని చోట, మైనస్ 30 డిగ్రీల గడ్డ కట్టే చలిలో 50 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి, పహారా కాయక తప్పదు. శత్రువుల చొరబాట్లు లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని, సరిహద్దులను కాపాడకా తప్పదు. 2020 మే నెలలో చైనా బలగాలు తమ వార్షిక విన్యాసం కోసం టిబెటన్ పీఠభూమి ప్రాంతానికి వచ్చాయి. కానీ, చైనా ఆ బలగాలను తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వైపు మళ్ళించింది. దాంతో, సరిహద్దు వెంట కీలకమైన పీపీ15, పీపీ17ఏ అనే రెండు గస్తీ పాయింట్లలోనూ రెండు దేశాల సైనికులు ఎదురుబొదురయ్యాయి. భారత్‌తో ప్రతిష్టంభన నెలకొంది. అప్పటికే గాల్వన్ లోయలోని పీపీ14, పాంగ్‌గాంగ్ త్సో సరస్సు ఉత్తరపు ఒడ్డున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ 4 గస్తీ పాయింట్లలోనూ చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, మోహరించాయి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 1976లో చైనాపై ఉన్నతస్థాయి నిర్ణాయక బృందం ‘చైనా స్టడీ గ్రూప్’ (సీఎస్జీ) ఏర్పాటైంది. ఆ బృందమే ఈ గస్తీ పాయింట్లను నిర్ణయిస్తుంది. భారత, చైనాల మధ్య ఇప్పటికీ అధికారికంగా సరిహద్దులు నిర్ణయం కాని నేపథ్యంలో ఎల్ఏసీని చైనా బలగాలు దాటడం మునుపటి ఒప్పందానికి తూట్లు పొడవడమే! ఈ వివాద పరిష్కారం కోసం గత ఏడాది మే నుంచి ఇప్పటికి సంవత్సరం పైగా భారత, చైనాల మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, నేటికీ అనేక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో పాంగాంగ్ త్సో ప్రాంతంలో, అలాగే ఆగస్టులో జరిగిన 12వ విడత చర్చల్లో గోగ్రా ప్రాంతంలోనూ బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. రెండు పక్షాలూ కలసి సంయుక్త ప్రకటన ఇచ్చాయి. కానీ, ఈసారి చర్చల్లో అలాంటి ఏ పురోగతీ లేదు. సంయుక్త ప్రకటనా లేదు. హాట్‌స్ప్రింగ్స్, దెమ్చోక్, దెప్సాంగ్ లాంటి అనేక ఘర్షణాత్మక ప్రాంతాలపై అంగుళమైనా ముందడుగు పడలేదు. పైపెచ్చు, రెండు వర్గాల మధ్య విభేదాలూ బాహాటంగా బయటపడ్డాయి. సరిహద్దుల్లో ఇటీవలి ఘటనలూ ఆ విభేదాలను స్పష్టం చేశాయి. తాజా విడత చర్చలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో జరిగిన సైనిక ఘర్షణ – చైనా సైనికులను కొన్ని గంటలు నిర్బంధించడం లాంటివి బయటకొచ్చాయి. చైనా వైపు నుంచి గతంలో గాల్వన్ లోయలో భారత సైనికుల నిర్బంధ చిత్రాలు లీకయ్యాయి. అలాగే, మరో విషయం. చర్చల తర్వాత అటువైపు నుంచి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేయడం సాధారణం. కానీ, గత కొన్ని విడతల చర్చల్లో చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఈ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. అంటే, చైనా ఈ చర్చలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న మాట. చర్చలు నత్తనడకన సాగుతున్నా డ్రాగన్ పట్టించుకోవడం లేదన్న మాట. ఘర్షణ కొనసాగినా సరే ఆ అగ్రరాజ్యానికి కావాల్సింది ఆధిపత్యమే తప్ప, సమస్యకు పరిష్కారం కాదన్న మాట. తాజా చర్చల్లో వైఫల్యంతో భారత భూభాగంపై చైనా కొనసాగుతోందనే మాట మళ్ళీ పైకొచ్చింది. సరిహద్దులోని వాస్తవ పరిస్థితిని దాచకుండా దేశానికి చెప్పాలంటూ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు భారత ప్రధాని మోదీని ప్రశ్నించాయి. మరోపక్క భారత – చైనా సరిహద్దు ప్రాంతాల్లో అతి కష్టంపై ఈ మాత్రమైనా వెసులుబాటు దక్కినందుకు భారత్ సంతోషించాలంటూ చైనా కటువుగా మాట్లాడుతోంది. సైనిక అధికార ప్రతినిధి చేసిన ఆ అహంభావపూరిత ప్రకటనలో సామరస్యం కన్నా బెదిరింపు ధోరణే కనిపిస్తోంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడట. మరి, ఏకంగా రాజులు, రాజ్యాలే మొండివాళ్ళయితే? చైనా అనుసరిస్తున్న వైఖరి అలాంటిదే. అగ్రరాజ్యం ఆ వైఖరిని మార్చుకుంటే... భారత సరిహద్దులో, తద్వారా ఉపఖండంలో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ, చైనా లక్ష్యం మాత్రం వాస్తవాధీన రేఖను తమకు అనుకూలంగా ఏకపక్షంగా మార్చేసుకోవడమే. మరీ ముఖ్యంగా, దెప్సాంగ్ మైదానప్రాంతాల్లో ఆ పని చేయాలన్నది పొరుగు దేశం లోలోపలి ఆకాంక్ష. డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరే అందుకు సూచిక. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. మూసుకుపోని చర్చల ద్వారాన్ని తెరిచే ఉంచాలి. మలి విడత చర్చలకు సిద్ధమవుతూనే, చైనా ఆటలకు అడ్డుకట్ట వేసే వ్యూహరచన చేయాలి. మన భూభాగం అంగుళమైనా వదలకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చే మార్గాలూ అన్వేషించాలి. కానీ, జగమొండి డ్రాగన్‌కు ముకుతాడు వేయడం మాటలు చెప్పినంత సులభమేమీ కాదు. అదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. -
అఫ్గన్ వాసుల తాకిడితో చమన్ సరిహద్దులను మూసివేసిన పాక్
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో తాలిబన్ల రాక్షస పాలన మళ్లీ తిరిగిరానుందని భావించి అనేక మంది అఫ్గన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశం దాటాలన్న సంకల్పంతో చివరికి ఆస్తులను కూడా వదిలేసి పొరుగు దేశాలకు పయనమవుతున్నారు అఫ్గన్ ప్రజలు. అయితే దేశాన్ని వీడేందుకు బయలుదేరుతున్న వాళ్లకు తాలిబన్ల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుకి వేలాది ప్రజలు చేరుకుంటున్నారు. ఆఫ్గన్ వాసుల తాకిడి పెరగడంతో చమన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. దీంతో చమన్ సరిహద్దుల్లో వేలది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. మరోవైపు అన్ని దేశాల సరిహద్దులు సహా వాటికి దారితీసే చెక్ పోస్టుల వద్ద తాలిబన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు -
సరిహద్దుల్లో భారీగా నిలిచిన వాహనాలు
గరికపాడు (జగ్గయ్యపేట అర్బన్)/నందిగామ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పగటి పూట లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి వెళుతున్న వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. తెలంగాణలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద, నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తెలంగాణలోకి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి వాహనాలను నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలోని కోదాడ పట్టణ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ ఈ–పాస్ లేని వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. రామాపురం చెక్‌పోస్టు మీదుగా రాత్రి నుంచి ఇప్పటివరకు ఈ–పాస్ ఉన్న 700కు పైగా వాహనాలను అనుమతించామని, ఈ–పాస్ లేని 1,500 వాహనాలను వెనక్కు పంపామని తెలిపారు. ప్రయాణికులు ఈ–పాస్‌తో వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణలోని మధిర పట్టణం రెడ్‌జోన్ కావడంతో ఎవ్వరినీ అనుమతించబోమని, ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే వెళ్లనిస్తామని జొన్నలగడ్డ వద్ద పోలీసులు చెప్పారు. దీంతో చేసేదిలేక కొందరు వెనుదిరగగా, అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్న వారిని మాత్రం ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు. -
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఈ-పాస్ తిప్పలు
-
ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. 040–24651119 లేదా 94944 38251 వాట్సాప్ లేదా ఐడీఎస్పీఎట్తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు వివరాలను పంపాలని తెలిపింది. రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబర్, రిజర్వ్ చేసిన బెడ్ టైప్ తదితర సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యం కంట్రోల్ రూమ్‌కు పంపిస్తే.. వారికి అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని వివరించింది. ఈ పత్రం ఆధారంగా రాష్ట్రంలో ప్రయాణించి ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ( చదవండి: వైరల్: కరోనా బాధితులతో డాన్స్ చేయించిన నర్సులు ) -
90 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 70 శాతం మంది వరకు లక్షణాలు లేకపోగా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంటే వైరస్ లక్షణాలు కనిపించేవారి సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది. గతంలో వైరస్ లక్షణాలున్న వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటివి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా కనిపిస్తున్నాయని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోవడం, బాగా తక్కువ లక్షణాలు ఉండటంతో చాలా మంది తమకు ఏమీకాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యక్తులకు వైరస్ వ్యాపించే ప్రమాదం నెలకొందని వైద్యారోగ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సరిహద్దులు, స్కూళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడం, చాలా మంది ఒక్కచోటికి చేరుతుండటంతో.. విద్యార్థులకు కరోనా వ్యాపిస్తోంది. టెస్టులు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండగా.. పరీక్షలు చేయక వెలుగు చూడని వైరస్ బాధితులు ఎందరో ఉన్నారని అంచనా. అలాంటి వారి నుంచి ఇండ్లలో తల్లిదండ్రులకు, పెద్దవయసు వారికి వైరస్ సోకుతోంది. ఇక కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేని సాధారణ స్థితికి వచ్చామన్న భావనతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలా రెండు నెలల్లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లోనూ బెడ్స్ నిండిపోతున్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ 50 నుంచి 60 శాతం మేరకు కరోనా కేసులతో నిండాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కరోనాకు కేటాయించిన 90 ఆక్సిజన్ బెడ్లలో 70 నిండిపోయాయి. 40 ఐసీయూ బెడ్లలో 10 నిండాయి. గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిలో 50 ఆక్సిజన్ బెడ్లలో 30.. 20 ఐసీయూ బెడ్లలో 12 నిండాయి. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో 30 ఐసీయూ బెడ్లలో అన్నీ ఫుల్ అయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొండాపూర్‌లోని కిమ్స్‌లో 34 ఆక్సిజన్ బెడ్లలో 23, ఆరు ఐసీయూలలో నాలుగింటిలో కరోనా బాధితులు చేరారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో 58 ఆక్సిజన్ బెడ్లలో 31, 19 ఐసీయూ బెడ్లలో 13 నిండిపోయాయి. పరిస్థితి ఇలా తీవ్రంగా మారుతుండటంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ సరఫరాకు ఆర్డర్లు పెట్టడంతోపాటు 15 వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్ వయల్స్‌ను తెప్పిస్తున్నారు. 30లక్షల మల్టీ విటమిన్ మాత్రలకు ఆర్డర్ పెట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. ఒక్కరోజే 313 కరోనా కేసులు రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 313 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. వైరస్‌తో మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,664కు చేరినట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 2,98,262 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 943 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. గురువారం 62,972 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 94,82,649కు చేరుకుందని వివరించారు. కాగా.. తెలంగాణలో 1.22 శాతమే వ్యాక్సిన్ వృధా అవుతోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్లు వృధా అయినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవంగా పది శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతాయనే భావనతో.. కంపెనీలే 10 శాతం అధికంగా వ్యాక్సిన్లు ఇస్తాయని, ఈ లెక్కన మన దగ్గర వృథా చాలా తక్కువని వివరించారు. పాఠశాలలు, పక్క రాష్ట్రాల నుంచే.. పాఠశాలల విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి వ్యాప్తి జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సరిహద్దు జిల్లాల్లోనే ఉంటున్నాయి. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అర్హులైన వారంతా టీకాలు వేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం, మరోవైపు పోలీసు, గ్రేహౌండ్స్ బలగాల తనిఖీలు, కూంబింగ్.. అటవీ పల్లెల్లో అలజడి రేపుతోంది. గోదావరి పరిరీవాహక ప్రాంతాతల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచా రంతో గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై మూడు నెలలుగా దృష్టి సారించిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇప్పటికే రెండు పర్యాయాలు సందర్శించిన పోలీసు బాస్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మరోమారు బుధవారం నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారుల బదిలీలు కూడా జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో అనుభవం, ఆసక్తి ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌తో రెడ్అలర్ట్ ఓ వైపు పోలీసుబాస్ పర్యటన, మరోవైపు దేవార్లగూడెం ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవార్లగూడెం – దుబ్బగూడెం గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం నాయకుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతి చెందా డు. దీనిపై స్పందించిన మావోయిస్టులు ఈనెల 6న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, తూర్పు గోదావరి జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నల్లకుంట ఏరియా అర్లపల్లికి చెందిన శంకర్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా పట్టుకున్న పోలీసులు చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునివ్వగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే, గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్ కోసం వేట మొదలుపెట్టారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీకారంగా మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు తనిఖీలు విస్తృతం చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని టీఆర్ఎస్, బీజేపీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. బడే చొక్కారావు, వెంకటేశ్ లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు నేతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. “ఆపరేషన్ ప్రహార్’ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టు దళాలు వీరి నాయకత్వంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాష్ట్ర యాక్షన్ టీం కార్యదర్శి దామోదర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ను టార్గెట్ చేసుకొని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు భూపాలపల్లి, ములుగు అడవుల్లో మకాం వేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే కేకేడబ్ల్యూ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌కు పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అడవులపై పట్టు ఉండడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు భావిస్తున్నారు. -
భారత్, చైనా మిలటరీ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగిం చాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ సోమవారం చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి. రాజ్‌నాథ్ సమీక్ష రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లద్దాఖ్‌లో పరిస్థితులపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, త్రివిధ దళాల అధిపతులు దీనికి హాజరయ్యారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను, ఆయుధ సంపత్తిని తరలించారు. ఈ ప్రాంతంలో భారత్ ఆధిపత్యం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వాస్తవా ధీన రేఖ వద్ద గగనతలంలో చైనా కదలికలపై నిఘాను మరింత పెంచాలని భారత వాయుసేనకు ఆదేశాలు వెళ్లినట్లు చెప్పాయి. అందుకే వివాదాలు: చైనా మంత్రి భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించా రు. ఇరు దేశాల నాయకత్వం విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌తో అన్ని అంశాలపై చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒప్పందాల ఉల్లంఘనే: భారత్ తాజాగా చైనా బలగాలు వాస్తవాధీన రేఖ వద్ద పాల్పడిన దుందుడుకు చర్యపై భారత్ స్పందించింది. పాంగాంగ్ దక్షిణ తీరంలో యథాతథ స్థితిని పాటించాలంటూ కుదిరిన ఒప్పందాలను చైనా లక్ష్యపెట్టలేదని స్పష్టం చేసింది. ఆగస్టు 29, 30న పాంగాంగ్ దక్షిణ తీరంలో ఆ దేశ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయంది. ఒప్పందాలను గౌరవించకుండా చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్ ఏసీ) వద్ద దేశ ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు భారత బలగాలు సరైన రక్షణాత్మక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరుదేశాల కమాండర్లు చర్చలు జరుపుతుండగానే చైనా కవ్వింపు చర్యలకు దిగిందన్నారు. -
సరిహద్దులు తెరిచిన ఈయూ
పారిస్: యూరోపియన్ యూనియన్ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికాను ఈ జాబితా నుంచి మినహాయించారు. చైనాను ఈ జాబితాలో చేర్చి, రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. అలాగే చైనా కూడా యూరోపియన్ దేశాలకు సహకరించాలనే షరతుతో యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే దేశాలకు షరతులు లేకుండా సరిహద్దులను తెరిచారు. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ ఓటింగ్ విధానం ద్వారా అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటేనెగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ట్యునీషియా దేశాల సరిహద్దులను తెరిచింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సభ్య దేశాలపై ఉంటుందని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. (ముప్పున్న వారికే ముందుగా టీకా!) -
బోర్డర్ టెన్షన్
-
కరోనా: కేరళపై గరం గరం
తిరువనంతపురం: కేరళలోని కాసర్గాడ్ జిల్లా కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో గత నెలలో కేరళతో ఉన్న సరిహద్దులను కర్ణాటక మూసేసింది. రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీసిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాజాగా తమిళనాడుతో ఉన్న సరిహద్దులను కేరళ మూసింది. తమిళనాడులో కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేరళ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గత వారం తమిళనాడుకు చెందిన రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్‌ను కేరళ పోలీసులు అనుమతించకపోవడంతో అతడు చనిపోయాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులను ఎంత బతిమాలినా జాలిచూపలేదని అంబులెన్స్ డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటన గురించి తిరువనతపురం కలెక్టర్‌ను కె. గోపాలకృష్ణన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. సాధారంగా అంబులెన్స్‌లు, అత్యవసర సరుకుల వాహనాలను పోలీసులు అడ్డుకోరని చెప్పారు. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమిళనాడులోని కొన్ని దక్షిణాది జిల్లాలు వైద్య అవసరాల కోసం కేరళ మీద ఆధారపడ్డాయని, అర్థాంతరంగా సరిహద్దు మూసివేస్తే ప్రజలు ఏమైపోతారని హక్కుల కార్యకర్త మార్తాండం పి సెల్వరాజ్ ప్రశ్నించారు. కర్ణాటక సరిహద్దులు మూసివేయగానే దాన్నో పెద్ద జాతీయ వివాదం చేసిన కేరళ ఇప్పుడు అదే తప్పు చేసిందని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. చదవండి: కర్ణాటక, కేరళ మధ్య ‘కరోనా చిచ్చు’ -
షిప్పింగ్ కంపెనీలో పని చేసేందుకు వెళ్లి..
-
ఏపీకు వచ్చే అన్ని సరిహద్దుల మూసివేత
-
సరిహద్దుల్లో సైన్యం డేగకన్ను
శ్రీనగర్/జమ్మూ: పాక్ నుంచి సొరంగాలు, కందకాల ద్వారా అక్రమ చొరబాట్లు, డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా వంటి వాటిపై సైన్యం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తనిఖీలు, నిఘాతో సరిహద్దుల వెంబడి డేగకన్ను వేశాయి. చొరబాట్లను నివారించేందుకు మూడంచెల గ్రిడ్‌ను హై అలర్ట్‌లో ఉంచాలని సైనిక, పరిపాలన యంత్రాంగాలను జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కోరారు. కశీ్మర్, పంజాబ్‌లలో పాక్‌తో ఉన్న వెయ్యి కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సొరంగాలు, కందకాల ద్వారా సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించేందుకు అవకాశం ఉందన్న అనుమానంతో జవాన్లు భారీగా తనిఖీలు చేపట్టారు. సొరంగాల జాడ కనిపెట్టేందుకు మూడంచెల సరిహద్దు కంచె వెంబడి నిర్ణీత లోతున్న కందకాలు తవ్వి, భూమిని దున్నుతున్నారు. గత వారం జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్లో సైన్యం కళ్లుగప్పి దేశంలోకి ప్రవేశించిన పాక్ యువకుడిని సైన్యం పట్టుకుంది. అతడు సరిహద్దుల్లో కంచెను దాటకుండానే చొరబడినట్లు గుర్తించిన సైన్యం..అక్రమ చొరబాట్ల కోసం పాక్ ఆర్మీ సరిహద్దుల్లో తవి్వన కందకాలు, సొరంగాల గుండానే అతడు వచ్చి ఉంటాడని అనుమానిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవాన్లు సరిహద్దుల్లో కందకాలు, సొరంగాలను కనిపెట్టేందుకు పంజాబ్, జమ్మూలలో ప్రత్యేక సెన్సార్లు, ఆధునిక టెక్నాలజీలతో అణువణువూ తనిఖీలు చేపట్టారు. చీనాబ్ నది గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబాట్లను నిలువరించేందుకు నదిలో గస్తీని పెంచింది. భారత గగనతలంలోకి చొరబడే డ్రోన్లను తక్షణమే కూల్చి వేయాలని ఆదేశించింది. సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పహారాను ముమ్మరం చేసింది. కశ్మీర్లో ఎన్ఎస్ఏ దోవల్ పర్యటన పాకిస్తాన్ ఆర్మీ ప్రేరేపిత చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చొరబాటు నిరోధక గ్రిడ్‌ను అప్రమత్తంగా ఉంచాలని, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచాలని ఎన్ఎస్ఏ దోవల్ ఆదేశించారు. కశీ్మర్ లోయలో ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన శ్రీనగర్‌లో అధికార యంత్రాంగం, భద్రతా అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. పాక్ నుంచి భారీగా అక్రమ చొరబాట్లకు అవకాశం ఉందన్న సమాచారంపై ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చొరబాట్ల వ్యతిరేక గ్రిడ్‌ను హైఅలెర్ట్‌లో ఉంచాలని ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారులను కోరారు. -
సరిహద్దులో 24 గంటలు నిఘా పెంచాలి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఎన్నికల వరకు 24 గంటలు గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్ హనుమంతరావు పోలీసులు, ఎక్సైజ్, ఎన్నికల అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఎస్పీ శ్రీధర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో మాడ్గి, హుసెళ్లి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా మద్యం, డబ్బులు రాకుండా ఉండేందుకు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టాలన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని, ఆయా మార్గాల్లో కూడా నిఘా పెంచాలని ఆయన పోలీసులు, అధికారులను ఆదేశించారు. బంగారం, మద్యం, డబ్బులు రాకుండా ఉండేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక సరిహద్దులోని గ్రామాల్లో ఎన్నికలకు రెండు రోజుల ముందు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు కూడా గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీదర్ జిల్లా నియోజకవర్గం సరిహద్దులో ఉందని, అక్రమంగా మద్యం, డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున, నివారణకు పూర్తి సహకారం అందించాలని బీదర్ ఎస్పీని కోరారు. కర్ణాటక నుంచి మద్యం, డబ్బులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీదర్ ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ సరిహద్దులో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం, అక్రమంగా డబ్బులు రాకుండా 24 గంటల పాటు తనిఖీలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారి అబ్దుల్ హమీద్, డీఎస్పీ నల్లమల రవి, ఎక్సైజ్ సీఐ ఆశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
కొస్టారికా, పనామా సరిహద్దుల్లో భూకంపం
-
సరిహద్దుల్లో శరణార్థులు !
ఉన్న ఊరు పొమ్మంటోంది. నిలువ నీడ లేకుండా చేస్తోంది. చీటికి మాటికి ఎన్నికలతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, గంటకో హత్యతో వీధుల్లో నెత్తుటి ఏళ్లు, ఎటు చూసినా హింసాత్మక వాతావరణం, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గృహహింసతో వాళ్లంతా పొట్ట చేత పట్టుకొని అమెరికాకు బయల్దేరారు. మధ్య అమెరికాలోని హోండరస్, ఎల్ సల్వాడర్ వంటి దేశాల నుంచి మార్చి 25న 400 మంది వలసదారులు మూటముల్లె సర్దుకొని పిల్లా పాపలతో బతుకు తెరువు వెతుక్కుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. నెల రోజుల పాటు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కొంత దూరం కాలినడకన, మరికొంతదూరం వాహనాల్లో ఎలాగైతేనేం అమెరికా, మెక్సికో సరిహద్దులకి చేరుకున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ వీరికి సహకారం అందించడమే కాదు, అమెరికాలో ఆశ్రయానికి చట్టపరంగానే అనుమతులు కోరింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితులతో వాళ్లని సరిహద్దుల్లోనే అధికారులు నిలిపివేశారు. ఒక్క వంతెన దాటితే చాలు, వాళ్లకి నిశ్చింతగా ఆశ్రయం దొరికి ఉండేది, కానీ అమెరికా అధికారులు వాళ్లపై పిడుగులాంటి వార్త పడేశారు. ఇప్పటికే పరిమితికి మించి శరణార్థుల్ని దేశంలోకి అనుమతినిచ్చామని, కొత్త వాళ్లకి ఇక ప్రవేశం కష్టమేనని అధికారులు తేల్చేశారు. అలా ఆశ్రయం కోరి వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉండడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలీక, ఎవరి దగ్గర తలదాచుకోవాలో అర్థం కాక ఆ వంతెన దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. రోడ్ల మీదే నిద్రపోతున్నారు. అమెరికా ఆశ్రయం ఇచ్చేవరకు తాము ఈ ప్రాంతం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పేశారు. శరణార్థులపై ట్రంప్ కఠిన వైఖరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుంచే మెక్సికో నుంచి వచ్చే వలసలపై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. వారంతా రేపిస్టులు అని, సరిహద్దుల్లో గోడ కట్టేస్తానంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆశ్రయం కోరి వచ్చిన వారిపై కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు. మధ్య అమెరికా దేశాల నుంచి శరణార్థుల ప్రయాణం ప్రారంభమైన దగ్గర్నుంచే ట్రంప్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. దేశ భద్రతను దెబ్బతీయడానికే స్మగ్లర్లు, నేరచరిత్ర ఉన్నవారే తమ తమ దేశంలోకి చొచ్చుకు వస్తున్నారని, వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి శరణార్థులకు ఎక్కువగా ఆశ్రయం ఇస్తున్న దేశం అమెరికాయే. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆశ్రయం కోరవచ్చు. వారు శరణార్థుల గత చరిత్రని పరిశీలించాక అనుమతిలిస్తున్నాయి. తర్వాత తర్వాత నెమ్మదిగా వారు అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందుతున్నారు. గత ఏడాది ఆఖరి మూడు నెలల్లోనే 30 వేల మంది శరణార్థులు తమకు ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకోగా వారిలో 20 వేల మంది వరకు అక్రమంగానే దేశంలోకి ప్రవేశించారు. ఇలా ఒక ప్రవాహంలా వస్తున్న శరణార్థులపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుర్భరమైన పరిస్థితుల్ని తప్పించుకోవడానికో, బతుకు తెరువు కోసమో కాకుండా మంచి ఉద్యోగాలు చేసి లగ్జరీ లైఫ్ కోసమే వారంతా వస్తున్నారని, అలాంటి వారికి ఎందుకు ఆశ్రయం ఇవ్వాలంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లీ బిడ్డల్ని వేరు చేస్తున్నారు శరణార్థుల్ని భయభ్రాంతులకి లోను చేస్తే అమెరికా వైపు కూడా కన్నెత్తి కూడా చూడరని ట్రంప్ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. సరిహద్దుల్లోనే తల్లిదండ్రుల నుంచి వారి బిడ్డల్ని వేరు చేస్తోంది. ఆ బిడ్డలు ఎంత పసివాళ్లు అన్నది కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పత్రాలు లేవనో, మరేదో సాకు చూపించి పసిగుడ్డుల్ని కూడా బలవంతంగా తల్లిదండ్రుల నుంచి లాక్కొని హోమ్స్‌కి తరలిస్తున్నారు. గత ఏడాది హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శిగా పని చేసిన జాన్ ఎఫ్ కెల్లీ తొలిసారిగా ఈ వ్యూహాన్ని అమలు చేశారు. అక్రమ వలసల్ని అడ్డుకోవాలంటూ వైట్ హౌస్ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే తాము ఇలాంటి చర్యలకు దిగుతున్నామంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సమర్థించుకుంటోంది. గత కొన్ని నెలల్లోనే వందల సంఖ్యలో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేశారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి ఇలా బిడ్డల్ని వేరు చేస్తే, ఆ చిన్నారులపై మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల : దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ సాగిస్తున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆరంభమైన మావోయిస్టుల కార్యాకలాపాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో కాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో, ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాదికారులు పలుమార్లు సమావేశమయ్యారు. మావోయిస్టులపై పట్టు సాధించే దిశగా సమాలోచనలు సాగించారు. ఆ తరువాత నుంచి జాయింట్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అటు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భష్త్రపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ సాగుతోంది. సరిహద్దులోని ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దులో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌కు తోడు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున తనిఖీలు సాగుతున్నాయి. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే వచ్చే ప్రధాన రహదారులలో మోహరిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు అణువణువునా తనిఖీలు సాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను ఉంచారు. మరో రెండు నెలల పాటు సరిహద్దులో ఇదే పరిస్థితి ఉండవచ్చని సమాచారం. -
పోలీస్ స్టేషన్లకు హద్దుల్లేవ్!
ఏదైనా నేరం జరిగితే బాధితులు ఫిర్యాదు చేసేందుకు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళతారు. అయితే అత్యధికులకు ఎదురయ్యేది స్టేషన్ల పరిధి సమస్య. నగరంలో మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 60, సైబరాబాద్‌లో 36, రాచకొండలో 42 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా ఒకటే అయినా.. సాంకేతికంగా వేర్వేరు ప్రాంతాలు. ఒకే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వేర్వేరు పోలీసుస్టేషన్ల పరిధిలోకి వస్తుంటాయి. సరిహద్దుల్లో నేరం జరిగితే ఎవరి పరిధిలోకి వస్తుందో తేలక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై ఏ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే. సాక్షి, సిటీబ్యూరో: ఏదైనా నేరం బారినపడిన బాధితులు తమకు జరిగిన అన్యాయం, ఎదురైన సమస్యలపై స్పందించమంటూ సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు పరిగెడతారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రాంతం సదరు ఠాణా పరిధిలోకి రాకుంటే... మరో ఠాణాకు వెళ్లమంటూ అధికారులు పంపిస్తుంటారు. ఇకపై కీలకాంశాల్లో ఇలా చేయడానికి కుదరదు. శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన అంశాలపై సమాచారం/ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధులతో సంబంధం లేకుండా స్పందించాల్సిందే. ఈ మేరకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించిన అధికారులు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫస్ట్‌లాన్సర్ ఉదంతంతో కదిలి.. ఇటీవల హుమయూయున్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఓ ఉదంతం జరిగింది. రెండు అల్లరి మూకల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన ప్రాంతం హుమయూన్ నగర్, బంజారాహిల్స్ ఠాణాల పరిధుల మధ్య ఉంది. దీంతో కొంత గందరగోళం ఏర్పడి పోలీసుల రాక ఆలస్యమైంది. దీన్ని ఉన్నతాధికారులు తీవ్రంగాపరిగణించారు. ఇకపై అలా కుదరదంటూ.. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో ఇకపై సరిహద్దులు, పరిధులు పట్టించుకోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రాథమికంగా ఎవరికి సమాచారం వస్తే వారు తక్షణం స్పందించాలని, ఘటనాస్థలికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాతే పరిధుల విషయం చర్చించాలంటూ ఎస్ఓపీ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈ పరిధుల అంశంలో ఇకపై సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నాం. మరోపక్క ఆక్టోపస్ కమాండోల మోహరింపు విషయంలోనూ కీలక మార్పులు చేశాం. ఇప్పటి వరకు ఆక్టోపస్ కమాండోలు ఏదో ఒక ప్రాంతంలో స్టాండ్ బైలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలా ఓ చోట ఉండటానికి బదులు నగరంలోకి కీలక ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో మోహరించాలని డీజీపీ నిర్ణయించారు. అందులో భాగంగానే గురువారం అసెంబ్లీ, సెక్రటేరియేట్స్ వద్ద వీరిని మోహరించాం. ఇకపై ప్రతి రోజూ వ్యూహాత్మకంగా వీరిని మోహరించనున్నాం’ అని తెలిపారు. ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 సిటీ సెంటర్ వైపు బంజారాహిల్స్ ఠాణా పరిధిలోకి, రోడ్డుకు ఇటున్న కేర్ ఆస్పత్రి ప్రాంతం పంజగుట్ట స్టేషన్ పరిధిలోకి వస్తాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో కోణార్క్ థియేటర్ రోడ్డుకు ఓ వైపు రాచకొండ కమిషనరేట్లోది కాగా, మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్లోనిది. ఇలాంటి చోట్ల నేరం జరిగితే సరిహద్దుల సమస్య తలెత్తుతుంది. -
మళ్లీ మొదటికి..
గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విస్తరణకు సంబంధించి గతంలోనే టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా దూరం ప్రాతిపదికన కాకుండా.. పట్టణీకరణ చెందుతున్న గ్రామాలను మాత్రమే మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సంగారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఇటీవల ప్రతిపాదనలు రూపొందించింది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సంగారెడ్డి, సదాశివపేటలో ఏడేసి, జహీరాబాద్‌లో పది, అందోలు–జోగిపేట నగర పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ చొప్పున మొత్తం 25 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత విలీన గ్రామ పంచాయతీల తీర్మానం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా.. అన్ని చోట్లా విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి.. మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. మున్సిపాలిటీ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి.. వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామ పంచాయతీలను మాత్రమే విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. కొత్తగా జనావాసాలు, వెంచర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని ప్రతిపాదించారు. తాజా ఆదేశాల ప్రకారం పట్టణీకరణ చెందుతున్న నాగాపూర్, మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కందిగ్రామాలు మాత్రమే విలీనమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సమావేశం.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సరిహద్దుల విస్తరణ, కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన జాన్ ఎఫ్ కెన్నడీ శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల మున్సిపల్ అధికారులు, డీపీఓలతో సమావేశమయ్యారు. సోమవారం సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు, సరిహద్దు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక అధికారి సూచనలు చేస్తున్నారు. కాగా 20వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కోసం ప్రతిపాదనలు రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెల్లాపూర్, కోహిర్ జనాభా 15వేలకు మించడం లేదు. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే తప్ప ఈ రెండు పంచాయతీలకు నగర పంచాయతీ హోదా దక్కేలా లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉండడంతో అమీన్పూర్ (జనాభా 36,452)ను కూడా ప్రస్తుతానికి నగర పంచాయతీ హోదా ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. బొల్లారం, నారాయణఖేడ్ గ్రామ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ మొదటికి! గ్రామ పంచాయతీ 2011 జనాభా సమీప గ్రామాలు కలిస్తే.. అమీన్పూర్ 36,452 44,132 బొల్లారం 34,667 36,480 నారాయణఖేడ్ 18,243 30,418 కోహిర్ 15,075 29,310 తెల్లాపూర్ 14,403 15,087 -
10 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు.. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు 10 వేల కిలోలకు పైగానే ఉంటాయని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో 49.44 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను తమ సిబ్బంది పట్టుకున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను బీఎస్ఎఫ్ బలగాలు బారీగా స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా 8,807 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న 439.21 కిలోల డ్రగ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌తో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను సైతం బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు.
-
సరిహద్దు తేలలేదు..!
► కొత్త జిల్లాల స్వరూపంపై అయోమయం ► సరిహద్దుల విషయంలో నెలకొన్న అస్పష్టత ► ఇప్పటికీ తయారు కాని జిల్లాల మ్యాప్‌లు ► అన్ని విభాగాల్లోనూ అరకొరగా సమాచారం ► క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం సాక్షి, హైదరాబాద్: దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను అట్టహాసంగా ప్రారంభించినా.. వాటి సరిహద్దుల విషయంలో అస్పష్టత నెలకొంది. ఏ జిల్లా పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి.. వాటి సరిహద్దులేమిటనే గందరగోళం క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కొత్త నైసర్గిక స్వరూపాన్ని సూచించే జిల్లాల రేఖా చిత్రపటాల(మ్యాప్‌లు)ను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో కొత్త జిల్లాలకు వెళ్లిన అధికారులు సైతం అరకొర సమాచారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆగస్టులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాను ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం 27 జిల్లాల మ్యాప్‌లను సైతం విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో వీటిని పొందుపరిచింది. తీరా కొత్త జిల్లాలు కొలువు దీరిన తర్వాత మ్యాప్‌ల ప్రస్తావన లేకుండా వెబ్సైట్లో నుంచి పాత మ్యాప్‌లను సైతం అధికారులు తొలిగించారు. మ్యాప్‌ల తయారీ బాధ్యతలను రెవెన్యూ, సీసీఎల్ఏ విభాగం తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(ట్రాక్)కు అప్పగించింది. ఇప్పటికీ అధికారికంగా రాష్ట్ర చిత్రపటంతో పాటు జిల్లాల మ్యాప్‌లను సైతం ట్రాక్ విడుదల చేయలేదు. పాత జిల్లాల్లో ప్రతి జిల్లాకో వెబ్సైట్ ఉంది. అందులో ఆయా జిల్లాకు సంబంధించిన విశేషాలు, వివిధ రంగాల విశిష్ఠతలు, అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలన్నీ పొందుపరిచారు. కొత్త జిల్లాలకు వెబ్సైట్లను ఏర్పాటు చేసి.. వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే దిశగా చర్యలు ముందుకు సాగటం లేదు. అలాగే ఏ జిల్లాలో పట్టణ జనాభా ఎంత.. గ్రామీణ జనాభా ఎంత అనేది ఆయా జిల్లా అధికారులు సైతం అంచనా వేసుకోలేని పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. కలెక్టర్లు సహా ఉద్యోగులు అప్ అండ్ డౌన్ అధికారులను ప్రజల చెంతకు చేర్చడంతో పాటు సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నందున క్షేత్రస్థాయిలో కనీస సమాచారం అందుబాటులో లేకుండాపోయిందని జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎక్కువ జిల్లాలున్న వివిధ రాష్ట్రాలకు సీనియర్ అధికారులను పంపి అధ్యయనం చేసిన ప్రభుత్వం ఆరంభంలో ఉండే ఇబ్బందులపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు జిల్లా కేంద్రాల్లో అప్ అండ్ డౌన్ డ్యూటీలకు పరిమితమయ్యారు. రాజధానికి సమీపంలో ఉన్న జిల్లాలకు నియమితులైన కొందరు కలెక్టర్లు హైదరాబాద్ నుంచే వెళ్లి వస్తున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో పాలన కుదుటపడలేదు. కొత్త కలెక్టరేట్లకు ప్రతిపాదనలు కొత్త జిలాల్లో కలెక్టరేట్లు సహా విభాగాలన్నీ తాత్కాలిక భవనాల్లో సర్దుబాటు చేశారు. దీంతో సమావేశాలకు, సమీక్షలకు కనీస సదుపాయాలు కరవై అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 30 కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ సముదాయం నిర్మిస్తామని పునర్వ్యవస్థీకరణకు ముందే సీఎం వెల్లడించారు. దాదాపు రూ.800 కోట్లు ఖర్చుతో వీటిని నిర్మించేందుకు అంచనాలు సైతం సిద్ధం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక అవసరాలకు జిల్లాకో రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సైతం ఫైళ్లు కదుపుతోంది. ఇటీవలే ఒక ప్రైవేటు ఏజెన్సీ రాష్ట్రంలో అవసరమైన జిల్లా కేంద్రాలన్నింటా కలెక్టరేట్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. డిజైన్ల తయారీతో పాటు నిర్మాణ పర్యవేక్షణకు అంచనా వ్యయంలో ఒకటిన్నర శాతం ఫీజుగా చెల్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
పాక్ భారత్ సరిహద్దుల్లో భారీ స్కెచ్.!
-
ఇదిగో భారత్.. అదిగో పాక్..
సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఆయన రాకను అక్కడి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్ నాథ్ ను పాక్ లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించాయి కూడా. ఇటీవల కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలకు మద్దతుగా పాకిస్థాన్ లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఉగ్రవాద సంస్థల నాయకులు ఏకంగా సరిహద్దుల్లోనే బైఠాయింపునకు దిగారు. భారత్ తో సరిహద్దును పంచుకుంటున్న అన్ని దేశాల కంటే పాకిస్థాన్ తోనే మనకు అనేక సమస్యలు! ఇరుదేశాల మధ్య ఇప్పటికే మూడు పెద్ద, ఒక చిన్న యుద్ధాలు జరిగాయన్న సంగతి తెలిసిందే. ఈశాన్యంలో బంగ్లాదేశ్.. ఉత్తరాన చైనా.. దక్షిణాన హిందూ మహాసముద్ర ద్వీపదేశం శ్రీలంక.. ఇలా భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నీ ఏదోఒక సందర్భంలో మనతో కయ్యానికి దిగినవే. వాయువ్యంలోని పాకిస్థాన్ సంగతి సరాసరే! నిత్యం ఉద్రిక్తవాతావరణాలతో ఇండో-పాక్ సరిహద్దు 'ప్రపంచంలోని కల్లోల సరిహద్దుల్లో' ఒకటిగా నిలిచింది. సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే దాయాది దేశంతో మనది చారిత్రక బంధం! 1947లో దేశ విభజన, భారత్- పాక్ ల మధ్య 2,900 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు ఏర్పడింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ)గా పిలిచే ఈ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చాలా చోట్ల ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. కొన్ని చోట్ల సాయుధులు పహారా కాస్తుంటారు. ఎల్ వోసీ వద్ద ఇరుదేశాలు కలిపి దాదాపు 50వేల స్తంభాలు, 1.5 లక్షల ఫ్లడ్ టైట్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట ఆ ఫ్లడ్ లైట్ల కాంతి అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య నాసా ఉపగ్రహం తీసిన భారత్- పాక్ సరిహద్దు ఫొటోల్లో ఆ వెలుగు స్పష్టంగా కనిపించింది. సరిహద్దుల్లోని విభిన్న ప్రాంతాల అరుదైన ఫొటోలు కొన్ని మీకోసం.. 1. నీలం నదికి అటూఇటూ చీలిపోయిన కేరన్ గ్రామం. 2. ఇరుదేశాలను వేరు చేసే చకోటి నది. 3. పిక్నిక్ కు వెళ్లినట్లుగా ప్రజలు నిల్చున్న ఈ చోటు చలియానా లోయలోని అంతర్జాతీయ సరిహద్దు. నీలం ప్రవాహనికి అటుఇటుగా చీలిపోయిన చలియానా గ్రమస్తులు ఒడ్డున నలబడి అరుపులతో సంభాషించుకుంటారు. 4. లల్హూన్- గోవిందీ రోడ్డుకు ఇటు ఇండియా, అటు పాక్. 5. ప్రఖ్యాత వాఘా సరిహద్దు. వాఘా గ్రామం నుంచి అటు 15 కిలోమీటర్లదూరంలో లాహోర్, ఇటు 32 కిలోమీటర్ల దూరంలో అమృత్ సర్ పట్టణాలున్నాయి. 6. సుచేత్ ఘర్ (కశ్మీర్)లోని జీరో లైన్ 7. పంజాబ్ లోని కౌసర్ జిల్లా గుండాసింగ్ వాలా సరిహద్దు. 8. చకోటి నదిపై నిర్మించిన అంతర్జాతీయ వారధి. 9. పాక్ పంజాబ్ లోని సియాల్ కోట్ అంతర్జాతీయ సరిహద్దు. 10. నాసా ఉపగ్రహం పై నుంచి తీసిన భారత్-పాక్ సరిహద్దు ఫొటో. -
హద్దులు దాటుతున్న మైనింగ్ మాఫియా
♦ కాల్సైట్ తవ్వకాల్లో నిబంధనలకు పాతర ♦ మామ్మూళ్ల మత్తులో అధికారులు అనంతగిరి: మండలంలోని వాలాసి పంచాయతీ నిమ్మలపాడులో నిబంధనలకు విరుద్ధంగా కాల్సైట్ మైనింగ్ చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వ్యక్తమవుతోంది. రూ. కోట్లు విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడం వారి నిబద్ధతకు అద్దం పడుతోంది. వాలాసి పంచాయతీ రాళ్లగరువు, కరకవలస, నిమ్మలపాడుల్లో గిరిజనుల పేరిట ఉన్న దుర్గా సోసైటీ ఆధ్వర్యంలో 3.5 హెక్టార్లు విస్తీర్ణంలో కొన్నేళ్లుగా మైనింగ్ జరుపుతున్నారు. ఈ క్వారీని ఆనుకొని ఉన్న ఏపీఎండీసీకి చెందిన క్వారీలో మైనింగ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో 5.96 హెక్టార్లల్లో కాల్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీ టెండరు పిలిచింది. టెండర్లు ఖరారు కాక ముందే సంస్థకు చెందిన స్థలంలోకి కొందరు చొరబడి తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను సైతం జరిపి తవ్వకాలు కొనసాగిస్తున్నారన్నది వాదన. లారీలతో బొడ్డవరకు రవాణా చేస్తున్నప్పుడు మలుపుల వద్ద తెల్లరాయి రోడ్డుపై పడుతోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే బిల్లుతో అక్రమ రవాణా... మైనింగ్‌తో పాటు కాల్సైట్ రవాణా సైతం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. నిమ్మలపాడు మైనింగ్ ప్రాంతం నుంచి విజయనగరం జిల్లా బొడ్డ వరకు రోజూ 20 నుంచి 30 లారీల లోడ్లు రవాణా చేస్తున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు మూడు లోడ్లు తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం విషయంలో మైనింగ్ అధికారులు చేతులు ఎత్తేయడంతో మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఈ క్వారీపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి కేసు నమోదు చేశారు. దుర్గా సొసైటీ పేరుతో క్వారీని నడుపుతున్న బినామీ వ్యక్తి తన పలుకుబడితో ఆ కేసును మాఫీ చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మండల తహసీల్దార్ రాణీ అమ్మాజీ మాట్లాడుతూ సర్వేయర్ అందుబాటులో లేరని, వచ్చిన వెంటనే సర్వే చేపట్టి హద్దులు నిర్ణయిస్తామన్నారు.అక్రమాలు జరిగినట్టు రుజువైతే కేసు నమోదు చేస్తామన్నారు. -
పట్టుచీరకు బ్లౌజ్ బొట్టు
పట్టు చీర కడితే పండగ వచ్చేసినట్టే. పండగ కళ రావాలంటే పట్టు చీర కట్టాల్సిందే. దీపాల వెలుగుల్లో మహాలక్ష్ముల్లా మెరిసిపోవడానికి పట్టు చీరలు రెపరెపలాడాల్సిందే! వరుసగా పెళ్లిళ్లు కూడా రావడంతో పట్టు చీరలు సందడిచేసే సమయం ఇదే! మీదైన ప్రత్యేకత వేడుకలో కనిపించాలంటే బ్లౌజ్ మీద దృష్టి పెట్టాలి. చీరకు తగిన బ్లౌజ్ కాదు, చీరను బ్రైట్ చేసే బ్లౌజ్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నుదుటికి బొట్టులా చీరకు బ్లౌజ్ ఓ తరగని అందం. జరీ అంచుల మెరుపులు పట్టు చీరకు ఎంతో అందాన్ని తీసుకువస్తాయి. జరీ లైన్స్, బార్డర్స్, మోటిఫ్స్.. వీటిలోనే పట్టు చీరలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే బ్లౌజ్ డిజైన్స్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. - ఎన్ .ఆర్ భిన్నమైన రంగులు పట్టు చీర కొన్నాక అందులోనూ బ్లౌజ్‌కి సరిపడా క్లాత్ ఉంటుంది. దీంతోనే బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటారు. చీర రంగుకు పూర్తి భిన్నమైన రంగు బ్లౌజ్‌లు, విభిన్న మోడళ్లలో డిజైన్ చేయించుకుంటే సందర్భానుసారం స్టైల్‌గా మెరిసిపోవచ్చు. ఎంబ్రాయిడరీ కీలకం జరీ, కుందన్స్, స్టోన్స్‌ను ఉపయోగించే చేసే మగ్గం వర్క్ బ్లౌజ్‌లు చూపుతిప్పుకోనివ్వకుండా డిజైన్ చేస్తున్నారు. వీటి కన్నా కేవలం పట్టు క్లాత్‌ను ఉపయోగించి మాత్రమే డిజైన్ చేసిన బ్లౌజ్‌లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్లకు వాడే బ్లౌజ్‌లలో ఎక్కువ మగ్గం వర్క్ చూస్తుంటాం. కానీ ప్రముఖ డిజైనర్స్ మాత్రం ఎంబ్రాయిడరీని ఉపయోగించకుండా పట్టు క్లాత్‌తోనే మోడ్రన్ డిజైన్స్ సృష్టిస్తున్నారు. ఫ్రంట్అండ్ బ్యాక్ నెక్ ఎప్పుడూ రౌండ్, స్క్యేర్ టైప్ కాకుండా బోట్ నెక్, హై నెక్, లెహంగా జాకెట్ స్టైల్.. ఇలా భిన్నమైన డిజైన్లు ఈ బ్లౌజ్లకు ఉపయోగించవచ్చు. ఈ డిజైన్ బ్లౌజులు ధరించడం వల్ల ఆధునికంగా కనిపిస్తారు. బాక్ నెక్స్‌లో క్రాస్, బ్రాడ్.. డిజైన్స్ ఈ కాలానికి తగ్గట్టుగా బాగా నప్పుతున్నాయి. స్లీవ్స్... స్లీవ్‌లెస్... పట్టు చీరల మీదకు ఒకే తరహా స్లీవ్స్ కాకుండా బుట్టచేతులు, లాంగ్, త్రీ బై ఫోర్త్.. ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ స్లీవ్స్ ఇప్పటి ట్రెండ్‌లో ముందున్నాయి. చీర అంచు అంతా ఇంకాస్త ఎక్కువగానే బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం నిండైన వెలుగునిస్తుంది’ అంటారు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైన్ గౌరంగ్‌షా, మనీషా మల్హోత్రాలు. -
'సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే'
-
సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే: కేసీఆర్
ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు ఆర్డినెన్సును తయారు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల సరిహద్దులను మార్చాలనుకుంటే.. రాజ్యాంగంలోని మూడో అధికరణం ప్రకారం రెండు రాష్ట్రాలను సంప్రదించాల్సిందేనని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు ఈ విషయం కోసం తొందర పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఒకవేళ రెండు రాష్ట్రాలను సంప్రదించకుండా సరిహద్దులను మారిస్తే మాత్రం అది అప్రజాస్వామికమే అవుతుందని కేసీఆర్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే డ్యాం ఎత్తు తగ్గించి, గిరిజనుల ఆవాసాలు ముంపు బారిన పడకుండా చూసుకుని కొత్త డిజైన్ ప్రకారం ప్రాజెక్టు కడితే ఎవరికీ ఇబ్బంది ఉండబోదని, అలాంటప్పుడు తాము కూడా ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. భద్రాచలం తెలంగాణలో ఉండి, దాని పరిధిలో ఉండే ఏడు మండలాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం సమంజసం కాదని అన్నారు. -
తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు మధ్య అడ్డు గోడలివే..