సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ఛతీస్‌గఢ్, భద్రాచలం దగ్గరలోని కుంట్ల, పుదుచ్చేరిలోని యానాంలో రిక్రియేషన్ క్లబ్బులను మూసేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
గతంలో విపరీతంగా కొనసాగిన జూద క్లబ్బులను రిక్రియేషన్‌లో భాగంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మూసివేశాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులో ఉండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దోచుకుంటున్న ఈ క్లబులను వెంటనే మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రులను, హోం శాఖామాత్యులను కలిసి విన్నవించామన్నారు.
దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని క్లబ్బులను గతంలో మూసివేశారని, యానాంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లబ్బులపై కలెక్టర్ దాడి చేసి సొసైటీని రద్దు చేసి సీజ్ చేశారని తెలిపారు. చెన్నై నగరంలో రిక్రియేషన్ పేరుతో నడిచే పేకట క్లబ్ ల గురించి కూడా త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకెళతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment