హైదరాబాద్: మెల్‌బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై అద్భుత శతకాన్ని సాధించిన మన నితీశ్ కుమార్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశంసలు కురిపించారు. కెరీర్ ఆరంభంలోనే భారత టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ గురించి ఆయన ఇలా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తేజం నితీశ్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు.
ఆయన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మన తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేసిన నితీశ్‌కు నా అభినందనలు. అలాంటి బిడ్డను దేశానికి అందించిన ఆయన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా తెలుగు వారు అన్ని రంగాలలో ముందు ఉంటారని నితీశ్ మరోసారి నిరూపించారు.' అని ఆయన అన్నారు.
స్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అంచులో ఉన్న టీమిండియాను నితీశ్ సెంచరీతో ఆదుకున్నాడు. మన జట్టు ఫాలోఆన్ ఆడుతూ పరాభవం ముంగిట నిలిచిన సమయంలో అతడి అసాధారణ పోరాటం వల్లే నాలుగో టెస్టులో ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం గెలుపు దిశగా భారత్ కొనసాగుతుంది.
#KethireddyJagadishwaraReddy congratulated the greatness of Telugu #Chiranjeevi #NitishKumarReddy who gave the glory of #Telugu's to the world today and congratulated his parents who gave this pearl to the #Indian #nation.@PMOIndia @HMOIndia @revanth_anumula @AndhraPradeshCM pic.twitter.com/Tv3oT7o3e1
— KETHIREDDY JAGADISH (@kethireddyjagad) December 28, 2024
Comments
Please login to add a commentAdd a comment