Melbourne Cricket Ground
-
Ashes Series 2025: చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
మహిళల యాషెస్ సిరీస్‌లోని (Women's Ashes Series 2025) ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (Annabel Sutherland) చరిత్ర సృష్టించింది. ఎంసీజీలో (MCG) (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్) సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ మహిళా క్రికెటర్ ఇక్కడ మూడంకెల స్కోర్ చేయలేదు. 1935, జనవరి 18న ఎలిజబెత్ అలెక్సాండ్రా స్నోబాల్ ఎంసీజీలో అజేయమైన 83 పరుగులు చేసింది. మరో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ (98 నాటౌట్) ఇదే మ్యాచ్‌లో సెంచరీకి చేరువయ్యిందికాగా, మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జనవరి 30 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అన్నాబెల్ సెంచరీ (258 బంతుల్లో 21 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు) చేసింది. 23 ఏళ్ల అన్నాబెల్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో సెంచరీ. కేవలం ఆరు మ్యాచ్‌లో కెరీర్లోనే అన్నాబెల్ ఈ మూడు సెంచరీలు సాధించింది. ఈ మూడు సెంచరీల్లో ఓ డబుల్ సెంచరీ ఉండటం మరో విశేషం.ఆసీస్‌కు భారీ ఆధిక్యంఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అన్నాబెల్ సెంచరీతో కదంతొక్కగా.. బెత్ మూనీ సెంచరీకి (98 నాటౌట్) చేరువైంది. మూనీకి జతగా తహ్లియా మెక్‌గ్రాత్ (9) క్రీజ్‌లో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 45, జార్జియా వాల్ 12, కెప్టెన్ అలైసా హీలీ 34, ఆష్లే గార్డ్నర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ర్యానా మెక్‌డొనాల్డ్ గే ఓ వికెట్ దక్కించుకుంది.అంతకుముందు అలానా కింగ్ (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్ తలో రెండు.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ హీథర్ నైట్ (25), వ్యాట్ హాడ్జ్ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్ 8, మయా బౌచియర్ 2, ఆమీ జోన్స్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 1, లారెన్ ఫైలర్ 8, లారెన్ బెల్ 7 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్ మల్టీ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్.. 12-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి. -
వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్ రెడ్డి
టెస్టు క్రికెట్లోనూ రాణించగలనని నిరూపించానని టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అన్నాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 ఆటగాడు టెస్టుల్లో రాణించగలడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.అయితే, ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన అద్భుత శతకంతో ఈ ఆంధ్ర ఆటగాడు అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. ఈ ప్రదర్శనతో తన సత్తా ఏమిటో చూపించాడు. వారి మాటలు తప్పని నిరూపించాఈ క్రమంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘నా ఆట గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయనే విషయం నాకూ తెలుసు. ఐపీఎల్లో రాణించిన ఆటగాడు ఇక్కడ సరిపోతాడా అని అన్నారు. వారి మాటలను తప్పని నిరూపించాలనుకున్నా. ఇప్పుడు అదే చేసి చూపించా. భారత జట్టు కోసం వంద శాతం శ్రమించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. సెంచరీ సాధించిన క్షణాలు అపూర్వమని నితీశ్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు. కోహ్లి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అతడు అన్నాడు.‘అది చాలా గొప్ప క్షణం. కోహ్లి ఆటను చూస్తూ, అభిమానిస్తూ పెరిగిన నేను ఇప్పుడు అతనితో కలిసి ఆడాను. పెర్త్‌లో కోహ్లి సెంచరీ చేసినప్పుడు మరో ఎండ్‌లో నేనున్నాను. నా ప్రదర్శనను కోహ్లి ఎంతో అభినందించి ప్రోత్సహించాడు. ఇక మిగిలింది అదేచాలా బాగా ఆడావని చెప్పాడు. ఇలాంటి సమయం గురించే నేను కలలుగన్నాను. నా సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించిన సిరాజ్‌కు కృతజ్ఞతలు. నిజానికి నా శతకంకంటే సిరాజ్ చివరి బంతిని డిఫెన్స్ ఆడినప్పుడే మైదానం దద్దరిల్లింది’ అని నితీశ్ గుర్తు చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు బౌలింగ్‌లో కూడా పదును పెంచాల్సి ఉందని నితీశ్ చెప్పాడు. -
క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశంసలు
హైదరాబాద్: మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై అద్భుత శతకాన్ని సాధించిన మన నితీశ్ కుమార్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశంసలు కురిపించారు. కెరీర్ ఆరంభంలోనే భారత టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ గురించి ఆయన ఇలా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తేజం నితీశ్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు.ఆయన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మన తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేసిన నితీశ్‌కు నా అభినందనలు. అలాంటి బిడ్డను దేశానికి అందించిన ఆయన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా తెలుగు వారు అన్ని రంగాలలో ముందు ఉంటారని నితీశ్ మరోసారి నిరూపించారు.' అని ఆయన అన్నారు.స్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అంచులో ఉన్న టీమిండియాను నితీశ్ సెంచరీతో ఆదుకున్నాడు. మన జట్టు ఫాలోఆన్ ఆడుతూ పరాభవం ముంగిట నిలిచిన సమయంలో అతడి అసాధారణ పోరాటం వల్లే నాలుగో టెస్టులో ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం గెలుపు దిశగా భారత్ కొనసాగుతుంది.#KethireddyJagadishwaraReddy congratulated the greatness of Telugu #Chiranjeevi #NitishKumarReddy who gave the glory of #Telugu's to the world today and congratulated his parents who gave this pearl to the #Indian #nation.@PMOIndia @HMOIndia @revanth_anumula @AndhraPradeshCM pic.twitter.com/Tv3oT7o3e1— KETHIREDDY JAGADISH (@kethireddyjagad) December 28, 2024 -
సచిన్ టెండుల్కర్ అందుకు అంగీకరించారు: ఎంసీసీ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club-ఎంసీసీ) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు తెలిపింది.కాగా 1838లో స్థాపించిన ఎంసీసీ ఆస్ట్రేలియాలోనే పురాతన క్రీడా క్లబ్. ఈ క్లబ్‌కు చెందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సచిన్ చేసిన పరుగుల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.ఎంసీజీలో పరుగుల వరదఈ వేదికపై మొత్తంగా ఐదు టెస్టులాడిన టెండుల్కర్(Sachin Tendulkar) 44.90 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సచిన్‌కు విశిష్ట సభ్యత్వం(Honorary Cricket Membership) ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది. ఆయన అంగీకరించడం మాకు సంతోషంఈ మేరకు.. ‘ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌కే అతడొక ఐకాన్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ఆటతీరుకు గుర్తింపుగా విశిష్ట సభ్యత్వం ఇస్తున్నాం’ అని ఎంసీసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.అదే విధంగా.. ఎంసీసీ అధ్యక్షుడు ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం భారత క్రికెట్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు కూడా సచిన్ టెండుల్కర్ ఎనలేని సేవలు అందించారు. ఆయన మా విశిష్ట సభ్యత్వం స్వీకరించేందుకు ఒప్పుకొన్నారు. ఇంతకంటే మాకు గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇలాంటివేం కొత్త కాదుఇక.. ఆస్ట్రేలియా నుంచి సచిన్‌కు ఈ గౌరవం కొత్తేం కాదు. మనదేశంలో ‘భారతరత్న’ లాంటి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారంతో 2012లోనే అక్కడి ప్రభుత్వం సచిన్ టెండుల్కర్‌ను సత్కరించింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఎంసీజీలోనే ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ఆడుతోంది. అంతకు ముందు పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్, అడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సమంగా ఉన్నాయి. చదవండి: IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్ -
Aus vs Eng: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. 43 ఏళ్ల తర్వాత ఇలా!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలిపింది. అదే విధంగా.. పింక్ బాల్‌తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.ఇక ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్ ఓవల్ మైదానం, బాక్సింగ్ డే మ్యాచ్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఉంటాయని సీఏ తెలిపింది. కాగా యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుండటం 43 ఏళ్లలో ఇదే తొలిసారి.ఇంగ్లండ్లోడ్రాఇంగ్లండ్ వేదికగా జరిగిన గత యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్ కంగారూ గడ్డపై జరుగనుంది.ఆసీస్ గడ్డపై గెలుపునకై తహతహఇదిలా ఉంటే.. 2010 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడి.. రెండు డ్రా చేసుకుంది.ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసీస్‌కు కీలకం.ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- యాషెస్ సిరీస్-2025- 26 షెడ్యూల్👉మొదటి టెస్టు- పెర్త్ స్టేడియం, నవంబరు 21-25, 2025👉రెండో టెస్టు- ది గాబా(డే, నైట్ పింక్‌బాల్ మ్యాచ్)- డిసెంబరు 4-8, 2025👉మూడో టెస్టు- అడిలైడ్ ఓవల్, డిసెంబరు 17- 21, 2025👉నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025👉ఐదో టెస్టు- ఎస్సీజీ, జనవరి 4-8, 2026.చదవండి: అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్ -
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్
సాధారణంగా క్రికెట్లో వర్షం, వెలుతురులేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా వ్యహరిస్తున్న థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు దీంతో దాదాపు 5 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్ థర్డ్ అంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీటులో ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్లు ప్రారంభించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్లు తెలియజేయగా.. అతడు ఏమైందోనని థర్డ్ అంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే 5 నిమిషాల తర్వాత థర్డ్ అంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: IND Vs AFG T20I Series: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్‌కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు 92453 మంది హాజరైనట్లు సమాచారం. 2015 వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాటి ఫైనల్‌కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్ ఫైనల్లో అదే ఆసీస్ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. According to official attendance numbers, the 2015 World Cup in MCG had higher attendance than the 2023 World Cup final in Ahmedabad👀🤯 pic.twitter.com/j2kapHeAfB — CricTracker (@Cricketracker) November 20, 2023 నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక..
Australia vs South Africa, 2nd Test - World Test Championship: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 182 పరుగుల తేడాతో పర్యాటక ప్రొటిస్ జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. గ్రీన్ మ్యాజిక్ మెల్బోర్న్ వేదికగా జరిగి బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో 189 పరుగులకే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సన్(59) అర్ధ శతకాలతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేయగలిగింది. డబుల్ సెంచరీ హీరో అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య కంగారూ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ(200)తో అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(1), వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (14) నిరాశపరిచినా.. స్టీవ్ స్మిత్ 85 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా ట్రవిస్ హెడ్(51), కామెరాన్ గ్రీన్ (51- నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 111తో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తప్పని పరాభవం ఇక తమ రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కావడంతో సౌతాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. నాలుగో స్థానంలో వచ్చిన తెంబా బవుమా 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన వెయిర్నే 33 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ముఖ్యంగా ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్‌గా వెనుదిరగడం ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 204 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. డబుల్ సెంచరీ హీరో డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. ఇక ఈ ఘన విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందు వరుసలో ఉన్న ఆస్ట్రేలియా తమ అగ్రస్థానం పదిలం చేసుకోగా.. రెండో స్థానం కోసం పోరులో పోటీ పడుతున్న సౌతాఫ్రికాకు చేదు అనుభవం మిగిలింది. తాజా ఓటమితో 72 పాయింట్లున్న ప్రొటిస్ పాయింట్ల పట్టికలో 54.55 నుంచి 50 శాతానికి పడిపోగా.. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Kane Williamson: పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీ.. విలియమ్సన్ అరుదైన రికార్డు -
Aus Vs SA: తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ సరికొత్త చరిత్ర
Australia vs South Africa, 2nd Test- Alex Carey: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ క్యారీ సెంచరీతో మెరిశాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 149 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. కాగా టెస్టు క్రికెట్లో అలెక్స్ క్యారీకి ఇదే తొలి శతకం. అంతేగాకుండా.. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు అలెక్స్ క్యారీ. బాక్సింగ్ డే టెస్టులో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా.. సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఇక డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీకి తోడు స్టీవ్ స్మిత్(85) సహా ట్రవిస్ హెడ్(51), కామెరాన్ గ్రీన్ (51- నాటౌట్) అర్ధ శతకాలతో రాణించగా.. క్యారీ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మరోవైపు.. మూడో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! -
Aus Vs SA: 69 పరుగులకే 5 వికెట్లు! పట్టుదలగా నిలబడ్డ ఆ ఇద్దరు.. తొలిసారి
Australia vs South Africa, 2nd Test: వరుసగా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు రోజుల్లోనే గెలిచింది. కాగా తొలి టెస్టులో ఆడిన జట్టునే ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొనసాగిస్తున్నామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 100వ టెస్టు ఆడనున్న 14వ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 26 పరుగుల వద్ద రనౌట్ కాగా.. మరో ఓపెనర్ సారెల్ ఎర్వీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. థీనిస్ డి బ్రూయిన్(12), తెంబా బవుమా(1), ఖయా జోండో( 5)పూర్తిగా నిరాశపరిచారు. అర్ధ శతకాలతో ఆ ఇద్దరు.. కెరీర్లో తొలిసారి ఈ క్రమంలో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను కైల్ వెరెయ్నే, మార్కో జాన్సెన్ తమ భుజాన వేసుకున్నారు. జాన్సెన్ అర్ధ శతకతంతో మెరిశాడు. 118 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో జాన్సెన్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. మరోవైపు.. లియోన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా షాట్ పరుగు పూర్తి చేసుకున్న వెయిర్నే సైతం హాఫ్ సెంచరీ(80 బంతుల్లో) సాధించాడు. ఈ సిరీస్‌లో, టెస్టుల్లో అతడికి ఇది రెండో టెస్టు అర్ధ శతకం కావడం విశేషం. ఇక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే సగర్వంగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అదే విధంగా రెండో స్థానం కోసం టీమిండియాతో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా గనుక మెరుగ్గా ఆడితే.. రోహిత్ సేనకు కష్టాలు తప్పవు. తుది జట్లు ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ దక్షిణాఫ్రికా డీన్ ఎల్గర్(కెప్టెన్), సారెల్ ఎర్వీ, థీనిస్ డి బ్రూయిన్, టెంబా బావుమా, ఖయా జోండో, కైల్ వెరెయ్నే(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
WC 2022: ఫైనల్లో ఆ జట్లే తలపడాలి.. నా ఓటు కూడా వాళ్లకే: డివిలియర్స్
ICC Mens T20 World Cup 2022 - Final Prediction: భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన మేటి జట్లకు వరుణుడి అంతరాయం కారణంగా పరాభవం... సంచలనాలు సృష్టించిన చిన్న జట్లు.. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. కొంతమందికి ఖేదం.. మరికొంత మందికి మోదం.. ఇలా అనేకానేక భావోద్వేగాలకు కారణమైన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. విజేతగా నిలిచే క్రమంలో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు సిద్దమయ్యాయి. గ్రూప్-1 నుంచి కివీస్, ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి టీమిండియా, పాక్ సెమీ పోరులో నిలిచాయి. ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్ అభిమానులు ఫైనల్‌పై తమ అంచనాలు తెలియజేస్తూ.. ట్రోఫీ కోసం దాయాదులు మరోసారి తలపడితే చూడాలని ఉందంటున్నారు. నా ఓటు కూడా వాళ్లకే! దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఈ మేరకు.. ‘‘ఫైనల్లో పాకిస్తాన్/ఇండియా?’’ అవునా? కాదా అంటూ ట్వీట్ చేయగా.. దాదాపుగా 77 శాతం మంది అవునని ఓటు వేశారు. ఇందుకు స్పందించిన డివిలియర్స్.. ‘‘70 శాతానికి పైగా అవునని ఓటు వేశారు. అయితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా తక్కువేమీ కాదు. ఇరు జట్లు మంచి లైనప్ కలిగి ఉన్నాయి. ఫామ్‌లో ఉన్నాయి కూడా! కాబట్టి ఈ సెమీ ఫైనల్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా నా ఓటు కూడా ఫైనల్లో ఇండియా/పాకిస్తాన్ మ్యాచ్‌కే! ఉత్కంఠ రేపే మ్యాచ్ కదా’’ అంటూ తాను సైతం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థుల పోరును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా నవంబరు 13న మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక టీ20 వరల్డ్‌కప్ తొలి ఎడిషన్ ఫైనల్లో టీమిండియా- పాక్ తలపడగా ధోని సేన విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తూ మురిసిపోతున్నారు. అయితే, అంతకంటే ముందు ఇరు జట్లు సెమీస్‌లో గెలవాల్సి ఉంటుందని మర్చిపోవద్దు! చదవండి: IND VS ENG: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. Fantasy final indeed! So far 70% have voted Yes, but I’m sure NZ and ENG will have something to say about that. Both teams have amazing line-ups and are in good form. Gonna be two epic semi final clashes. My vote goes for an Ind/Pak final too, would be a mouth watering encounter — AB de Villiers (@ABdeVilliers17) November 7, 2022 -
అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే మైదానంలోకి దూసుకొచ్చి హల్చల్ చేశాడు. జార్వో 69 టీషర్ట్ ధరించి సిరీస్‌లో పలుమార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతన్ని మైదానం నుంచి నిషేధం విధించినప్పటికి.. జైలుకి వెళ్లినప్పటికి అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే మొత్తంగా మాత్రం తన చర్యలతో అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అభిమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్ అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త బాధను కలిగించింది. అయితే అనుమతి లేకుండా మైదానంలోకి దూసుకురావడం తప్పుగా పరిగణిస్తారు. ఎంత అభిమానం ఉన్న ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. రోహిత్ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. కాగా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! A fan entered into a stadium during India vs zim match....#INDvsZIM #T20worldcup22 #T20WorldCup #SuryakumarYadav #semis #RohitSharma𓃵 #ViratKohli𓃵 follow for more tweets pic.twitter.com/fWvKNIky63 — Santoshgadili (@Santoshgadili3) November 6, 2022 Little fan didn't get chance to meet Rohit Sharma... Nice gesture from Captain Rohit he talked with him...#RohitSharma𓃵 #T20worldcup22 #T20WorldCup pic.twitter.com/eQ4Pw6UJt2 — 𝖲𝖺𝗎𝗋𝖺𝖻𝗁🤍 (@Cricket_Gyaani_) November 6, 2022 A fan invaded the field today to meet Rohit Sharma, he was in tears when he came close to Rohit. The fan has been fined 6.5 Lakhs INR for invading the field. pic.twitter.com/CmiKIocTHf — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022 -
జింబాబ్వేతో కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే క్రమంలో రేపు (నవంబర్ 6) జింబాబ్వేతో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. మ్యాచ్‌కు వేదిక అయిన మెల్బోర్న్లో వర్షం పడే సూచనలు లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్లో పేర్కొంది. ఇదే వేదికపై గతవారం మూడు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొని ఉండింది. అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) మెల్బోర్న్లో వాతావరణం క్లియర్‌గా ఉంటుందని, టెంపరేచర్ 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తే.. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు వెళ్తుంది. మరోపక్క టీమిండియాతో పాటు సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లు సైతం రేపే తమ ఆఖరి సూపర్-12 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. రేపు ఉదయం 5:30 గంటలకు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీస్‌కు అర్హత సాథిస్తుంది. ఉదయం 9:30 గంటలకు జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా దాయాది జట్టు సెమీస్ అవకాశాలు భారత్, దక్షిణాఫ్రికాల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. -
WC 2022: అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు.. అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల మోత.. మిడిలార్డర్లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. టోర్నీ తాజా ఎడిషన్‌లో 220 రన్స్‌తో టాప్‌లో.. జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టి ఓవరాల్‌గా టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా అవతరించిన సూర్య.. ఇక బౌలర్లు సరేసరి.. అటు సీనియర్ భువనేశ్వర్ కుమార్.. ఇటు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.. ఫీల్డింగ్‌లోనూ లోపాలు సరిదిద్దుకుని మరింత పటిష్టమైన జట్టుగా టీమిండియా.. సవాల్ విసిరిన జింబాబ్వే కెప్టెన్! ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రోహిత్ సేన సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. మేటి జట్టు.. వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు.. మరి ప్రత్యర్థి భయపడటం సాధారణమే కదా! అయితే, గొప్ప జట్టుతో పోటీపడటం తమకే లాభిస్తుందంటున్నాడు జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్. పాకిస్తాన్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన జింబాబ్వే.. నెదర్లాండ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి చతికిలపడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బ్యాటర్లను కట్టడి చేసేందుకు తమ బౌలర్లు సంసిద్ధంగా ఉన్నారంటూ క్రెయిగ్ సవాల్ విసరడం విశేషం. గ్రూప్-2లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టుతో ఆదివారం(నవంబరు 6) జింబాబ్వే తలపడనున్న నేపథ్యంలో జింబాబ్వే సారథి క్రెయిగ్ ఎర్విన్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘టీమిండియా బ్యాటర్లను ఎదుర్కోవడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్! ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కంటే అదృష్టం, అవకాశం మరొకటి ఉండదు. కాబట్టి మా వాళ్లు తప్పకుండా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సన్నద్ధమయ్యారు. విరాట్ కోహ్లి వికెట్ తీసే అవకాశం ఎంత మందికి వస్తుంది? అలాంటి అరుదైన, అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు! రేపటి మ్యాచ్‌లో మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా తమ సత్తా చాటుకుంటారు’’ అని తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించాడు. అలాంటివి వర్కౌట్ కావేమో! ఇక కోహ్లి అత్యుత్తమ ఆటగాడు అంటూ కొనియాడిన 37 ఏళ్ల ఎర్విన్.. అతడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలేమీ రచించలేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేసే మేటి బ్యాటర్ల విషయంలో స్పెషల్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కావు గానీ తమ బౌలర్లు మాత్రం పట్టుదలగా పోరాడటం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాగా మెల్బోర్న్లో టీమిండియా- జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రూప్-2 నుంచి ఏ రెండు జట్లు సెమీస్‌కు చేరతాయన్న అంశం తేలనుంది. చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా T20 WC 2022: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు -
WC 2022: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదే: ఆసీస్ దిగ్గజం
ICC Mens T20 World Cup 2022- Final Prediction: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్-12లో భాగమైన ఎనిమిది జట్లు సెమీస్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోవైపు ఈ ఎడిషన్‌లో వర్షం సైతం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రూప్-2లో ఆదివారం(నవంబరు 6) నాటి మ్యాచ్‌లు ముగిసేదాకా సెమీస్ చేరే జట్లేవో చెప్పలేని పరిస్థితి. బుమ్రా లేకున్నా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పాటు ఫైనల్ చేరే జట్టు ఇదేనంటూ అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్సైట్ కాలమ్‌లో.. ‘‘ఆస్ట్రేలియా కొన్ని విభాగాల్లో కాస్త వెనుకబడి ఉంది. మరోవైపు టీమిండియా జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. అయినప్పటికీ ఈ రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ టోర్నీ ఆసాంతం స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతోంది. కచ్చితంగా చెప్పలేం.. అయితే కొన్ని మ్యాచ్‌లకు అంతరాయం కలిగినా ఇండియా- పాకిస్తాన్ వంటి మ్యాచ్‌లు పూర్తి వినోదం అందించాయి. నిజానికి ఫైనల్ ఆడేందుకు మెల్బోర్న్కు ఏ జట్లు వెళ్తాయో ఎవరూ కరెక్ట్‌గా చెప్పలేరు. అయితే, ఆస్ట్రేలియా తన మార్గాన్ని సుగమం చేసుకుంటుందని భావిస్తున్నా. సౌతాఫ్రికా కూడా ప్రమాదకర జట్టే. అయితే, నేను ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇండియా- ఆస్ట్రేలియా మధ్యే ఫైనల్ జరుగుతుందని అనుకుంటున్నా’’ అని పాంటింగ్ రాసుకొచ్చాడు. కాగా గ్రూప్-2లో ఉన్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచి ఆరు పాయింట్లతో టాపర్‌గా ఉండగా.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా నాలుగింట రెండు గెలిచి ఐదు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ మెరుగైన రన్‌రేటుతో 7 పాయింట్లతో టాపర్‌గా కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లండ్ ఆసీస్ కంటే మెరుగైన రన్‌రేటుతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ సెమీస్ చేరడమే కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా నవంబరు 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. చదవండి: NZ Vs IRE: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఐరిష్ బౌలర్! భువీని సైతం వెనక్కి నెట్టి ఐసీసీ భారత్‌కు సపోర్ట్ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్ అవార్డులు ఇవ్వాలంటూ పాక్ మాజీ ప్లేయర్ అక్కసు -
WC 2022: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. ఫైనల్ ‘బెంగ’!
T20 World Cup 2022- Final AT MCG: ఆస్ట్రేలియాలో కురుస్తున్న అకాల వర్షాలు యావత్ క్రికెట్ ప్రియుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. క్రేజీ టి20 ప్రపంచకప్‌కు పదే పదే వరుణుడు అడ్డుతగలడం... అనామక మ్యాచ్‌లతో పాటు రక్తి కట్టించే మ్యాచ్‌లు కూడా రద్దవడం అభిమానులకు ఆనందం దూరం చేస్తోంది. ఇప్పటివరకు మెగా ఈవెంట్లో 13 మ్యాచ్‌లు జరిగితే ఏకంగా ఐదు మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపింది. ఇందులో 4 మ్యాచ్‌లైతే పూర్తిగా రద్దయ్యాయి. కీలక మ్యాచ్ రద్దు! ఒక మ్యాచ్‌కు అంతరాయం ఎదురైనా ‘డక్‌వర్త్ లూయిస్’ ఫలితంతో బయటపడింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు, డక్‌వర్త్‌తో క్రికెట్ కూన ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు గ్రూప్–1లో శుక్రవారం కీలకమైన మ్యాచ్ జరగాల్సింది. దెబ్బతిన్న చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులంతా భావించారు. ఈ గ్రూప్‌ను శాసించే మ్యాచ్ అవుతుందనుకుంటే... వర్షంలో నిండా మునిగిపోయింది. ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన ఐర్లాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్ కూడా రద్దవడం ఇరు జట్లను తీవ్రంగా నిరాశపరిచింది. గ్రూప్–1లో అఫ్గాన్ అంతటి బాధ ఇంకెవరికీ లేదు. జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం ఖాతాలో పడిపోయాయి. శ్రీలంక మాత్రమే ఈ గ్రూపులోని ఆరు జట్లలో ఒక్క శ్రీలంక మాత్రమే వాన బాధితుల జాబితాలో లేదు. కివీస్, ఇంగ్లండ్, ఆసీస్, ఐర్లాండ్, అఫ్గాన్లను వాన ఇబ్బంది పెట్టింది. పాయింట్ల పట్టికలో ఈ ఐదు జట్లు ‘ఫలితం తేలని’ రికార్డులో నిలిచాయి. భారతీయులు అత్యధికంగా ఉండే సిడ్నీని కాదని ఆస్ట్రేలియాలోనే సుప్రసిద్ధ వేదిక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ). కానీ ఇప్పుడిదే ఈ ప్రపంచకప్‌కు కంటగింపుగా మారింది. 90 వేల పైచిలుకు సామర్థ్యమున్న ఈ ప్రధాన స్టేడియంలో పొట్టి మెరుపులు చూద్దామని పట్టుబట్టి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు తీరా మైదానానికి వచ్చే సరికి చినుకులు ఎదురవుతున్నాయి. క్రికెట్‌ను ఆస్వాదించాలన్న ఆశలపై వరుణుడు అదే పనిగా నీళ్లుజల్లుతున్నాడు. పూర్తిగా రద్దయిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇక్కడ జరగాల్సినవే కాగా ఒకటి హోబర్ట్‌లో రద్దయింది. భారతీయులు అత్యధికంగా ఉండే సిడ్నీని కాదని దాయాదుల సమరానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎంచుకున్న మైదానం ఎంసీజీ. సుప్రసిద్ధ వేదిక.. 667లో ఒక్కటే రద్దు.. అయినా ఫైనల్ బెంగ! అయితే మ్యాచ్‌కు ముందు వర్షభయమున్నప్పటికీ ఇండో–పాక్ సమరం జరగడం... ఫైనల్‌ను మించిన వినోదం అందించడం సీఏకు అత్యంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇంగ్లండ్‌తో తమ జట్టుకు శుక్రవారం ఏర్పాటు చేసిన మ్యాచ్ కూడా వర్షం ఖాతాలో పడటమే సీఏను ఇబ్బంది పెడుతోంది. అన్నట్లు ఫైనల్‌కు కూడా ఎంసీజీనే వేదిక. రిజర్వ్ డే ఉన్నప్పటికీ సూపర్–12 దశలో వరుసగా 26, 28 తేదీల్లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల్ని తుడిచిపెట్టేయడం క్రికెట్ వర్గాల్లో ‘ఫైనల్’ బెంగను పెంచుతోంది. ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ మూడు మ్యాచ్‌లకు ముందు ఎంసీజీలో 667 టి20 మ్యాచ్‌లు జరగ్గా... ఒకే ఒక్క మ్యాచ్, అదీ 2007లో మాత్రమే రద్దయింది. చదవండి: T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి' T20 WC 2022: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వర్షం కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు
టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం అయింది. గ్రూఫ్-1లో భాగంగా సూపర్-12లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్-2022(సూపర్-12)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు సమయం అసన్నమైంది. మెల్బోర్న్ వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు పడాల్సిన టాస్ వర్షం కారణంగా అలస్యమైంది. మధ్యహ్నం 2 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. చదవండి: T20 WC 2022: కోహ్లి రికార్డులు బద్దలు కొట్టిన రజా.. తొలి ఆటగాడిగా -
Eng Vs IRE: ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. ఐర్లాండ్ విజయం
ICC Mens T20 World Cup 2022 - England vs Ireland: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్.. ఇంగ్లండ్ మీద 5 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ స్కోర్లు: ఐర్లాండ్ 157 (19.2) ఇంగ్లండ్ 105/5 (14.3) వరణుడు మరోసారి ఉత్కంఠగా సాగుతున్న ఇంగ్లండ్- ఐర్లాండ్ మ్యాచ్‌కు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ గెలవాలంటే 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన వేళ.. అలీ, లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడింది. దీంతో కాసేపు ఆటను ఆపారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మలన్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. పెరుగుతున్న రన్‌రేటు 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 86/4 నాలుగో వికెట్ డౌన్ హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. డాక్రెల్ బౌలింగ్‌లో డెలనీకి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. మలన్, అలీ క్రీజులో ఉన్నారు. స్కోరు- 68-4(11) 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 63/3 మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. స్టోక్స్ క్లీన్ బౌల్డ్ 29 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఫియాన్ హ్యాండ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 37/3. డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జాషువా లిటిల్ మరోసారి అద్భుతం చేశాడు. అతడి బౌలింగ్‌లో హేల్స్ అడేర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లలో స్కోరు: 14/2 ఆదిలోనే భారీ షాక్ ఇంగ్లండ్ జట్టుకు జాషువా లిటిల్ ఆదిలోనే భారీ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొదటి ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 2/1. మలన్, అలెక్స్ హేల్స్ క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ స్కోరెంతంటే! ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐరిష్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండ్రూ బిల్బిర్నీ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్‌కు మూడు, సామ్ కర్రాన్‌కు రెండు, మార్క్‌వుడ్‌కు మూడు, బెన్‌స్టోక్స్‌కు ఒక వికెట్ దక్కాయి. వరుస వికెట్లు సామ్ కర్రాన్ అద్భుత బంతితో మెకార్తీ, ఫియోన్ హాండ్లను బౌల్డ్ చేశాడు. దీంతో 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఏడో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో మార్క్ అడేర్ ఏడో వికెట్(150-7)గా వెనుదిరిగాడు. ఆరో వికెట్ డౌన్ కాంఫర్ రూపంలో ఐర్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లలో స్కోరు - 144/6. వరుసగా రెండు వికెట్లు లియామ్ లివింగ్ స్టోన్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్ మూడో బంతికి బల్బిర్నీ, నాలుగో బంతికి డాక్రెల్ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఐర్లాండ్ ఐదు వికెట్లు(133-5) కోల్పోయింది. 15 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు- 127/3 డకౌట్‌గా వెనుదిరిగిన టెక్టర్ మార్క్ వుడ్ మరోసారి దెబ్బకొట్టాడు. అతడి బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి టెక్టర్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాంఫర్- బెల్బిర్నీ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో టక్కర్ రనౌట్‌గా అయ్యాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: 103-2 పది ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: 92/1 (10) ఆచితూచి ఆడుతున్న కెప్టెన్ ఆండ్రూ బెల్బిర్నీ (19)ఆచితూచి ఆడుతుండగా.. టక్కర్(16 బంతుల్లో 26) ధాటిగా ఆడుతున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ చేసిన పరుగులు ఒక వికెట్ నష్టానికి 65. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: 45-1 తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ ఆదిలోనే ఐర్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్.. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: 26-1. బెల్బిర్నీ, టక్కర్ క్రీజులో ఉన్నారు ఆట మొదలైంది వర్షం తెరిపి ఇవ్వడంతో ఇంగ్లండ్- ఐర్లాండ్ మధ్య ఆట మొదలైంది. స్కోరు: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సూపర్-12లో భాగంగా గ్రూప్ 1లో ఉన్న ఇంగ్లండ్- ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)వేదికైంది. ఎంసీజీలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇక వర్షం పడే సమయానికి ఐర్లాండ్ స్కోరు 1.3 ఓవర్లలో 11/0గా ఉంది. కెప్టెన్ ఆండ్రూ బెల్బిర్నీ 2, పాల్ స్టిర్లింగ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తుది జట్లు: ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బెల్బిర్నీ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫియోన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: T20 WC 2022: ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా -
అప్పుడు మాటలు పేలావు! తట్టుకోలేరన్నావు! ఇప్పుడు తుస్సుమన్నావు! మ్యాచ్‌కే హైలైట్‌గా..
T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli: టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న మెల్బోర్న్ పిచ్‌పై.. విరాట్ కోహ్లి ఆడిన కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్.. సగటు టీమిండియా అభిమాని మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన తరుణంలో... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. మ్యాచ్‌కే హైలైట్ షాట్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్‌లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడి పరుగు తీయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తద్వారా గత ప్రపంచకప్‌లో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బదులు తీర్చుకుంది. నా హోం గ్రౌండ్ అన్నావు కదా! ఈ అద్భుత విజయం నేపథ్యంలో... టీమిండియాతో మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంసీజీ తన హోం గ్రౌండ్ లాంటిదన్న(బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న నేపథ్యంలో) రవూఫ్.... తన బెస్ట్ ఇచ్చానంటే భారత బ్యాటర్లు తట్టుకోవడం కష్టమేనంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం నాటి(అక్టోబరు 23) మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. ఆఖరి ఓవర్లో కోహ్లి రెండు సిక్సర్లతో చెలరేగడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రవూఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మాటలు పేలావు.. తుస్సుమన్నావు ‘‘రవూఫ్ ఆనాడు ఏమన్నావో గుర్తుందా? చూశావా నీ హోం గ్రౌండ్లో.. నీ బౌలింగ్‌లో మా కింగ్ కోహ్లి వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌ను మా వైపు తిప్పేశాడు. థౌజండ్‌వాలా పేల్చేశాడు. మాటలు పేలిన నువ్వేమో తుస్సుమన్నావు!’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో రవూఫ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: No Ball Call: అంపైర్లపై అక్తర్ ట్వీట్.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది కదా! ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్‌పై ప్రశంసల జల్లు View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 World Cup 2022: 'కోహ్లి'నూర్ విజయం
అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్బోర్న్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు. మెల్బోర్న్: భారత్ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్‌పై శివమెత్తాడు. తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్బోర్న్లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ దశ గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‡్షదీప్ (3/32), హార్దిక్ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. హారిస్ రవూఫ్ (2/36), నవాజ్ (2/42) భారత్‌ను ఇబ్బంది పెట్టారు. గెలిచేదాకా క్రీజులోనే... లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్ తెరదించాడు. అక్షర్ పటేల్ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్‌కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది. నవాజ్ 12వ ఓవర్లో ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్ కూడా 2 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్‌కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్ కార్తీక్ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71 పరుగులు చేయడం విశేషం. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న నెదర్లా్లండ్స్తో ఆడుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 4; బాబర్ ఆజమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‡్షదీప్ 0; షాన్ మసూద్ (నాటౌట్) 52; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 5; హైదర్ అలీ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 2; నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 9; ఆసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్‡్షదీప్ 2; షాహిన్ అఫ్రిది (సి అండ్ బి) భువనేశ్వర్ 16; హారిస్ రవూఫ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 22–1; అర్‡్షదీప్ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్ పాండ్యా 4–0–30–3; అశ్విన్ 3–0–23–0; అక్షర్ పటేల్ 1–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) నసీమ్ షా 4; రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) హారిస్ రవూఫ్ 4; కోహ్లి (నాటౌట్) 82; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) 15; అక్షర్ పటేల్ (రనౌట్) 2; హార్దిక్ (సి) బాబర్ ఆజమ్ (బి) నవాజ్ 40; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–34–0; నసీమ్ షా 4–0–23–1; హారిస్ రవూఫ్ 4–0–36–2; షాదాబ్ ఖాన్ 4–0–21–0; నవాజ్ 4–0–42–2. ఆ రెండు సిక్స్‌లతో... మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్‌పై కోహ్లి కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్‌లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ►19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. ►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. ►19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ►19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. ►19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ►19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. ►19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. ►19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. -
ఇండియాకి వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందా..?
-
హార్దిక్ పాండ్యాకు ఏమైంది.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటేనా!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మోకాలి గాయంతో బాధపడుతున్నాడా. మెల్బోర్న్ వేదికగా ఇవాళ(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌తో పోరుకు ముందు మెల్బోర్న్ గ్రౌండ్లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫోటోలో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో తలమునకలయ్యుంటే పాండ్యా మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. ఆ సమయంలో అతని కుడి మోకాలికి పట్టి కనిపించింది. దీంతో పాండ్యాకు గాయమైందని.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే పాండ్యా గాయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదంతా పుకార్లే అని కొట్టిపారేశారు. ''అతను ఎలాంటి గాయంతో ఇబ్బంది పడడం లేదని.. మాములుగా మోకాలిపై ఒత్తిడి పడకుండా క్రికెటర్లు పట్టి వేసుకుంటారు. ఆ పట్టీని చూసి గాయమైందనుకుంటే ఎలా'' అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ''పాకిస్తాన్‌తో ఆడే తుది జట్టును ఆల్రెడీ నిర్ణయించాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచకప్ కొట్టి తొమ్మిదేళ్లు కావొస్తుంది. అయినా ప్రతీ మ్యాచ్‌కు జట్టును మార్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఆటగాళ్లు సిద్ధమై ఉండాలి. ఏదైనా మార్పు ఉంటే ముందే చెప్తాం.. చివరి నిమిషంలో ఆటగాళ్లను ఎంపికచేయడం నాకు నచ్చదు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటనేది అందరికి తెలుసు.. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Hardik Pandya has his right knee strapped. Could be a knee cap, as well. But he is limping a bit. @Sportskeeda #INDvPAK #T20WorldCup pic.twitter.com/72KKE9xSyO — Srinjoy Sanyal (@srinjoysanyal07) October 22, 2022 చదవండి: దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు
అమ్మ, ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అంటారు. అలాగే చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య ఉండే రసవత్తర పోరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఒక మ్యాచ్‌కు ఇంత క్రేజ్ ఎందుకంటే చెప్పలేం. అదేంటో గానీ ఈ రెండుజట్లు ఎదురుపడినప్పుడల్లా ప్రతీ ఒక్కరిలో దేశభక్తి పొంగొపోతుంది. గెలిస్తే సన్మానాలు, సత్కారాలు.. ఓడితే చీత్కారాలు, చెప్పుల దండలు పడడం గ్యారంటీ. ఒకప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే మాములుగానే ఉండేది. కానీ ఎందుకో 90వ దశకంలోకి అడుగుపెట్టాకా పూర్తిగా మారిపోయింది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే రెండు జట్ల మధ్య పోరు కంటే రెండు దేశాల మధ్య వైరం అనేలానే అభిమానులు చూస్తున్నారు. ముఖ్యంగా 1996 వన్డే వరల్డ్‌కప్ నుంచి భారత్-పాక్ మ్యాచ్‌కు ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఆ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఇదీ భారత్-పాక్ మ్యాచ్‌కున్న క్రేజ్ ఎలాగు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ టీమిండియాను ఓడించలేకపోయింది. 1992 నుంచి 2019 వరల్డ్‌కప్ వరకు పాకిస్తాన్‌తో తలపడిన సందర్భాల్లో ప్రతీసారి టీమిండియాదే విజయం. ఇక పొట్టి ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2021 టి20 ప్రపంచకప్ మినహా మిగిలిన సందర్భాల్లో తలపడిన ప్రతీసారి భారత్‌దే పైచేయి. ►టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖిగా ఆరుసార్లు తలపడ్డాయి. ఐదుసార్లు భారత్ గెలుపొందగా, ఒకసారి పాకిస్తాన్‌ను విజయం వరించింది. ►ఎంసీజీ మైదానంలో ఇప్పటివరకు 15 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ చేసిన జట్లు తొమ్మిదిసార్లు గెలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగుసార్లు నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది. గతంలో ఈ వేదికపై భారత్ ఆడిన రెండు టి20 మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా... పాకిస్తాన్ ఆడిన ఒక మ్యాచ్‌లో ఓడింది. చదవండి: T20 World Cup: ప్రపంచకప్ ‘ప్రతీకార’ పోరు -
T20 World Cup: ప్రపంచకప్ ‘ప్రతీకార’ పోరు
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు, ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా అది కొత్తగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాతేమీ ఆడటం లేదు, ఇరు జట్ల మధ్య పోరు జరిగి సరిగ్గా 50 రోజులే అయింది. అయినా సరే ఇప్పుడు వరల్డ్‌కప్ వచ్చేసరికి మళ్లీ అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే ఉద్వేగం... ఆటగాళ్లపై అదే తరహాలో తప్పని ఒత్తిడి కూడా! ఆసియా కప్‌ను పక్కన పెడితే గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయం కోణంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ మరింత కీలకం. ‘ప్రతీకారం’ అనే మాటను వాడదల్చుకోలేదని ఎవరు చెప్పినా ఆ పదం విలువ, అర్థమేమిటో భారత అభిమానులకు బాగా తెలుసు! మెల్బోర్న్: ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల హోరు మధ్య నేడు భారత్, పాకిస్తాన్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దీంతో అభిమానులందరికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వినోదానికి ఫుల్ గ్యారంటీ. రెండో స్పిన్నర్ ఎవరు? భారత జట్టుకు బ్యాటింగ్‌కు సంబంధించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆసియా కప్‌తో పాటు ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లను బట్టి చూస్తే చాలా వరకు తుది జట్టు ఏమిటో స్పష్టమవుతుంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లిలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గత వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురి వికెట్లు తీసి షాహిన్ అఫ్రిది ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈసారి అతని బౌలింగ్‌పై చెలరేగితే ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడగల సమర్థుడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ బాధ్యతలు చేపడతారు. ఎడంచేతి వాటం ప్రయోజనం ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం కార్తీక్కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఎక్కువ. పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్లు ఖాయం కాగా... రెండో స్పిన్నర్ విషయంలో అశ్విన్, చహల్‌లలో ఒకరే ఆడే అవకాశముంది. రవూఫ్ కీలకం! పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు ఉంది. అంకెలపరంగా చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్ద సంఖ్యలో పరుగులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, వారి స్ట్రయిక్‌రేట్ పేలవం. షాన్ మసూద్ పేలవ ఫామ్‌లో ఉండగా, గాయంతో ఫఖర్ జమాన్ దూరమయ్యాడు. మిడిలార్డర్లో హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు అంతంత మాత్రం బ్యాటర్లే! ఆసియా కప్‌లోనే వీరి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆసీస్ గడ్డపై వీరు ఏమాత్రం ఆడతారనేది చెప్పలేం. దాంతో పాకిస్తాన్ తమ బౌలింగ్‌నే ప్రధానంగా నమ్ముకుంటోంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షాహిన్ తమ రాత మార్చగలడని పాక్ భావిస్తోంది. షాహిన్ బౌలింగ్‌లో శుభారంభం అందిస్తే ఆ జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. మరో పేసర్‌గా నసీమ్ షా ఉంటాడు. అయితే వాస్తవానికి అఫ్రిదికంటే కూడా హారిస్ రవూఫ్ కీలకం కానున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున చెలరేగిన అతనికి ఒక రకంగా ఇది సొంత మైదానంలాంటిది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షమీ, చహల్/అశ్విన్, భువనేశ్వర్, అర్‡్షదీప్ సింగ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. -
IND Vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ భయాలేమి అక్కర్లేదట!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 23న) చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌కు టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడయ్యాయి. 90వేలకు పైగా సామర్థ్యం ఉన్న మెల్బోర్న్ స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం పెద్ద ఆటంకంగా ఉంది. భారత్, పాక్ మ్యాచ్ జరగనున్న ఆదివారం మెల్బోర్న్లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయంటూ గతంలో ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే వరుణ దేవుడు అభిమానుల మొర ఆలకించినట్లున్నాడు. శనివారం ఉదయం నుంచి మెల్బోర్న్లో వర్షం పడలేదని.. వాతావరణం సాధారణంగా ఉందంటూ ఆస్ట్రేలియా వాతావారణ విభాగం స్టేడియానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది . సోమవారం వరకు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే వర్షం ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని.. 40 శాతం మేర వర్షం పడే అవకాశముందని తెలిపింది. అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న సంశయంలో ఉన్న భారత్-పాక్ అభిమానులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ రేపు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. దీంతో అభిమానులు భారత్-పాక్ మ్యాచ్ ఎలాగైనా మ్యాచ్ జరిగేలా చూడాలని వరుణ దేవుడికి పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఇన్నాళ్లు మ్యాచ్ గెలవాలని కోరుకుంటూ పూజలు చేయడం చూశాం.. ఇప్పుడేమో మ్యాచ్ జరిగేలా చూడాలని పూజలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ'' మరికొంతమంది పేర్కొన్నారు. A very good morning to everyone in India (and Pakistan). This is the view outside MCG at 1pm. The sun is out. Forecast has improved massively this morning. No more rain expected until Monday. Yes, read that again!! 🙂#IndvPak #IndvsPak #T20WorldCup pic.twitter.com/XXVEFr2JLt — Chetan Narula (@chetannarula) October 22, 2022 చదవండి: కోహ్లి, రోహిత్‌ల భజన తప్ప సూర్య గురించి అడగడం లేదు! విండీస్ జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2022: తొమ్మిదేళ్లుగా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు.. ఈసారి: రోహిత్ శర్మ
T20 World Cup 2022- Rohit Sharma- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గత తొమ్మిదేళ్లుగా భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవకపోవడం నిరాశకు గురిచేసిందని.. ఈసారి ఆ లోటు తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపాడు. పొట్టి క్రికెట్ సమరం మొదటి ఎడిషన్ నుంచి రోహిత్ శర్మ జట్టులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి అతడు కెప్టెన్ హోదాలో వరల్డ్‌కప్ ఆడనున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం (అక్టోబరు 23) నాటి మ్యాచ్‌తో టీమిండియా సారథిగా మొదటిసారిగా ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు ముందుకు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. నిరాశకు గురయ్యాం.. అయితే ఈసారి ఈ సందర్భంగా గత ప్రపంచకప్‌లో పరాభవం, తదనంతరం టీ20 ఫార్మాట్లో ఎదురులేని జట్టుగా నిలిచినప్పటికీ ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో వైఫల్యం తదితర అంశాల గురించి హిట్‌మ్యాన్ స్పందించాడు. ఈ మేరకు.. ‘‘గత తొమ్మిదేళ్లుగా మేము ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. నిరాశకు గురైన విషయం వాస్తవమే. అయితే, జట్టు రాతను మార్చే అవకాశం ఇప్పుడు మా చేతుల్లో ఉంది. అయితే, ఈ అంశాలు మాపై ఒత్తిడిని పెంచలేవు. మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా కష్టపడతాం. మాకు ఆ సత్తా ఉంది నిజానికి మేము గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాం. కానీ కొన్ని పొరపాట్ల వల్ల కీలక సమయాల్లో ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది. తప్పులు సరిదిద్దుకుంటాం. చెప్పాలంటే మా జట్టు పటిష్టంగానే ఉంది. ఐసీసీ ఈవెంట్లో అగ్రస్థాయికి చేరుకునే సత్తా కలిగి ఉంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా మెల్బోర్న్ వేదికగా జరుగనున్న ఆరంభ మ్యాచ్‌కు టీమిండియా ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. అదే ఆఖరు ఇక 2007లో టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్-2011 తర్వాత టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలవలేదు. ధోని తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టి.. విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఐసీసీ టైటిల్ గెలవకుండానే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. చదవండి: Cricket West Indies Board: విండీస్ జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే..! IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్.. వీళ్లు ఎదురుపడితే మజానే వేరు T20 WC 2022: వీరిపైనే భారీ అంచనాలు.. ఈ టీమిండియా ‘స్టార్లు’ రాణిస్తేనే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వాన గండం!
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే ఈ పోరులో ఎప్పుడో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, 90 వేల సామర్థ్యం గల మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దద్దరిల్లడం ఖాయమని అనిపించింది. అయితే ఇప్పుడు ఈ చిరకాల పోరుకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 80 నుంచి 90 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్టంగా 5 మిల్లీ మీటర్ల వరకు కూడా వాన కురవవచ్చని చెబుతున్నారు. శుక్రవారం కూడా మెల్బోర్న్లో వాన పడింది. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. మెల్బోర్న్కు చేరుకున్న టీమిండియా
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం దగ్గరపడుతోంది. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్ 23)న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం మెల్బోర్న్లో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. అదే విధంగా భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా తమ జర్నీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా దాదాపు రెండు వారాల ముందే ఆస్ట్రేలియా చేరుకుంది. కంగరూల గడ్డపై అడుగు పెట్టిన భారత్ మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. తొలుత వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఆడగా.. అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. కాగా భారత్ బ్రేస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. Perth ✔️ Brisbane ✔️ Preparations ✔️ We are now in Melbourne for our first game! #TeamIndia #T20WorldCup pic.twitter.com/SRhKYEnCdn — BCCI (@BCCI) October 20, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });add this quiz to t20 wc articles చదవండి: T20 WC 2022: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి -
T20 WC: జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, కీలక మ్యాచ్‌ల ఆరంభ సమయం.. పూర్తి వివరాలు
T20 World Cup 2022- Format, Points System All Details: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) ఈ ఐసీసీ ఈవెంట్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్‌ల ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర అంశాలు పరిశీలిద్దాం. మొత్తం 16 జట్లు ప్రపంచకప్-2022లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్- ఏ: ►నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్- బి: ►ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే ఈ ఎనిమిది జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. సూపర్ 12 గ్రూప్- 1: ►అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, గ్రూప్- ఏ విజేత, గ్రూప్- బి రన్నరప్. గ్రూప్-2: ►బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, గ్రూప్- బి విజేత, గ్రూప్- ఏ రన్నరప్ వేదికలు: ఆస్ట్రేలియాలోని ఏడు వేదికల్లో ఈ ఈవెంట్ జరుగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా, అడిలైడ్‌లోని ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, గీలాంగ్‌లోని కర్దీనియా పార్క్, హోబర్ట్‌లోని బెలరివ్ ఓవల్, పెర్త్ స్టేడియం, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు స్టార్ నెట్వర్క్, స్కై స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్, ఈఎస్పీఎన్, పీటీవీ తదితర ఛానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రసారం. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), డిస్నీ+హాట్‌స్టార్(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారాలు. ప్రసార భారతిలో హిందీలో కామెంటేటరీ. టోర్నీ ఫార్మాట్: మూడు దశల్లో టోర్నీ నిర్వహణ ఫస్ట్ రౌండ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో గ్రూప్-ఏ, గ్రూప్- బి జట్లు పోటీపడతాయి. ఇరు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. సూపర్-12 ఈ దశలో టాప్-4లో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంటాయి. నాకౌట్ స్టేజ్ ►నాకౌట్ స్టేజ్‌లో రెండు సెమీ ఫైనల్స్ ►గెలిచిన జట్లు ఫైనల్‌కు ►నవంబరు 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ పాయింట్ల కేటాయింపు ఇలా ►ఫస్ట్ రౌండ్, సూపర్-12 స్టేజ్‌లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రెండు పాయింట్లు. ►టై లేదంటే ఫలితం తేలకుంటే: ఒక పాయింట్ కేటాయిస్తారు. ►ఓడిన జట్టుకు సున్నా పాయింట్లు. రిజర్వు డేస్ సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే.. ►అక్టోబరు 16న ఫస్ట్ రౌండ్లో భాగంగా శ్రీలంక- నమీబియా మధ్య మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభం ►సూపర్-12లో మొదటి మ్యాచ్: అక్టోబరు 22న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ ►అక్టోబరు 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్(ఎంసీజీ- భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) నాకౌట్ స్టేజ్: భారత కాలమానం ప్రకారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభం ►నవంబరు 9, బుధవారం సెమీ ఫైనల్-1 ►గురువారం 10, గురువారం సెమీ ఫైనల్-2 ఫైనల్ ►నవంబరు 13, ఎంసీజీ పూర్తి షెడ్యూల్ Photo Courtesy: t20worldcup.com టీ20 వరల్డ్‌కప్-2022 టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ. చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే! -
T20 WC: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా.. ఫొటో వైరల్
T20 World Cup 2022- Team India Preparations Pic Viral: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టింది. పెర్త్‌లోని ఐకానిక్ స్టేడియం వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్ వేదికగా ఐసీసీ మెగా ఈవెంట్ సన్నాహకాలు షురూ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోను భారత క్రికెట్ నియంత్రణ మండలి ట్విటర్లో షేర్ చేసింది. హెల్లో.. డబ్ల్యూఏసీఏ.. ‘‘హెల్లో.. డబ్ల్యూఏసీఏలోకి స్వాగతం.. టీమిండియా తమ మొదటి ట్రెయినింగ్ సెషన్‌కు సిద్ధమైంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. Hello and welcome to WACA 🏟 #TeamIndia are here for their first training session. pic.twitter.com/U79rpi9u0d — BCCI (@BCCI) October 7, 2022 హాట్ ఫేవరెట్‌గా బరిలోకి ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గురువారం ముంబై నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ఈ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా ఆటగాళ్లంతా తమకు విష్ చేయడానికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సంతోషపరిచారు. ఇక టీమిండియాను చీర్ చేస్తూ తీసుకువచ్చిన కేక్‌ను వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కట్‌చేశాడు. ఇలా కోలాహలం నడుమ ఆస్ట్రేలియాకు పయనమైన భారత జట్టు.. అక్కడికి చేరుకున్న మరుసటి రోజే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో పాటు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ సేన ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. Smiles, laughter and wishes as #TeamIndia left from Mumbai for Australia 📹📸 pic.twitter.com/Re60cUgnZx — BCCI (@BCCI) October 7, 2022 రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు.. మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాలోత టీ20 సిరీస్‌లను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ఈవెంట్లో భాగంగా.. అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్ వేదికగా టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆ తర్వాత ఆసీస్, న్యూజిలాండ్‌తో గబ్బా స్టేడియంలో వార్నప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న మెల్బోర్న్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఈ ఈవెంట్లో తమ అసలైన ప్రయాణం ఆరంభించనుంది. అతడి స్థానంలో ఎవరో?! కాగా ప్రధాన ఓపెనర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరం కాగా 14 మంది సభ్యులతో టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారన్న అంశం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహ్మద్ షమీ లేదంటే మహ్మద్ సిరాజ్ లేదా స్టాండ్ బైగా ఉన్న దీపక్ చహర్‌లలో ఎవరో ఒకరు బుమ్రా ప్లేస్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: Pak Vs Ban 1st T20: చెలరేగిన రిజ్వాన్.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం IND vs SA: 'మీ కంటే బాల్ బాయ్ బెటర్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు' -
Ind Vs Pak: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లకు చుక్కలే! నీకంత సీన్ లేదు!
T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ తన ప్రణాళికల గురించి వెల్లడించాడు. ముఖ్యంగా టీమిండియాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. భారత బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నానన్నాడు. హారిస్ రవూఫ్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో అతడు 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎంసీజీ నా హోం గ్రౌండ్ ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రవూఫ్ ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ సన్నాహకాల గురించి చెప్పుకొచ్చాడు. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పోరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నా హోం గ్రౌండ్ లాంటిది. అక్కడి పిచ్‌లు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నా. నా నైపుణ్యాలకు పదును పెట్టి.. నా బెస్ట్ ఇచ్చానంటే వాళ్లు(టీమిండియా బ్యాటర్లు) తట్టుకోవడం కష్టమే. హోం గ్రౌండ్లో ఆడనుండటం నాకు సానుకూల అంశంగా మారింది’’ అని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు రవూఫ్ ప్రాతినిథ్యం వహిస్త్ను విషయం తెలిసిందే. కాగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న భారత్, పాకిస్తాన్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడనున్నాయి. నీకంత సీన్ లేదులే! ఇక 28 ఏళ్ల రవూఫ్ ఇటీవల జరిగిన ఆసియా కప్-2022లో భాగంగా రోహిత్ సేనతో మొదటి మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, సూపర్ -4 స్టేజ్‌లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రవూఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ అతడికి కౌంటర్ ఇస్తున్నారు. ‘‘నీకంత సీన్ లేదు. సొంతగడ్డ మీదే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నావు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నావు. చూద్దాం ఎవరు పైచేయి సాధిస్తారో’’ అంటూ ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో అతడి గణాంకాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే ఆసీస్ పిచ్‌లపై రవూఫ్‌నకు మంచి రికార్డే ఉంది. బీబీఎల్‌లో 18 మ్యాచ్‌లలో అతడు 30 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. తొలి భారత కెప్టెన్‌గా Ind Vs SA T20 Series: బుమ్రా స్థానంలో జట్టులోకి సిరాజ్: బీసీసీఐ -
T20 WC: ఈసారి టీమిండియాను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు: అక్తర్
T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభమేమీ కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఈసారి భారత జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. కాబట్టి బాబర్ ఆజం బృందానికి గెలుపు అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ అనూహ్య రీతిలో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి ఐసీసీ టోర్నీలో భారత్‌పై తొలి గెలుపు నమోదు చేసింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అక్టోబరు 16న మెగా టోర్నీ మొదలు కానుంది. ఇందులో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్లు అక్టోబరు 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తలపడనున్నాయి. ఈసారి అంత వీజీ కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘ఈసారి టీమిండియా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లో భారత్‌ను ఓడించడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. ఇప్పుడే విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, మెల్బోర్న్ పిచ్ పాతబడే కొద్ది బౌన్సీగా తయారవుతుంది. ఫాస్ట్ బౌలర్లకు అనూకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిస్తే పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేయకూడదు’’ అని సూచించాడు. మొదట బ్యాటింగ్ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దాదాపు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు మెల్బోర్న్ గ్రౌండ్‌కు వచ్చే అవకాశం ఉందని అక్తర్ అంచనా వేశాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... T20 World Cup 2022: జెయింట్ రిషబ్ పంత్.. గాడ్జిల్లాలా ఎంట్రీ.. ! Welcome to The Big Time, Rishabh Pant 🚁 🚁#T20WorldCup pic.twitter.com/ZUSK63ssFZ — T20 World Cup (@T20WorldCup) July 10, 2022 -
షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ ఆటగాడు షేన్ వార్న్‌కు లెజెండరీ క్రికెటర్లు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం మెల్బోర్న్లోని ఎంసీజీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులతో పాటు పలువురు ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. గ్లెన్ మెక్‌గ్రాత్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ తదితర క్రికెటర్లంతా వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఇయాన్ బోథమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు వార్న్ సేవలను గుర్తుచేసుకుంటూ కడసారి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. ''గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత నేను లండన్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నా చిరకాల మిత్రుడు షేన్ వార్న్ ఎదురుపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇద్దరం కలవడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలోనే ఇద్దరం కలిసి లండన్‌లో గోల్ఫ్ క్రీడను ప్రారంభించాలనుకున్నాం. కానీ ఈరోజు వార్న్ అది నెరవేరకుండానే దూరమయ్యాడు. మా ఇద్దరి బంధానికి గుర్తుగా లండన్‌లో త్వరలోనే గోల్ఫ్ కోర్సును ప్రారంభిస్తాను. కడసారి నా మిత్రునికి వీడ్కోలు పలుకుతున్నా.. భౌతికంగా దూరమైనా మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతావు'' అంటూ తెలిపాడు. సచిన్‌తో పాటు మెక్‌గ్రాత్, ఇయాన్ బోథమ్‌లు వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో వీడియోలో పంచుకున్నారు. చదవండి: Symonds-Shane Warne: 'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు' Sachin Tendulkar, Glenn McGrath and Ian Botham pay their tributes to Shane Warne at the memorial service at the MCG. pic.twitter.com/2PJo9hYMFe — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 Shane Warne's father Keith pays tribute to his son at the memorial service at the MCG as the world remembers the legendary Australian cricketer. pic.twitter.com/07TFQHPxTW — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 -
ఆస్ట్రేలియాకు షేన్ వార్న్ భౌతికకాయం
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు వార్న్ మృతదేహాన్ని తరలించారు. రేపటిలోగా మృతదేహం ఆస్ట్రేలియాకు తరలించేలా అధికారులు ప్లాన్ చేశారు. ఇక వార్న్ శవపరీక్షకు సంబంధించి అటాప్సీ రిపోర్టు సోమవారం వచ్చిన సంగతి తెలిసిందే. రిపోర్టులో వార్న్‌ది సాధారణ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇక వార్న్ అంత్యక్రియలు మార్చి 30న ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతని అభిమానులు, సన్నిహితులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా ఎంసీజీని వేదికగా చేశామని విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి డానియెల్ అండ్రూస్ వెల్లడించారు. ఎంసీజీ వార్న్‌కు విశిష్టమైన వేదిక. అక్కడే 1994లో జరిగిన యాషెస్ సిరీస్‌లో హ్యాట్రిక్‌తో అందరికంటా పడ్డాడు. తర్వాత 2006లో అచ్చొచ్చిన ఆ వేదికపైనే 700వ వికెట్ తీశాడు. బ్యాంకాక్‌లోని విల్లాలో స్నేహితులతో గడిపేందుకు వచ్చిన 52 ఏళ్ల వార్న్ ఈనెల 4న గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. చదవండి: Shane Warne: 'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్ -
షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు
Shane Warne Funeral: ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. There's nowhere in the world more appropriate to farewell Warnie than the 'G. Victorians will be able to pay tribute to Shane and his contribution our state, and his sport, at a memorial service at the MCG on the evening of March 30th. Info and tickets will be available soon. — Dan Andrews (@DanielAndrewsMP) March 9, 2022 ఎంసీజీతో వార్న్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలనుకున్నామని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నతాధికారి డేనియల్ ఆండ్రూస్ బుధవారం వెల్లడించారు. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉండటంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పిస్తున్నారు. వార్న్ పార్ధివ దేహం థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది. కాగా, 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. తన స్పిన్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాశించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
'ఈసారి కూడా మాదే పైచేయి'.. బాస్ దానికి చాలా టైముంది
టి20 ప్రపంచకప్ 2022లో లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే గ్రూఫ్‌లో ఉన్న కారణంగా టీమిండియా, పాకిస్తాన్ అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరగడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికి పాకిస్తాన్ ఆటగాళ్లు ఇప్పటినుంచే కత్తులు దూస్తున్నారు. తాజాగా షోయబ్ అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: "ఈ సారి కూడా విజయం పాకిస్తాన్‌దే.. కోహ్లి, రోహిత్ తప్ప..." ''ఈసారి కూడా విజయం మాదే. టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ మరోసారి పై చేయి సాధిస్తుంది. టి20 క్రికెట్లో పాకిస్తాన్ ఎప్పుడు భారత్ కంటే బెటర్‌గానే కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. భారత్ మీడియా పనిగట్టుకొని టీమిండియాపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. ఇది మాకు సానుకూలంగా మారుతుంది.. టీమిండియా అందుకే ఓడిపోతుంది'' అంటూ కామెంట్ చేశాడు. అయితే అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత సీన్ లేదు.. ఈసారి టీమిండియాదే పై చేయి అవుతుంది... మ్యాచ్‌కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది.. ఇప్పుడే అంత తొందరెందుకు అక్తర్.. దానికి చాలా సమయం ఉంది''.. అంటూ కామెంట్స్ చేశారు. కాగా టీ20 ప్రపంచకప్-2021 లీగ్ దశలో పాక్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-2లో టీమిండియా,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా? -
మూడో టెస్టు: మొటెరా స్టేడియం విశేషాలు ఎన్నో..
భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారంనుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్‌తో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న మొటెరా మైదానం తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటివరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటాన్ని ప్రేక్షకులు ఒక అదృష్టంగా భావిస్తుండగా, ఇప్పుడు భారత అభిమానులకు కూడా మన ‘ఎంసీజీ’లో అలాంటి ‘లక్ష’ణమైన అవకాశం దక్కనుంది. పైగా ఈ టెస్టు మ్యాచ్ పింక్ బంతులతో జరిగే డే అండ్ నైట్ టెస్టు కావడంతో మైదానం మరింత వెలుగులు విరజిమ్మనుంది. సాక్షి క్రీడా విభాగం ‘సర్దార్ పటేల్ స్టేడియం’గా కూడా పిలిచే మొటెరా మైదానంలో 1983 నవంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. సునీల్ గావస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్ తన 432వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది. 2006 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో దీనిని ఆధునీకరించారు. 2011 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు వేదికైన ఈ గ్రౌండ్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ 2012 డిసెంబర్లో జరిగింది. 2015లో దీనిని పూర్తిగా పునాదులనుంచి కూలగొట్టి కొత్త స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గత ఏడాది ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ ఇక్కడే జరగ్గా, ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్ పోటీలకు గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు తొలిసారి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమైంది. మొటెరా స్టేడియం విశేషాలు చూస్తే.. ► స్టేడియం సామర్థ్యం 1 లక్షా 10 వేలు ► నిర్మాణ వ్యయం సుమారు రూ. 678 కోట్లు ► (ఎల్ అండ్ టీ సంస్థ) ► మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది ► అవుట్ ఫీల్డ్ పరిమాణం ► 180 గజాలు X 150 గజాలు ► 6 ఇండోర్, 3 అవుట్డోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, జిమ్ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్ రూమ్‌లు ► 40 మందికి వసతి కల్పిస్తూ ► ఇండోర్ క్రికెట్ అకాడమీ ► 76 కార్పొరేట్ బాక్స్‌లు ► స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు. ఇతర మైదానాల తరహాలో ఫ్లడ్ లైట్లు వాడకుండా పైకప్పు కింది భాగంనుంచి వరుసగా లైట్లను అమర్చారు. ► ప్రేక్షకులకు అన్ని వైపులనుంచి స్పష్టమైన ‘వ్యూ’ ఉండే విధంగా ఇంత పెద్ద మైదానంలో ఒక్క పిల్లర్ కూడా లేకుండా కొత్త టెక్నాలజీతో నిర్మించడం విశేషం. ► ప్రధాన గ్రౌండ్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ► 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా వెంటనే ఆట కోసం సిద్ధం చేసే అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ► ఒకేసారి స్టేడియం పరిసరాల్లో కనీసం 60 వేల మంది స్వేచ్ఛగా తిరగగలిగే విధంగా ప్రత్యేక ర్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ► 3 వేల కార్లు, 10 వేల ద్విచక్రవాహనాల పార్కింగ్ సౌకర్యం -
ఆ క్రెడిట్ వాళ్లిద్దరిదే: రహానే
మెల్బోర్న్: తాము అవలంబించిన ఐదు బౌలర్ల వ్యూహం బాగా పనిచేసిందని టీమిండియా కెప్టెన్(తాత్కాలిక) అజింక్య రహానే హర్షం వ్యక్తం చేశాడు. అడిలైడ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఒత్తిడిని జయించి ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారని పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడారంటూ రహానే ప్రశంసలు కురిపించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానే సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది పింక్‌బాల్ టెస్టులో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనప్పటికీ సమిష్టి కృషితో ఆసీస్‌ను మట్టికరిపించింది.(చదవండి: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం) ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. ‘‘ మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అందరూ బాగా ఆడారు. అయితే ఈ విక్టరీ క్రెడిట్ అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్, గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. అడిలైడ్ మ్యాచ్ తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లిద్దరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు అమోఘం. అలాంటి వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఇక మేం అనుసరించిన ఐదు బౌలర్ల వ్యూహం ఈ మ్యాచ్‌లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒక ఆల్‌రౌండర్ కావాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే జడేజా అద్భుతంగా రాణించాడు. ఇక శుభ్‌మన్ గురించి చెప్పాలంటే తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ గురించి మనకు తెలుసు. ఈ మ్యాచ్‌లో కూడా తను అదే స్థాయిలో ఆడాడు. సిరాజ్ ఎంతో క్రమశిక్షణగా బౌల్ చేశాడు. దేశవాలీ క్రికెట్లో వారికున్న అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. మైదానంలో వారు ప్రదర్శించిన ఆటతీరు గొప్పగా ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. గిల్ మొత్తంగా 80(45+35) పరుగులు చేశాడు. -
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం
మెల్బోర్న్: పింక్ బాల్ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) లక్ష్యం చిన్నదే కావడంతో ఆచితూచి ఆడి టార్గెట్‌ను కరిగించారు. మూడో వికెట్‌కు విలువైన 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా వెంటవెంటనే మయాంక్ అగర్వాల్ (5), పుజారా (3) వికెట్ కోల్పోయినప్పటికీ భారత్ సునాయాసంగా గెలుపు బాట పట్టింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ దూరమైనప్పటికీ రహానే నేతృత్వంలో విజయం సాధించిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. కెప్టెన్ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న అజింక్యా రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో రహానేకు ఇది మూడో విజయం కావడం విశేషం. అంతేకాకుండా మెల్బోర్న్లో భారత జట్టుకు వరుసగా రెండో విజయం కూడా ఇదే. మొత్తంగా మెల్బోర్న్లో భారత జట్టుకు నాలుగో విజయమిది. ఇక జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. (చదవండి: ఈ దశాబ్దపు మేటి క్రికెటర్ కోహ్లి) ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 195 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 200 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 70/2(15.5 ఓవర్లు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం
న్యూఢిల్లీ: డీఆర్ఎస్ విధానంలో ‘అంపైర్స్ కాల్’ నిబంధన పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ నిర్ణయంపై సంతృప్తి లేకనే డీఆర్ఎస్ను ఆశ్రయిస్తారు ఆటగాళ్లు. మరి ఆ నిర్ణయాన్ని సమీక్షించి నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన థర్డ్ అంపైర్.. తను ఎటూ తేల్చలేక మళ్లీ అంపైర్ అభిప్రాయానికే వదిలేస్తే.. లాభం ఏముంటుంది’అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. డీఆర్ఎస్ విధానంపై ముఖ్యంగా ‘అంపైర్స్ కాల్’ అంశంపై దృష్టి సారించాలని ట్విటర్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరాడు. కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఎల్బీగా ఔట్ కావాల్సిన లబుషేన్, జో బర్న్స్ ఈ నియమం వల్ల బతికిపోయారు. టీమిండియా ఆటగాళ్ల అప్పీల్‌ను అంపైర్ తోసిపుచ్చడంతో.. కెప్టెన్ రహానే డీఆర్ఎస్కు వెళ్లాడు. అయినా, ఫలితం లేకపోయింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) బంతి వెళ్తున్న దశేమిటో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాన్ని వదిలేశాడు. దాంతో వారిద్దరూ సేవ్ అయ్యారు. అయితే, బంతి మాత్రం సరైన దిశలోనే వికెట్లపైకి వెళ్లిందని రీప్లేలో తెలుస్తోంది. మరోవైపు డీఆర్ఎస్ ద్వారా సరైన నిర్ణయం రాకపోవడం.. అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాలను వదిలేయడంపై టీమిండియా ఆటగాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 195 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసి 131 ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను మరోమారు భారత బౌలర్లు బెంలేలెత్తించారు. 133 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: 2 పరుగుల ఆదిక్యంలో ఆసీస్) The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire. The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 -
బాక్సింగ్ డే టెస్టు: పట్టు బిగిస్తున్న భారత్
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 195 పరుగులకు ఆలౌట్ చేసిన రహానే సేన.. 326 పరుగులు చేసి 131 పరుగుల విలువైన ఆదిక్యాన్ని సాధించింది. అనంతరం మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించి ఆతిథ్య జట్టు నడ్డి విరిచారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లు ఆడిన ఆసీస్ 133 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. ఆసీస్ 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఇక పోస్టు మ్యాచ్ ప్రెజంటేషన్లో మాట్లాడిన కెప్టెన్ రహానే భారత బౌలర్ల కృషిని కొనియాడాడు. కీలకమైన వికెట్లు తీయడం ద్వారా టీమిండియాను మంచి స్థితిలో నిలిపారని అన్నాడు. మ్యాచ్ అప్పుడే అయిపోలేదని మిగతా వికెట్లును త్వరత్వరగా తీయగలిగితే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. తన రనౌట్ అనంతరం జడేజా అసంతృప్తికి లోనయ్యాడని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని అతనికి సూచించినట్టు రహానే చెప్పుకొచ్చాడు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం) -
రెండో టెస్టు: బిగ్ వికెట్ కూల్చిన బుమ్రా
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కీలక వికెట్ కోల్పోయింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్టీవ్ స్మిత్ (30 బంతుల్లో 8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం 81 పరుగుల వద్ద ఉంది. ఓపెనర్ జో బర్న్స్ (10 బంతుల్లో 4)ను ఉమేశ్ యాదవ్, మార్నస్ లబుషేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్)ను అశ్విన్ ఔట్ చేశారు. ప్రస్తుతం భారత్ కంటే ఆతిథ్య జట్టు 50 పరుగుల వెనకబడి ఉంది. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ 34 పరుగులు, ట్రావిస్ హెడ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. 326 పరుగులు చేసి 131 ఆదిక్యాన్ని సాధించింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) -
బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 131 పరుగుల ఆదిక్యం సాధించిన భారత జట్టుకు విజయవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులను బట్టి తెలుస్తోంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 100కు పైగా తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించిన జట్లు ఎక్కువ సార్లు గెలుపును సొంతం చేసుకున్నాయి. సెంచరీ పరుగుల కంటే ఎక్కువ తొలి ఇన్నింగ్స్ ఆదిక్యంతో గెలిచిన జట్లలో భారత్ కూడా ఉండటం విశేషం. 1910లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు ఆదిక్యం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంతో ద్వారా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1931లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆదిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి: రహానే అనూహ్య రనౌట్, టీమిండియా ఆలౌట్) 1972లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్సింగ్స్‌లో 133 పరుగుల ఆదిక్యం సాధించిన ఆతిథ్య జట్టు ప్రత్యర్థిని రెండో ఇన్సింగ్స్‌లో కట్టడి చేసి.. 92 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక 1980లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 182 పరుగుల భారీ ఆదిక్యాన్ని సాధించింది. ఆతిథ్య జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, పైన పేర్కొన్న నాలుగింటిలో మూడింట ఆస్ట్రేలియానే ఉండటం గమనార్హం. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో ఆదిక్యం సాధించి వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియా ఎప్పుడూ ఓటమి చెందకపోవడం విశేషం. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్సింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 28/1 తో బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. (చదవండి: నాయకుడు నడిపించాడు) -
‘సెంచరీ’ టెస్టులో విక్టరీ దక్కేనా?
మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత్ ముందు మరో సవాల్ నిలిచింది. నేటి నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే ‘బాక్సింగ్ డే’ రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్ లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌లో 1–0తో ప్రస్తుతం ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్‌లోనూ ఓడితే భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశాలు ముగుస్తాయి. అడిలైడ్‌లో గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగుతుండగా, భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. జడేజా, పంత్‌లకు చోటు గత టెస్టులాగే ఈసారి కూడా భారత మేనేజ్మెంట్ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. విఫలమైన పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్, సాహా స్థానంలో మరో కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చారు. షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో పేసర్ సిరాజ్‌కు చోటు దక్కింది. అయితే కోహ్లికి బదులుగా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ను కాకుండా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించడం విశేషం. రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా... జడేజా వైపు జట్టు మొగ్గు చూపించింది. ఐదో బౌలర్‌గా అతను జట్టుకు మరింత బలం చేకూర్చగలడని టీమ్ భావిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రాణించడం గిల్, పంత్ ఎంపికకు కారణం. అయితే కోహ్లిలాంటి స్టార్ లేని నేపథ్యంలో సహజంగానే బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. మయాంక్, గిల్ శుభారంభం అందించడం కీలకం. ఇప్పుడు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్‌పైనే జట్టు భారీ స్కోరు చేయడం ఆధారపడి ఉంది. ఆంధ్ర క్రికెటర్ విహారి తనకు లభించిన మరో అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. విదేశాల్లో అంతంత మాత్రమే రికార్డు ఉన్న జడేజా ఈసారి ఎలా ప్రభావం చూపిస్తాడనేది చూడాలి. బౌలింగ్‌లో ఇప్పుడు బుమ్రాపైనే పెను భారం పడింది. ఇంత కాలం అతను ఆడిన అన్ని మ్యాచ్‌లలో మరోవైపు నుంచి సీనియర్ ఇషాంత్ శర్మ లేదా షమీ సహకరించారు. ఉమేశ్ ఇప్పటికీ అద్భుతాలు చేయలేదు. ఇక సిరాజ్ ఆడుతోంది తొలి మ్యాచ్. అశ్విన్ గత మ్యాచ్‌లో లయ అందుకోవడం సానుకూలాంశం. మొత్తంగా కోహ్లి, షమీ దూరం కావడంతో రెండు విభాగాల్లోనూ కొంత బలహీనంగా మారిన జట్టు ఆసీస్‌ను నిరోధించాలంటే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. స్మిత్ చెలరేగితే... వార్నర్ లేకపోవడంతో తొలి టెస్టులో ఆసీస్ ఓపెనింగ్ బలహీనంగా కనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శనతో బర్న్స్‌కు కావాల్సిన ఆత్మవిశ్వాసం దక్కగా, వేడ్ కూడా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో విఫలమైనా... స్మిత్, లబ్షేన్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా భారత్‌పై అద్భుత రికార్డు ఉన్న స్మిత్ చెలరేగితే కష్టాలు తప్పవు. గ్రీన్ తనను తాను నిరూపించుకోగా, కెప్టెన్ పైన్ తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ట్రావిస్ హెడ్ మాత్రం ఇంకా కుదురుకోవాల్సి ఉంది. వీటన్నింటికి మించి ఆసీస్ బలం పేస్ బౌలింగ్ త్రయంపైనే ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ సమష్టిగా చెలరేగితే పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్ చూపించింది. వీరికి లయన్ జత కలిస్తే ఆసీస్ పైచేయి సాధించడం ఖాయం. 100: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. సిరాజ్‌కు తొలి ‘టెస్టు’... 24 ఏళ్ల తర్వాత భారత్ తరఫున టెస్టు ఆడనున్న మరో హైదరాబాదీ. సరిగ్గా ఐదు వారాల క్రితం నాన్న చనిపోయాడు. చివరి చూపునకు వెళ్లవచ్చని బోర్డు అనుమతించినా... గుండెల్లో తన వేదనను దాచుకుంటూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. సహచరులు ఇచ్చిన స్థయిర్యంతో తన సాధనను కొనసాగించాడు. ఇప్పుడు ఆ బాధకు కాస్త ఉపశమనం అందించే అరుదైన అవకాశం అతనికి దక్కింది. స్వదేశం తిరిగి వెళ్లిపోకుండా అతను తీసుకున్న నిర్ణయం సరైన ఫలితాన్నందించింది. షమీ అనూహ్యంగా గాయపడటంతో మొహమ్మద్ సిరాజ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు భారత టెస్టు క్రికెటర్‌గా ఎదగడం అసాధారణం. రంజీల్లో సూపర్ మూడు టి20 మ్యాచ్‌లలో 3 వికెట్లు... ఏకైక వన్డే లో వికెట్ దక్కనే లేదు... సిరాజ్ అంతర్జాతీయ రికార్డు ఇది. దీనిని చూస్తే అతను జాతీయ జట్టు తరఫున విఫలమయ్యాడనిపిస్తుంది. కానీ సిరాజ్‌కు అవకాశం ఇవ్వడంలో సెలక్టర్లే పొరపడ్డారని అనిపిస్తుంది. దేశవాళీలో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలోనే వచ్చాయి. ఎరుపు బంతితోనే అతను ఎక్కువగా తన పదును చూపించాడు. సీమ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే అతని గ్రిప్, బౌన్సర్లు సిరాజ్ బౌలింగ్‌లో ప్రధాన బలాలు. తన తొలి రంజీ సీజన్ (2016–17)లోనే హైదరాబాద్ తరఫున 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో సన్‌రైజర్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం చకచకా జరిగిపోయాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు అతని సామర్థ్యంపై కొన్ని అనుమానాలు రేపినా ... తాజా ఐపీఎల్లో కోల్‌కతాపై 8 పరుగులకు 3 వికెట్లు తీసిన ప్రదర్శన సిరాజ్‌ను మళ్లీ సీన్లోకి తీసుకొచ్చింది. ఘనమైన రికార్డు 2018లో 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో సిరాజ్ 19.80 సగటుతో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దక్షిణాఫ్రికా ‘ఎ’పై రెండుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీయగా... ఆస్ట్రేలియా ‘ఎ’పై 8 వికెట్లతో చెలరేగిన ప్రదర్శన కూడా ఉంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో హెడ్, లబ్‌షేన్, ఖాజాలాంటి టెస్టు క్రికెటర్లున్నారు. భారత్ ‘ఎ’ తరఫున సిరాజ్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇవన్నీ రంజీ ట్రోఫీకంటే నాణ్యతాపరంగా ఎక్కువ స్థాయివే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.63 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. షమీ లేక కొంత అదృష్టం కలిసొచ్చినా... ఈ గణాంకాలు చూస్తే టెస్టుల్లో అతనికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంగానే చెప్పవచ్చు. మొత్తంగా 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి సిరాజ్ 23.44 సగటుతో 152 వికెట్లు తీశాడు. వన్డేలు, టి20లు ఎన్ని ఆడినా టెస్టు క్రికెటర్‌గా వచ్చే గుర్తింపే వేరు. ఇప్పుడు ఆ గౌరవాన్ని అందుకున్న సిరాజ్ మున్ముందు మరింత సత్తా చాటాలని చోటు పదిలం చేసుకోవాలని ఆశిద్దాం. వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ సిరాజే కావడం విశేషం. మధ్యలో ప్రజ్ఞాన్ ఓజా ఆడినా... అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. పిచ్, వాతావరణం ఈ టెస్టు కోసం డ్రాప్ ఇన్ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. చక్కటి బౌన్స్ కూడా ఉంది. రెండు రోజులపాటు చిరుజల్లులు పడే అవకాశం మినహా... వాతావరణం బాగుంది. టెస్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), మయాంక్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, ఉమేశ్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, స్టార్క్, లయన్, కమిన్స్, హాజల్‌వుడ్. –సాక్షి క్రీడా విభాగం -
‘ఎంసీజీ’లో మ్యాచ్ కోసం ప్రయత్నాలు
మెల్బోర్న్ : కరోనా కారణంగా ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నుంచి భారత్–ఆ్రస్టేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టు తరలిపోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి డిసెంబర్ 26 నుంచి 30 వరకు ‘బాక్సింగ్ డే’ టెస్టును ఎంసీజీలోనే జరిగేలా చూడాలని భావిస్తున్నట్లు మెల్బోర్న్ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నకి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది ‘బాక్సింగ్ డే’ టెస్టుకు 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన మెల్బోర్న్ పార్క్‌లో 8 లక్షల మంది మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ప్రస్తుతం ఆ్రస్టేలియాలోని 70 శాతం కరోనా కేసులు విక్టోరియా రాష్ట్రంలోనే నమోదు కాగా... మరణాలు 90 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. ‘గరిష్టంగా ఎంత మందిని టెస్టు మ్యాచ్‌లు అనుమతించాలనే విషయంలో చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే సాధ్యమైనంత ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు ప్రయతి్నస్తాం. దీనికి సంబంధించి క్రికెట్ ఆ్రస్టేలియాతో మాట్లాడుతున్నాం. ఒక్క క్రీడా ఈవెంట్ కారణంగా ఇప్పటి వరకు మేం చేస్తున్న శ్రమ వృథా కాకూడదనే మా ప్రయత్నం. ఒక్కసారి ఇలాంటి చోట కోవిడ్–19 వ్యాప్తి మొదలైందంటే అది ఎక్కడి వరకు సాగుతుందో చెప్పలేం’ అని డేనియల్ ఆండ్రూస్ అభిప్రాయ పడ్డారు. మెల్బోర్న్లో ‘బాక్సింగ్ డే’ టెస్టు సాధ్యంకాకపోతే టెస్టు మ్యాచ్ వేదిక అడిలైడ్‌కు మారే అవకాశం ఉంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇదే కానుంది..!
గాంధీనగర్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ పట్టణంలో గల మోటేరా స్టేడియం అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. త్వరలోనే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు దక్కించుకోబోతుందంటూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నథ్వాని ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ స్టేడియం విస్తరణ పనులు చేపట్టారని.. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా నిలవనుందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిమల్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. మెల్బోర్న్ కంటే పెద్ద స్టేడియాన్ని అహ్మదాబాద్‌లోని మోటేరాలో నిర్మిస్తున్నాం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలల ప్రాజెక్ట్ అయిన ఈ మైదానం పూర్తయితే యావత్ దేశానికి కీర్తి తీసుకోస్తుందం’టూ పరిమల్ ట్వీట్ చేశారు. 2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. దాదాపు 49వేల మంది ఈ మైదానంలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ వెస్టిండిస్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. World's Largest Cricket Stadium, larger than #Melbourne, is under construction at #Motera in #Ahmedabad,#Gujarat. Once completed the dream project of #GujaratCricketAssociation will become pride of entire India. Sharing glimpses of construction work under way. @BCCI @ICC #cricket pic.twitter.com/WbeoCXNqRJ — Parimal Nathwani (@mpparimal) January 6, 2019 -
బాక్సింగ్‌డే టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు వ్యూహంలో భాగంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన హనుమ విహారి జట్టు స్కోర్40 పరుగుల వద్ద ప్యాట్‌కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 బంతులు ఆడిన విహారి 8 పరుగులు చేశాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. దాంతో వారి స్థానంలో మయాంక్, విహారిలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. పెర్త్ టెస్టులో దారుణంగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు బాక్సింగ్ డే సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. -
మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల సందడి
మెల్బోర్న్ : మెల్బోర్న్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 'జగన్ వెంటే మేమంతా' అని ఉన్న ప్లెక్సీలు పట్టుకుని, సోషల్‌మీడియా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ శాఖమూరిలతో పాటూ పలువురు ఎన్ఆర్ఐలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్- ఆస్ట్రేలియా రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ను దిగిన ఆసీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. అనంతరం వర్షం కురవడం ప్రారంభమై, ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. -
నయా చరిత్ర
ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై... భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో పటిష్టమైన కంగారూలకు చెక్ పెట్టి తొలిసారి టి20 సిరీస్ (2-0)ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. లాన్నింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జొనాసేన్ (26 బంతుల్లో 27; 1 సిక్స్), బ్లాక్వెల్ (12) మోస్తరుగా ఆడారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 5 ఓవర్లలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా... లాన్నింగ్, జొనాసేన్‌లు నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి ఆదుకున్నారు. జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 69 పరుగులు చేసి నెగ్గింది. మిథాలీ రాజ్ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు), మందన (24 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడగా ఆడారు. టీమిండియా స్కోరు 7.5 ఓవర్లలో 52 పరుగులు ఉన్న దశలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 10 ఓవర్లలో 66 పరుగులుగా సవరించారు. దీంతో 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో మిథాలీ రెండు, మందన ఓ ఫోర్‌తో జట్టును గెలిపించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది. గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మూనీ (సి) పాటిల్ (బి) గోస్వామి 10; హారిస్ (బి) గోస్వామి 0; లాన్నింగ్ రనౌట్ 49; పెర్రీ రనౌట్ 4; జొనాసేన్ (సి) కృష్ణమూర్తి (బి) కౌర్ 27; హీలే (సి) మిథాలీ రాజ్ (బి) పూనమ్ 1; బ్లాక్వెల్ నాటౌట్ 12; కోయ్‌టి (సి) పాండే (బి) గైక్వాడ్ 3; ఫర్రెల్ (స్టంప్) వర్మ (బి) గైక్వాడ్ 0; చీట్లి నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18 ఓవర్లలో 8 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1-1; 2-28; 3-33; 4-103; 5-105; 6-106; 7-112; 8-113. బౌలింగ్: గోస్వామి 4-0-16-2; పాండే 1-0-12-0; నిరంజన 3-0-23-0; అనుజా పాటిల్ 3-0-20-0; గైక్వాడ్ 4-0-27-2; పూనమ్ యాదవ్ 2-0-17-1; హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-2-1. భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ నాటౌట్ 37; మందన నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 69. బౌలింగ్: జొనాసేన్ 2-1-7-0; ఫర్రెల్ 2-0-17-0; చీట్లి 2-0-9-0; ఫెర్లింగ్ 2-0-16-0; కోయ్‌టి 1-0-12-0; పెర్రీ 0.1-0-4-0. 2-0తో టి20 సిరీస్ సొంతం