PC: ICC
T20 World Cup 2022- Format, Points System All Details: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) ఈ ఐసీసీ ఈవెంట్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్‌ల ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర అంశాలు పరిశీలిద్దాం.
మొత్తం 16 జట్లు
ప్రపంచకప్-2022లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి.
గ్రూప్- ఏ:
►నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
గ్రూప్- బి:
►ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే
ఈ ఎనిమిది జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి.
సూపర్ 12
గ్రూప్- 1:
►అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, గ్రూప్- ఏ విజేత, గ్రూప్- బి రన్నరప్.
గ్రూప్-2:
►బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, గ్రూప్- బి విజేత, గ్రూప్- ఏ రన్నరప్
వేదికలు:
ఆస్ట్రేలియాలోని ఏడు వేదికల్లో ఈ ఈవెంట్ జరుగనుంది.
బ్రిస్బేన్‌లోని గబ్బా, అడిలైడ్‌లోని ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, గీలాంగ్‌లోని కర్దీనియా పార్క్, హోబర్ట్‌లోని బెలరివ్ ఓవల్, పెర్త్ స్టేడియం, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
స్టార్ నెట్‌వర్క్, స్కై స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్, ఈఎస్‌పీఎన్, పీటీవీ తదితర ఛానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రసారం.
ఇండియాలో స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), డిస్నీ+హాట్‌స్టార్(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారాలు.
ప్రసార భారతిలో హిందీలో కామెంటేటరీ.
టోర్నీ ఫార్మాట్:
మూడు దశల్లో టోర్నీ నిర్వహణ
ఫస్ట్ రౌండ్
రౌండ్ రాబిన్ పద్ధతిలో గ్రూప్-ఏ, గ్రూప్- బి జట్లు పోటీపడతాయి. ఇరు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.
సూపర్-12
ఈ దశలో టాప్-4లో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంటాయి.
నాకౌట్ స్టేజ్
►నాకౌట్ స్టేజ్‌లో రెండు సెమీ ఫైనల్స్
►గెలిచిన జట్లు ఫైనల్‌కు
►నవంబరు 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్
పాయింట్ల కేటాయింపు ఇలా
►ఫస్ట్ రౌండ్, సూపర్-12 స్టేజ్‌లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రెండు పాయింట్లు.
►టై లేదంటే ఫలితం తేలకుంటే: ఒక పాయింట్ కేటాయిస్తారు.
►ఓడిన జట్టుకు సున్నా పాయింట్లు.
రిజర్వు డేస్
సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..
►అక్టోబరు 16న ఫస్ట్ రౌండ్‌లో భాగంగా శ్రీలంక- నమీబియా మధ్య మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభం
►సూపర్-12లో మొదటి మ్యాచ్: అక్టోబరు 22న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్
►అక్టోబరు 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్(ఎంసీజీ- భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు)
నాకౌట్ స్టేజ్: భారత కాలమానం ప్రకారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభం
►నవంబరు 9, బుధవారం సెమీ ఫైనల్-1
►గురువారం 10, గురువారం సెమీ ఫైనల్-2
ఫైనల్
►నవంబరు 13, ఎంసీజీ
పూర్తి షెడ్యూల్
Photo Courtesy: t20worldcup.com
టీ20 వరల్డ్‌కప్-2022 టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే!
Comments
Please login to add a commentAdd a comment