టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మోకాలి గాయంతో బాధపడుతున్నాడా. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌తో పోరుకు ముందు మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది.
ఆ ఫోటోలో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో తలమునకలయ్యుంటే పాండ్యా మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. ఆ సమయంలో అతని కుడి మోకాలికి పట్టి కనిపించింది. దీంతో పాండ్యాకు గాయమైందని.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే పాండ్యా గాయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదంతా పుకార్లే అని కొట్టిపారేశారు.
''అతను ఎలాంటి గాయంతో ఇబ్బంది పడడం లేదని.. మాములుగా మోకాలిపై ఒత్తిడి పడకుండా క్రికెటర్లు పట్టి వేసుకుంటారు. ఆ పట్టీని చూసి గాయమైందనుకుంటే ఎలా'' అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ''పాకిస్తాన్‌తో ఆడే తుది జట్టును ఆల్రెడీ నిర్ణయించాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచకప్ కొట్టి తొమ్మిదేళ్లు కావొస్తుంది. అయినా ప్రతీ మ్యాచ్‌కు జట్టును మార్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఆటగాళ్లు సిద్ధమై ఉండాలి. ఏదైనా మార్పు ఉంటే ముందే చెప్తాం.. చివరి నిమిషంలో ఆటగాళ్లను ఎంపికచేయడం నాకు నచ్చదు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటనేది అందరికి తెలుసు.. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు.
Hardik Pandya has his right knee strapped. Could be a knee cap, as well. But he is limping a bit. @Sportskeeda #INDvPAK #T20WorldCup pic.twitter.com/72KKE9xSyO
— Srinjoy Sanyal (@srinjoysanyal07) October 22, 2022
చదవండి: దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు
Comments
Please login to add a commentAdd a comment