భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వాన గండం! | T20 World Cup 2022: Rain may lead to curtailed India-Pakistan match | Sakshi
Sakshi News home page

భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వాన గండం!

Published Sat, Oct 22 2022 12:28 AM | Last Updated on Sat, Oct 22 2022 12:28 AM

T20 World Cup 2022: Rain may lead to curtailed India-Pakistan match - Sakshi

మెల్‌బోర్న్‌: టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే ఈ పోరులో ఎప్పుడో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, 90 వేల సామర్థ్యం గల మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ దద్దరిల్లడం ఖాయమని అనిపించింది.

అయితే ఇప్పుడు ఈ చిరకాల పోరుకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 80 నుంచి 90 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్టంగా 5 మిల్లీ మీటర్ల వరకు కూడా వాన కురవవచ్చని చెబుతున్నారు. శుక్రవారం కూడా మెల్‌బోర్న్‌లో వాన పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement