భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club-ఎంసీసీ) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు తెలిపింది.
కాగా 1838లో స్థాపించిన ఎంసీసీ ఆస్ట్రేలియాలోనే పురాతన క్రీడా క్లబ్. ఈ క్లబ్‌కు చెందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సచిన్ చేసిన పరుగుల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.
ఎంసీజీలో పరుగుల వరద
ఈ వేదికపై మొత్తంగా ఐదు టెస్టులాడిన టెండుల్కర్(Sachin Tendulkar) 44.90 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సచిన్‌కు విశిష్ట సభ్యత్వం(Honorary Cricket Membership) ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది.
ఆయన అంగీకరించడం మాకు సంతోషం
ఈ మేరకు.. ‘ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌కే అతడొక ఐకాన్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ఆటతీరుకు గుర్తింపుగా విశిష్ట సభ్యత్వం ఇస్తున్నాం’ అని ఎంసీసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
అదే విధంగా.. ఎంసీసీ అధ్యక్షుడు ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం భారత క్రికెట్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు కూడా సచిన్ టెండుల్కర్ ఎనలేని సేవలు అందించారు. ఆయన మా విశిష్ట సభ్యత్వం స్వీకరించేందుకు ఒప్పుకొన్నారు. ఇంతకంటే మాకు గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పేర్కొన్నాడు.
ఇలాంటివేం కొత్త కాదు
ఇక.. ఆస్ట్రేలియా నుంచి సచిన్‌కు ఈ గౌరవం కొత్తేం కాదు. మనదేశంలో ‘భారతరత్న’ లాంటి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారంతో 2012లోనే అక్కడి ప్రభుత్వం సచిన్ టెండుల్కర్‌ను సత్కరించింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఎంసీజీలోనే ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ఆడుతోంది.
అంతకు ముందు పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్, అడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సమంగా ఉన్నాయి.
చదవండి: IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్
Comments
Please login to add a commentAdd a comment