CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..! | 2015 World Cup Final In MCG Had Higher Attendance Than 2023 World Cup Final In Ahmedabad | Sakshi
Sakshi News home page

CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!

Published Mon, Nov 20 2023 1:42 PM | Last Updated on Mon, Nov 20 2023 2:34 PM

2015 World Cup Final In MCG Had Higher Attendance Than 2023 World Cup Final In Ahmedabad - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్‌ 19) జరిగిన ఈ మ్యాచ్‌కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు 92453 మంది హాజరైనట్లు సమాచారం.

2015 వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాటి ఫైనల్‌కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్‌ ఫైనల్లో అదే ఆసీస్‌ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. 

నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్‌ హెడ్‌ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్‌ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్‌ (58 నాటౌట్‌) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు.

భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లి (54), కేఎల్‌ రాహుల్‌ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (3/55), హాజిల్‌వుడ్‌ (2/60), కమిన్స్‌ (2/34), మ్యాక్స్‌వెల్‌ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement