world cup 2015
-
CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్‌కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు 92453 మంది హాజరైనట్లు సమాచారం. 2015 వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాటి ఫైనల్‌కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్ ఫైనల్లో అదే ఆసీస్ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. According to official attendance numbers, the 2015 World Cup in MCG had higher attendance than the 2023 World Cup final in Ahmedabad👀🤯 pic.twitter.com/j2kapHeAfB — CricTracker (@Cricketracker) November 20, 2023 నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
భారత్‌తో ఫిక్సింగ్ చేయమన్నారు : పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, ఇలాంటి ఉద్దేశాలతో మరోసారి నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా హెచ్చరించా’’ అని అక్మల్ చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి. 2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్ మహమ్మద్ షమీ బౌలింగ్ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 107 పరుగులతో చెలరేగిపోయాడు. Umar Akmal claims he was offered $200,000 during World Cup to leave two deliveries, tells @Shoaib_Jatt that he was also offered money to skip games against India. I wonder if Akmal had ever reported these approaches, if not then this statement will get him in more troubles. pic.twitter.com/inIQLN5Np4 — Faizan Lakhani (@faizanlakhani) June 24, 2018 -
'క్రిస్ గేల్ నన్ను లైంగికంగా వేధించాడు'
ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన తనను లైంగికంగా వేధించాడంటూ ఓ ఆస్ట్రేలియా మహిళ వెల్లడించింది. 2015 వరల్డ్ కప్ సమయంలో వెస్టిండిస్ జట్టుతో కలిసి పనిచేస్తున్న తన పట్ల గేల్ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆమె చెప్పింది. 'శాండ్విచ్ తీసుకొనేందుకు నేను టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాను. అక్కడ నాకు గేల్ ఎదురయ్యాడు. అతను టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. వెంటనే అతను టవల్ కూడా తీసేసి.. అభ్యంతరకరంగా మాట్లాడాడు. అతన్ని చూసి షాక్ తిన్నాను. మరుక్షణంలో అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అని ఆమె ఫెయిర్‌ఫాక్స్ మీడియా సంస్థకు తన అనుభవాన్ని వివరించింది. ఈ ఘటన గురించి వెస్టిండిస్ జట్టు మేనేజర్, మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్కు వివరించగా.. మహిళా సిబ్బందితో ఆటగాళ్లు గౌరవప్రదంగా వ్యవహరించాలంటూ సర్క్యులర్ జారీచేశారని, కానీ అందులో గేల్ పేరు ప్రస్తావించలేదని ఆమె తెలిపారు. గేల్ ఇప్పటికే ఓ క్రికెట్ ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. మహిళా ప్రజెంటర్ అయిన మెల్ మెక్‌లాలిన్‌ను తాగడానికి నాతో పాటు వస్తావా అంటూ గేల్ అంటూ ప్రత్యక్ష ప్రసారంలో అడగడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. -
'విరాట్ తప్పేమీ లేదు'
మెల్ బోర్న్: వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొందరగా అవుటై అనేక విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మాత్రం విరాట్ తప్పేమీ లేదంటూ సమర్థించుకొచ్చాడు. 'ఒక మ్యాచ్‌లో విఫలమైతేనే విమర్శించడం సమంజసం కాదు. ఆస్ట్రేలియాపై మంచి గణాంకాలు నమోదు చేసిన యువ ఆటగాడు విరాట్. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ చాలా బాగా రాణించాడు. వరల్డ్ కప్ సెమీస్‌లో రాణించలేకపోవడం కోహ్లి దురదృష్టం. ఇలాంటివన్నీ క్రీడల్లో సహజమే. సెమీస్‌లో టీమిండియా ఓడిపోయినందుకు పెద్దగా బాధపడలేదు. బలమైన జట్లే ఫైనల్‌కు వెళ్లాయి. గత నాలుగు నెలల నుంచి ముక్కోణపు టోర్నీ, టెస్టు సిరీస్‌ల్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ సొంత గడ్డపై అద్భుతంగా రాణించింది. సెమీస్ వరకు టీమిండియా ఎక్కడా కూడా తడబడలేదు. యువ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌తో రాణించారు. ఆసీస్ కూడా బలమైన జట్టు కావడం వల్లనే సెమీస్‌లో ఇండియా ఓడిపోయింది' అని ద్రావిడ్ అన్నాడు. -
ఇండియా - ఆసీస్ మ్యాచ్ ఎఫెక్టె
-
భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్
హైదరాబాద్: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంతో నగరంలో క్రికెట్ ప్రేమికుల సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుపైకి వచ్చి అభిమానులు నృత్యాలు చేశారు. జాతీయ జెండాలు చేతబట్టి తమ దేశ భక్తిని చాటారు. వీధుల్లో బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ప్రపంచ కప్ జట్టులో.. తెలుగు తేజం!
-
సారీ... మీరొద్దు!
యువరాజ్, సెహ్వాగ్‌లకు మొండిచెయ్యి హర్భజన్, గంభీర్, జహీర్లకూ నిరాశే ప్రపంచకప్‌కు 30 మంది భారత ప్రాబబుల్స్ ఎంపిక జనవరి 7లోగా 15 మందితో జట్టు ప్రకటన ముంబై: గత వైభవం, జ్ఞాపకాలను పట్టించుకోనే లేదు... వర్తమానానికే విలువ, గుర్తింపు... భవిష్యత్తుపై, ముందుకు వెళ్లటంపైనే దృష్టి... భారత క్రికెట్ జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్లు పాటించిన సూత్రం ఇది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం గురువారం 30 మంది సభ్యుల ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. చాలా రోజులుగా నిలకడగా రాణిస్తున్న, ఇటీవల అవకాశం దక్కిన ప్రతి చోటా తమ ప్రతిభను ప్రదర్శించిన యువ ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. 2011 ప్రపంచకప్ విజయంలో భాగమైన సీనియర్ ఆటగాళ్లు ఐదుగురికి ఇందులో స్థానం లభించలేదు. నాడు కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ఖాన్లను ఎంపిక చేయలేదు. వీరంతా తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది కావస్తున్నా... ఆసీస్ గడ్డపై అనుభవం అక్కరకు వస్తుందనే కారణంతో ఏదో మూల ఒక ఆశ ఉండేది. కానీ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ ఆశలకు తెర దించింది. సీనియర్లకన్నా కొత్త కుర్రాళ్లపైనే నమ్మకం ఉంచడం ఉత్తమమంటూ తమ మనోభావాన్ని బయట పెట్టింది. ప్రాబబుల్స్ నుంచి 15 మంది సభ్యుల తుది జట్టును ప్రకటించేందుకు జనవరి 7 వరకు గడువు ఉంది. ఊహించినట్లుగానే... 2011లో జగజ్జేతగా నిలిచిన జట్టులో భాగమైన ధోని, కోహ్లి, రైనా, అశ్విన్ మాత్రమే ఇప్పుడు టీమ్‌లో ఉన్నారు. మిగతా 11 మంది ఈ సారి జట్టుకు దూరమయ్యారు. యువ క్రికెటర్లను ఎంపిక చేయడంలో కూడా ఎలాంటి సంచలనాలు లేవు. ఇటీవల జాతీయ జట్టు తరఫున, దేశవాళీలో కూడా రాణించిన ఆట గాళ్లకే అవకాశం దక్కింది. పుజారాను ఇంకా సెలక్టర్లు వన్డే ఆటగాడిగా గుర్తించకపోగా, కర్ణాటకకు దేశవాళీలో వరుసగా నాలుగు టైటిల్స్ అందించినా...వినయ్ కుమార్‌కు నిరాశ తప్పలేదు. ధోనితో పాటు మరో ముగ్గురు కీపర్లు అందుబాటులో ఉండటంతో దినేశ్ కార్తీక్, నమన్ ఓజాలను కూడా పక్కన పెట్టారు. ఎంపికలో ప్రస్తుత ఫామ్‌నే పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా సీనియర్లకు ప్రతికూలంగా మారింది. ‘సెలక్షన్ కోసం సీనియర్ల పేర్లు కూడా పరిశీలించాం. ప్రతీ ఒక్కరి గురించి చర్చ జరిగింది. అయితే బాగా ఆడుతున్నవారినే ఎంపిక చేయాలని అందరం నిర్ణయించాం. కుర్రాళ్లు దేశవాళీలో చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టలేము. ఏవైనా తీవ్ర గాయాలు అయితే తప్ప ఈ జాబితానుంచే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తాం. సెలక్షన్లో కెప్టెన్ సూచనలను కూడా పరిశీలనలోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. భారత ప్రాబబుల్స్ బ్యాట్స్‌మెన్: ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారి, మనీశ్ పాండే, మురళీ విజయ్ పేస్ బౌలర్లు: ఇషాంత్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్, ఆరోన్, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, అశోక్ దిండా స్పిన్నర్లు: అశ్విన్, రసూల్, కరణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వికెట్ కీపర్లు: ఎంఎస్ ధోని, ఉతప్ప, సంజు శామ్సన్, వృద్ధిమాన్ సాహా ఖేల్ ఖతం..! నేను భవిష్యత్తులో భారత్‌కు ఆడతానో, లేదో... నెల క్రితం యువరాజ్ సింగ్ సంశయం, ఆపై వెంటనే మళ్లీ వస్తానంటూ ఆత్మవిశ్వాసం. ప్రపంచ కప్‌కు ఎంపికవుతానని నాకు ఇంకా నమ్మకముంది...మూడు రోజుల క్రితం సెహ్వాగ్ మనసులో మాట. ఐపీఎల్లో నేనే భారత అత్యుత్తమ స్పిన్నర్‌ను...ఈ ప్రదర్శన నన్ను కాపాడుతుందంటూ కొన్నాళ్ల క్రితం హర్భజన్ ఆశతో చేసిన వ్యాఖ్య. ఇక ఆటతోనే తన విలువ చూపాలని ప్రతీ దేశవాళీ మ్యాచ్ బరిలోకి దిగిన గంభీర్...ఆస్ట్రేలియాలో అనుభవమే తనకు కలిసొస్తుందనే విశ్వాసంతో జహీర్ ఖాన్. సాక్షి క్రీడావిభాగం: ఇప్పటి వరకు ఏదో ఒక ఆశ, నమ్మకం వీరి ఆలోచనలను ప్రపంచ కప్ వైపు నడిపించింది. అయితే భారత సెలక్టర్లు వీరి అన్ని కోరికలకు అడ్డుకట్ట వేశారు. ఇక మీరు అవసరం లేదంటూ తలుపులు మూసేశారు. ప్రపంచ కప్ కోసమే కాదు ఆ తర్వాతి భవిష్యత్తు కోసమే కుర్రాళ్లను ఎంపిక చేశామంటూ బోర్డు కుండబద్దలు కొట్టింది. ఈ ఐదుగురికి కనీసం ప్రాబబుల్స్‌లో చోటు దక్కినా ఆశ పడేందుకు అవకాశం ఉండేది. ఎందుకంటే ఇక్కడ దేశవాళీలో అద్భుతంగా ఆడితే, అక్కడ ఆస్ట్రేలియాలో కుర్రాళ్లు విఫలమైతే...అప్పుడైనా సీనియర్ల అవసరం గుర్తుకు వచ్చి ఎంపికయ్యేవారేమో! ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఏదైనా ‘మర్యాదపూర్వక వీడ్కోలు’ కోసం ప్రత్యేకంగా బీసీసీఐ మరో మ్యాచ్‌కు అవకాశం ఇస్తే తప్ప ఇకపై వీరు భారత్ తరఫున ఆడటాన్ని మనం చూడకపోవచ్చు. 2011 ప్రపంచ కప్ విజయంలో భాగమై ఇప్పుడు ప్రాబబుల్స్‌లో స్థానం లభించని (11 మంది) ఆటగాళ్లను చూస్తే... యువరాజ్ సింగ్: గత వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువరాజ్ పాత్రను 1983లోని మొహిందర్ అమర్నాథ్తో పోల్చారు. ఇప్పుడూ అదే పోలిక చెప్పవచ్చేమో. ఎందుకంటే అమర్నాథ్కు కూడా 1987 ప్రపంచ కప్‌లో చోటే దక్కలేదు. ఇప్పడు యువీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది! 2011 ఫైనల్ అనంతరం ఆడిన 16 వన్డే ఇన్నింగ్స్‌లలో యువరాజ్ 18.53 సగటుతో కేవలం 278 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లే పడగొట్టడం అతని ఫామ్‌లేమిని సూచిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఆఖరి వన్డే ఆడిన యువీ విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 168 పరుగులే చేశాడు. యువీ శైలిలో ఆడే జడేజా, అక్షర్ నిలదొక్కుకోవడంతో అతని చోటు పోయింది. వీరేంద్ర సెహ్వాగ్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్లలో 13 వన్డేల్లో సగటు 20.23 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. రోహిత్ నిలదొక్కుకొని భారీ స్కోరు చేస్తుండటంతో చాన్స్ పోయింది. గంభీర్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్ళలో 30 మ్యాచ్‌ల్లో సగటు 23.58 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా ధావన్ దూకుడైన ఆటతో గుర్తింపు తెచ్చుకోవడం గంభీర్ అవకాశాలు దెబ్బ తీసింది. హర్భజన్ సింగ్: 2011 జూన్‌లో ఆఖరి వన్డే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. అశ్విన్ ఎలాగూ జట్టులో ఉన్నాడు. గత సారే అతనితో పోటీ పడాల్సి వచ్చింది. కాబట్టి భజ్జీకి తలుపులు మూసుకుపోయాయి. జహీర్ ఖాన్: సుదీర్ఘ కాలంగా ఫిట్నెస్ సమస్యలు. మేలో ఐపీఎల్ తర్వాత పోటీ క్రికెట్ ఆడనే లేదు. 2012 ఆగస్టులో ఆఖరి వన్డే ఆడిన జహీర్ గాయంనుంచి ఇంకా కోలుకోలేదు. జట్టులో ఉన్న భారత పేసర్లు ఇప్పటికే తమను తాము నిరూపించుకొని స్థిరపడ్డారు. ఇక గత ప్రపంచ కప్ ఆడినవారిలో సచిన్ రిటైర్ కాగా, శ్రీశాంత్‌పై నిషేధం వేటు పడింది. ఇతర ఆటగాళ్లు మునాఫ్, నెహ్రా, చావ్లా, యూసుఫ్ పఠాన్ చురుగ్గా లేకపోవడంతో పాటు వరుసగా విఫలమయ్యారు.