నవంబర్ 23 నుంచి భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్‌కప్‌లో ఆసీస్ లీడింగ్ రన్ స్కోరర్ (11 మ్యాచ్‌ల్లో 535 పరుగులు) డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. విశ్రాంతి కోసం వార్నర్ చేసుకున్న విజ్ఞప్తిని ఆసీస్ క్రికెట్ బోర్డు పరిగణలోకి తీసుకుంది. దీంతో వరల్డ్‌కప్ ముగిసిన అనంతరమే వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సీనియర్లెవ్వరినీ ఎంపిక చేయలేదు. ఆసీస్ టీమ్‌కు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ స్థానంలో ఆరోన్ హార్డీని జట్టులోకి తీసుకుంది.
మరోవైపు భారత సెలెక్టర్లు కూడా ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. వీరి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు నిన్ననే టీమిండియాను ప్రకటించారు. కాగా, వన్డే వరల్డ్‌కప్ 2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆ జట్టు టీమిండియాను ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ (నవంబర్ 23) వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ (చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రమే).
Comments
Please login to add a commentAdd a comment