![T20 World Cup 2022: Rohit Sharma led India reaches Melbourne - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/20/team-india.jpg.webp?itok=DH2ShI5q)
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం దగ్గరపడుతోంది. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్ 23)న మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టింది.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. అదే విధంగా భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా తమ జర్నీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మెల్‌బోర్న్ చేరుకున్న టీమిండియా.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా దాదాపు రెండు వారాల ముందే ఆస్ట్రేలియా చేరుకుంది.
కంగరూల గడ్డపై అడుగు పెట్టిన భారత్ మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. తొలుత వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఆడగా.. అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. కాగా భారత్ బ్రేస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది.
Perth ✔️
— BCCI (@BCCI) October 20, 2022
Brisbane ✔️
Preparations ✔️
We are now in Melbourne for our first game! #TeamIndia #T20WorldCup pic.twitter.com/SRhKYEnCdn
add this quiz to t20 wc articles
చదవండి: T20 WC 2022: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి
Comments
Please login to add a commentAdd a comment