India vs Pakistan World Cup
-
W T20 WC: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్ (ఫొటోలు)
-
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
భారత బౌలర్ల అద్భుతం.. కుప్పకూలిన పాకిస్థాన్
-
భారత్-పాక్ మ్యాచ్: స్టేడియంలో అభిమానుల సందడి (ఫొటోలు)
-
ఆసియాకప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్.. అలా జరిగితే పాకిస్తాన్‌కు టీమిండియా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ శ్రీలంక, పాకిస్తాన్ల వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖత చూపడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో ఏసీసీ నిర్వహించనుంది. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధిలు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ ఈవెంట్లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఈ ఆరు జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. అదే విధంగా ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం .. పాకిస్తాన్లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు , శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక భారత జట్టు మాత్రం తమ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడనుంది. కానీ ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం చూస్తే ఓ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అది ఎలా అంటే..? పాకిస్తాన్ వేదికగా మూడు గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లు, ఒక సూపర్ ఫోర్ మ్యాచ్ జరగనుంది. ఆ మూడు గ్రూపు మ్యాచ్‌లు పాకిస్తాన్-నేపాల్, ఆఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్-శ్రీలంక మధ్య జరగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 6న లాహోర్ వేదికగా సూపర్-4 తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గ్రూపు-ఎ టాపర్, గ్రూపు-బిలో రెండో స్ధానంలో నిలిచిన జట్లు తలపడనున్నాయి. భారత జట్టు గ్రూపు-ఎలో ఉందన్న సంగతి తెలిసిందే. ఒకే వేళ గ్రూప్-ఎలో టీమిండియా అగ్రస్ధానంలో నిలిస్తే.. సూపర్ 4 మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్తుందా అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఇది జరిగితే వేదికను మర్చే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా లీగ్ స్టేజ్‌లో టీమిండియా మొత్తం అన్ని మ్యాచ్‌లు గెలిచినా.. తమ గ్రూపులో రెండో స్ధానంలో మాత్రమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే ఏ2గా భారత్ ఉంటుంది కాబట్టి పాక్‌కు వెళ్లే అవసరం ఉండదు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. -
T20 World Cup 2022: 'కోహ్లి'నూర్ విజయం
అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్బోర్న్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు. మెల్బోర్న్: భారత్ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్‌పై శివమెత్తాడు. తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్బోర్న్లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ దశ గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‡్షదీప్ (3/32), హార్దిక్ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. హారిస్ రవూఫ్ (2/36), నవాజ్ (2/42) భారత్‌ను ఇబ్బంది పెట్టారు. గెలిచేదాకా క్రీజులోనే... లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్ తెరదించాడు. అక్షర్ పటేల్ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్‌కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది. నవాజ్ 12వ ఓవర్లో ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్ కూడా 2 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్‌కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్ కార్తీక్ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71 పరుగులు చేయడం విశేషం. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న నెదర్లా్లండ్స్తో ఆడుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 4; బాబర్ ఆజమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‡్షదీప్ 0; షాన్ మసూద్ (నాటౌట్) 52; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 5; హైదర్ అలీ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 2; నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 9; ఆసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్‡్షదీప్ 2; షాహిన్ అఫ్రిది (సి అండ్ బి) భువనేశ్వర్ 16; హారిస్ రవూఫ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 22–1; అర్‡్షదీప్ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్ పాండ్యా 4–0–30–3; అశ్విన్ 3–0–23–0; అక్షర్ పటేల్ 1–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) నసీమ్ షా 4; రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) హారిస్ రవూఫ్ 4; కోహ్లి (నాటౌట్) 82; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) 15; అక్షర్ పటేల్ (రనౌట్) 2; హార్దిక్ (సి) బాబర్ ఆజమ్ (బి) నవాజ్ 40; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–34–0; నసీమ్ షా 4–0–23–1; హారిస్ రవూఫ్ 4–0–36–2; షాదాబ్ ఖాన్ 4–0–21–0; నవాజ్ 4–0–42–2. ఆ రెండు సిక్స్‌లతో... మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్‌పై కోహ్లి కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్‌లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ►19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. ►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. ►19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ►19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. ►19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ►19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. ►19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. ►19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. -
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర...
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయా తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో అఖరి మూడు ఓవర్లలో భారత్ ఏకంగా 48 పరుగులు చేసింది. తద్వారా ఓ అరుదైన ఘనతను టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో కలిసి సమంగా నిలిచింది. గతంలో 2019 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా కూడా చివరి మూడు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అదే విధంగా ఆఖరి బంతిలో భారత్ విజయం సాధించడం ఇదే నాలుగో సారి కావడం గమనార్హం. అంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై, 2018లో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై కూడా భారత్ ఆఖరి బంతికే విజయం సాధించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC PAK Vs IND: కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు రోహిత్ ఫిదా.. భుజంపై ఎత్తుకుని మరి! -
Ind Vs Pak: ఏం మాట్లాడాలో తెలియట్లేదు.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(82 నాటౌట్-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు. నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్‌కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్‌కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్ కాల్కులేషన్తో హరీస్ బౌలింగ్‌లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా' - మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ. 160 పరుగుల లక్ష్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
సూపర్ సండే ఫైట్ : చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ యుద్ధం
-
T20 World Cup: ప్రపంచకప్ ‘ప్రతీకార’ పోరు
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు, ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా అది కొత్తగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాతేమీ ఆడటం లేదు, ఇరు జట్ల మధ్య పోరు జరిగి సరిగ్గా 50 రోజులే అయింది. అయినా సరే ఇప్పుడు వరల్డ్‌కప్ వచ్చేసరికి మళ్లీ అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే ఉద్వేగం... ఆటగాళ్లపై అదే తరహాలో తప్పని ఒత్తిడి కూడా! ఆసియా కప్‌ను పక్కన పెడితే గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయం కోణంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ మరింత కీలకం. ‘ప్రతీకారం’ అనే మాటను వాడదల్చుకోలేదని ఎవరు చెప్పినా ఆ పదం విలువ, అర్థమేమిటో భారత అభిమానులకు బాగా తెలుసు! మెల్బోర్న్: ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల హోరు మధ్య నేడు భారత్, పాకిస్తాన్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దీంతో అభిమానులందరికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వినోదానికి ఫుల్ గ్యారంటీ. రెండో స్పిన్నర్ ఎవరు? భారత జట్టుకు బ్యాటింగ్‌కు సంబంధించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆసియా కప్‌తో పాటు ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లను బట్టి చూస్తే చాలా వరకు తుది జట్టు ఏమిటో స్పష్టమవుతుంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లిలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గత వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురి వికెట్లు తీసి షాహిన్ అఫ్రిది ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈసారి అతని బౌలింగ్‌పై చెలరేగితే ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడగల సమర్థుడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ బాధ్యతలు చేపడతారు. ఎడంచేతి వాటం ప్రయోజనం ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం కార్తీక్కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఎక్కువ. పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్లు ఖాయం కాగా... రెండో స్పిన్నర్ విషయంలో అశ్విన్, చహల్‌లలో ఒకరే ఆడే అవకాశముంది. రవూఫ్ కీలకం! పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు ఉంది. అంకెలపరంగా చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్ద సంఖ్యలో పరుగులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, వారి స్ట్రయిక్‌రేట్ పేలవం. షాన్ మసూద్ పేలవ ఫామ్‌లో ఉండగా, గాయంతో ఫఖర్ జమాన్ దూరమయ్యాడు. మిడిలార్డర్లో హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు అంతంత మాత్రం బ్యాటర్లే! ఆసియా కప్‌లోనే వీరి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆసీస్ గడ్డపై వీరు ఏమాత్రం ఆడతారనేది చెప్పలేం. దాంతో పాకిస్తాన్ తమ బౌలింగ్‌నే ప్రధానంగా నమ్ముకుంటోంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షాహిన్ తమ రాత మార్చగలడని పాక్ భావిస్తోంది. షాహిన్ బౌలింగ్‌లో శుభారంభం అందిస్తే ఆ జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. మరో పేసర్‌గా నసీమ్ షా ఉంటాడు. అయితే వాస్తవానికి అఫ్రిదికంటే కూడా హారిస్ రవూఫ్ కీలకం కానున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున చెలరేగిన అతనికి ఒక రకంగా ఇది సొంత మైదానంలాంటిది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షమీ, చహల్/అశ్విన్, భువనేశ్వర్, అర్‡్షదీప్ సింగ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. మెల్బోర్న్కు చేరుకున్న టీమిండియా
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం దగ్గరపడుతోంది. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్ 23)న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం మెల్బోర్న్లో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. అదే విధంగా భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా తమ జర్నీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా దాదాపు రెండు వారాల ముందే ఆస్ట్రేలియా చేరుకుంది. కంగరూల గడ్డపై అడుగు పెట్టిన భారత్ మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. తొలుత వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఆడగా.. అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. కాగా భారత్ బ్రేస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. Perth ✔️ Brisbane ✔️ Preparations ✔️ We are now in Melbourne for our first game! #TeamIndia #T20WorldCup pic.twitter.com/SRhKYEnCdn — BCCI (@BCCI) October 20, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });add this quiz to t20 wc articles చదవండి: T20 WC 2022: జోష్ ఇంగ్లిస్ అవుట్.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్ జట్టులోకి -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ భారీ డిమాండ్
-
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. పంత్‌కు నో ఛాన్స్! కార్తీక్ వైపే మొగ్గు
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మరో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడనుంది . ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం కన్పించడంలేదు. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే సాధించాడు. అదే విధంగా అంతకుముందు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ పంత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్‌ను పక్కన బెట్టి వికెట్ కీపర్ బాధ్యతలు దినేష్ కార్తీక్‌కు అప్పజెప్పాలని టీమిండియా మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఫినిషర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 181 బంతులు ఎదర్కొన్న కార్తీక్ 150.82 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు సాధించాడు. ఇక పంత్ గత 17 ఇన్నింగ్స్‌లో 136.84 స్ట్రైక్ రేట్‌తో 338 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ స్థానంలో కార్తీక్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరికీ ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కుతుందో పాక్-భారత్ మ్యాచ్ వరకు వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్' -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి
టీ20 ప్రపంచకప్-2022 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. పెర్త్‌లోని వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్ వేదికగా టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో విరాట్ పుల్ షాట్, లెగ్ గ్లాన్స్, స్ట్రెయిట్ డ్రైవ్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కన్పించింది. ప్రస్తుతం విరాట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కింగ్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్‌లో అదరగొట్టిన విరాట్.. అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లలోనూ తన జోరు కొనసాగించాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్ వేదికగా టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. అదే విధంగా ఆసీస్, న్యూజిలాండ్‌తో గబ్బా వేదికగా వార్మప్ మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. కాగా ఈ మార్క్యూ ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యా్చ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనుంది. Virat Kohli practicing batting in the nets session at Perth - Absolute treat to watch. pic.twitter.com/NVYHHeqkQX — CricketMAN2 (@ImTanujSingh) October 8, 2022 చదవండి: Ishan Kishan: పాపం ఇషాన్ కిషన్! ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ.. -
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును సెప్టెంబర్ 15న బీసీసీఐ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానున్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆసియాకప్-2022 ముగిసిన నాలుగు రోజుల తర్వాత సెలక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఆసియాకప్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 16లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న బీసీసీఐ జట్టును ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ప్రతీ జట్టుకు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు అనుమతి ఉంది. క్రికెటర్లు, నెట్ బౌలర్లు, సహాయ సిబ్బందితో కలిసి మొత్తం 30 మంది వరకు ప్రయాణించొచ్చు. అధికారికంగా 15 మంది ఆటగాళ్లు, 8 మంది సహాయ సిబ్బంది ఉండాలి. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు..
Teamindia Beat Pakistan To Lift Inaugural T20 World Cup On This Day: పొట్టి క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు అవుతుంది. 2007 సెప్టెంబర్ 24న టీమిండియా తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌కు కైవసం చేసుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని నేతృత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ధోని సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. అంతకుముందు కపిల్ నేతృత్వంలో భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్ నెగ్గింది. జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ తుది సమరంలో ధోని ప్రపంచకప్‌కు ముద్దాడటం భారత్ క్రికెట్ అభిమానుల మదిలో నేటికీ మెదులుతూనే ఉంది. దీని తర్వాత మరోసారి టీమిండియా ధోని నేతృత్వంలోనే వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా(2011) అవతరించినా.. తొలి పొట్టి ప్రపంచకప్ గెలవడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్‌కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను ఏ భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఏమాత్రం అనుభవం లేని జోగిందర్ సింగ్‌తో ఆఖరి ఓవర్ బౌల్ చేయించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ధోనిపై యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపించింది. ఇక, మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్((54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ(16 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్కు 3 వికెట్లు దక్కగా, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆసిఫ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో పాక్.. పడుతూ లేస్తూ లక్ష్యానికి మరో 5 పరుగుల దూరంలో(19.3 ఓవర్లలో 152) ఆలౌటైంది. భారత బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్(3/16), ఆర్పీ సింగ్(3/26), జోగిందర్ శర్మ(2/20), శ్రీశాంత్(1/44) పాక్ నడ్డివిరిచారు. మూడు వికెట్లతో పాక్‌కు దెబ్బకొట్టిన ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు.. -
పందిలా బలిసావు.. డైట్ చేయవచ్చు కదా
-
‘సప్త’ సమరానికి సై!
సరిగ్గా నాలుగు నెలల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలభై మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఆ దాడి తర్వాత మన దేశంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాల ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఏమైనా సరే పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ మాత్రం ఆడవద్దంటూ వీరాభిమానుల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు వ్యాఖ్యలు చేశారు. రెండు పాయింట్లు పోయినా వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాల్సిందేనని ప్రముఖులెందరో బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు సమయం గిర్రున తిరిగింది... అసలు జరుగుతుందో లేదో అని సందేహమున్న మ్యాచ్‌కు సర్వం సన్నద్ధమైంది. ఇప్పుడు ఎవరి ఆలోచనల్లోనూ పుల్వామాలు, బాలాకోట్‌లు లేవు... ఉన్నదల్లా క్రికెట్ ఒక్కటే. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్ల కొనుగోలు కోసం ఐసీసీ బ్యాలెట్ ఓపెన్ చేస్తే ఫైనల్ మ్యాచ్‌కు 2.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అదే భారత్, పాక్ మ్యాచ్‌కు ఏకంగా 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ఇరు జట్ల కెప్టెన్లు దీనిని ఒక క్రికెట్ మ్యాచ్‌గానే చూడండి, ఆటను ఆస్వాదించండి అని గంభీరంగా ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ వారితో పాటు అభిమానులకూ తెలుసు ఇది అన్ని మ్యాచ్లలాంటిది కాదని. రెండు దేశాలు మ్యాచ్ ఫలితాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయోనని! 41 ఏళ్లలో 131 సార్లు తలపడినా... భారత్, పాక్ మ్యాచ్ ఏదో రూపంలోనో, మరే కారణంతోనో ఆసక్తి రేపుతూనే ఉంది. ఇప్పుడు విశ్వ వేదికపై దాయాదుల మధ్య ఏడోసారి జరిగే సమరానికి అందరిలో అంతే ఆసక్తి, అదే ఉత్సాహం! మాంచెస్టర్: రెండేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్... అప్పటి భారత్ టీమ్ బలాన్ని చూస్తే పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అనూహ్యం. సరిగ్గా చెప్పాలంటే బలహీనంగా కనిపించిన పాక్‌ను తప్పుగా అంచనా వేసి కోహ్లి సేన బోల్తా కొట్టింది. ఇప్పుడు అదే ఇంగ్లండ్‌లో మరో ఐసీసీ ఈవెంట్లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఈ మధ్య కాలంలో మరో రెండు వన్డేలలో పాక్‌ను భారత్ చిత్తు చేసినా... వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఉండే జోష్ వేరు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇక్కడి ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేడు లీగ్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. మూడు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా విరాట్ బృందం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా, ఈ సారైనా భారత్‌పై తమ చెత్త ప్రపంచకప్ రికార్డు సరిచేయాలని పాక్ ఆశిస్తోంది. అయితే ఇరు జట్లకు ప్రత్యర్థిగా వర్షం మరోవైపు నుంచి వేచి చూస్తుండటమే పెద్ద సమస్య. విజయ్ శంకర్‌కు చాన్స్! ధావన్‌కు గాయమయ్యాక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జట్టు కొత్త కూర్పును పరీక్షించాలని భారత్ భావించింది. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్ దానికి అవకాశం కల్పించవచ్చు. ఓపెనర్‌గా రోహిత్‌కు తోడుగా రాహుల్ బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ దాదాపుగా నిర్ణయించుకుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే అతని స్లో మీడియం పేస్ ఉపయుక్తంగా ఉంటుందని జట్టు భావిస్తోంది. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే పిచ్‌ను బట్టి అదనపు పేసర్ గురించి ఆలోచిస్తామని కోహ్లి చెప్పాడు. అదే జరిగితే కుల్దీప్ స్థానంలో షమీ ఆడే అవకాశం ఉంది. వర్షంతో మ్యాచ్ కుదించాల్సి వస్తే అప్పుడు తమ జట్టు కూర్పును కూడా మార్చుకుంటామని కూడా కెప్టెన్ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్, కోహ్లి వైఫల్యమే భారత్‌ను దెబ్బ తీసింది. ఈసారి వీరిద్దరు గట్టిగా నిలబడితే టీమిండియాకు ఎలాంటి సమస్య ఉండదు. శుభారంభం లభిస్తే ఆ తర్వాత ధోని, పాండ్యా, జాదవ్ దానిని కొనసాగించగలరు. ఒక్కసారిగా ఫామ్‌ను అంది పుచ్చుకున్న ఆమిర్‌ను మన టాపార్డర్ సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. బుమ్రా, భువనేశ్వర్ తమ స్థాయిలో చెలరేగితే భారత్‌కు ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది. మాలిక్‌ను ఆడిస్తారా! భారత్‌తో వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పాక్ ఆటగాళ్లలో షోయబ్ మాలిక్ ఒకడు. అయితే అదంతా గతం. భారత్‌పై గత తొమ్మిదేళ్లలో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ప్రపంచకప్‌లో కూడా ఫామ్ ఘోరంగా ఉంది. అయితే అతని అనుభవం దృష్ట్యా మరో అవకాశం ఇవ్వాలని టీమ్ భావిస్తోంది. ఆసిఫ్ అలీ స్థానంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్‌కు చోటు ఇవ్వడం మినహా గత మ్యాచ్ ఆడిన జట్టునే పాక్ బరిలోకి దించనుంది. పాక్‌కు కూడా టాప్–3నే బలం. ఈ ముగ్గురి వన్డే సగటు 50కి పైగానే ఉండటం విశేషం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా ఫఖర్ జమాన్ సెంచరీనే భారత్‌ను ఓడించింది.ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అనుభవజ్ఞుడైన హఫీజ్ కూడా కీలకం అవుతాడు. కొత్త పేసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో భారత్ ఎప్పుడూ ఆడలేదు. ఇది తమకు అనుకూలిస్తుందని పాక్ ఆశిస్తోంది. ఆమిర్‌ను జట్టు ప్రధానంగా నమ్ముకుంది. తన శైలి బౌలింగ్‌కు ఇక్కడి పరిస్థితులు సరిగ్గా అనుకూలించే అవకాశం ఉండటంతో ఆమిర్ ప్రమాదరకంగా మారగలడు. మొత్తంగా తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో చిత్తు కావడం మినహా పాక్ జట్టు బలంగానే కనిపిస్తోంది. ఫేవరెట్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించగలిగిన సర్ఫరాజ్ బృందాన్ని తక్కువగా అంచనా వేస్తే కష్టం. మీరు హీరోలుగా మారే అవకాశం వచ్చింది. మీది 2019 బ్యాచ్. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. ఇందులో ఒక్కో క్షణం మీ కెరీర్లను నిర్వచిస్తుంది. ఏదైనా ప్రత్యేకంగా చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతారు. –పాక్ జట్టు సభ్యులనుద్దేశించి కోచ్ మికీ ఆర్థర్ చెప్పిన మాటలు పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. కనీస మాత్రం పచ్చిక కూడా లేదు. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా మారిపోయే వాతావరణం జట్టు వ్యూహాలను మార్చవచ్చు. వర్ష ప్రమాదం ఎలాగూ ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. 1999 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడే మ్యాచ్ జరిగింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, విజయ్ శంకర్, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. పాకిస్తాన్: సర్ఫరాజ్ (కెప్టెన్), ఇమామ్, ఫఖర్, బాబర్ ఆజమ్, హఫీజ్, మాలిక్, సొహైల్/ఇమాద్, షాదాబ్, రియాజ్, ఆమిర్, షాహిన్ ఆఫ్రిది. చహల్, రోహిత్, బుమ్రా -
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
-
అదే రేడియోలో ఇప్పుడు...
బిగ్ బి అమితాబ్‌బచ్చన్ సినీ రంగానికి రాకముందు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని చోట్లా తిరస్కారాలే. రేడియో వ్యాఖ్యాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ‘‘నీ గొంతు పనికిరాదు’’ అని మూడు రేడియో సంస్థలు ఆయన ముఖం మీదే చెప్పాయి. కానీ, అదే అమితాబ్ గొంతు ఇప్పుడు రేడియోలో తొలిసారి వినిపించనుంది. క్రికెట్ వ్యాఖ్యానంలో దిగ్గజాలైన కపిల్‌దేవ్, హర్షాభోగ్లేలతో గొంతు కలపనున్నారు. ఈ నెల 15న జరగబోయే ఇండియా-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలిసారిగా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇది రేడియోలో ప్రసారం కానుంది. ‘‘నా గొంతు అప్పుడు రేడియో వ్యాఖ్యానానికి పనికి రాలేదు. ఇప్పుడైనా సరిపోతుందని ఆశిస్తున్నా’’ అని ఈ సందర్భంగా అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.