అదే రేడియోలో ఇప్పుడు... | Introducing Amitabh Bachchan, the commentator for India vs Pakistan World Cup clash | Sakshi
Sakshi News home page

అదే రేడియోలో ఇప్పుడు...

Published Mon, Feb 2 2015 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

అదే రేడియోలో ఇప్పుడు...

అదే రేడియోలో ఇప్పుడు...

బిగ్ బి అమితాబ్‌బచ్చన్ సినీ రంగానికి రాకముందు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని చోట్లా తిరస్కారాలే.  రేడియో వ్యాఖ్యాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ‘‘నీ గొంతు పనికిరాదు’’ అని మూడు రేడియో సంస్థలు ఆయన ముఖం మీదే చెప్పాయి. కానీ, అదే అమితాబ్ గొంతు ఇప్పుడు రేడియోలో తొలిసారి వినిపించనుంది. క్రికెట్ వ్యాఖ్యానంలో దిగ్గజాలైన కపిల్‌దేవ్, హర్షాభోగ్లేలతో గొంతు కలపనున్నారు. ఈ నెల 15న జరగబోయే ఇండియా-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలిసారిగా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇది రేడియోలో ప్రసారం కానుంది. ‘‘నా గొంతు అప్పుడు రేడియో వ్యాఖ్యానానికి పనికి రాలేదు. ఇప్పుడైనా సరిపోతుందని ఆశిస్తున్నా’’ అని ఈ సందర్భంగా అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement