Big B Amitabh Bachchan
-
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
బిగ్‌బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్‌పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
ప్రముఖ కంపెనీ వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసింది. అలాగే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ స్విగ్గీతో పాటు జెప్టోలో వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.స్విగ్గీ ఐపీఓ ద్వారా నిధులు సేకరిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే క్విక్ కామర్స్ బిజినెస్‌కు పబ్లిక్ మార్కెట్లో పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ప్రముఖులు ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. తాజాగా బిగ్‌బీ కుటుంబానికి చెందిన కార్యాలయం స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ కూడా స్విగ్గీతో పాటు జెప్టోలోనూ వాటాను కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఈ ఆఫర్ ఓ తుఫాన్!రెవెన్యూ ఎలా అంటే..స్విగ్గీ దేశీయంగా దాదాపు 580 నగరాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. రెస్టారెంట్లు, ఆహారప్రియుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్లు తమకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. దాంతోపాటు వినియోగదారుల నుంచి ఆర్డర్లను స్వీకరించడానికి రెస్టారెంట్లుకు అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తోంది. ఆన్లైన్ ప్రకటనల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తోంది. స్విగ్గీ కేవలం ఆన్లైన్ ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా ఇన్‌స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది. -
కుమారుడితో కలిసి కల్కి చూసిన బిగ్‌బీ.. ఇంత ఆలస్యంగానా? (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..
సినిమాలలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు భారీ మొత్తంలో సంపాదిస్తారు. వీరిలో చాలా మంది మంచి వ్యాపారవేత్తలు కూడా. తమ నట జీవితంతో పాటు సమాంతర వ్యాపారాలను ప్రారంభించడం మనం చూశాం. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు లేదా విలాసవంతమైన పబ్బులు, క్లబ్బులు నడుపుతుండగా మరికొందరు రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇటీవల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అమితాబ్ బచ్చన్బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సైట్ FloorTap.com కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లో, వీర దేశాయ్ రోడ్ సమీపంలో ఉన్నాయి.మొత్తం 8,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కార్యాలయ భవనాలను రూ.59.58 కోట్లకు బిగ్ బీ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లావాదేవీకి అమితాబ్ బచ్చన్ రూ.3.57 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడంతో 2024 జూన్ 20న సేల్ డీడ్ ఖరారైంది. వ్యాపార ప్రాంగణం మూడు పార్కింగ్ స్థలాలతో వచ్చినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకందారుగా గుర్తించారు.గత ఏడాది ఆగస్టులో అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భవనంలో ఇప్పటికే నాలుగు ఆఫీస్ సూట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు వాణిజ్య స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకుని రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు.ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే భవనంలో పెట్టుబడులు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం.. బిగ్ బీకి ఇప్పుడు సిగ్నేచర్ బిల్డింగ్ 7 ఆఫీస్ స్పేస్‌లు ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, సిగ్నేచర్ బిల్డింగ్ ఇతర సెలబ్రిటీలకు కూడా హాట్ స్పాట్. సీనియర్ బచ్చన్ తో పాటు మనోజ్ బాజ్‌పాయ్, కాజోల్, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి.అజయ్ దేవగణ్, కాజోల్ఈ భవనంలో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్‌ను కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ .7.64 కోట్లకు కొనుగోలు చేశారు. సిగ్నేచర్ బిల్డింగ్ లోని 16, 17 అంతస్తుల్లో ఉన్న ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన రూ.2.70 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.అభిషేక్ బచ్చన్కొన్ని వారాల క్రితం అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. 57వ అంతస్తులో మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లను రూ.15.42 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.మనోజ్ బాజ్పాయ్మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా రజా గత ఏడాది అక్టోబర్‌లో సిగ్నేచర్ బిల్డింగ్‌లోని నాలుగు యూనిట్లలో రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.7.77 కోట్లు కాగా, యూనిట్ కు రూ.46.62 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్‌లు సిగ్నేచర్ బిల్డింగ్‌లో 2,099 చదరపు అడుగుల యూనిట్‌ను కలిగి ఉన్నారు. సారా అలీఖాన్, అమృతా సింగ్ 2023 జూలైలో రూ.9 కోట్లకు ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, కార్తీక్ ఆర్యన్ 2023 సెప్టెంబర్‌లో రూ.10 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ప్రాపర్టీల అమ్మకానికి వెసులుబాటు కల్పించింది. -
ఆదిపురుష్ టీమ్ కి మరో స్వీట్ న్యూస్ అందనుందా..
-
బిగ్ బీ అమితాబ్ కు ప్రమాదం
-
అమితాబ్‌కు బర్త్ డే సర్ప్రైజ్.. 'ప్రాజెక్ట్ కె' క్రేజీ అప్డేట్
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే కానుకగా ప్రాజెక్ట్-కె బృందం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంలో బిగ్ బీ లుక్‌ను రివీల్ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. బిగ్ బీ పిడికిలి బిగించి ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమితాబ్ ఇవాళ 80వ జన్మదినం జరుపుకుంటున్నారు. (చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ) ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అమితాబ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. లెజెండ్స్ ఎప్పటికీ అమరులుగానే ఉండిపోతారని పోస్టర్‌పై రాసుకొచ్చింది. ఈ పోస్టర్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరలవడంతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. A powerhouse that has entertained for more than 5 decades! Can't wait to show the world the new avatar you've unleashed this time. Here's to the 80th & many more! May the force be with you always & you're the force behind us @SrBachchan sir - Team #ProjectK pic.twitter.com/Q3xLPqP2wN — Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2022 -
బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు
బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లోనూ బిగ్ బీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించారు. బాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టిన అమితాబ్ 90వ దశకంలో ఓ రేంజ్లో స్టార్‌గా మారిపోయారు. ఇవాళ (అక్టోబర్ 11) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. కెరీర్లో ఒడుదొడుకులు: బాలీవుడ్ సినిమా పాటలకు స్టెప్పులెయ్యాలన్నా.. ప్రతి ఒక్కరికి అమితాబ్‌నే ఆదర్శంగా తీసుకోవాల్సిందే. చిన్న పిల్లాడిలా ఒదిగిపోవాలన్నా పెద్దమనిషిలా తీర్పులు చెప్పాలన్నా ఈ తరం కుర్రాడిలా స్టెప్పులెయ్యాలన్నా ఒక్క బిగ్ బీకే సాధ్యమైంది. ఈ విలక్షణమైన నటుడు సినిమాల్లోకి అంతా ఈజీగా రాలేదు. ఆయన కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఈ వయసులో కూడా ఆయన కోసం సినిమా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 80 పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా...: ఆయనకు 80 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా.. ఇప్పటికీ నవ యువకుడిలా కనిపిస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ వయసులోనూ యువ నటులతో పోటీపడుతూ ఎంతో ఫిట్‌గా ఉంటున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. (చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ) ఆయన సినీ ప్రస్థానం..: అద్భుతమైన గాత్రంతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అమితాబ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో తన ప్రయాణం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ సాత్ హిందుస్థాన్‌లో అన్వర్ అలీగా మొదలైన సినీ ప్రస్థానంతో ఆ తర్వాత వరుస హిట్లను అందుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం తర్వాత మొదట్లో చాలామంది హేళన చేశారు. ఓ సారి నీ మొహం అద్దంలో చూసుకో అని అన్నా వాటన్నింటినీ పట్టించుకోలేదు బిగ్ బీ. వాటినే సవాల్‌గా స్వీకరించి తనదైన నటనతో అందరిని అవాక్కయ్యేలా చేశారు. ఊహించని ప్రమాదం...: బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లివచ్చారు. ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా.. తిరిగి పుంజుకున్నారు. టీబీ, లివర్ సంబంధిత వ్యాధులు, కరోనా బారిన పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన డైట్లో సాధారణ భోజనానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం యోగా, వాకింగ్ చేయడం తప్పనిసరి చేసుకున్నారు. అందుకే బిగ్ బీ ఈ వయసులోనూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. (చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్.. ధరెంతంటే?) బిగ్ బీని వరించిన అవార్డులు...: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదటి సినిమా పెద్దగా సక్సెక్ కాకపోయినా.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1973లో ఆయన జంజీర్ మూవీ సాంప్రదాయ పాత్రలను అధిగమించిన భారతీయ సినిమా యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా మారడానికి దోహదపడింది. 1984లో భారత్ ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ అందుకున్నారు. 2007లో ఫ్రెంచ్ ప్రభుత్వం అతనికి నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అవార్డును అందజేసింది. ఆనంద్, దీవార్, షోలే, అమర్ అక్బర్ ఆంటోనీ, త్రిశూల్, నిశ్శబ్ద్, అగ్నిపథ్, పికు, పింక్ అతని నట జీవితంలో కొన్ని మైలురాళ్లు. తాజాగా గుడ్‌బై సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆయనకు విషెస్ చెప్పేందుకు ముంబైలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం ఇంటి బయటకు వచ్చి అందరినీ కలిశారు. అభిమానులతో కలిసి సందడి చేశారు. కెరీర్లో ఎంత ఎత్తు ఎదిగినా.. చాలా సింప్లీసిటీగా కనిపించడం ఆయన సొంతం. #WATCH | Actor #AmitabhBachchan greets his fans who have gathered outside his residence 'Jalsa', in Mumbai, on his 80th birthday today. pic.twitter.com/eMahx6uOWi — ANI (@ANI) October 11, 2022 -
KBC 14: కోటి గెలుచుకున్న కవిత.. కానీ, రూ. 7.5 కోట్ల ప్రశ్నకు మాత్రం!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్ షో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్ కేబీసీ సీజన్ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్‌గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ సీజన్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకుంది. ఏంటి ఆ ప్రశ్న.. అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్‌లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది. దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది. చదవండి: Samantha: స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే.. -
బిగ్ బీ ప్రతీక్ష కాంపౌండ్ వాల్ని ఎందుకు కూల్చరు....?
జుహూలోని అమితాబ్ బచ్చన్‌కు చెందిన ప్రతీక్షా బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైఫల్యంపై కాంగ్రెస్ మహారాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. అయితే జులైలో ఈ భాగాన్ని గుర్తించాలని రోడ్డు సర్వే అధికారులను కోరినప్పటికీ బీఎంసీ చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ వీఎం కనడే రోడ్డు విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని బీఎంసీని ఆదేశించారు. (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) అయితే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) చట్టంలోని సెక్షన్ 299 కింద తాము బచ్చన్‌కు నోటీసులు పంపించాం అని విచారణ సందర్భంగా బీఎంసీ పేర్కొంది. కాకపోతే అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ తులిప్ మిరాండా ఇది చాలా అన్యాయం, నిబంధనలకు విరుద్ధం అని విరుచుకుపడ్డారు. అంతేకాదు తాను తంలో బీఎంసీకి సంబంధించిన కే-వెస్ట్ వార్డుతో సమస్యను లేవనెత్తడమే కాక రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు అన్ని ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. కానీ బచ్చన్ ఆస్తి కొనుగోలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందంటూ మిరాండా విమర్శించారు. అయితే గతంలో 2017లో బీఎంసీ రోడ్డు విస్తరణ పనుల గురించి బచ్చన్ తోపాటు అదే ప్రాంతంలోనే ఉంటున్న మరో ఏడుగురు తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ప్రతీక్ష నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్లే మార్గంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు పౌరసరఫరాల సంస్థ ఈ నిర్మాణాల కాంపౌండ్ భాగాన్ని తీసుకుని సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డును 40 అడుగుల నుంచి 60 అడుగులకు విస్తరిస్తామని అధికారులు తెలిపారు. అయితే 2019లో బీఎంసీ బచ్చన్ బంగ్లాకు ఆనుకుని ఉన్న భవనాల సరిహద్దు గోడను కూల్చివేసింది. అయితే ప్రతీక్ష కాంపౌండ్ మాత్రం అటకెక్కింది. (చదవండి: చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం) -
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు
-
కంటెస్టెంట్ జోకు.. అమితాబ్ సీరియస్
జీవితంలో చాలా వాటికి అలసిపోతూ ఉంటాం. ప్రయాణంలో అలసట సహజమే. జీవితమంటేనే ప్రయాణం కదా. ఎక్కడైనా కొంచెంసేపు ఆగితే అలసట తీరుతుందని అనుకుంటాం. తీరదు! ఆ ఆగడం మరింత అలసటగా అనిపిస్తుంది. అదే జీవితంలోని విశేషం. అలసట తెలియకూడదంటే జర్నీ సాగుతూనే ఉండాలి. ఎక్కడో ఒక పువ్వు విచ్చుకుని ఊగుతూ చటుక్కున మన అలసటను తెంపుకుని వెళుతుంది. ఇష్టమైన ఒక మనిషి ముఖం మన అలసటను పంచుకుని ముంగురులను సవరించి ఇక పొమ్మంటుంది. ఆ మనిషికీ తన ప్రయాణం ఒకటి ఉంటుంది మరి. అందుకే పొమ్మనడం. ఏమిటిది?! సీరియస్‌గా ఎటో వెళ్లి పోతున్నాం!! అసలైతే ఖోష్లేంద్ర చెందివున్న అలసట గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవలసింది. కె.బి.సి 12 కంటెస్టెంట్ అతడు. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అతడిని అడిగారు.. ‘‘ఖోష్లేంద్ర జీ, గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు?!’’ అని. సాధారణంగా కె.బి.సి. విజేతలకు చిన్న చిన్నవే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి. స్కూల్ కట్టిస్తాను అంటారు. మా ఊరికి చెరువు తవ్విస్తాను అంటారు. పొలం కొని సేద్యం చేస్తాను అంటారు. ఖోష్లేంద్ర ఇలాంటివేమీ చెప్పలేదు. అయినా ఇలాంటివే చెప్పాలని ఏముంది? ఆయన అవసరాలు ఏవో ఉండొచ్చు. ‘‘ఊ.. బోలియే ఖోష్లేంద్ర జీ మీరైతే ఏం చేస్తారు?’ అని తనదైన గంభీర స్వరంతో మళ్లీ అడిగారు అమితాబ్. ‘‘జీ.. నాకు వచ్చిన డబ్బుతో నేను నా భార్య ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను’’ అన్నారు ఖోష్లేంద్ర జీ. ‘‘ఎందుకంటే పదిహేనేళ్లుగా నేను నా భార్య ముఖం చూసీ చూసీ అలసిపోయాను’’ అని కూడా అన్నారు. అమితాబ్ కి నిజంగా కోపం వచ్చింది. ఆయన రియాక్షన్ చూసి, ‘‘ఊరికే జోక్ చేస్తున్నాను అమితాబ్ జీ’’ అన్నారు ఖోష్లేంద్ర. ‘‘ఖోష్లేంద్ర జీ.. జోక్ గా కూడా అలాంటి మాటలు అనకండి’’ అన్నారు అమితాబ్. ఖోష్లేంద్రకు కూడా పాఠశాలలు కట్టించాలని, చెరువులు తవ్వించాలని, రోడ్ల పక్కన అశోకుడిలా చెట్ల మొక్కలు నాటించాలనీ, వీటన్నింటికంటే ముందు.. భార్యను జోయ్ అలుక్కాస్కో, త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరీ జ్యుయలరీస్కో తీసుకెళ్లాలని వుండొచ్చు. అయితే అమితాబ్‌ని నవ్వించాలని అనుకుని తన భార్యపై జోక్ వేసినట్లున్నారు. ఆయనకు మాత్రం తెలియకుండా ఉంటుందా.. పదిహేనేళ్లుగా భార్యా తన ముఖం చూస్తూనే ఉందని! -
మీటూ : మౌనం వీడిన అమితాబ్
ముంబై : భారత్‌లో సెలబ్రిటీల లైంగిక వేధింపులపై మీటూ మూవ్మెంట్ పేరుతో బాహాటంగా బాధిత మహిళలు వెల్లడిస్తున్న ఘటనలపై బిగ్ బీ అమితాబ్ బచన్ ఎట్టకేలకు స్పందించారు. గురువారం 76వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అమితాబ్ పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను ట్విటర్ ఖాతాలో అమితాబ్ పోస్ట్ చేశారు. పనిప్రదేశాల్లో మహిళల పట్ల ఏ ఒక్కరూ దురుసుగా అసభ్యంగా వ్యవహరించరాదని, అలాంటి ఘటనలు ఎదురైతే వాటి గురించి తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిందితులపై ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపరమైన చర్యల ద్వారా పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాల వారు అణిచివేతకు గురువుతున్న క్రమంలో పాఠశాల స్ధాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలన్నారు. దేశంలో పలు రంగాల్లో మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్న నేపథ్యంలో వారికి భద్రతతో కూడిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాగా తనుశ్రీ దతా, నానా పటేకర్ ఉదంతంపై ఇటీవల అమితాబ్‌ను ప్రశ్నించగా తాను తనుశ్రీని కాదని, నానా పటేకర్‌ను కూడా కానందున దీనిపై తానేం వ్యాఖ్యానిస్తానని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిగ్ బీ తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుపట్టారు. మరోవైపు తనుశ్రీ సైతం తనకు జరిగిన అన్యాయంపై అమితాబ్ నోరుమెదపకపోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. సినిమాల్లో అభ్యుదయ భావాలతో ఊదరగొట్టి ప్రేక్షకుల ప్రశంసలు పొందే వారంతా తమ కళ్ల ముందు జరిగే ఘోరాలపై ప్రశ్నలను తప్పించుకోవడం తగదని తనుశ్రీ అన్నారు. -
మెగాస్టార్ సంపద ఎంత పెరిగిందంటే..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పెట్టుబడుల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ పెట్టుబడుల ద్వారా ఆర్జనలో కూడా బిగ్ బి అనిపించుకున్నారు. అటు నటలోనూ, ఇటు సంపదని నిర్మించుకోవడంలోనూ మెగాస్టార్‌గా నిలిచారు. బిగ్ బి కుటుంబానికి చెందిన షేర్ల పెట్టుబడి విలువ రెండున్నర సంవత్సరాలలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. రెండు సంవత్సరాల క్రితం 250,000 డాలర్లుగా ఉన్న సంపద కాస్తా ఇపుడు 17.5 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరైజ్డ్ రెమిటన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా విదేశీ కంపెనీలో తొలి ముఖ్యమైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు. తండ్రి-కొడుకు ద్వయం, (అమితాబ్,అభిషేక్)లు మెరీడియన్ టెక్ పిటీ లిమిటెడ్ 250,000డాలర్ల (దాదాపు రూ. 1.57 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఈ స్టాక్ బాగా పుంజుకోవడంతో సంపద 17.5మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.113కోట్లకు) చేరింది. అమితాబ్ ఖాతా ద్వారా 150,000 డాలర్లు, అమితాబ్ , అభిషేక్‌ల జాయింట్ అకౌంట్ ద్వారా లక్ష డాలర్ల పెట్టుబడులున్నాయని మెరిడియన్ టెక్ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట శ్రీనివాస్ మీనావల్లి ప్రకటించారు. అయితే మెరిడియన్ టెక్ అంత పాపులర్ స్టాక్ కాదు. ఇటీవల మెరీడియన్‌కు చెందిన జిద్దు.కామ్‌ను మరో విదేశీ సంస్థ లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు చేసింది. అమెరికన్ స్టాక్‌మార్కెట్ నాస్డాక్లో లిస్ట్ అయిన రెండు రోజుల తర్వాత ఈ స్టాక్ అనూహ్యంగా లాభపడింది. దీంతో లాంగ్ ఫిన్ కార్ప్ లో బిగ్ బి కుటుంబం షేర్ విలువ అమాంతం పెరిగింది. కాగా 2017, డిసెంబరు లో జిడ్డు.కామ్ బ్లాక్ చైన్ లేదా క్రిప్టోకరెన్సీ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా స్వయంగా ప్రకటించుకుంది. అంటే క్రిప్టోకరెన్సీ ద్వారా వివిధ ఖండాల్లో సూక్ష్మ రుణాలను అందిస్తుంది. కాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రిప్టోకరెన్సీ మానియా నేపథ్యంలో లాంగ్‌ఫిన్ స్టాక్ వెయ్యి శాతం కంటే ఎక్కువ లాభపడింది. -
బిగ్ బీ లేటెస్ట్ ట్వీట్..!
సాక్షి, ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75)మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘బిగ్ బీ ’ ఫాలోయర్స్ సంఖ్య ఎనిమిది కోట్లకు చేరుకుంది. స్వయంగా అమితాబ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 80 మిలియన్ల ఫాలోయర్స్ అంటూ ఆయన ట్విట్ చేశారు. దీంతో ట్విట్టర్లో సందడి నెలకొంది. అటు అభిమానులు, ఇటు వివిధ వర్గాలకు పెద్దలు పలువురు అభినందలతో ముంచెత్తుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ సినీ రంగానికి విశేష సేవలందించిన సీనియర్ నటుడు బిగ్ బికి ట్విట్టర్లో 31.7 మిలియన్లు, ఫేస్బుక్ లో 27,731,622 మంది, ఇన్స్టాగ్రామ్ లో 6.2 మిలియన్ల మంది పాలోయర్స్ ఉన్నారు. సోషల మీడియాలో తరచూ చురుగ్గా ఉండే అమితాబ్ ఖాతాలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, రిషీకపూర్‌తో 102 నాట్ అవుట్ సినిమాల్ నటిస్తున్నారు. T 2737 - 80 MILLION followers !!! on social media .. collective !! 80 MILLION !! 80 MILLION !! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/GL9j3oTfWT — Amitabh Bachchan (@SrBachchan) December 10, 2017 -
ఆటోగ్రాఫ్ కోసం నీళ్లల్లోకి దూకేశాడు!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం ఉండని, ఆయన ఆటోగ్రాఫ్ కోసం తపించని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఓ అభిమాని గురించి అమితాబ్ తన ట్విట్టర్లో ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘‘ ‘దో అంజానే’ చిత్రం షూటింగ్ అప్పుడు ఇది జరిగింది. ఆ చిత్రంలో ఓ పాటను బొటానికల్ గార్డెన్స్‌లో చిత్రీకరిస్తున్నాం. షాట్ గ్యాప్‌లో నా కెమెరాతో పరిసరాలను బంధిస్తున్నా. మేము ఓ సరస్సు ఒడ్డున ఉన్నాం. అవతలి వైపు నుంచి ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కావాలని సైగ చేశాడు. ‘ఓకే’ అని సైగ చేశా. అతను ఓ పెన్ను, పేపరు నోట్లో పెట్టుకుని నీళ్లల్లోకి దూకేశాడు. నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుని, అది తడవకూడదనే ఉద్దేశంతో వెనక్కి ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ కాగితం తడిసిపోయింది. ఏదేమైనా ఆ క్షణానికి అనుకున్నది చేశాడు’’. -
అదే రేడియోలో ఇప్పుడు...
బిగ్ బి అమితాబ్‌బచ్చన్ సినీ రంగానికి రాకముందు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని చోట్లా తిరస్కారాలే. రేడియో వ్యాఖ్యాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ‘‘నీ గొంతు పనికిరాదు’’ అని మూడు రేడియో సంస్థలు ఆయన ముఖం మీదే చెప్పాయి. కానీ, అదే అమితాబ్ గొంతు ఇప్పుడు రేడియోలో తొలిసారి వినిపించనుంది. క్రికెట్ వ్యాఖ్యానంలో దిగ్గజాలైన కపిల్‌దేవ్, హర్షాభోగ్లేలతో గొంతు కలపనున్నారు. ఈ నెల 15న జరగబోయే ఇండియా-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలిసారిగా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇది రేడియోలో ప్రసారం కానుంది. ‘‘నా గొంతు అప్పుడు రేడియో వ్యాఖ్యానానికి పనికి రాలేదు. ఇప్పుడైనా సరిపోతుందని ఆశిస్తున్నా’’ అని ఈ సందర్భంగా అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.