బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది.
గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.
ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్‌సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్‌లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్‌లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.
చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు.
కోటి రూపాయల ప్రశ్న
"ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్‌ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్‌లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment