
జుహూలోని అమితాబ్ బచ్చన్‌కు చెందిన ప్రతీక్షా బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైఫల్యంపై కాంగ్రెస్ మహారాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. అయితే జులైలో ఈ భాగాన్ని గుర్తించాలని రోడ్డు సర్వే అధికారులను కోరినప్పటికీ బీఎంసీ చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ వీఎం కనడే రోడ్డు విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని బీఎంసీని ఆదేశించారు.
(చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..)
అయితే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) చట్టంలోని సెక్షన్ 299 కింద తాము బచ్చన్‌కు నోటీసులు పంపించాం అని విచారణ సందర్భంగా బీఎంసీ పేర్కొంది. కాకపోతే అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ తులిప్ మిరాండా ఇది చాలా అన్యాయం, నిబంధనలకు విరుద్ధం అని విరుచుకుపడ్డారు. అంతేకాదు తాను తంలో బీఎంసీకి సంబంధించిన కే-వెస్ట్ వార్డుతో సమస్యను లేవనెత్తడమే కాక రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు అన్ని ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. కానీ బచ్చన్ ఆస్తి కొనుగోలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందంటూ మిరాండా విమర్శించారు.
అయితే గతంలో 2017లో బీఎంసీ రోడ్డు విస్తరణ పనుల గురించి బచ్చన్ తోపాటు అదే ప్రాంతంలోనే ఉంటున్న మరో ఏడుగురు తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ప్రతీక్ష నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్లే మార్గంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు పౌరసరఫరాల సంస్థ ఈ నిర్మాణాల కాంపౌండ్ భాగాన్ని తీసుకుని సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డును 40 అడుగుల నుంచి 60 అడుగులకు విస్తరిస్తామని అధికారులు తెలిపారు. అయితే 2019లో బీఎంసీ బచ్చన్ బంగ్లాకు ఆనుకుని ఉన్న భవనాల సరిహద్దు గోడను కూల్చివేసింది. అయితే ప్రతీక్ష కాంపౌండ్ మాత్రం అటకెక్కింది.
(చదవండి: చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం)
Comments
Please login to add a commentAdd a comment