బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసింది. అలాగే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ స్విగ్గీతో పాటు జెప్టోలో వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
స్విగ్గీ ఐపీఓ ద్వారా నిధులు సేకరిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే క్విక్ కామర్స్ బిజినెస్‌కు పబ్లిక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ప్రముఖులు ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. తాజాగా బిగ్‌బీ కుటుంబానికి చెందిన కార్యాలయం స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ కూడా స్విగ్గీతో పాటు జెప్టోలోనూ వాటాను కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: ఈ ఆఫర్ ఓ తుఫాన్!
రెవెన్యూ ఎలా అంటే..
స్విగ్గీ దేశీయంగా దాదాపు 580 నగరాల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. రెస్టారెంట్లు, ఆహారప్రియుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్‌లు తమకు ఇష్టమైన రెస్టారెంట్‌ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. దాంతోపాటు వినియోగదారుల నుంచి ఆర్డర్‌లను స్వీకరించడానికి రెస్టారెంట్లుకు అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తోంది. ఆన్‌లైన్ ప్రకటనల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తోంది. స్విగ్గీ కేవలం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా ఇన్‌స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment